Something about Indian families that bothers me the most.. put in words with a real life experience by Mrs. Sudha Murthy..
నేను చాల ఎక్కువ నమ్మే విషయాల్లో ఒకటి, అమెరికాలో నాకు నచ్చే విషయాలు లో ఒకటి ఈ ఆస్తి పంపకాలు.. ఇండియాలో నాకు అస్సలు నచ్చని విషయం కూడా అదే.... పొట్ట కట్టుకుని రూపాయ రూపాయ పోగు చేసి, బ్రతికున్న అన్ని రోజులు కక్కుర్తిగా కూడా బ్రతికి, అందరితో అనిపించుకుని ఆఖరికి చచ్చిపోయినాక కూడా కొట్టుకు చచ్చే విషయంగా మిగిలిపోవడం బాధాకరం ఐన విషయం. మీ పుట్టింటి వాళ్ళకి ఏమి ఉంది.. అత్తగారు ఎంత ఇచ్చారు.. నువ్వు నీ బిడ్డకి ఏమి దాస్తున్నావ్.. ఇది చాల రొటీన్గా వచ్చే మాటలు.. బిడ్డలు వాళ్ళని వాళ్ళు బ్రతకడానికి ఒక మార్గం చూపెట్టాలి, తమకి తాము, వీలయితే సమాజానికి కూడా సాయం చెయ్యగల స్తోమత తెచ్చుకోవడానికి సాయం చెయ్యాలి. మనిషిగా బ్రతకడం నేర్పించాలి... ఆళ్ళకి మనం ఏదో నీతులు చెప్పేముందు మనం పాటిస్తే సగం కష్టాలు ఉండవేమో కదా..
No comments:
Post a Comment