So much happening in a single day.. happy beginnings, sad endings, health and sickness, peace and violence, calm and chaos... one of its kind day!!!!
ఎండల్లో పిచ్చ తిరుగుడు తిరిగి.. మనిషి జీవితంలో ఎన్నో అంశాలు ఒకే రోజు చూసి, విన్న నాకు ఏంటో ఒక లాంటి నిస్సారమైన భావం.. ఎందుకీ పరుగు, ఏమిటీ అర్థం అని.. మొత్తం మీద ఒక పెళ్లి, ఒక చావు.. రెండు జీవితమైన ముఖ్య ఘట్టాలలో పాలు పంచుకున్నాను. ఎవరో తెలిసిన చుట్టాల్లో ఒక పెద్దాయన పోయారు, అంతకు ముందు ప్రతి దానికి దడుచుకు చచ్చే నేను ఈ మధ్య ఇలాంటి వాటికి మాత్రం తప్పక వెళ్లి వస్తున్నాను..
ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిజాలు, ఎన్నో కలలు, కొత్త జీవితాలు, కొన్నిటికి చరమాంకాలు... ఈ క్షణం మాత్రమె శాస్వతం .. మిగతా అంతా భ్రమ...
No comments:
Post a Comment