Showing posts with label books. Show all posts
Showing posts with label books. Show all posts

Monday, February 20, 2017

Feb 18 - Sorting

Letting go of things is the toughest task, a few of her books set aside to give away to her cousins..  One thing I am gong to miss going back to India is books.  I feel too stressed to even think of leaving behind our 1st home together..

Went grocery shopping in the evening and it always a pleasure to listen to old songs on the drive, the same list for the last 10 years, in between we switched to new ones but evenually fall back into the old track :)


Monday, March 25, 2013

Day 74/March 15 - Current Reads

the new set from the library...

కొత్త పుస్తకాలు వచ్చేసాయి... 

Tuesday, February 5, 2013

Day 33/Feb 2 - Kiddie Reads

The library system rocks.. like I say time and again... these are the kid's bedtime reads... she just loves them..!

Tuesday, July 31, 2012

Wk32/Dy4(214) ~ August 1 ~ More Books

a few more from complete yandamoori collection..

తెలుగు పుస్తకాలు చదవడం పెంచాను ఈ మధ్య, OA  తెచ్చిపెట్టిన యండమూరి సెట్టు మొత్తం, శ్రీ శ్రీ, మాలతి చందూర్ బాపు రమణ సాహిత్యం , మెల్లిగా చదువుతున్నా.

Saturday, May 19, 2012

Wk20/Dy5(138) ~ May 17 - Chadivesaanoch

Done with complete all the mags and monthlies up to date...

చాలా రొజుల నించి మా అమ్మకి ఒంట్లొ బాగోక నాకు ఖాళీ లేక, చదవ బుద్ధి కాక.. అలా పేర్చి పెట్టిన పుస్తకాల దుమ్ము దులిపేసాను ఆఖరికి.

Tuesday, April 17, 2012

Wk15/Dy4(102) ~ April 11 - Abbo Ennunnaayo!

My new lot... somehow I just am not able to read anything... some block I guess!

కాగితం కనపడితే పాపం అనుకుని పొట్లం కట్టిన వాటిని కూడా చదివేసే నాకు ఈ మధ్య పెద్దగా చదవ బుద్ధి కాట్లేదు.. ఎండలు, పని వత్తిడి, కేవలం ఒక పైత్యం ఏదైనా కావొచ్చు.

Sunday, April 8, 2012

Wk14/Dy7(98) ~ April 7 - A Day of Shopping

... all set for the big day.

పండు గాడి పేరు చెప్పి పండగ చేసుకోటం నాకు అలవాటే కదా.. తన పుట్టినరోజు అని చెప్పుకుని ఊరు మీద పడి అన్ని తెచ్చేసుకున్నాం.. చాలా రోజుల తరవాత విజయవాడ వెళ్లాం.

Friday, March 2, 2012

Wk9/Dy6(62) ~ March 2 - The books that chose me..

There are some books I plan to buy and some books that kind of come to me a gift or just a random pick from the store..!!!

కొన్ని పుస్తకాలకి మనకి ఏదో అనుబంధం ఉంటుంది అని గట్టిగా నమ్ముతాను నేను... నేను ఎంచుకునేవి కొన్ని ఉంటాయి, నన్ను ఎంచుకునేవి కొన్ని ఉంటాయి... ఆ సమయంలో నాకు కావలిసింది ఏంటో ఎవరో తెలుసుకుని పంపించినట్టు ఉంటుంది అందులోని సారాంశం.. అలాంటివే ఈ రెండూ.

Tuesday, February 21, 2012

Wk8/Dy3(52) ~ Feb 21 - Pani Leni Panulu

... putting a cover for my personal books...

ఖాళీగా ఉంటె పండుగాడి జ్వరం గురించి తలుచుకుని పిచ్చెక్కి పోతుంది అని ఈ పని లేని పనిని ఇవ్వాళ పెట్టుకున్నా... తను కొంచెం పరవాలేదు ఆడుతుంది.. సాయంకాలం అవ్వబోతుంది అంటే చాలు గుండెల్లో గుబులు పుడుతుంది ఈ మధ్య నాకు... దేవుడా.... ఇంకా చాలు ఈ ఏడాదికి సరిపడా నొప్పులు తనకి ఇచ్చేసావ్, కోలుకునే ఓపిక రానివ్వు!

