A small boxful of clips, bands, pins etc for the kid
చిచ్కూ కి ఇవన్ని పెట్టి భలే తయారు చెయ్యాలి అనే నా కోరిక దాదాపు రెండు ఏళ్ళ నించి అలాగ ఉండిపోయింది.. లార్డ్ పుస్కి గారి తల మీద చెయ్యి పెడితే రణరంగం ఇంట్లో.. ఏది పెట్టినా ఇసిరి నేలకేసి కొట్టడమే, అది కూడా పుట్టిన రెండో రోజునించే.. తల మీద చిన్న గుడ్డ ఉన్న సరే పీకి కేవ్వుమనడం :(.. అప్పుడప్పుడు ఇలా ఆ డబ్బా చూసుకుని మురుసుకోవడమే నేను చేసేది.
పోనీలెండి. ఇలా అయినా మీ డబ్బులు ఆదా చేస్తుందని తృప్తి పడండి. అంతకు మించి ఏం చెయ్యగలరు. కొంచెం పెద్దది అయిన తరువాత గుండు చేయిస్తానని బెదిరించండి. రబ్బర్ బ్యాండులు, పిన్నులు లేని జుట్టు ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అని బెదిరించండి. దెబ్బకి దిగొస్తుంది. ;)
ReplyDelete