The earthen pots for cool water to beat the summer heat
మా చిన్నప్పుడు ఫ్రిజ్ అనేది లేనప్పుడు ఎండలు వస్తే రాత్రి పూట ఎవరి బుల్లి కూజ వాళ్ళది, కుండలో నీళ్ళు... తాబేటి కాయ ఒకటి ఉండేవి ఎప్పుడు ఎండా కాలంలో.. ఈ మధ్య కుండలు తప్ప వేరేవేమి కనిపించట్లేదు నాకు, కూజాలు కూడా అక్కడక్కడ ఉంటున్నా ఈ తాబేటి కాయ మాత్రం అస్సలు కనిపించలా.. మొన్న రోడ్ మీద కనిపిస్తే ఎంచక్కా తెచ్చేసుకుని నీరు చిమర్చడానికి కుండ పక్కన పెట్టి వాడటం మొదలు పెట్టా.
శ్రీగారు,
ReplyDeleteనమస్కారం.
తాబేటి కాయ కోసం, కనీసం ఫోటో తీసుకోడానికి మా పల్లెలో కుమ్మర్ల ఇళ్ళన్నీ తిరిగాను దొరకలేదు. నెట్ లో వెతికితే మీ దొకటే ఫోటో కనపడింది. తీసుకుంటున్నానని ముందు చెప్పనందుకు మన్నించండి. మీ బ్లాగులు చూశాను, బాగున్నాయి. మరలా చూడాలి, చదవాలి. నన్ను తెలియనివారి బ్లాగులు చూసినపుడు బాగుంటే చెప్పడం నాకో అలవాటు. తప్పులుంటే మన్నించండి.
శర్మ