Sunday, October 31, 2010

October 31 - Atla Taddi, Uyyalalu

Swinging high and swinging low

It has been raining real bad these past couple of days, hence posting the pictures from my old archives.

అట్ల తద్ది రోజు ఉయ్యాలలు ఊగటం చాలా బాగుంటుంది.. తెల్లవారు ఝాము తలంట్లు, నోములు, వాయనాలు, వంటలు, వగైరా వేరే వాళ్లకి వదిలేసి ఉయ్యాల ఊగటం, అట్లు తినడం మాత్రం చేస్తే అసలు ఆ పండగ నా దృష్టిలో ;).   పోయినేడాది మా అమ్మమ్మ వాళ్ళ దొడ్లో ప్రత్యేకంగా పండు గాడితోటి ఆడుకోటానికి వచ్చే బడి పిల్లల కోసం కట్టించాడు మామయ్య దీన్ని.. పిల్లలు వెళ్ళాక ఖాళి ఉన్నప్పుడు పక్కింటి శీను పద్మ ఆంటి (నన్ను పెంచారు చిన్నప్పుడు, ఇప్పుడు పండు గాడిని).. నాకు వీళ్ళంటే చాలా ఇష్టం ఇప్పటికి కొత్త జంటలాగా చాలా అన్యోన్యంగా ఉంటారు.

October 30 - Awesome Mirror Work

Ceiling in Baba Temple at Angaluru, Krishna District.

ఇది అద్దాల మేడ కాదు, కేవలం అద్దాల పై కప్పు మాత్రమే, చూడటానికి ఏంటో ముచ్చటగా, శుభ్రంగా ఉంటుంది.. నాకు ఈ గుడి అన్నా, గుళ్ళో ప్రదేశాలన్న చాలా ఇష్టం, పండు తల్లిని షికారు తీసుకెళ్ళాలి ఊరు దాటి అంటే ఇదే మా ఫస్ట్ choice.

October 29 - Angaluru Gudi

The most serene baba temple I have been to to-date . a must visit place if you appen to be in Krishna district.

అంగలూరు లో ఉన్న బాబా గుడి అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఆ వాతావరణం, ఆ విగ్రహం, ఆ చోటు, ఆ శుభ్రత, అన్నిటికి మించి అక్కడ ఇంకా వేరే దేవాలయాలకి పట్టినట్టు దేవాదాయ శాఖ చీడ పట్టలేదు.  లంచాలు, అడ్డ దారులు ఇంకా లేవు.  ఒక కుటుంబంలోని సభ్యులంతా కలిసి నిర్మాణం చేసి నడిపిస్తున్న ఒక మంచి ఆలయం.   గుడికెళ్ళి దేవుడికి మనసార దణ్ణం పెట్టుకోవాలి అంటే ఇలాంటి చోటికే వెళ్ళాలి.   ఇక్కడ ఫొటోస్ not allowed.  నేను గుడి బయట నించి చాలా దూరం జూమ్ చేసి తీసిన పిక్చర్ ఇది.  ఎక్కువ మాటలు ఉండవు, అరుపులు ఉండవు, గుడిలో ఉండే నిర్మలత్వం చెప్పడానికి వీలు లేనంత బాగుంటుంది.

Thursday, October 28, 2010

October 28 - Dishti Bomma

A common anti-evil eye device
ఊర్లో ఎక్కడ చూసినా ముందు కనిపించేవి ఇవి.   మా ఊర్లో అందరికంటే మాంచి popular ఫోటో ఇది.

Wednesday, October 27, 2010

October 27 - Stray puppies బుజ్జి కుక్క పిల్లలు

Stray puppies taking rest after game time
వీధి కుక్కకి పుట్టిన బుజ్జి పిల్లలు నాలుగు, మిగిలింది రెండు.. ఎంచక్కా రెండు పడి లేచి, నాకి పాకి డొల్లి డొల్లి ఆడుకుంటాయ్.. భలే ముచ్చటగా తిరుగుతూ ఉంటాయి.  సాయంత్రం పూట నాకు పండు తల్లికి మంచి కాలక్షేపం.

Tuesday, October 26, 2010

October 26 - Cute Little Stuff

Sorting stuff to give away... the store-all-the-memories me says to keep them while the practical me says to give it to needy.. the practical one wins but the senti one has a tough time leaving them... This was done in the middle of night, not able to sleep not able to let go.. a photo reminder for those cute little things.


పండు తల్లి జ్ఞాపకాలు, అమ్మ నా వస్తువులు ఇచ్చేసినప్పుడు నేను ఏడ్చి గొగ్గోలు పెట్టేదాన్ని, ఇప్పుడు నేను చేస్తుంది అదే.. పెట్టెలో దాచి ఇదిగో అది డే 200 కి  వేశా, ఇది నీ ఫస్ట్ sweater , అది నీ ఫస్ట్ diaper అంటూ దాయటం కంటే.. ఇంకో పిల్లకో, పిల్లాడికో ఉపయోగపడతాయ్ అనిపిస్తుంది.. చాలా మటుకు ఇచ్చేశాను, కాని ప్రతిసారి కాలం చెయ్యి దాటిపోయింది అని ఒక బాధ.  బుజ్జి బుజ్జి బట్టలు, బొమ్మ గుడ్డల్లాంటి చొక్కాలు, చెప్పులు, గౌనులు... ఏదో ఒక చెప్పలేని బాధ.

Monday, October 25, 2010

October 25 - Dolu, Sannaayi

performing before a happy kid

పనుల్లేని పండగ రోజుల్లో చాలా మంది ఇంటికి వస్తూ ఉంటారు, తుమ్మెదలు, దొమ్మరి వారు, పగటి వేష గాళ్ళు.. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.  అట్ల తద్ది పండగ రోజున ఈ సన్నాయి డోలు వాళ్ళు వచ్చారు.. మామూలుగా ఐతే కలిసి వస్తారు కాని నిన్న మాత్రం ఒకోకరు ఒక్కో ఇంటికి వెళ్లారు... సన్నాయి మా ఇంటికి డోలు పక్కింటికి... పేపర్ చదివేసుకుంటున్న పండు గాడికి పెద్ద పండగ ఇంక... ఆయన వాయిద్యం ఈవిడ నాట్యం... అదే కదా బాల్యంలోని మాధుర్యం.. తనకి చెయ్యాలనిపిస్తే చేసేస్తుంది.. అదే మనం చేస్తే పట్టుకుని ఎర్రగడ్డలో పడేస్తారు ;).