I found these trash to treasure handmade vases made with beads and wires.. first one using the glass top of a traditional lamp and the other from a bulb and a bangle as base structures in the collection that I got from the house owner :).
మా చిన్నప్పుడు ఇలాంటివి చాల చూసే వాళ్ళం, చేసేవాళ్ళం కూడా.. వైర్ బుట్టలు అల్లడం, వగైరా , వగైరా.. చాలా ఏళ్ళ తరవాత మొన్న ఇల్లు దులిపేటప్పుడు ఇవి బయట పడ్డాయి.. ఈ రోజుల్లో నాజూకు సోకులు మొదలయ్యాక ఇలాంటివి చేసే ఓపిక, తీరిక, పెట్టుకునే స్థలం ఎవరికీ ఉండట్లేదు.. నేను కూడా ఇప్పుడు వీటిని ఎక్కడ పెట్టాలా అని దీర్గాలోచనలో ఉన్నా..
దీపం బుడ్డి మీది గ్లాసు తోటి పూసలు, వైర్, గట్టిగా అల్లి చేసింది కనీసం పాతిక ఏళ్ళ కిందటిది, ఇప్పటికీ చెక్కు చెదరలేదు.