A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Showing posts with label Nature. Show all posts
Showing posts with label Nature. Show all posts
Tuesday, January 24, 2017
Friday, February 22, 2013
Day 49/Feb 18 - Old world feel..
Tuesday, September 4, 2012
Wk35/Dy6(238) ~ August 25 ~ Oori Cheruvulu
the water source of the village, 2 lakes which when dried is kind of drought situation... one is on the verge of drying
ఊర్లో రెండు చెరువులు, పక్కా పల్లెటూరు కావటాన ఇంకా కుల వ్యవస్థ ఉన్నందువలన, చిన్న చెరువు పెద్ద చెరువు అని.. పెద్ద చెరువుకి నీరు ఎత్తున ఉంటాయ్, చిన్న చెరువుకి పల్లాన ఉంటాయి... వానలు రాక విపరీతమైన ఎండలకి ఊర్లో ఇంచు మించు కరువు వాతావరణం, నాట్లు ఇంకా పడలేదు, కాలవలు వదలట్లేదు అయోమయం గందరగోళం లాగా ఉందిపరిస్తితి .

Monday, July 30, 2012
Wk31/Dy3(206) ~ July 24 ~ Creepers on the wall
Saturday, July 28, 2012
Wk29/Dy1(190) ~ July 8 ~ ష - షట్పదము ~ (Sha - Shatpadamu)
Wk28/Dy6(188) ~ July 6 ~ వ - వరి చేను ~ (Va - Vari Chenu)
Wednesday, July 25, 2012
Wk27/Dy5(180) ~ June 28 ~ ప - పచ్చదనం (Pa - Pacchadanam)
Sunday, June 24, 2012
Wk25/Dy6(167) ~ June 15 ~ జ - జనుము గడ్డి (~Ja - Janumu Gaddi)
the second Jha in telugu alphabet..
ఇంటి మీద తాటాకులు కాకుండా ఈ జమ్ము లేదంటే జనుము గడ్డి కప్పుతారు.. రేకుల మీద ఎండల్లో చల్లగా ఉండటానికి కూడా కప్పుతారు.. మామూలుగా ఐతే చాల బారుగా లావుగా బలంగా ఉంటుంది గడ్డి, ఎండాకాలం వానలు పడక ముందు కోయిన్చేసి ఇల్లు కప్పించేస్తారు.. అలా కొట్టేయ్యగా ఇప్పుడిప్పుడే మొలుస్తున్న ఫోటో ఇది.. ఎండల్లో తీసుకోవాల్సింది బద్దకించాను :(.

Saturday, June 9, 2012
Wk23/Dy7(154) ~ June 2 ~ ఔ - ఔషధ విలువలు (Ou- Oushadha Viluvalu)
Neem, tulasi and aloe..
చక్కగా వేప చెట్టు గాలి పీల్చుకుంటూ పందుం పుల్ల తోటి పళ్ళు తోముకుని కొంత వేప చిగురు తినేసి ఆ పిమ్మట కాస్త తులసాకులు నమిలితే అసలు ఏ రోగాలు దెగ్గరకి రావు అని మా తాతయ్య చిన్నప్పుడు మాతోటి తినిపించేవాడు ... ఇప్పుడు అన్నీ ఉన్నా కాని ఒంటి నిండా బద్ధకం కూడా ఉండి ఏమి చెయ్యట్లేదు.
మొఖానికి కాస్తంత కలబంద గుజ్జు రాసుకుంటూ మచ్చలు పడవు అని కూడా అం, అన్నీ ఇంట్లో ఉండి వీటిని ఉపయోగించుకున్న వాళ్ళు ధన్యులు సుమతీ అని నా మాట.

