Saturday, December 24, 2011

Day 359 ~ Dec 25 - Silently Strong

The grass on the rocks at the seashore in Vizag

నేను మొన్న బీచ్ కి వెళ్లినప్పుడు అక్కడ రాళ్ళ మధ్యలో నుంచుని చాల సేపు ఆదుకున్నాం నేను పండు గాడు, అక్కడ సేఫ్ గా ఉంది అని, అలలు పెద్దగా వచ్చ్చినా కూడా రాళ్ళ మధ్య జారిపోవడం పడిపోవడం ఉండదు, గట్టిగా పట్టుకుని ఉండొచ్చు, చక్కగా కాళ్ళ మీద నీళ్ళు పడుతుతూ, కిందనించి ఇసక జారుతూ ఉన్న కూడా పడిపోతామేమో అని భయం అనిపించలేదు... అక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఈ రాళ్ళ మీద ఎప్పుడూ నీళ్ళు పడుతూనే ఉంటాయి అలల తాకిడి వలన, కాని అక్కడ పట్టు సాధించి మొలిచిన ఈ నాచు గడ్డి ఎంత గొప్పది కదా అనిపించింది.

PS - Archived Pic


Day 358 ~ Dec 24 - Bellam Tayyaari

The sugar cane ready to be crushed and made to juice in the cement tank.

దార్లో వస్తూ ఉండగా చాలా చోట్ల చెరుకు పిప్పి కనిపిస్తే ఎంటబ్బ చేస్తున్నారు అని డౌట్లు, ఒక చోట ఆపి లోనకెళ్ళి చూసి కొంచెం బెల్లం ముక్క తిని వచ్చాం.

The cane juice is being boiled to prepare jaggery at high temperatures for hours.

అరకు కొండ దిగినాక సృన్గవరపు కోట అవతల చాల చోట్ల ఇంటి బయట జనాలు ఇలా బెల్లం తయారి చేస్తున్నారు.. ఎప్పుడు చూడలేదు నేను.. కాబట్టి మెల్లిగా పండు గాడు నేను వెళ్లి చూసి వచ్చ్చాం.

The boiled and prepared jaggery being put into moulds and the ready ones being laid out separately.

తయారైన బెల్లం అచ్చులు తీసి పక్కన పెడుతున్న వ్యక్తి.. ఇక్కడ కిలో ఇరవై రెండు రూపాయలుకి అమ్ముతారు అంట.. బయట ఎంతో ఇంకా నేను కనుక్కోలేదు.

PS - Archived  pic  

Day 357 ~ Dec 23 - Bongu Chicken


Bamboo cut and ready for preparing their trade mark bamboo chicken.. in Aruku Valley

నేను ఎప్పుడో విలేజిలో వినాయకుడు సినిమాలో చూసాను ఇది చెయ్యడం.. ఏంట్రా ఇది చిత్రంగా ఉంది అనుకున్నా... అరుకులో ఎక్కడ చూసినా ఈ పోస్టర్లు చూసి ఎల్లె లోపల ఒకసారి ట్రై చెయ్యాలి అనుకున్నాను... నేను ఇంక మాంసాహారం మానేద్దాం అనుకుంటున్నాను.. జీవ హింస, ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యున్నతిలో అడ్డంకి అనిపిస్తుంది... ఒక్కసారిగా బలవంతంగా మానెయ్యడం కాకుండా, మనసులో తినాలని కోరిక చంపుకోడం కంటే అసలు ఆ కోరిక పోగొట్టుకోవాలి అని ఒక ప్రయత్నం.


Cooked chicken, had a very good flavor, kid loved it... very spicy, nicely cooked...

PS: Archived pic

Day 356 ~ Dec 22 - Visiting a Farmer's Family in Aruku

Me chatting up with the family on the way back from Chaparaai, near Dumri Guda around 4 kms or so from Araku.