Wk8/Dy2(51) ~ Feb 20 - Night out buddies!!

My new lot arrives to keep me company when I stay awake to keep a watch on the kid

చిచ్కూ గాడికి పగలు అలా అలా ఉన్నా రాత్రి మాత్రం పిల్ల అల్లాడిపోతుంది జ్వరానికి.. టెస్ట్లు ఏమి చూపించట్లేదు, హీమోగ్లోబిన్ తక్కువ ఉంది resistance  లేదు అంటారు... ఎన్నాళ్ళో తనకి ఈ గోల పాపం..

ఎప్పుడూ చదివే నాకు ఇప్పుడు ఈ చదువే కాస్త నిమ్మళంగా అనిపించేలా చేస్తున్నాయి.

Monday, February 13, 2012

Wk6/Dy7(42) ~ Feb 11 - Kid's Books..

... and we finally get to read our this year's book buys from the exhibition and watch the kid rhyme/dance CDs and DVDs!!

చిచ్కూ గాడి జ్వరం పుణ్యమా అని వాడికి కొన్న పుస్తకాల దుమ్ము దులిపాము, నీరసంగా పడుకుని వింటూ ఉండిపోయింది పాపం.

Thursday, February 2, 2012

Wk5/Dy4(32) ~ Feb 1 - Nenadoka Type...

Two contradictory things that I plan to do at the same time.. Pro and Anti Ramayana Epic.

ఊరందరిది ఒకదారి నాది ఇంకో దారి.. ఇది జగమెరిగిన సత్యం :).. ఊరందరిది ఒక దారి నాది మాత్రం రహదారి అనేది నేను అనుకునే సత్యం.   RGV తెగ పొడిగిస్తే ఏంటబ్బా ఇది ఒకసారి చదవాలి అనుకున్న, మళ్ళి నవ్యలో కళ్ళు తెరిచినా సీత చదివినాక ఈసారి చదివేయ్యల్సిందే అని గట్టి నిర్ణయం తీసుకున్నా.. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు..

The playlist containing Chaganti gaari discourses on Ramayana and Human Values in Today's Society..
రామ భక్తుడైన చాగంటి గారి రామాయణం మానవీయ విలువలు అనే ప్రసంగం వింటూ ఇది చదవడం ఈ కధకి మీరెవరు అనుకోని మలుపు... అదొక పైత్యం అనుకోండి ఏమైనా అనుకోండి.. ఒక ప్రయోగం అని మాత్రం నేను చెప్పగలను.

Friday, January 27, 2012

Wk3/Dy4(18) ~ Jan 18 - Geeta Makarandam

Different Geeta translations I happen to have...

గీత చదివి మన గీత మార్చుకోవడం అనేది ఎప్పటినించో నేను వింటున్న మాట, నేను చాల బాధగా ఉన్నప్పుడు విని తెరిపిన పాడేది కూడా ఇది వినే, ఘంటసాల గారి గొంతులో అమృతం పోసి మరీ పాడినట్లు ఉంటుంది, బాధ తీసి పెట్టినట్టు పోతుంది.  ఎలాంటి ప్రశ్నకైన అందులో దాగి ఉన్న సమాధానం తెలిస్తే చాలు అనిపిస్తుంది... మళ్ళీ వినడం మొదలు పెట్టాలి, చదవడం మొదలు పెట్టాలి అనుకుంటూ ఉన్న పుస్తకాలన్నీ పోగేసి చూసుకుని మురిసిపోవడమే కాని చదివిన విన్న పాపాన పోట్లేదు :(.

Wednesday, January 11, 2012

Week 2, Day 12 - Jan 12 ~ Taala Patra Grandhaalu

Hanuman Chalisa and Ashtalakshmi Stotram on palm leaves... reviving old with new technology..

