Monday, October 31, 2011

Day 304 ~ Oct 31 - Sunset in the Village

a view from second floor balcony of our house.. loved this pic for thatched roofs and greenery, a village scene rapidly vanishing...

డాబా మీద నించి చూస్తె చుట్టూ చెట్లు ఇంకా అక్కడక్కడ ఉన్న తాటాకు ఇళ్లు, పొద్దు గూకే సూర్యుడు.. నాకు చాల నచ్చే దృశ్యాలలో ఒకటి.

Day 303 ~ Oct 30 - Puttalo Paalu


Offering milk at the local temple.

పుట్టలో పాలు పొయ్యడం అంటే మా గుళ్ళో ఉన్న సిమెంటు పుట్టలో పొయ్యడమే.. పక్కన ఏదో చిన్న దిబ్బ ఉంటె జనాలు అక్కడ పోస్తున్నారు అని అక్కడ కూడా పోసాము.

Day 302 ~ Oct 29 - Recording Dance

A dance troupe performing on stage, a form of local entertainment where artistes perform for Hit dance numbers.

అటు దసరా అయ్యింది హమ్మయ్య మైకుల గోల పోయింది అనుకునేలోగానే నాగుల చవితి సంబరాలు అని తొమ్మిది రోజులు గోల మొదలు.. అసలు మా ఊర్లో ఈ మైకులు బాన్ చేసేస్తే పీడా పోతుంది అసలు అనిపిస్తుంది.. ఎక్కడో ఊరి చివర గుడి ఉంటె ఊరంతా మైకు లాగుతారు, పిచ్చి గోల.  అందులో భాగంగా ఈ రికార్డింగ్ డాన్సు పెట్టారు.

Thursday, October 27, 2011

Day 301 ~ Oct 28 - Studious

The kid gets her Diwali gift, the much awaited tudy table that is her choice and she simply loves!

చిచ్కూ గాడి దీపావళి పండగ కానుక... I am no-force-to-read/study parent.. so hoping the kid feels learning is fun than a MUST!

Wednesday, October 26, 2011

Day 300 ~ Oct 27 - A Mile Stone

A milestone pic for a milestone post.. 300th day of the year!!  Now the trainer foot rest is officially off, we still need to be around but yes, we passed out the baby phase a year and a half after we got it first..

చిచ్కూ గాడి ఫస్ట్ పుట్టినరోజు గిఫ్ట్, దీన్ని తోసుకుంటూ నేను వాడు ఎన్ని రాచకార్యాలు వెలగ బెట్టామో, ఏంటో పిచ్చ తిరుగుడు తిరిగామో, ఇప్పుడు తనే నడిచేస్తుంది, పెద్దగా ఎక్కట్లేదు.. ఇంకా కొన్నాళ్ళకి ఇది ఎక్కనుకూడా ఎక్కదేమో...

Where did my tiny little baby go!!!!!

Day 299 ~ Oct 26 - Maa Intlo Deepaavali

kid's friends trying to get her to hold sparklers!

ప్రతి ఏడు లాగే ఈ సారి కూడా పండు గాడి ఫెండులు అందరు కలిసి పటాసులు పేల్చారు.. తను కాకరపూవత్తులు కాల్చడానికి కాస్త భయపడింది కాని రోప్స్ బాగానే కాల్చుకుంది..

If you can see closely, it is drizzling while we light up our crackers :).

Day 298 ~ Oct 25 - Tapaakaayala Motha

sun-drying the crackers for lighting them up at night..

చూసి చూసి ఇన్నాళ్ళు ఇరగదీసిన ఎండలు ఆగిపోయి పంతం కోసం అన్నట్లు విపరీతంగా వాన.. ఏదో కాసేపు ఎండా వస్తే పెట్టుకున్నాం.

Day 297 ~ October 24 - Gunned

The kid gets her first gun.. for a non-weapon toy picker, had to give in, largely just to relive my personal childhood memories than anything else.

చిన్నప్పుడు దీపావళి వచ్చింది అంటే చాలు ఈ మందు రీలు ఒకటి పెట్టుకుని పెల్చుకుంటూ, పేలకుండా మిగిలిపోయిన వాటిని నేలకో, గరుకుగా ఉన్న గోడకో గీక్కుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళం..

Day 296 ~ Oct 23 - Kainkaryam

The first time I have seen the usage of work "gna" from telugu akshara maala..