అలా వెళ్తూ ఉంటె రోడ్ పక్కన ముచ్చటగా పని చేసుకుంటున్న ఈ కుటుంబం కనిపించింది.. మెల్లిగా కాస్త దూరం నడిచి వెళ్లి వాళ్ళతోటి కాసేపు మాట్లాడి, నా గురించి చెప్పి, వాళ్ళ గురించి తెలుసుకుని, చిచ్కూ గాడికి తువ్వాయిలు, బుజ్జి మేకలు, రాగి గింజలు చూపించి వచ్చాను.. నాకు చాల నచ్చిన ట్రిప్ అనుభవాల్లో ఇదొకటి.

The cattle, sheep returning from grazing the fields all day, the man separating raagi from the grass.. a perfect farmer's evening moment..

కొడుకు గేదలు తోలుకెళ్ళి తీసుకొచ్చి, తండ్రి రాగులని దుడ్డు కర్ర తోటి బాడి, చేట తోటి చెరిగి ఇస్తే, తల్లి, కూతురు వాటిని ఇంకోసారి చెరిగి రాగులు తీసి పక్కన పెడుతున్నారు... ఏంటో సంతృప్తి తోటి బ్రతుకుతున్నారు అనిపించింది, ఇల్లు ఐదు కిలోమీటర్లు ఉన్నా ఎంచక్కా అలాగే నడుచుకుని ఎల్లిపోతారు, వాళ్ళే కూరలు అవి పండించుకుని తింటారు... అన్ని వదిలేసి అలా బ్రతికేయ్యాలి అనిపించింది నాకు.

The kid watches as the ladies separate husk from raagi...

చిచ్కూ గాడికి కూడా ఇదంతా భలే నచ్చింది, అటూ ఇటూ తిరిగి తువ్వాయిల వెంట పరుగులెత్తి, గడ్డి అవి పీకి ఆదుకుంది.

Archived pic.

Day 355 ~ Dec 21 - An Era Ends... Miss You Budda Maamayya :(((

My youngest maternal uncle.. the one who gave kid the name "Pandu"... is no more!!!!!!

బుడ్డ మామయ్యా అంటూ ఇంక మేము నోరార పిలవడానికి, ఎప్పుడు నవ్వుతూ ఉండే తన మొహం చూడటానికి మాకు ఇంక ప్రాప్తం లేదు... ఎంతో దర్జాగా బ్రతికి, తరవాత చితికిపోయి, నిలదొక్కుకోలేక, తట్టుకోలేక, చాల చిన్న వయసులో తిరిగి రాని దూరాలకి వెళ్ళిపోయాడు.  ఈ బ్లాగ్ మొదలు పెట్టింది కూడా నేను ఈ ఫోటో తోటే.... తెలియని బాధ ఉండి ఉండి వచ్చి పోతూ ఉంది.

PS:
I just wanted it documented the day he left us, hence 2 photos for the day.

Tuesday, December 20, 2011

Day 355 ~ Dec 21 - Dhyana Workshop Ends!!

The books and CDs I  had purchased from the counter after the final ceremony...

నలభై రోజుల ధ్యానం క్లాస్సులు ఆఖరి రోజు.. ప్రతి రోజు రెండు నించి సాయంత్రం నాలుగు గంటల దాక రోజుకి రెండు గంటలు, ఒక గంట ధ్యానం, ఒక గంట సత్సంగం, మనసుకి, శరీరానికి కూడా ఏంటో తృప్తిని ఇచ్చింది.. కొన్ని రోజులు నేను వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లో లేకపోతె ఎక్కడుంటే అక్కడ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే చాల ఫలితం కనిపించింది.


Monday, December 19, 2011

Day 354 ~ Dec 20 - Etikoppaaka Toy makers..

Toys ready to be packed and dispatched to different places...


The toy making tools, machine, moulds and the vegetable dyed lac used in coloring of the toys...

