Full moon at 5:30 p.m. yesterday. the flash -less cam could not capture the beauty but still I tried (pic taken by sony cam).
నాకు వెన్నెల్లో ఇప్పుడు నేను ఉండే ఇల్లు అంటే చాలా చాలా ఇష్టం.. అంతకు ముందు కూడా ఇష్టమే కాని వెన్నెల నిజమైన అందం నేను ఆస్వాదించింది ఇక్కడే.. వెన్నెల్లో ఈ ఇంటి అందం చెప్పలేనంత ఇష్టం నాకు.. కొబ్బరి చెట్లు మీదగా పడే వెన్నెల నీడ, ఆ వెలుగులో ఆ ఇంటి నీడ పడే నేల, చల్లని గాలి, చుట్టు పక్కల నిశ్శబ్దం.. డాబా మీద నించి చూస్తె కనిపించే ఊరు, సద్దుమణిగిన తరవాత చాలా ముచ్చటగా ఉంటుంది.. ప్రతి రాత్రి పౌర్ణమి ఐతే ఎంత బాగుండు అనిపిస్తుంది.. ఇంత తీరిక, ఓపిక అవకాశం మళ్లీ ఎప్పుడు దొరుకుతుందో అని వెన్నలని అంతా తాగేయ్యాలి అనిపిస్తుస్తుంది కూడా :).
The moon at 8 p.m. could not stay out beyond that due to cold.. how I wish I had a camera to capture these lovely moments (sony cam again).. but Thank God for the lovely lens in my eyes which enables me to enjoy this spectacular beauty of nature once a month.
అసలు వెన్నల అనే కాదు నాకు వీలు కుదిరినప్పుడు ఆకాశం వైపు ఆ నక్షత్రాల వైపు, వీధి దీపాల వెలుతురులో కనిపిస్తున్న చెట్ల ఆకుల నీడల్ని, చిన్ని చిన్ని దీపాల్లాగా కనిపించే మిణుగురు పురుగుల్ని చూడటం అన్నా కూడా చాలా ఇష్టం.. గుప్పెండంతా ఆకాశాన్ని తీసుకుని గుండెల్లో దాచేసుకుని ఎప్పుడు అదే ఆనందం పొందాలి అనిపిస్తూ ఉంటుంది.. చిచ్కూ కి ఇంకా పెద్దగా తెలియదు కాని చందమామ అన్నా స్టార్స్ అన్నా భలే ఇష్టం.. చల్ల గాలి అని నేనే బయటకి తీసుకుని రాను గాని..
First pic is beautiful!
ReplyDeleteNijam gane sree...first pic lo vennela andam nindu ga kanipisthundi...so beautiful!
ReplyDelete