జ్ఞ అనే అక్షరాన్ని మామూలు వ్రాతలో ఉపయోగించటం నేను ఎప్పుడు చూడలేదు.. మొదటి చూసేసరికి అదొక లాంటి వింత ఫీలింగ్.

Day 295 ~ Oct 22 - Fallen Glory

I find more hair in the bin than on my head :((( when I look at it each time I comb my hair.

జుట్టు రాలడం అనే మాట వింటే నాకు ఈ మధ్య వణుకు వస్తుంది.. ఎవరైనా ఆ మాట అంటే రోలు ఎల్లి మద్దేలకి చెప్పటం అంటే ఇదే అని ఏడవలేక నవ్వడం చింపిరి చూపులు చూడటం.  అసలు ఇంకా నెత్తి మీద మిగిలిన నాలుగు పరకలు ఎప్పుడు రాలిపోతాయో అని బెంగ.. కుయ్యో, మొర్రో, లబో దిబో.. లబ లబ లబ.

Day 294 ~ Oct 21 - Dent -o- Car

A car full of dents, could not dare to click a pic from the front view where the real damage is visible.. the buffalo menace!!

కారు తోలడం అంటే ఆషామాషీ కాదు రోడ్ మీద పెద్దగా ట్రాఫిక్ లేకపోయినా అని అర్థం అవ్వాలి అంటే గేదలు తిరిగే రోడ్ల మీద బండి తోలాలి.. నాయనో, తెలంగాణా సమ్మె పుణ్యమా అని ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు దీనికి, అప్పుడే లెక్కలేనన్ని సొట్టలు.. తలుపులు తోసుకు పోయి, బోయినేట్ లేచిపోయి.. ముందు నించి చూడటానికి దారుణంగా ఉంది.. గుద్దిన గేదలు దేవుడి దయ వల్ల సుబ్బరంగా ఉన్నాయి కాని తలుచుకుంటే గుండె దడ మాత్రం ఆగదు

Day 293 ~ Oct 20 - Shredded

I am amazed at my capability of piling up junk and paper all over and when I begin shredding it usually means at least a couple of bucketfuls of waste..phew!!!

నెలకోసారో, ఎప్పుడో ఈ చెత్త చిమ్పుడు కార్యక్రమం పెట్టినప్పుడల్లా అనుకుంటా ఎందుకొచ్చిన గోల ఎప్పటికప్పుడు పారెయ్యాలి అని... ఏళ్ళ తరబడి అనుకోటమే కాని పాటించటం లేదు.

Tuesday, October 18, 2011

Day 292 ~ Oct 19 - Shady Roads

Trees spreading shade on both sides of the road near Vadaali on Kattipudi route.

నా చిన్నప్పుడు బెజవాడ నించి ఊరు ఎల్లె ఎర్ర బస్సు ఎక్కితే ఎంత ఎండైనా తెలియకుండా చక్కగా చెట్ల నీడన ఇంటికి చేరిపోయే వాళ్ళం, బస్సు లోంచి తొంగి చూస్తూ, ఒక్కోసారి రాసుకుంటూ బస్సు ఎల్లేది.. రాను రాను కరెంటు తీగలకి అడ్డం అని, వానలకి పడిపోయి కొన్ని, రోడ్లు పెంచడానికి కొన్ని వరసపెట్టి కొట్టేసి కొట్టేసి రోడ్లు మోడు బారిపోయాయి.  కత్తిపూడి దాక వేసే రోడ్ లో మిగతావాటిని మెల్లిగా కొట్టేస్తున్నారు, ఎన్నో ఏళ్ళ నించి ఇలా నీడనిస్తూ ఉండే వాటిని కొట్టేసి మన కాళ్ళని మనమే నరికేస్తుకున్నట్టు అనిపిస్తుంది నాకు, చాల బాధగా, ఇంకా ఇలాంటి రోడ్లు కేవలం ఫోటోలోనే చూపించాలి మన ముందు తరాలకి :(.

Day 291 ~ Oct 18 - Vadaali Jagannaatha Swamy Chinna Puri

The idols of Balarama, Subhadra and Jagannatha at Vadaali temple in Krishna dt.

ఇన్ని ఏళ్ళగా ఈ ఊర్లో ఉంటూ పక్కనే ఉన్న ఈ జగన్నాధ స్వామి గుడికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు అసలు అది ఒకటి ఉంది అని కూడా తెలియదు, ఇంటి దెగ్గర నించి మూడు కిలోమీటర్లు కూడా ఉండదేమో గట్టిగా చూసినా, దీనిని పూరి తరవాత అంత గొప్ప గుడి అంటారు అని నాకు తెలియదు.. మొత్తం వడాలి అంటా స్వామి వారి భూములే అంట, దాని అయివేజు మీద నడుస్తుంది అంట, గుడి చిన్నగానే ఉంది కాని బోలెడంత ఖాళీ స్థలం, మూడు ఆవులు, చెట్లు, చూడటానికి బాగుంది.