ఏటికొప్పాక వెళ్ళాలి అని ఎన్నాళ్ళ నుంచో ఒక కోరిక, అక్కడ ఊరు ఊరు అంతా ఇలా బొమ్మలు చేస్తారు అవి ప్రపంచం అంటా వెళ్తాయి అని వినటమే కాని చూడటం ఎప్పుడా అనుకునేదాన్ని... తీరా అక్కడికేల్లెపాటికి  చీకటి పడిపోయింది, కరెంటు కోత మూలాన, ఊరంతా సరిగ్గా చూడటం కుదరలేదు కాని ఒక చోట మటుకు inverter వేసి ఉంటె అక్కడ వెళ్లి కొన్ని కొనుక్కుని వచ్చాం... రోజులో ఎనిమిది గంటలు ఇంకా కరెంటు తీస్తున్నారు అంటే దారుణం అనిపించింది.

Sunday, December 18, 2011

Day 353 ~ Dec 19 - Course of Godavari...

The miniature outside Sir Arthur Cotton Museum in Dhawaleswaram, a heritage place...

కాటన్ దొర ప్రయత్నా ఫలితంగా గోదావరి తీర ప్రాంతం అంత ఎంతో బాగు పడింది అని అనడమే కాని చదివింది నేను చాల తక్కువ, ఇక్కడ మోడల్స్ అవి చూసినాక కూడా పెద్దగ అర్థం కాలేదు, ఇంజనీరింగ్ బుర్ర కాదు మనది కాబట్టి ఏమి ఎక్కలేదు కాని అక్కడ ఉన్న మంచి మాటలు, ఈ నాటికీ అక్కడి ప్రజలు అతినికి ఇచ్చే గౌరవం.. ఇదీ మనిషిగా బ్రతకడం  అనిపించింది.

Saturday, December 17, 2011

Day 352 ~ Dec 18 - Back Home

..looks like we carried half the house with us for the kid, about of a quarter of the stuff still waiting in the car... unpacking and re-grouping the kid is a task!!!

కాకి తిరుగుడు పూర్తి చేసుకుని ఆఖరికి కొమ్పకొచ్చి పడ్డాం... విడిచిన బట్టలు, సద్దాల్సిన చెత్త, కడాగాల్సిన కారు, అబ్బో అడగొద్దు బీబత్సంగా ఉంది.. కాని ఈ ట్రిప్ మాత్రం సూపర్.


Day 351 ~ Dec 17 - Beautiful Beach Sunrise

a wonderful sunrise view from Ramakrishna beach, extremely refreshing with orange rays on still waters, white surfs in the waves, hitting the rocks and gently flowing back in the river...

వైజాగ్ బీచ్ లో గంట 

Day 350 ~ Dec 16 ~ Araku Sukravaaram Santha

The local weekly fair where the tribal farmers from nearby places sell their produce and buy stuff for their needs from the stalls erected...organic, farm fresh, extremely cheap, healthy and best food...

ప్రతి శుక్రవారం అరకు ఊరులో ఈ సంత జరుగుతుంది అంట, అక్కడికి జనాలు వాళ్ళు పండించినవి తెచ్చి అమ్మి, వాళ్లకి కావలసినవి కొనుక్కుని కొన్ని మైళ్ళు మళ్ళీ నడిచి తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు... చూడగానే తినాలనిపించెంట బాగున్నాయి అన్ని కూడా..

Day 349 ~ Dec 15 - Tribal Dhimsa Dancing


The famous Dhimsa dance performed by local tribal women arranged by AP Tourism Department at Araku Valley for package trip travelers!!

The men providing musical backdrop for the dancers...

అడవి లోని అన్ని తెగల వారు అన్ని సంతోష సమయాల్లోనూ సంబరం గాను చేసుకునే ఈ నృత్యం టూరిస్ట్ల కోసం ఇక్కడ చేస్తున్నారు... చుట్టూ జనాలు కూడా వీళ్ళ తోటి కలిసి గంతులేసారు, ఎందుకో చిచ్కూ గాడికి వాళ్ళ కేకలు నచ్చేలేదు చంక దిగలేదు.