అప్పుడెప్పుడో ట్యాంక్బండ్ మీద ఎల్తుంటే నన్నయ్య, తిక్కన మొల్ల లాంటి వాళ్ళ చేతుల్లో చూసినవి, లేదంటే బొమ్మల్లో చూసినవి ఇవి.. అప్పుడు వీటి మీదే రాసేవాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తున్నారు అని చూపెట్టారు... ఒక్కోటి 250 /- అన్నారు... నేను కొనలేదు, ఎందుకో చదవనేమో అనిపించింది.. కొని దాయడం కూడా నచ్చలేదు.

Tuesday, January 10, 2012

Week 2, Day 10 - Jan 10 ~ Vijayawada Book Exhibition

Yay, finally before the close tomorrow, I went to the place I look forward to go to each year, missed it last year due to multiple fractures :)

పుస్తకాలు నమిలి మింగేసే టైపు నేను.. అలాంటి నాకు పుస్తకాలన్నీ గుట్టలు గుట్టలుగా ఒకే చోట కనిపిస్తే ఇంకా చెప్పేదేముంది పెద్ద పండగ :).. ప్రతి ఏడు దీని కోసం భలే ఎదురు చూస్తాను నేను.

Rain played a spoil sport... but I did not give up.

మొత్తం రోజంతా తుప్పర పడుతూనే ఉంది.. ఉంది ఉంది వాన ఝాడించి కొట్టడం, మళ్ళీ తుప్పర పడటం.. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడి జాతి కదా మనది వదలలేదు...

Leaving English to Flipkart buys, just focused and bought Telugu books.

కొత్త పుస్తకాల వాసన అంటే పడి చచ్చే నాకు ఆహా ఓహో అమోఘం.

PS:  Missed you Keerthi.. BG gaaru, Olga books choosinappudu I remembered you a lot! 

Monday, January 2, 2012

Week 1, Day 2 ~ Jan 2 - The Fresh Lot

The new lot from the British Library

నాకు మళ్ళీ చదువుకోవడానికి బోలెడు పుస్తకాలు వచ్చేసాయోచ్చ్!

Saturday, September 3, 2011

Day 246 ~ Sep 3 - L For Library System


Wherever I go, there is a library to keep me company... AFP, by far is the best library system that I have seen and used.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నా తోడుగా ఉన్న నా నేస్తాలు పుస్తకాలు, అక్కడ కొంచెం సర్డుకోగానే నేను వెతుక్కునేది ముందుగా అక్కడ ఉండే లైబ్రరీ కోసం.  ఊర్లో గ్రంధాలయంలో ఇలాంటి కార్డు ఇవ్వరు కాని పుస్తకంలో రాసి తెచ్చుకోవడమే.

Tuesday, June 28, 2011

Day 179 ~ June 28 - Sneha bandham

Gifts from my best buddy..

ఒకప్పుడు మేము కలిస్తే ఎప్పుడో తెల్లారి నిద్రపోయేవాళ్ళం కబుర్లు చెప్పుకుంటూ, అలిసిపోయి, ఓపిక పోయి ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియలేదు ఇద్దరి కీ.. కాలం తో పాటు ఎన్ని మార్పులు వచ్చినా మారని బంధం స్నేహం ఒకటే కదా, ఎంతో దూరం నించి వచ్చినా ఎక్కువ సేపు నాతో లేకపోయినా, తను వస్తే అదొక తృప్తి...జీవితపు ఒడిదొడుకుల్లో పడి పెద్దగా మాట్లడుకోపోయినా తనకి నేను ఉన్నాను నాకు తను ఉంది అని నమ్మకం చాల గట్టిది.  పెళ్లి అయిపోయి, దూరం ఐపోయి ఎన్నో స్నేహ బంధాలు విడిపోయినా తను నేను మాత్రం అలా ఉండిపోయాం.  ఇంట్లో వాళ్ళు అరిచి గీపెట్టినా గోల చేసిన అన్ని లైట్ లైట్ లైట్.. వాళ్ళ దారి వాళ్ళది మా దారి మాది.. ఇది ఫెవికాల్ బంధం.

