Trees spreading shade on both sides of the road near Vadaali on Kattipudi route.
నా చిన్నప్పుడు బెజవాడ నించి ఊరు ఎల్లె ఎర్ర బస్సు ఎక్కితే ఎంత ఎండైనా తెలియకుండా చక్కగా చెట్ల నీడన ఇంటికి చేరిపోయే వాళ్ళం, బస్సు లోంచి తొంగి చూస్తూ, ఒక్కోసారి రాసుకుంటూ బస్సు ఎల్లేది.. రాను రాను కరెంటు తీగలకి అడ్డం అని, వానలకి పడిపోయి కొన్ని, రోడ్లు పెంచడానికి కొన్ని వరసపెట్టి కొట్టేసి కొట్టేసి రోడ్లు మోడు బారిపోయాయి. కత్తిపూడి దాక వేసే రోడ్ లో మిగతావాటిని మెల్లిగా కొట్టేస్తున్నారు, ఎన్నో ఏళ్ళ నించి ఇలా నీడనిస్తూ ఉండే వాటిని కొట్టేసి మన కాళ్ళని మనమే నరికేస్తుకున్నట్టు అనిపిస్తుంది నాకు, చాల బాధగా, ఇంకా ఇలాంటి రోడ్లు కేవలం ఫోటోలోనే చూపించాలి మన ముందు తరాలకి :(.
No comments:
Post a Comment