Day 348 ~ Dec 14 - Five Years!!!!!!!!

... and this day, we complete highly eventful 5 years of staying married!!!!.. in the backdrop is Simhachalam Temple.

ఐదేళ్ళ క్రితం ఎవరికీ ఎవరో తెలియని ఇద్దరికి ఈ రోజు ఒక బుడ్డి బుడమకాయ కూతురు... !!

Day 347 ~ Dec 13 - Annavaram Konda

View of Pampa Sarovar on the way down from Annavaram temple.. it is a wonderful evening view with cattle grazing, ducks and cranes in the pond, loads of greenery, blue sky, cold weather.... awesome drive!!

పంపా నది తీరంలో ఒక హోటల్ పక్కన నించి కనిపించిన ఈ దృశ్యం భలే ప్రశాంతంగా ఉంది.

Day 346 ~ Dec 12 - Vayyaari Godaaramma

View of river Godavari from Dhawaleshwaram Bridge near Rajahmundry... awesome view, full with water, cool breeze..

మా వారం రోజుల వెకేషన్ మొదలు పెట్టిన రోజున ప్రశాంత గోదావరిని చేరే పాటికి ఇంచుమించు నాలుగు అయ్యింది.. 

Saturday, December 10, 2011

Day 345 ~ Dec 11 - Pournami Dhyaanam


The 40-day workshop Dhyaana regulars meditating on Pournami day.

పౌర్ణమి గ్రహణం రెండు కలిసి వచ్చిన రోజు ధ్యానం చేస్తే మంచిది అన్నారు... ఈ ఇరవై ఒకటో తారీకు దాక రోజు జరుగుతాయ్ నాకు చాల చాల నచ్చింది ఈ వర్క్ షాప్.

Friday, December 9, 2011

Day 344 ~ Dec 10 - Ontari Paavuraayi

A baby pigeon settled in the Dhyaana Center :).

ధ్యానం క్లాస్లు ఎక్కడ ఊర్లో నలభై రోజులు జరుగుతున్నాయి.. ఎవరు వెళ్ళినా ఎల్లకపోయినా ఈ పావురాయి పిల్ల మటుకు ఇక్కడే ఉంది ఎంచక్కా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటుంది... 

Thursday, December 8, 2011

Day 343 ~ Dec 9 - Dhaanyam Bastaalu

People loading the weighed and bagged paddy into lorry for storage.

కుప్ప నూర్చేసి, కాటా వేసిన ధాన్యాన్ని ఇంటికో, గోడౌన్ కో తరలిస్తున్న రైతు.

Wednesday, December 7, 2011

Day 342 ~ Dec 8 - Kuppa Noorpidi

Farmer drying the harvested paddy in the field

కుప్ప నూర్చినాక ధాన్యం ఎందబెట్టుకుంటున్న రైతు.. పక్కనే ఇంకో కుప్ప ఉంది అది ఇంకా నూరవలేదు.

Tuesday, December 6, 2011

Day 341 ~ Dec 7 - Kosina Vari Panalu

The paddy crop cut and laid for drying in the field

పొలం అంటా మనుషులు కోసేసినాక వారి పనలు పొలంలో ఎండబెడతారు...

Monday, December 5, 2011

Day 340 ~ Dec 6 - Vari Kotalu

Ladies cutting the paddy crop...

సారవా కోతలు మొదలు అయిపోయాయి ఊర్లో... పొద్దున్నే ఆడవాళ్ళు కోతలకి, మగవాళ్ళు కట్టి వేతలకి వెళ్ళిపోయి ఊరంతా ఖాళీగా అన్పిస్తుంది..

