my savaari in Gdw, whenever I go there..
గూడు రిక్షాలు పోయి ఈ రిక్షాలు వచ్చేసి ఈ మధ్య, ఎక్కడం కాస్త కష్టం నాకు బట్ కాలుష్యం పెంచని బండి కాబట్టి నాకు ఇదే ఎక్కువ ఇష్టం అంతక ముందు అరె ఒక మనిషి కష్టపడి బండి లాగుతుంటే దున్నపోతులాగా ఎక్కి కూర్చోడం ఏంటి అని ఒక ఫీలింగ్ ఉండేది, తరవాత తరవాత వాళ్ళతో మాట్లాడి, తెలుసుకుంది ఏంటి అంటే ఆటోలు లాంటివి కొంటె పెట్రోలు అని, license అని, పోలీసులు అని, రిపేర్లు అని ఆ గోలంతటికంటే రెక్కల కష్టం మంచిది అని అనుకుంటున్నారు అని నచ్చితే వెళ్తాం లేదంటే తన్ని పెట్టి పడుకుంటాం అని అనుకుంటారు అని.. ఈ బండి లాగి పిల్లల పెళ్లి చేసి, చదువులు చెప్పించి చాల చేసాం అంటే భలే ముచ్చటేస్తుంది.. ఎప్పుడు గుడివాడ ఎల్లినా చక్కగా నేను వెళ్ళాల్సిన చోట్లు , ఉండాల్సిన టైం చెప్పేసి ఒకళ్ళని మాట్లాడేసుకుని మళ్ళి బస్సు స్టాండ్ దెగ్గర దిమ్పేసే లాగ చూసుకుంటున్న. ఈ మధ్య నేను వాళ్లకి బాగా పరిచయం అయిపోయి వాళ్ళే వంతులేసుకుని వచ్చేస్తున్నారు :).
మనుషులతో మాట్లాడుతూ, సుఖ దుఖాలు తెలుసుకుంటూ, కలిసి ఉండటంలో ఉన్న మజా నే వేరు కదా.
No comments:
Post a Comment