నాకు క్రియ నేర్పించి నాతొ చేయించి నా కంటే నా గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నన్ను అన్ని వేళలా అర్థం చేసుకుంటూ ఉండే తను నాకు దేవుడిచ్చిన తోబుట్టువు.


Friday, June 17, 2011

Day 166 ~ June 15 - Schools Begin..

.. and the new books arrive.  The govt. schools provide children with text books and give a list for the notebooks.

కొత్త సంవత్సరం మొదలు అయ్యింది, కొత్త పుస్తకాల జోరు.. నాగుకి కొన్న పుస్తకాలు కాకుండా ఇంకొన్ని కొత్త పుస్తకాలు కొనమని బళ్ళో చెప్పారు అంట... కాయితం రాసుకొచ్చి ఇచ్చింది.. అలా కొనుక్కొచ్చి, వాటికి అట్టలు వేసి, ఆ కొత్త వాసన చూస్తూ ఉంటె మళ్ళీ బళ్లోకి నేనే వెళ్ళినంత ఆనందంగా ఉంది.  ఇవి కొన్నప్పుడు ఆ పిల్ల కళ్ళలో ఆనందం ఎంత డబ్బులు పోసినా రాదేమో... తను బాగా చదువుకుని పదో తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి జీవితానికి బాట వేసుకోవాలి అని అందరు దీవిన్చేయ్యండి ప్లీజ్.

Sunday, June 5, 2011

Day 157 ~ June 6 - A couple of Years Ago

A snapshot of library checkouts in 2009...books my best friends, that see me through everything!!!

ఊరికొచ్చిన కొత్తలో టీవీ చూడలేక, మనసు అస్సలేం బాగోక, ఎవరి తోనూ మాట్లాడటం ఇష్టం లేక అంటే ఇష్టం లేక కాదు ఆ మాటలు వినలేక ఏమి చెయ్యాలో అర్థం కాక, ఎక్కడికైనా పారిపోదామా అంటే, పెద్ద పొట్ట వేసుకుని వెళ్ళలేక నా పాట్లు ఇప్పుడు తలచుకుంటే భలే నవ్వొస్తుంది.  ఎలాగో అంత మొండితనం ఉన్నప్పుడు అప్పుడు మాత్రం ఎందుకు అంత బాధ పడాలి అని... కాని అంత స్థితప్రజ్ఞత వచ్చేస్తే ఇంకేమి కావాలి.

శిరీష ఐడియా ప్రకారం నేను ఇప్పటి దాక చదివిన పుస్తకాల లిస్టు తయారు చెయ్యాలి అంటే చాల వరుకు గుర్తు రాట్లేదు, తోచినవి రాసుకుని, ఇలా లైబ్రరీ లో చదివిన వాటిని మాత్రం అక్కడికెళ్ళి రాసుకోచ్చాను.  మొదట్లో నేనే వెళ్లి తెచ్చుకున్నాను, ఒకసారి కళ్ళు తిరిగి తూలు వచ్చెయ్యడం తోటి బడిలో పిల్లలు తెచ్చిపెట్టేవాళ్ళు, ఒక్కోసారి, మా అమ్మ, మిట్టు వెళ్ళేవారు.  ఈ లైబ్రరీ లేకపోతె ఇంకా ఎంత పిచ్చెక్కి పోయేదో అనిపిస్తుంది ఒక్కోసారి.

ఆ రోజలు తలచుకుంటే వణుకు కూడా వచ్చేస్తుంది, కూర్చోలేను, నుంచోలేను, నడవాలంటే పడిపోతానేమో అని భయం, తిండి సహించదు, ఏమి అర్థం కాదు, కుదురులేని ఆలోచనలు, క్షణ క్షణం భయం భయం... కాని ఒక భయంకరమైన మొండి ధైర్యం తెగువ, అదే లేకపోతె నేనంటూ లేనేమో.