Day 339 ~ Dec 5 - Rush Hour

A rush pediatrician's clinic.. could not find a place to sit in the huge waiting corridor or the hospital compound... felt sickening to see so many sick kids thanks to the climate change

చిచ్కూ గాడికి విపరీతంగా జలుబు, జ్వరం, దగ్గు మొదలయ్యాయి అని నేను నేను ఆసుపత్రికి తీసుకెళ్తే ఊరంతా అక్కడే ఉన్నట్టు అనిపించింది.. పిల్లల ఏడుపులు, గోల చాలా బాధ అనిపించింది... ఆ బాధలో సగం తల్లి తండ్రులకి పంచి పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది కాని ఏమి చెయ్యలేని నిస్సహాయత, తుళ్ళింతలు వేస్తూ తిరిగే పిల్లలు వేలాడిపోయి నీరసంగా ఉంటె అస్సలు బాగోలేదు.

Day 338 ~ Dec 4 - Bhale Savaari

Blessed are we that the kid has such wonderful buddies who just love to carry her around (touchwood).. this is how she watched the events on Teppotsavam.

చిచ్కూ గాడికి ఉన్న అన్నలని చూస్తె నాకు భలే ముచ్చటేస్తుంది.. ఎన్ని కోట్లిచ్చినా రాని బంధం కదా అది, అసలు ముట్టుకుంటే మాసిపోతుంది అన్నంతగా గారం చేసి, ఎత్తుకుని భుజాల మీద దేవుడమ్మ దేవుడు ఆడిస్తారు... తనకి జనాల మధ్య సరిగా కనిపించటానికి అలా ఎత్తుకుని బాణ సంచా అవి చూపించారు. 

Day 337 ~ Dec 3 - Teppotsavam

The procession of lord Subhramanya (Snake God) with his two wives Valli and Devasena under full security.

ప్రతి ఏడాది జరిగే ఈ తెప్పోత్సవానికి చుట్టూ పక్కల ఊర్ల నించి చాల మంది జనాలు వస్తారు.  ఒకాయన ఒక పాముని చంపేసి దాని పరిహారం కోసం కట్టించిన గుడి క్రమేణా చాల కీర్తి పొందింది చుట్టూ పక్కల ఊర్లలో.  ఈ ఉత్సవానికి కాల్చిన అవ్వాయి సువ్వాయిల (టపాకాయల) ఖర్చే కొన్ని లక్షలు ఉండొచ్చు.  నేను మొదటి సారి ఇలాంటి ఉత్సవానికి వెళ్లాను.

Day 336 ~ Dec 2 - Hamsa Vaahanam

Decorated place for God's procession in temple koneru.

కోనేట్లో దేవుడి ఊరేగింపుకి సిద్దంగా ఉంచిన తెప్ప.

Day 335 ~ Dec 1 - Sambaram Tirunaallu

The games and rides near Singarayapalem Nagendra Swamy Temple for Shasthi Utsavaalu done every year.

సుభ్రమణ్య షష్టి రోజు పూజలు అవి బాగా ఘనంగా చేస్తారు మా ఊరికి దేగ్గర్లోని సింగరాయపాలెం గుడిలో.. ఈ ఏడాది కొత్తగా ఇవన్ని కూడా పెట్టారు.

Day 334 ~ Nov 30 - Yaarnaala

Gifts and sweets offered to the groom's side after wedding, to be distributed to near and dear!

పెళ్లి తరవాత యార్నాల అని పెళ్లి కొడుకు ఊర్లో వాళ్లకి పంచి పెట్టడానికి చలిమిడి, పళ్ళు, పసుపు, కుంకుమ, సున్నిపిండి లాంటివి ఇస్తారు, తమ స్తోమత కి తగినట్లు.. పిల్లని తోలి సారి అత్తవారింటికి పంపినప్పుడు తీసుకెళతారు దీన్ని.


Day 333 ~ Nov 29 - Kotta Janta Nomu

Cleaning the idol of Satya Narayana Nomu with milk and panchamruta.

కొత్త జంట తోటి మగ పిల్లవాడి ఇంట్లో చేయించే మొదటి వ్రతం.

Day 332 ~ Nov 28 - Pelli Sandadi

A happy bride displays the ring she found in the water pitcher during wedding rituals.

