A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Showing posts with label places. Show all posts

Friday, May 4, 2012
Tuesday, April 3, 2012
Wk14/Dy2(93) ~ April 2 - Vacche Vacche Railu Bandi
... kid is delighted to see this sign... each time we pass by a railway line, she wishes a train passes and she waves to the train :)..
చిలకలపూడి దెగ్గర గేటు పడ్డప్పుడు పండుగాడికి పండగ :)... గేటు పడితే పెద్దవాళ్ళకి ఎంత బాధగా అనిపించినా పిల్లలు మాత్రం ఎంత సంతోష పడతారు కదా.. ఆ కూ మోత, జనాలకి చేతులు ఊపుతూ కేకలు పెట్టడం... ఉందొ లేదో స్వర్గం.. నా బాల్యం నాకిచ్చేయ్ పాట గుర్తొస్తుంది.

Wk14/Dy1(92) ~ April 1 - Bird's Eye View...
Kid climbs the bird watch tower at Aatapaaka with Paunaa..
చిచ్కూ గాడికి ఆటపాకలో పిట్టలన్నా, వాటిని చూడటానికి ఎక్కే బోటు అన్నా, ఆ బోటు వెళ్ళేటప్పుడు ఎగిరిపడే బుల్లి చాప పిల్లలన్నా, జపం చేసుకునే కొంగలన్నా భలే నచ్చేసింది... ఇంకొక వారం మాత్రమె ఉండొచ్చు, ఇప్పటికే నీటి నిలవ తగ్గిపోయి, పిట్టలు తిరిగి వెళ్ళిపోయే సమయం దెగ్గర పడింది.... ఈ సారి తను బాగా ఆడుకుంది, అంతకు ముందు ఎందుకు తీసుకెళ్లలేదా అని బాధ అనిపిస్తుంది.

Wk13/Dy7(91) ~ March 31 - Alalu, kalalu, aatalu...
The kid having fun as the waves hit her tiny legs...
మొదటి సారి చిచ్కూ గాడిని బీచ్ కి తీసుకెళ్ళినప్పుడు కాళ్ళ కింద ఇసక జారిపోతుంటే బెదిరిపోయింది, ఇసక నీళ్ళు పోసుకుని ఆదుకుంది కాని అలల జోలికి రాలేదు, అలాంటిది ఒకటి రెండు సార్లు వెళ్ళేపాటికి మనకి విసుగు పుట్టాలి తప్పితే తను మాత్రం అమ్మ కాసేపు, అమ్మ కూసేపు, అంటూ అలలు వస్తూ పోతూ ఉంటె తనని ఎత్తు పట్టుకుని నీళ్ళని తోయించాలి అని భలేగా ఆడుకుంటుంది... బలవంతంగా మనం లాక్కుని వస్తే తప్ప రాకుండా తయారయ్యింది.. బీచి దెగ్గర ఇల్లు పెట్టుకుందాం అని అడుగుతుంది :).

Thursday, March 15, 2012
Wk10/Dy7(70) ~ March 10 - Pelli Mandapam
I actually liked the ambiance created in the village scene with this wedding in spite of hating the extravagance in such events...
పిలవడం పాపం అన్నట్టు ఎక్కడికి పడితే అక్కడికి డుమ్ములు సౌండ్లు వినడానికి వెళ్ళిపోతాం నేను పండు గాడు... అంతే మరీ అన్ని చోట్లకి కాదు ఏదో తెలిసిన వాళ్ళింటికి అన్నమాట :).. మా తాతయ్య తమ్ముడి మనవరాలి పెళ్లి, పక్క ఊర్లో ఇంక మూడు పూటలా పెళ్ళికెళ్ళి పుష్టిగా కుమ్మేసి వాచ్చాం. ఆరు బయట అక్కడ కట్టిన మండపం అదీ మొత్తం కళ్యాణ మండపంని మించిపోయింది... ఎన్ని వేల మంది వచ్చినా చిరాకు లేకుండా జరిగిపోయింది.

Monday, February 13, 2012
Wk6/Dy6(41) ~ Feb 10 - Injikki :(
The hospital prescription booklet of the kid, this place really rocks! Maganti Children's Hospital...
నిను వీడని నీడని నేనే అంటూ పైశాచికంగా పీడించుకుని తింటుంది పిచ్చి దగ్గు చిచ్కూ గాడిని... ఏది తిన్నా, ఆఖరికి మందులు కూడా ఎసుకోవడం కక్కడం ఇంకా ఇంజెక్షన్ కోర్సు ఇవ్వక తప్పలేదు.. నా కంటే ఎక్కువ మా డాక్టర్ గారు బాధ పడిపోయారు, చిన్ని ప్రాణానికి ఎంత ఇవ్వకూడదు అనుకున్నా తప్పట్లేదు అని.. గుడివాడలో ఉన్నఅన్నిట్లోకి సుబ్రతలో కాని, ట్రీట్మెంట్లో కాని, అన్ని రకాలుగా మంచిది ఈ హాస్పిటల్... ఈయన చేతిలో పండు గాడు ఉంటె అన్ని సర్దుకుంటాయి అని నా గట్టి నమ్మకం..!!
PS: We planned on attending Dileep's wedding with Vardhika!! Missed it as were in the hospital the whole day!! Pls. give them your best wishes!

