This is our style statement for this summer..
చిచ్కూకి మొన్నటిదాకా హెయిర్ స్టైల్ అంటే అంట కత్తెర.. మేము అందరమూ అరేయ్ ఒరేయ్, వాడు వీడు అని పిలుస్తూ ఉండటం వలన, ఆ జుట్టు వలన అందరు తను నా కొడుకు అనుకోవడం, పైగా చూసి చూసి విసుగు వచ్చెయ్యడం వలన జుట్టు పెంచడం మొదలు పెట్టా... సరిగ్గా ఎండా కాలం వచ్చేపాటికి అది మొహం మీద కళ్ళలో పడి, మెడ మీద పడిపోతూ చెమట పట్టేస్తుంటే పాపం తను చెప్పలేక చిరాకు పడిపోతుంది... మొత్తం ఒక వైపు లాగి కట్టడానికి ఇంకా మొలకలు అంతగా పెద్దవలేదు.. కాబట్టి ఇంట్లో తిరిగేటప్పుడు ఎండల్లో ఇలాగే రెండు, మూడు, పిలకల్లో కనిపిస్తాం :).
No comments:
Post a Comment