Tuesday, August 14, 2012

Wk34/Dy4(228) ~ August 15 ~ Jai Bharath

Performance by Prince Troupe at Carnival

స్వాతంత్ర్య దినోవత్సవ వేడుకలు...

Wk34/Dy3(227) ~ August 14 ~ Lovely Get-ups

the other cutie pies

అసలు ఎంత ముద్దుగా ఉన్నారో బుజ్జి కన్నలు .

Wk34/Dy2(226) ~ August 13 ~ Baby Jhansi

On the way to fancy dress competition

మొదటి సారి పండు గాడి బళ్ళో స్వాతంత్ర్య సమరయోధుల వేషం వేసుకుని రమ్మని చెప్పారు.. తనని ఝాన్సీ  లక్ష్మిబాయి లాగ తయారు చేయించి తీసుకుని వెళ్ళాము.

Wk34/Dy1(225) ~ August 12 ~ Meeting Buddies


Meeting her virtual buddies...

ఆఖరికి తన ప్రియ మిత్రులని కలిసి కాసేపు కబుర్లు చెప్పింది.

Wk33/Dy7(224) ~ August 11 ~ To Dholakpur

The carnival at Haailand

పండుగాడి చోటా భీమ పిచ్చి అంతా ఇంతా కాదు, ఏది చెప్పినా చేసేస్తుంది తను.. అందుకే డోలక్ పూర్ వెళ్తున్నాం అనగానే ఎగిరి గంతేసింది..

Wk33/Dy6(223) ~ August 10 ~ Potter

potter at work..

బుల్లి బుల్లి మట్టి ముంతలు భలేగా చేస్తున్నాడు కదా ఈ తాత.. 

Wk33/Dy5(222) ~ August 9 ~ Un-Follow'ed

though the folder says productivity, it is exactly the opposite when it comes to my life.. most unproductive time spent is in these sites

మెల్లిగా ఒక్కోటి నా వ్యసనాలని పక్కన పెడుతున్నా... 

Wk33/Dy4(221) ~ August 8 ~ Mosquito Menace


పొలాల్లో ఊడుపులు మొదలు పెట్టినాక దోమలు అన్ని ఊరు మీద పడిపోయినాయి.. ఈ చేపల చెరువుల పుణ్యమా అని ఇంచు మించు ఏడాది పొడుగునా దోమలు ఉంటూనే ఉంటున్నాయి, ఎండలు  మటుకు ప్రాణానికి హాయి, ఇప్పుడు ఇలా అన్ని సమకూర్చుకుని పెట్టుకొని చంపుకోడమే పని

Wk33/Dy3(220) ~ August 7 ~ Minnu This August

Minnu this month...

నాకు మిన్నుని చూస్తె పండు గాడు గుర్తొస్తాడు, వాడి భవిష్యత్తు గుర్తొస్తుంది.

Wk33/Dy2(219) ~ August 6 ~ Less Mess

With the uniform 5 days a week, the daily-wear cupboard looks a lot more cleaner :)

తొడిగే బట్టలు తగ్గిపోయినాక పండు గాడి బీరువా భలే ముద్దుగా ఉంటోంది ఈ మధ్య.

Wk33/Dy1(218) ~ August 5 ~ First Exam

.. and the kid completes her exams

 పరిక్షలు అంటే భయపడాలి, ఓ చదివేయ్యాలి అని ఎవరు చెప్పారో కాని పండుగాడికి ఒకటికి పది సార్లు చదువుకుంటూ కూర్చుంది.. నేనేమో ఎందుకురా వచ్చు కదా చదవటం అంటే, ఎగ్జామ్స్ కి చదవాలి లే అమ్మా నీకు తెలియదు అంట :).

Wk32/Dy7(217) ~ August 4 ~ The dairies begin

weekly and lesson plan.

పండుగాడి డైరీ...

Wk32/Dy6(216) ~ August 3 ~ First Class/Homework

Official first classwork and homework done by kid

నాకు పిల్లలకి బండెడు పుస్తకాలు, పూటంతా సరిపోయే చాకిరి లాంటి హోం వర్క్ అంటే భలే భయం.. అదృష్టవశాత్తు పండు గాడికి రెండు లైన్  లకి మించి పని ఇవ్వరు, అది కూడా తను రాగానే నన్ను కూడా చూడనివ్వకుండా బరికేసుకుంటుంది.. ఇంకా పుస్తకం శుబ్రంగా ఉంచుకోడం తెలియట్లేదు, ఒక లైను రాయమంటే కాగితం అంతా రాస్తుంది.

Wk32/Dy5(215) ~ August 2 ~ Stocked up

The school kid-essentials...!

పండు గాడిచదువు సరంజామా.. బళ్ళో తనకి అన్నీ వాళ్ళే ఇస్తారు.. ఇంటి దెగ్గరకి తనకి ఇవన్నీ కావాలి అని తెచ్చుకుంది.