Thursday, July 28, 2011

Day 210 ~ July 29 - Tulasi Kota

Readymade Tulasi Pot...  A reminder of amma, her daily routine!

తులసి కోట చూడగానే అమ్మమ్మ గుర్తొస్తుంది నాకు... సొంత ఇంట్లో పాల రాతితో ఒకటి కట్టించుకోవాలి అనేది నా చిన్ని పెద్ద కోరిక!  చాలా రోజులకి నర్సరీ లో కనిపిస్తే కొని తెచ్చేసా, రంగులు పోయాక మల్లె సుబ్బరంగా నేనే వేసుకుంటా :).

Just looking at a tulasi corner in any home, reminds me of ammamma, a tumbler full of water, a couple of incense sticks, a few flowers, folded hands and enormous peace on her face with her daily after bath morning ritual.

Day 209 ~ July 28 - Morning Joy


An early morning view, that I love so much.. listening to birds, watching the blue sky, white clouds and an orange Sun, some cool breeze to go with... music in the background and a kid running around, perfect idea of a morning.

మా ఇంట్లో నాకు ఎంతగానో నచ్చే చోటు :).

Day 208 ~ July 27 - Potted

and the mother daughter paint another pot :).

పని లేని మంగలాడు పిల్లి తల గొరిగాడు అని మా తాతీ అంటూ ఉండేవాడు, ప్రస్తుతం నేను చిచ్కూ అదే పని లో ఉన్నాం :)

I love all the not so fine art forms that we produce, the time spent doing it is what makes special I  guess!!

Monday, July 25, 2011

Day 207 ~ July 26 - Green!!

I go green with envy each time I see this green fence near the unused park near the mobile nursery.... gorgeous!

పురుగు పుత్రా అని భయం కాని లేకపోతె ఇలాంటిది ఒకటి పాకించేస్తే కంటికి ఎంత ఇంపుగా ఉంటుందో.

Day 206 ~ July 25 ~ Muntha Mashaala

After a tiring day of gardening, the kids and me decide for a treat, our very own Munta Mashaala in the making, andhra version of Bhelpuri :).

వానలు పడుతుంటే రోజంతా పని చేసి అలిసిపోయి ఏదైనా తినాలి అనిపిస్తుంది, అప్పుడు రోడ్ మీద పడి కొని తెచ్చుకుని కుమ్మేసేది ముంత మషాలా.. ఇంట్లోనే చేసేస్తే పోలా అని అందరం తలా ఒక చెయ్యేసి ఇరగదీసేసాం, చాల బాగా కుదిరింది. 

Day 205 ~ July 24 - Kotta Kundeelu

Fresh stock just arrived in the local mobile nursery that we have every year when the rains start... tempting!!!

కొత్త కుండీలు అంటే కుక్క పిల్లలాగ తోక ఊపెసుకుంటూ వెళ్ళిపోయాం నేను చిచ్కూ గాడు... మళ్ళీ కొన్ని మొక్కలు తెచ్చుకుని పెట్టేశాం :).

We got another bulk and filled the house :).

Day 204 ~ July 23 - Goodu Rikshaa


Quite a lot of these were seen back when we were kids, transporting us around from the bus stop to the  remote village in place of the 7-seaters we have now!!

గూడు రిక్షా అంటే మా చిన్నతనం, హైదరాబాద్లో బస్సు ఎక్కి ముదినేపల్లిలో దిగి మా ఊరేల్లాలి అంటే ఈ రిక్షాలే..మేము వస్తున్నాం అని తెలియగానే మా తాతయ్య ఒక రిక్షాని పంపేవాడు, తనకెందుకు శ్రమ అని మేము ఎప్పుడైనా ఎక్కోచ్చేసామో వాడితో బేరం గురించి గొడవ.. అవన్నీ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు.. ఈ రిక్షా కూడా.  వెట్టి వాడు డప్పు వేసి దండోరా చేసేవాడు, అతని బదులు ఇప్పుడు ఈ మైకు సెట్టు పెట్టుకుని ఈ రిక్షా అతను చెప్పి వెళ్ళిపోతున్నాడు.

This is the only one I have seen in the past 3 yrs. which is used to make announcements in the village, maybe a panchaayat vehicle.

Friday, July 22, 2011

Day 203 ~ July 22 - Vidyaarambham

The first step in the world of acquiring knowledge, first day in school!!