నేను ఈ పెళ్లికూతురుకి ఒక రకంగా ఎంతో రుణపడి ఉన్నాను, తను అన్ని వేళలా నన్ను వెన్నంటి ఉంది ఎంతో చేసింది, కాని తన పెళ్ళికి నేను వెళ్ళలేకపోయాను.

పెళ్ళిలో ఎన్నో మధుర ఘట్టాలు ఉంటాయి అందులో ఈ ఉంగరాలాట ఒకటి.. తను తీసిన సంబరంలో ఆ పెళ్ళికూతురి నవ్వు, అది చూస్తున్న ఆ పిల్లల ఆనందం, ఈ ఫోటో నాకు కూడా భలే నచ్చింది.

PS:  I missed the wedding and hence this picture is courtesy Sravan Yemineni about whom I have heard a lot about, especially the ease he has with kids and loved his photos!!

Day 331 ~ Nov 27 - Pelli Cheerala Sandadi

Trial dress-up for bridal sarees in Kalyaana Kanchi, Kkp.

పెళ్లి చీరలు కొనే సందడి అంతా ఇంతా  కాదు, నేను ఉన్నప్పుడు కొన్ని కొన్నారు వాళ్ళు అప్పుడు తీసిన ఫోటోలు.

Day 330 ~ Nov 26 - Engaged

Missed the friend's engagement that happened a while ago...

నా చిన్న నాటి స్నేహితుని చెల్లి నిశ్చయతాంబూలాల నాటి ఫోటో.. ఎడం చేతి ఉంగరపు వేలికి పెట్టుకుంటారు కాని తనకి తెచ్చింది పెద్దగ ఐపోయి అలా పెట్టుకుంది :).

Thursday, November 24, 2011

Day 329 ~ Nov 25 - Knobbed Puzzle

Kid with her favorite pass time knob alphabet puzzle.. she can play this for hours, telling stories about characters next to each alphabet..

చిచ్కూ గాడికి ఈ ఆట చాలా ఇష్టం, తెచ్చినప్పుడు రెండు రోజులు మేము పెట్టి నేర్పించాం ఇప్పుడు తను పెట్టి నేర్పిస్తుంది రోజు మాకు చెప్తుంది.

Wednesday, November 23, 2011

Day 328 ~ Nov 24 - The Ultimate Journey

A coffin maker just outside Gdw Raithu Bazaar

గుడివాడ రైతు బజారు వెళ్ళిన ప్రతి సారీ నాకు ఈ శవం పేటిక ఒకటి ఎప్పుడు కనిపిస్తుంది.. దాన్ని చూసినప్పుడల్లా ఏదో ఒక వింత భావన, అది అమ్ముడు పోకుండా ఉంటె బాగుండు అని అనిపిస్తుంది ఒక్కోసారి, ఒక్కోసారి ఎన్ని ఉన్నా ఆఖరికి ఇందులోనే కదా ఈ కట్టె పోయేది అనిపిస్తుంది, ఒక్కోసారి ఇతని జీవనాధారం ఇంకొకరి చావు మీద ఆధారం కదా అనిపిస్తుంది.. ఆలోచన లేకుండా ఒకసారి కూడా అటు దాటి రాలేను.. ఒక్కోసారి ఒక్కో రకం.

Day 327 ~ Nov 23 - Kaarteeka Anna Samaaraadhana

people waiting for their turn at the annual ceremony in Siva temple.

కార్తీక మాసంలో మా ఊర్లో శివాలయంలో నెలంతా పూజలు చేసి ఆఖారున మహా అన్న సమారాధన/వన భోజనాలు చేస్తారు... నేను ఊర్లో ఉంటె ప్రతి సారి తప్పకుండా ఎల్లి వస్తాను.. ఈ సారి చిచ్కూ గాడిని కూడా తీసుకెళ్ళాం.. తన మొదటి వనభోజనాలు ఇవి.

