A new addition... loyal to Samsung :).
ఫోన్ చూసి కూడా మనిషిని అంచనా ఎయ్యొచ్చు అని విషయం మొన్న బిగ్ C లో తెలిసింది... నన్ను చూడగానే బీబత్సమైన మోడల్స్ చూపించడం మొదలుపెట్టాడు కౌంటర్ లో అబ్బాయ్.. ఇది ఐ ఫోన్ ఇది బెర్రీ ఫోన్ అని.. బాబూ నాకు బేసిక్ మోడల్ కావాలి గట్టిగా ఉండాలి అని.. ఐన వినడే.. ఆఖరికి నా పాత ఫోన్ తీసి ఇది నాయన అని చెప్తే ఎగా దిగా చూసి ఇంకో అమ్మాయిని అప్పచెప్పి ఎల్లిపోయాడు... :).. నాకు ఫోన్ అంటే చెయ్యడం, లేదంటే ఎత్తడం, అంతవరకే, ఇప్పుడు ఐతే మరీ ఏదైనా నాకు కావాల్సి వస్తేనే అది నా దెగ్గర ఉంటుంది. సెల్ నన్ను జనాలు రీచ్ అవ్వడానికి కాదు నేను ఏదైనా అవసరానికి వాడటానికి .. ఫొటోలకి కామెర ఉండాలి, నెట్ కి కంప్యూటర్ ఉండాలి.. దేని పని అది చెయ్యాలి. ల్యాండ్ లైన్ అన్నిటికి సెల్ మాత్రం కేవలం మన ఇష్టానికి :).
The older one, GSM mobile, is the most used and abused and liked phone considering how the kid uses it IF she can lay hands on it.
Big C లో నాకు same experience. మీకు కనీసం ఒక అమ్మాయిని అప్పజెప్పి పక్కకి వెళ్ళాడు. నా కేసులో అయితే నేను కొనే టైపు కాదని పక్కకి వెళిపోయాడు. ఒళ్ళు మండి రేట్ ఎక్కువున్న ఒక డబ్బా మొబైల్ ఒకటి కొనుకోచ్చా. ఇంటికి వచ్చిన తరువాత ఏడుపులు, శోకాలు, పెడబొబ్బలు (ఇంకేవరివి, నావే). షర్టు మీద ఉమ్మేసాడని చొక్కా చించుకున్నట్టు అయ్యింది నా పరిస్థితి. :((
ReplyDelete