Friday, February 3, 2012
Wk5/Dy7(35) ~ Feb 4 - My First School
This is a sepia picture of the school that I first went to... right in front of my grandparents' home... 30 yrs. ago and still the same..
చిన్నప్పుడు నేను వెళ్ళిన బడి.... నాకు బాగా గుర్తు కొన్ని బియ్యం, మురమురాలు పోసే వాళ్ళు సంచిలో నెలకోసారి అనుకుంటా :).. ఇప్పటికీ ఆ బడి ఉంది కాని పండు గాడిని పంపాలంటే పచ్చి బూతులు నేర్చుకోస్తాడు అని భయం.
Monday, December 19, 2011
Day 354 ~ Dec 20 - Etikoppaaka Toy makers..
Toys ready to be packed and dispatched to different places...
The toy making tools, machine, moulds and the vegetable dyed lac used in coloring of the toys...
ఏటికొప్పాక వెళ్ళాలి అని ఎన్నాళ్ళ నుంచో ఒక కోరిక, అక్కడ ఊరు ఊరు అంతా ఇలా బొమ్మలు చేస్తారు అవి ప్రపంచం అంటా వెళ్తాయి అని వినటమే కాని చూడటం ఎప్పుడా అనుకునేదాన్ని... తీరా అక్కడికేల్లెపాటికి చీకటి పడిపోయింది, కరెంటు కోత మూలాన, ఊరంతా సరిగ్గా చూడటం కుదరలేదు కాని ఒక చోట మటుకు inverter వేసి ఉంటె అక్కడ వెళ్లి కొన్ని కొనుక్కుని వచ్చాం... రోజులో ఎనిమిది గంటలు ఇంకా కరెంటు తీస్తున్నారు అంటే దారుణం అనిపించింది.

Sunday, December 18, 2011
Day 353 ~ Dec 19 - Course of Godavari...
The miniature outside Sir Arthur Cotton Museum in Dhawaleswaram, a heritage place...
కాటన్ దొర ప్రయత్నా ఫలితంగా గోదావరి తీర ప్రాంతం అంత ఎంతో బాగు పడింది అని అనడమే కాని చదివింది నేను చాల తక్కువ, ఇక్కడ మోడల్స్ అవి చూసినాక కూడా పెద్దగ అర్థం కాలేదు, ఇంజనీరింగ్ బుర్ర కాదు మనది కాబట్టి ఏమి ఎక్కలేదు కాని అక్కడ ఉన్న మంచి మాటలు, ఈ నాటికీ అక్కడి ప్రజలు అతినికి ఇచ్చే గౌరవం.. ఇదీ మనిషిగా బ్రతకడం అనిపించింది.

Saturday, December 17, 2011
Day 351 ~ Dec 17 - Beautiful Beach Sunrise
Monday, November 21, 2011
Day 326 ~ Nov 22 - Junk Yard?
unused vehicles which are rendered useless in the local magistrate's office building premises
మామయ్యకి ఏదో పని ఉంది magistrate ఆఫీసుకి వెళ్ళాల్సి వస్తే కాసేపు నేను అటు కాకి తిరుగుడు తిరిగాను, అప్పుడు నా కంటికి ఈ పాడు పడిపోయిన బళ్ళు కనిపించాయి.. తుప్పట్టి పోయి, మట్టి కొట్టుకుని ఎందుకు పనికి రాకుండా తయారయ్యాయి.

Wednesday, November 16, 2011
Day 319 ~ Nov 15 - Pidata Kinda Pappu
Day 317 ~ Nov 13 - Mudupu Kobbari Kaayalu
coconuts offered as "mudupu" for Goddess Chamundeswari in Chitkula, Medak.
చిట్కుల లోని ఈ అమ్మవారి గుడిలో ఏమైనా కోరికలు కోరి ముడుపు కడితే అది తీరినాక ఆ కొబ్బరి కాయ కొట్టి అమ్మవారి దర్సనం చేసుకోవాలి. మా అమ్మ నాతోటి పండు గాడు పుట్టాలి అని కట్టించింది ఒకప్పుడు.. ఇప్పుడు ఎలాగో అంత దూరం వెళ్లాం కాబట్టి ముడుపు చెల్లించి వచ్చాం.
మనది ఇది తెలియదు అన్నిటి మధ్యలో, మొక్కు తీరితే వచ్చి ఏదోకటి విప్పదీసి కొట్టి దణ్ణం పెట్టుకోవచ్చు అని చెప్పారు.