Monday, November 21, 2011

Day 326 ~ Nov 22 - Junk Yard?

unused vehicles which are rendered useless in the local magistrate's office building premises

మామయ్యకి ఏదో పని ఉంది magistrate  ఆఫీసుకి వెళ్ళాల్సి వస్తే కాసేపు నేను అటు కాకి తిరుగుడు తిరిగాను, అప్పుడు నా కంటికి ఈ పాడు పడిపోయిన బళ్ళు కనిపించాయి.. తుప్పట్టి పోయి, మట్టి కొట్టుకుని ఎందుకు పనికి రాకుండా తయారయ్యాయి.

Day 325 ~ Nov 21 - Raavi Chettu - Poojalu

people waiting below the raavi plant for pooja on last Kaartheeka Somavaaram.

రావి చెట్టు కింద జనాలు అందరు నుంచుని ఒక చిన్న పిల్లవాడితోటి బేరాలు ఆడుతుంటే ఎందుకో అర్థం కాలేదు నాకు.. తీరా చూస్తె చెట్టు మీద ఇంకో పిల్లాడు కొమ్మలు తుంచి విసురుతుంటే ఈ బుడతడు వచ్చిన వాళ్లకి అమ్ముతున్నాడు.  కార్తీక నోములకి ఈ రావి చెట్టు ఆకులని, వెళ్ళని వాడతారంట.. అదీ విషయం.

Day 324 ~ Nov 20 - Work in Progress

kid engrossed in painting her tiny planters.

పండు గాడికి కూడా ఈ మధ్య నా painting పైత్యం పట్టింది.. తనకి ఈ రంగుల బ్రస్షులు ముంచి పుయ్యడం భలే ఇష్టం.

Friday, November 18, 2011

Day 323 ~ Nov 19 - Daily Ritual

A daily ride for the kid on her som taata's old kawasaki bike :).

ఎండా వాన అని లేకుండా ప్రతి రోజు ఒక్క రవుండు తాత అని గోల చేసి మరీ ఊరి పొలిమేరల దాక ఒక సారి చుట్టి రావడం ఇక్కడి ఆనవాయితీ అయిపొయింది.

Day 322 ~ Nov 18 - Du Du Basavanna

Traditional oxen performance...

బసవన్న ప్రతి ఏడాది ఒకసారి వచ్చి వెళ్తాడు.. ఈ సారి కొంచెం తొందరగానే వచ్చేసాడు... దణ్ణం పెట్టి, ఆటలు ఆడించారు కాసేపు... పాపం పాస్ కూడా పోసేసింది ఇంట్లోనే :((... అందరు మంచిది చాలా అన్నారు అలా జరిగితే.

Thursday, November 17, 2011

Day 321 ~ Nov 17 - Back Home

Ducks in SOS village...

ఆ సిటీ గొడవ నించి బయట పడి పల్లెటూర్లో పడి పొతే ప్రాణానికి చెప్పలేనంత హాయిగా ఉంది... ప్రసాంతమైన ఈ ఖజానా బాతులాగ ఉంది నా పని :).

Wednesday, November 16, 2011

Day 320 ~ Nov 16 - Dashing Love

me belting up the kid for her favorite dashing cars.. yes, she is illegal, underage for riding even this toy.. yet we managed to do it ;).

చిచ్కూ కి బీబత్సంగా నచ్చేసిన ఆట ఇది.. ఎంత ఆడిన అమ్మ మళ్ళీ గుద్దేద్దాం అని గోల :).

Day 319 ~ Nov 15 - Pidata Kinda Pappu

Love this yummy stuff, a vendor selling in front of Indira Park.

ముంత మషాలా, పిడత కింద పప్పు, పేరు ఏదైనా రుచి యమహో.

Day 318 ~ Nov 14 - Child Plays

Kid plays with another kid in Balbhavan at JNTU.

ఎప్పుడు ఊర్లోనే ఉండే పండు గాడికి ఇవన్ని చూస్తె భలే పండగ, చాల చక్కగా ఆడుకుంది