Thursday, December 9, 2010

December 8 - Kottaa.. Paatha

I finally get a Nikon basic model sleek camera for regular pictures to assist at nighttime...

కొత్త కెమెరా ఒకటి కొనేసాను ఆఖరికి... SLR కొనాలి అంటే అది మనకి అందే రేంజ్ లో లేదు.. మొత్తం మీద నాకు నచ్చింది కొనాలి అంటే చిరిగి చాటంత అయ్యింది దెగ్గర దెగ్గర 60K అన్నాడు.. కాసేపు దాని వేపు చూసుకుని, నోట్లో నోట్లో  సొల్లు కార్చేసుకుని.. ఉసూరు మంటూ ఒకటి తెచ్చుకున్న.. ఈసారి పెద్ద budget కొనేస్తే మళ్లీ నా SLR కోరిక మూల పడిపోతుంది అని, అయినా నేను తీసే ఇంతోటి బొమ్మలకి ఇప్పుడే అంత కావాలా అని, ఒక రకంగా ఈ బ్లాగ్ కోసమే కొన్నాను దీన్ని.. ఈ ఊరునించి వెళ్ళేలోపు అన్ని జ్ఞాపకాలు దాచుకోవడానికి.. ఒక వాచీ కూడ ఫ్రీ గా ఇచ్చాడు నికోన్ వాడు... సో ఇది నా పాత కెమెరా తో తీసిన కొత్త దాని ఫోటో అన్నమాట.  నాకు పెద్దగా నచ్చలేదు.. అదేదో చెప్పినట్లు రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తె మొట్టబుద్ది అయ్యింది అంట.. అలా ఉంది  నా పరిస్తితి.. కాని చక్కగా అరిచేతిలో ఇమిడి పోయేలాగా ఉంది బుజ్జిది..


ఇది నామొదటి కెమెరా, నా కష్టార్జితంతో కొన్నది, ఎంతో ఆలోచించి నా ఫ్రెండ్ తోటి అమెరికా నించి తెప్పించుకున్నది, నా బడ్జెట్ కి... చిచ్కూ గాడిని ఇప్పటిదాకా ఫోటోల్లోకి దింపింది ఈ బుజ్జిదే, ఎన్నో జ్ఞాపకాలను, మరిచిపోకుండా ఈ బుజ్జిది తనలో దాచుకుని నాకు ఇచ్చింది.. అందుకే ఇదంటే నాకు చెప్పలేని ప్రేమ.. ఎంత పాడైపోయినా, ఎంత blur ఇమేజెస్ వచ్చినా దీన్నే అంటిపెట్టుకుని ఉన్న.. ఫ్లాష్ పోయింది అని కొత్తది వేయిస్తే 4వేలు అయ్యి మళ్లీ వారానికి కొత్త ఫ్లాష్ కూడ పోయింది, గారంటీ కూడా లేదు.. ఎవరికి చెప్పుకోలేక కుయ్యో మొర్రో అని అలాగే దాచేసా... I Love you my sweetheart.. you will be there with me forever and ever, you kept the memory of Sreya's first moments alive forever for her to see later..

 ఒక రేంజ్ లో సెంటి అయిపోయా కదా :((.. బాయ్ బంగారం రెస్ట్ తీసుకో చక్కగా.. అప్పుడప్పుడు నేను వచ్చి చూస్తా, మంచి వెలుతురులో బోలెడు ఫోటోలు తీస్తా.

3 comments:

  1. మొత్తానికి ఒక మంచి కెమెరా కొనేసారు అన్నమాట. నాకైతే నచ్చేసింది మీ కెమెరా..

    SLR మీద పడిందా మీ కన్ను.. అయినా 50 వేల పెట్టి కోనేంత ఏముంది అంట అందులో?? దానిని బయటకు తీసుకెళ్ళాలంటే పెద్ద ప్రహసనం. దానిని ఓ పసి గుడ్డు లాగా చూసుకోవాలి (పసి పాప కూడా కాదు). అది కింద పడినా, కనిపించక పోయినా, గుండెల్లో రైళ్ళు/విమానాలు/జెట్ విమానాలు అన్నీ కలిసి పరిగెత్తుతాయి..

    ReplyDelete
  2. true but passion ani kooda okatuntundi kada.. edaina aim chesinappudu aa goal meeda drushti to we achieve a lot more.. choodam how my SLR dreams end up.. and yeah, according to a lot of my friends SLR is an over rated cam but still..

    ReplyDelete
  3. hey sree..naadi ditto story..na first camera friend cheta US nunchi teppichukunna..naa kastarjitham tho...adi padayipoyindi anukondi...adi ante naaku chaala istam..it gave me an opportunity to click many snaps of my mother when she was alive..

    ReplyDelete