Showing posts with label old world charm. Show all posts
Showing posts with label old world charm. Show all posts

Monday, July 30, 2012

Wk31/Dy4(207) ~ July 25 ~ Good Old Antennae

How can one forget the days we used to adjust these with huge bamboo poles to get clarity in TV

టీవీ ఉన్న ప్రతి ఇంట్లో ఒకప్పుడు ఇవి కనిపించేవి కర్ర తీసుకుని అటు ఇటు వీటిని తిప్పి సిగ్నల్ రాట్లేదు అని హైరానా పడిపోవడం అనేది మా కాలంలో పెరిగిన పిల్లలందరికీ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది :).

Wk31/Dy3(206) ~ July 24 ~ Creepers on the wall

Beautiful jasmine creepers in the homes

పచ్చటి ఆకులు పూలు లతలు ఇంట్లో ఉంటె ఆ ఇంటి సొగసు వేరు.. సన్నజాజి పందిరి మా బేబీ అమ్మమ్మ ఇంటి గేటు ముందర అల్లుకుని భలే ముచ్చటగా ఉంటుంది.. ఈ వయసులో కూడా ఆవిడ పని మినిషి లేకుండా ఎంత ముచ్చటగా ఉంచుకుంటుందో ఇల్లు వాకిలి చూస్తె చాల నేర్చుకోవాలి అనిపిస్తుంది.

Wk31/Dy2(205) ~ July 23 ~ Old World Homes


Typical doors and windows of olden days in villages

ఊర్లో చెక్క తలుపులతో చేసిన పెంకుటిళ్ళు  ఇంచు మించు అని శిధిలం అయిపోతున్నాయి, ఇంకా ఒకటి అరా ఏమైనా ఉంటె అవి కూడా ఆ ఇంట్లోని పెద్దలు చనిపోగానే పాడు పెట్టేస్తున్నారు.. మా ఊర్లో లింగ తాతగారి ఇల్లు ఇది  ఆయన తరవాత కొన్నాళ్ళకి ఇది చెదలకి నిలయం, లేదంటే కొత్తగా కొన్న వాళ్ళు కూల్చేసి కొత్తది కట్టించుకోడం..

Thursday, June 23, 2011

Day 172 ~ June 21 - Pedda Baala Siksha

A once-up-on-a-time must-have book in Telugu Homes... revived and renewed.. my day to day reference.

నాకు చాల చిన్న వయసులో ఈ పుస్తకం ఇంట్లో చూసిన గుర్తు మళ్ళీ తరవాత ఎక్కడా కనిపించలేదు, ఈ మధ్య మళ్ళీ బుక్ ఎగ్జిబిషన్ పుణ్యమా అని ఇళ్ళల్లోకి చేరిపోతున్నాయ్.  నాకు ఈ పుస్తకం చాల నచ్చింది, పండుగాడికి ఏది నేరిపించాలన్న, తెలుగు నెలలు, వారాలు, పద్యాలు పాటలు అవీ ఇవీ అని లేకుండా అన్ని ఒకే చోట ఉన్నాయ్.  బల్లి శకునాలు, పుణ్య కార్యాలు ముహూర్తాలు అది ఇది అని లేకుండా ఏది కావాలంటే అది దొరికిపోతుంది ఇందులో..