Day 316 ~ Nov 12 - SOS village
A prayer and news-sharing meet at SOS village where all the kids from the 12 families assembled.. a memorable evening with kids and my kid.
వట్టి నాగులపల్లి దెగ్గర ఉన్న ఈ చోటు చాల ప్రశాంతంగా ఉంది.. పిల్లలు అందరు భలే సంతోషంగా ఆడుకున్నారు చిచ్కూ గాడితోటి.. నాకు ఈ ఊరు, ఈ కాన్సెప్ట్, అన్ని చాల నచ్చేసాయి.. ఆ రాకాసి ట్రాఫిక్ నించి బయటి పడి హైదరాబాద్లో ఇంట ప్రసాంతంగా ఉండటం ఇంకా ఇంకా నచ్చింది.
trip here.

Day 313 ~ Nov 9 - Gurjari Memories
Stuff I used to love buying back in early 2000s.. now the place has just gotten smaller but the collection brings back nostalgia.
గుర్జరి అంటే అదొక రకమైన ఇష్టం నాకు, మొదట్లో నాకు జీతం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినవి కొనుక్కోవాలి అన్నప్పుడు ఇక్కడే తెచ్చుకునేదాన్ని.. బట్టలు,ఫైల్స్, పూసలు... ఆ నాటి ఆ జ్ఞాపకాలెంతో మధురం.

Day 312 ~ Nov 8 - Main Door
Door at the entrance of Garvi-Gurjari.. something I have a distinct memory of, something that I really like, that old world stuff..
బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఈ తలుపు చూసి భలే ముచ్చట పడేదాన్ని, దాని కోసమే మొదటి సారి గుర్జరికి కూడా వెళ్లాను అంటే అది అర్థం ఆటుంది.. మళ్ళీ ఇన్నాళ్ళకి.

Wednesday, October 26, 2011
Day 296 ~ Oct 23 - Kainkaryam
Tuesday, October 18, 2011
Day 292 ~ Oct 19 - Shady Roads
Trees spreading shade on both sides of the road near Vadaali on Kattipudi route.
నా చిన్నప్పుడు బెజవాడ నించి ఊరు ఎల్లె ఎర్ర బస్సు ఎక్కితే ఎంత ఎండైనా తెలియకుండా చక్కగా చెట్ల నీడన ఇంటికి చేరిపోయే వాళ్ళం, బస్సు లోంచి తొంగి చూస్తూ, ఒక్కోసారి రాసుకుంటూ బస్సు ఎల్లేది.. రాను రాను కరెంటు తీగలకి అడ్డం అని, వానలకి పడిపోయి కొన్ని, రోడ్లు పెంచడానికి కొన్ని వరసపెట్టి కొట్టేసి కొట్టేసి రోడ్లు మోడు బారిపోయాయి. కత్తిపూడి దాక వేసే రోడ్ లో మిగతావాటిని మెల్లిగా కొట్టేస్తున్నారు, ఎన్నో ఏళ్ళ నించి ఇలా నీడనిస్తూ ఉండే వాటిని కొట్టేసి మన కాళ్ళని మనమే నరికేస్తుకున్నట్టు అనిపిస్తుంది నాకు, చాల బాధగా, ఇంకా ఇలాంటి రోడ్లు కేవలం ఫోటోలోనే చూపించాలి మన ముందు తరాలకి :(.
Day 291 ~ Oct 18 - Vadaali Jagannaatha Swamy Chinna Puri
The idols of Balarama, Subhadra and Jagannatha at Vadaali temple in Krishna dt.
ఇన్ని ఏళ్ళగా ఈ ఊర్లో ఉంటూ పక్కనే ఉన్న ఈ జగన్నాధ స్వామి గుడికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు అసలు అది ఒకటి ఉంది అని కూడా తెలియదు, ఇంటి దెగ్గర నించి మూడు కిలోమీటర్లు కూడా ఉండదేమో గట్టిగా చూసినా, దీనిని పూరి తరవాత అంత గొప్ప గుడి అంటారు అని నాకు తెలియదు.. మొత్తం వడాలి అంటా స్వామి వారి భూములే అంట, దాని అయివేజు మీద నడుస్తుంది అంట, గుడి చిన్నగానే ఉంది కాని బోలెడంత ఖాళీ స్థలం, మూడు ఆవులు, చెట్లు, చూడటానికి బాగుంది.
Subscribe to:
Posts (Atom)