Thursday, February 24, 2011

February 24 - Ramana Gaaru Inka Evariki Andani Kammanu Pattukuni Vellipoyaaru..


I have not seen anyone express extreme hunger and his trysts with in such a manner to bring a laughter on the reader's lips.

ఆకలి గురించి దాని బాధ గురించి ఇంత నవ్వులాటగా చెప్పిన మనిషి ఇంకొకరు ఉండరేమో.. మొదలు పెట్టినప్పటినించి చివరి పేజీ దాక అలా చదివేయ్యలనిపిస్తుంది.. జీవితం ఒక తమాషా అని నిలువు ప్రతీక ఈ ఆటోబయోగ్రఫీ అనిపిస్తుంది.

 The latest and the last of his writings to my library :(.

బాపు బొమ్మ అంటే పుస్తకంలో ఉన్న విషయం అంతా అందులోనే కనిపించేస్తుంది అంటారు అది ఎంత నిజం... ఈ రెండు కోతుల తోకలు ఏది మొదలు ఏది అంతం అని తెలియట్లేదు కదూ.  డెన్నిస్ ని కాపీ కొట్టినా బుడుగు ని మించిన వాడా చెప్పండి?

Perhaps the current state of Bapu would be similar to the shadow with a gaping hole near the heart...!!

ఎవరైనా పొతే అయ్యో కుటుంబ సభ్యులు ఎంత దుఖంలో ఉన్నారో అని మనం అనుకుంటాం కాని రమణ గారు ఇక లేరు అంటే ఇక బాపు గారు ఒంటరి అని ఎంతో మందికి అనిపించి ఉండొచ్చు అంటే వీరి స్నేహం , బంధం అనుబంధం ఎంతటిదో తెలుస్తుంది... ఇప్పుడు బాపుగారు బొమ్మ వెయ్యాలి అంటే తన నీడకి గుండె దెగ్గర ఖాళీ ఉంటుందేమో కదూ..


The last 2 entries were made by me yesterday while re-starting his (In)Kothi-Kommacchi..

పొద్దున్నే లేచి కేవలం ప్రసాంతమైన వాతావరణంలో ప్రశాంతం అయిన పనులు మాటలు మాత్రమె వినాలి అనే నా రూలు ప్రకారం టీవీ చూడటం మానేసాను కాని బ్లాగ్లో updates ఉంటాయి అని మర్చిపోయి చూస్తె తెలిసిన కబురు.. చాల బాధగా నా రోజు మోదోలయ్యింది.. నిన్నే రాసుకున్న ఒక మనిషి ఇంకా లేరు అంటే ఇంకొంచెం ఎక్కువ బాధ వేసింది... నా లాంటి ఎందఱో అభిమానులకి ఇది ఒక తీరని లోటు మిగిల్చిన రోజు..

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు పోయిన ఇదే తారీఖున  ఈయన కూడా అస్తమించడం తెలుగు సాహిత్యానికి ఈ రోజుని బ్లాక్ డే గా మిగులుస్తుందేమో.

2 comments:

  1. May his soul rest in eternal peace.

    ReplyDelete
  2. చాలామంది బ్లాగుల్లో తమ బాధ వెళ్ళగ్రక్కారు! నేను ఇది చూడలేక ఆగ్రిగేటర్స్ చూడటం మానేసా.మానని పుండు మీద కారంజల్లుతున్నట్తు ఉంది అవి చూస్తుంటే....కానీ మీ బ్లాగ్ చూసాకా ఎంత బాధేసిందో! మీరు నిన్ననె రాసుకున్నారు! ఇవాళ్టికి ఆయన లేరు అంటే....! నాకు మీ బ్లాగ్ చూస్తే....చాల చాలా బాధేసింది శ్రీ గారు :((((((

    ReplyDelete