Sunday, October 16, 2011

Day 290 ~ Oct 17 - Gudla chettu :)

I really dont know what this plant is called but in childhood, we used to collect them as eggs and place them in empty tablet sheets as egg holders while playing doll house games.

చిన్నప్పుడు లక్క పిడతల్లో అన్నం వండుకుని, కూర వండుకుని, బొమ్మల పెళ్ళిళ్ళు చేసే ఆటల్లో ఈ చెట్టు కాయలని కోసుకొచ్చి గుడ్లు అని ఆడుకునే వాళ్ళం, ఖాళి మందుల అత్తా ముక్కల్లో పెట్టి.. మళ్ళీ చాల రోజులకి మా ఇంటి దెగ్గర పొదల్లో ఇవి కనిపిస్తే మళ్ళీ ఆ రోజులన్నీ ఒకసారి కాళ్ళ ముందు కదిలాయి.

PS:  Dont miss the red ants in this pic, for some reason I love this picture a lot, maybe the memories!!!

Day 289 ~ Oct 16 - Water That Falls

This a picture taken from above the Prakasam Barrage where we parked for a while to enjoy the cool breeze on a hot afternoon around 3 p.m.

బ్యారేజి మీద నుంచుని అలా నీళ్ళని చూస్తూ నుంచుంటే భలే చల్లటి గాలి వచ్చింది, ఏంట్రా అని కిందకి చూస్తె ఈ నీళ్ళు జారిపడుతున్నాయి,  ఆ నీటికి కింద పడిన చేప పిల్లలు ఎదురు ఈదటానికి ప్రయత్నిస్తున్నాయి, చూడటానికి చాల బాగా అనిపించింది.

Day 288 ~ Oct 15 - Bat House

If you observe those tiny black things hanging upside on the tree, those are bats..

గబ్బిలాలు అంటే ఈ మధ్య నాకు విపరీతమిన విరక్తి వచ్చేస్తుంది, మా దొడ్లో ఒక నాలుగైదు జామ చెట్టుకు పట్టుకుని తిరుగుతున్నాయ్, అవి రాత్రి పూట జామ పిందెలు కొరికి పారెయ్యటం, ఎత్తుకుని పరుగెత్తటం చేస్తుంటే ముందు ముచ్చటగా అనిపించింది కాని ఒకే చోట ఇన్ని చూసి, అక్కడ వచ్చే వాసనకి చచ్చినంత పని ఐపోయింది.  

Thursday, October 13, 2011

Day 287 ~ Oct 14 - Dhyaana Buddha

Dhyana Buddha under construction near the banks of Krishna, did not go inside the structure.. I just hope this turns out good considering the stink and the surrounding area right now.

బుద్ధుని జీవిత విధానాలు అవి అమరావతి లో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి.. చాల దూరం నించి చూస్తె కనిపించే ఈ విగ్రహం ఇంకా కడుతూనే ఉన్నారు, నది ఒడ్డున అంటా బాగానే ఉంది కాని చాల చాల బాగు చెయ్యాలి ఇంకా..  నాకు ఒక్క monk  కూడా కనిపించలేదు ఎక్కడా కూడా.

Day 286 ~ Oct 13 - Amaralingeswara RadhamWooden carriage for Lord Siva at Amaravati.

అమరావతి లో నాకు రెండు రధాలు కనిపించాయి, ఒకటి పాడు ఐపోయి ఊడిపోయి, ఇంకోటి పాక వేసి కట్టేశారు.. ఈ రధం మీద పనితనం నాకు చాల నచ్చింది, మొత్తోం కనిపించలేదు, దీన్ని తీసి వాడాలి అంటే మొత్తం పాక ని ఊడదీయాలి.
The shelter for the ratham, to protect it from damage from the elements 

Tuesday, October 11, 2011

Day 285 ~ Oct 12 - Paccha Pacchati Chelu..

