A traditional dance-form called Kolaatam done by a group with 2 sticks in hand and anklets to the legs
నాగుల చవితి ఈ రోజు రేపు రెండు రోజులు అంటున్నారు.. మేము, నేను చిచ్కూ గాడు ఇవ్వాళే పోసేసాము.. పాపం చిట్టి కూనకి జ్వరం వచ్చింది... :(. గుడి దెగ్గర ఈ రోజు ఈ కోలాటం పెట్టారు.. చాలా రోజుల తరవాత చూసాను.. పోయినేడాది వేణు గోపాల స్వామి గుళ్ళో పెట్టారు, కాని అప్పుడు ఆడవారు చేసారు.. ఇప్పుడు అంతా కుర్రాళ్ళు... రెండు పోల్చి చెప్పాలి అంటే చెప్పలేను వారు gracefulగా చేసారు, వీళ్ళు energeticగా చేసారు.. చిన్న పిల్లలు కూడ చేస్తారు ఒక్కో సారి.. కనుమరుగై పోతున్న ఈ కార్యక్రమాలని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది.. రేపు చిచిక్స్ గాడు వాళ్ళ పిల్లలకి వీడియో లోను ఫోటోలోను చూపించాలేమో.. పాపం ఇంత జ్వరంలోను అమ్మ డాన్సు అని కాసేపు చూసింది.
No comments:
Post a Comment