Thursday, May 24, 2012
Wk22/Dy6(146) ~ May 25 ~ ఋ - ఋతువు (Aru - Rutuvu)
Kid happily playing with flowers in what I call the Indian fall.. sisira rutuvu :).
శిశిర ఋతువు అంటే ఆకులు రాలే కాలం అని నాకు చాలా రోజులు తెలియదు.. అంటే మనకి తెలుగు బ్రహ్మాండంగా వచ్చేసును అని కాదు కాని చాల మటుకు మంచి తెలుగు వచ్చేది కాదు, ఇప్పటికీ రాదు అనేది పక్కన పెడితే.. ఇది మా బుల్లి బుచికిని చిన్నప్పుడు ఏడో నెలలో తీసిన ఫోటో.. ఋతువుల్లో ఈ ఋతువు చూడటానికి బాగుంటుంది ఎంచక్కా కింద నేలంతా ఆకులు పువ్వులు పడి, పాచి వాళ్ళ నడుములు పోతాయి కాని భలే ఉంటుంది కింద నేల, తరవాత చెట్లు బోసి పోతాయి అనుకోండి, కాని అదీ జీవితంలో ఒక భాగమే, మళ్ళీ కొత్త చిగురు కొత్త సృష్టి.
PS: I had initially chosen my favorite spring picture from US but mana ooru conceptki set kaaka, now that the kid no where resembles the one in picture currently, bindaasgaa posting :).
Tuesday, May 22, 2012
Wk21/Dy3(143) - May 22 ~ ఈ - ఈనెల చీపురు (Ee - eenela cheepuru)
Saturday, May 19, 2012
Wk21/Dy1(141) - May 20 ~ ఆ - ఆకుమడి (Aa - Aakumadi)
The paddy shoots ready to be planted elsewhere..
పొలంలొ వరి విత్తనాలు నాటినప్పుడు వాటిని ఆకుమడి అంటారు.. ఒక మడి చెసి అందులొ విత్తనాలు జిమ్ముతారు.. అవి మొక్క మొలిచినాక తీసి నాటుమడి లొ కూలీల చేత నాటిస్తారు..
పండు గాడి చిన్నప్పుడు ఏదో పోటీ కోసం తీశాను ఈ ఫోటోలని... ఇప్పుడు గాని అలా పొలంలో దింపితే పీకి పాకం పెడుతుంది.
PS: From the archives.
Suggestions for the next alphabet ????
Sunday, May 13, 2012
Wk19/Dy7 (133) ~ May 12 - Kobbari Chettu Kadhalu
Finally got someone to cut down the branches and dry and formed coconuts from the trees... was scared to death with the winds, rains and thunders and them falling left, right and center all around the place.
కాయలు అన్ని తయారు ఐపోయి కోసే వాళ్ళు లేక, మట్టలు ఎండిపోయి గాలికి ఎప్పుడు పడతాయో తెలియక, అడపా దడపా రాలే కాయలు ఎక్కడ గుండు పగల కొడతాయా అని భయం భయం గా ఉంటున్నా ఈ మద్య .. అసలు చెట్టు ఎక్కే లేదే నాధుడే లేకపోయాడు ఊర్లో.. అందులో ఇవి కాడుల్లగా ఇంత బారున ఉన్నాయి.. ఎలాగైతేనేమి చెట్టుకి 50/- అని చెప్పి బతిమాలి బామాలి ఎక్కించి కొట్టించి ఊపిరి తీసుకున్నా.. అసలే ఈ మధ్య ఈదురు గాలులు, వానలు, హడిలి పోతూ బ్రతికాను ఎవరి మీద పడతాయో అని... హమ్మయ్య
Tuesday, May 8, 2012
Wk19/Dy3(129) ~ May 8 - Allukunna Latalu
I love this green creeper giving out yellow flowers, put it last year during rains.. it was a task getting it to climb the first floor but then it caught up really fast once there :)...
నాకు ఇల్లు అంటూ ఉంటె ఎంచక్కా ఒక బుల్లి వరండా అందులో ఒక ఊగుడు బల్ల అందులో కూర్చుని చూడటానికి చుట్టూ పచ్చదనం ఉండాలి అని కోరిక.. అదెలాగో ఎప్పుడు తీరుతుందో తెలియదు అంతలోపు ఈ ఇంట్లో పోయినేడాది ఈ మొక్క నాటాను వానల్లో, అది పెరిగి డాబా మీద అల్లుకుని గాలికి ఊగుతూ పచ్చటి పూలతోటి ఎంతో ముద్దుగా ఉంది ఇంకా అల్లుకోవాలి కాని నాకు ఎక్కడ ఆగుతుంది ఆనందం.. ;).

Subscribe to:
Posts (Atom)