The statue of anjaneya swamy.. standing next to the main road.
ఈ విగ్రహం మా తాతయ్య నేను చిన్నప్పుడు ఎప్పుడో చేయించాడు, ఇంటి ఎదురుగా ఉన్న రామాలయానికి ఇవ్వడానికి, తరవాత ఆ గుడి మూత పడిపోయింది, విగ్రహం పని ఆగిపోయింది....అలాగ రంగులు లేకుండా, సిమెంట్ తోటి చాలా రోజులు ఉండిపోయింది ఇంటి ఎదురుగుండా.... చివారఖరికి ఎప్పుడో ఎవరో బడ్డీ కొట్టు అతను అడిగి తీసుకుని దీనికి మోక్షం ప్రసాదించాడు.. తన కొట్టు పక్కనే నిలబెట్టి.. రోడ్ పక్కనే ఉన్న తన షాప్ ని గవర్నమెంటు వాళ్ళు కూల్చేయ్యకుండా... కొంచెం బాధేసింది ఇలా ఆయన విగ్రహం వాడటం కాని అలా రంగులు లేకుండా ప్రతిష్ట లేకుండా ఉండటం కంటే ఇదే మేలు అని సరిపెట్టేసుకున్నా... చిచ్కూ కి అంజి స్వామి నాకు God మేము ఆ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఒకసారి పలకరించి వెళ్తాం.
No comments:
Post a Comment