 
Paddy crop with banana and coconut tree backdrop with monkeys monkeying around... wonderful sight

రోడ్ పక్కన ఈ పచ్చటి పొలం, చల్లటి గాలి అందులో అక్కడక్కడ వేళ్ళాడే కోతి పిల్లలు నాకు చూడటానికి భలే నచ్చింది.. కాని అరటి తోటలో ఈ కోతుల బెడద తలుచుకుంటేనే భయమేసింది.. ఎంచక్కా కొబ్బరి మట్టలకి తోకలు చుట్టేసి అటు ఇటు వేలాడుకుంటూ.. గట్టు మీద కూర్చుని పేలు కుక్కుకుంటూ భలే గంతులు వేస్తున్నాయ్ పొలం అంతా.

by the way, could catch only one monkey in shot, rest of them were just jumping away.

Day 284 ~ Oct 10 - Krishnaveni.. Teluginti Viriboni..

view of River Krishna from Prakasam barrage, I so love this place, so many memories of throwing coins from the bus, the water smell, the city everything spells out NOSTALGIA!

ఇది అని చెప్పలేను కాని నాకు ఈ కృష్ణ నది అంటే చాలా చాలా ఇష్టం, ఏదో కన్నా తల్లిని చూసినట్లు అనిపిస్తుంది.  వంతెన మీద వెళ్ళేటప్పుడు ఆ చల్లటి గాలి, ఆ నీటి వాసన, ఆ గల గల శబ్దం, అక్కడక్కడ కనిపించే ఇసక తెన్నలు....

Day 283 ~ Oct 10 - Walk In The Park

The kid and the OA walk around near the Buddha Stupa at Amaravati.. it is a nice place for an early morning walk, peaceful and serene.

అమరావతిలో ఉన్న బుద్ధుని స్తూపాలు, పురావస్తు శాఖ వాళ్ళ మ్యుసియంలు, కాల చక్రాలు, ధ్యానాలు, భక్తీ అని ఏదో తెలియని ఒక ప్రసాంతత ఉంది ఇక్కడ.. ఆధునిక జీవితపు హంగులు చేరిపోయినా కూడా ఇంకా అక్కడక్కడ ఉన్న పాత ఇల్లు, కట్టడాలు, గుడి, నది, భక్తీ, ముక్తి అన్ని ఒకే చోట ఉన్నట్లనిపించింది.

Day 282 ~ Oct 9 - Nomadic Lifestyle

Milk taken from the local hotel for the kid.. decided to go on a nomadic trip, no plans, just planning as we go and tagging along a kid was fun though scary considering the hygiene and all.

ఒక ప్లాన్ అంటూ లేకుండా రోడ్ మీద వెళ్తూ ఎటు వల్లాలి అనిపిస్తే అటు వెళ్లి, ఎక్కడ చీకటి పడితే అక్కడ పడుకుని, లంబాడి జీవన విధానం ఎలాగుంటుందో చూడాలి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు లింగు లింగు మంటూ ఇద్దరం కాకి తిరుగుడు తిరిగినా ఇప్పుడు చిచ్కూ గాడి తోటి కొంచెం కష్టమే అనుకున్నాం, కాని పాపం వాడు ఏ మాత్రం గోల చెయ్యకుండా మాతో పాటు బాగా తిరిగేసాడు.. జలుబు, కొద్దిగా జ్వరం కూడా పట్టుకున్నాయి వాతావరణం తేడా వాళ్ళ, కాని ఇదొక మర్చిపోలేని అనుభవం.

Day 281 ~ Oct 8 - Undavalli Guhalu

A rock temple carved for Ananta Padmanaabha Swamy in caves situated near Krishna-Guntur border.. Loved the scenic beauty surrounding this place.

ఉండవల్లి మీదగా అమరావతి వెళ్ళొచ్చు, అది చిన్న దారి అని తెలిసి ఆ దారిలో వెళ్ళాము, అక్కడే ఈ గుహలు ఉంటాయి అని కాని ఏమి తెలియదు.  దారి పొడుగునా పచ్చని పంటలు, చల్లటి గాలి, చాల చాల నచ్చింది నాకు ఈ చోటు, ఎంచక్కా ఇక్కడే ఒక నాలుగు ఎకరాలు కొనేసుకుని హాయిగా పందిచుకు తింటూ జీవితం వేల్లమార్చేయ్యాలి అనిపించింది. 

Day 280 ~ Oct 7 - Srikaakuleswara Swamy

The idol of lord, there was this divine radiance and an old world charm to this place, all through I had this feeling that I had been to this place some time, seen this premises but I had never ever been there.. loved the feeling.

మహిమ గల గుడి తప్పకుండా వెళ్ళండి వెళ్ళండి అని ఇంటి దేగ్గరి VRO గారు పీక్కుని తినేస్తుంటే తప్పేటట్లు లేదురా బాబు అని బయలు దేరి వెళ్లాం కాని అక్కడి వెళ్తే మనసుకు చెప్పలేనంత హాయిగా అనిపించింది.

The temple existing since 1010 AD, reconstructed twice, now renovated and looks like this but the sanctum sanctorum gives you an old world feel.


This existing temple is said to be built by Sree Krishna Devaraaya.. there are inscriptions from Chola dynasty time and this is Amukta Malyada Room!

తెలుగు వాళ్ళు అంత గొప్పగా పొగిడే ఈ ఆముక్త మాల్యద ని చదవాలని ఎంతో ఆశగా ఉంది కాని ఏంటో దాన్ని ముట్టుకోగానే నిద్రోచ్చేస్తుంది నాకు :(.

It is in Krishna District on the way between Movva and Challapalli..

Day 279 ~ Oct 6 - Another Year...

Mom's birthday cake... yumm!!

మా మమ్మీ పుట్టిన రోజుకి పండు గాడి తరపున కోసిన కేకు.

Day 278 ~ Oct 5 - Piggy Gang

Saw pigs after a real long time, their presence in the temple premises was a little disturbing and yucky but the kid loved watching them..

మా చిన్నప్పుడు పందుల రామ రావు అని ఒకాయన పండులని కొని ఊరి మీద వదిలేసి అవి పెరిగినాక పట్టుకుని అమ్ముకునేవాడు, వాటిని చూస్తె చచ్చే భయం వేసేది, వాటిని పట్టుకునేతప్పుడు వాళ్ళ కేకలు, వాటి పరుగులు అరుపులు నానా బీబత్సంగా ఉండేది.. తరవాత ఆయన పోయాక వాళ్ళ పిల్లలు బాగా సంపాదించుకుని వీటిని పెంచడం మానేశారు... మళ్ళీ ఇంచు మించు ఒక పది పదిహేను సంవత్సరాలకి ఈ పండి పరివారం కనిపించింది.

Monday, October 3, 2011

Day 277 ~ Oct 4 - Baccha Bhajana Batch

Local children doing bhajans at the Navaratri Mandap.

నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చాల బాగా భజనలు పాడేది అంట, పూజలు జరిగితే ఆవిడ భజన లేకుండా ఉండేది కాదు అంట, నేను మటుకు తను పాడటం బయట వినలేదు ఎప్పుడు.. ఈ గుడిలో కూడా చాల సేవ చేసేది అంట ఆవిడ, బోలెడంత మంది జనం వచ్చేవారంతా, ఇప్పుడు టీవీ లకి అతుక్కుపోయి ఎవరు రాట్లేదు, ఈ పిల్లలే పాడుకుంటున్నారు భజన బృందం దెగ్గర కూర్చుని...తొందరలో వీళ్ళు కూడా మిగలరేమోSunday, October 2, 2011

Day 276 ~ Oct 3 - Saraswathi Namasthubyam

Today's diety form is Saraswathi, the goddess of education, so we promptly go to the temple to pooja done!

మూల నక్షత్రం సరస్వతి పూజ అని చిన్నప్పుడు చాల చాల హడావుడి చేసేవారు, ఈ రోజు కొందరు అక్షరాభ్యాసం కూడా చేయించుకుంటారు పిల్లలకి.. ఊర్లో శివాలయంలో అమ్మవారి అలంకరణ ఇది.. 

Day 275 ~ Oct 2 - Tiny Pond

Converted an old cement water filler into our tiny lotus pond.. !

పాత సిమెంటు తొట్టి ఉంటె దానికి కాస్త రిపేరు చేసి నీళ్ళు పోసి నాచు పెంచి మా బుల్లి తటాకము తయారు చేసుకుని బుద్ధుడి దెగ్గర పెట్టేసామోచ్!

Day 274 ~ Oct 1 - Buddi Deepaalu??

light bulbs fixed up in traditional lantern design...

రామగుండం సమ్మె పుణ్యమా అని రోజులు సంగం సేపు కరెంటు ఉండట్లేదు... inverter  కూడా ఎక్కువ సేపు రావడం లేదు, మల్లి recharge  అయ్యే లోపు కరెంటు డాం  అంటుంది అందుకోసం దీపం బుడ్డి దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఎక్కడా ఎవరు వాడట్లేదు అని చెప్తున్నారు..