చిచ్కూ గాడికి ఇంక రెండున్నర ఏళ్ళు కూడా రాకుండా బడి ఏంటి అని అందరు గోల గోల చేసేస్తున్నా నాకు మాత్రం తను ఇప్పుడు వెళ్ళడం కనీసం ఒక గంట కోసం అయినా మంచింది అనిపిస్తుంది, ఏది చూస్తె అది యిట్టె పట్టేసి నేర్చుకునే ఈ వయసులో, కాసేపు  ఒక క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే మంచిది అనిపిస్తుంది, పల్లెటూర్లో playschools ఉండవ్, ఇంట్లో నేను తనకి నేర్పించేవి ఎన్ని ఉన్నా తన ఈడు పిల్లల దెగ్గర ఉంటే మంచింది అనిపించిది, ఇంట్లో తనే ఒక మహారాణి లాగ అలవాటు అయిపోతుంది నా భయం, బయట ప్రపంచం కూడా చూపించాలి అని నా తాపత్రయం.. అందుకే ఈ రోజునించి మాకు రోజుకో గంట బడి.. ఆ పిల్లలకి గేమ్ పిరియడ్ అప్పుడు ఒక గంట వెళ్లి రావడానికి ఏర్పాటు చేసుకున్నాం.. మొదటి రోజు భలే సరదాగానే ఉంది అనుకుంటా ఆయన కూడా పాపం ఎత్తుకునే ఉన్నాడు ఆ గంట, ఏమి ఏడవలేదు, ఇంటికి రాగానే అమ్మ ఒక రవుండు మళ్ళీ బడికి వెళ్దామా అంది :).

మీరు మళ్లీ ఒకసారి అలా దీవిన్చేయ్యందోచ్ ,  


.. and the very first letters, my very own sweet language Telugu... a, aaaaaaaaa... :).

Day 202 ~ July 21 - The Goody Basket

A basket ready for the big day.. all set!

Day 201 ~ July 20 - The Golden Oldies

and this is my mom... love digging into those old pictures but as luck would have it, there are just a couple of them left

Day 200 ~ July 19 - Beauty of Friendship

I feel so grateful for the kid to be in a place and among kids who shower her with love unlimited, unconditional.

Day 199 ~ July 18 - Not a forest

This is not a picture of a forest but of a piece of land in the midst of regular houses, abandoned homes, sold and unoccupied, investment lands or whatever.

ఊర్లో జీవ జంతువులు చాలా ఎక్కువ ఉంటాయ్, వాటితో సహజీవనం చెయ్యడం అలవాటు కూడా ఐపోయింది కాని ఈ మధ్య ఇలాంటి స్థలాలు పెరగడం తోటి ఎక్కడ పడితే అక్కడ పాములు కుప్పలు తెప్పలుగా తయారవుతున్నాయ్, చాలా దారుణంగా ఉండి పరిస్తితి.. ఈ మధ్య కాలంలో నా చేత్తో నేనే రెండు పాము పిల్లల్ని చంపాల్సినంత :(((.. అందరు ఉన్నట్టే మనం కూడా అని సర్ది చెప్పేసుకున్నా ఈ జీవ హింస కి మనసు  చాలా బాధపడుతుంది.
Green is good to look at but it is really scary because these places home a whole lot of creatures that creep and crawl, poisonous and otherwise...!!

Day 198 ~ July 17 - Radhakrishna Poolu

Bunches of flowers that remind me of my childhood, days where these used to cover the temple entrance, the color, the fragrance is very very appealing to me even now.  Whenever I see it, I just get into another world altogether..

రాధ కృష్ణ పూలు అంటారు వీటిని, చిన్నప్పుడు గుప్పెళ్ళతో వీటిని కోసి ఇసక గూళ్ళు కట్టుకుని వాటి బయట పెర్చుకునే వాళ్ళం, ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం 


PS:  Found one and planted and I am like counting days to see it in full bloom!! Grow up soon :).

Day 197 ~ July 16 - In Shambles

When I look at those walls, I am reminded of a legacy, a life well lived just shattered!! too many lessons, too many memories and too much of grief all at once.

ఊర్లో దివాణం అంటే చాలా గొప్ప దొరలు, వెలమ దొరలు గుర్రాల బాగ్గీలు, ఘోషా, జమీందారీ అదొక లోకం. నా చిన్నప్పుడు ఆ ఇంట్లో లక్ష్మి ఆంటీ ఉండేది, నాయన గారు ఉండేవారు, ఒక్క వెలుగు వెలిగి ఆరిపోయారు, వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంపేవారు కాదు ఆవిడ, పని వాళ్ళు పూర్తిగా నమిలి మింగేశారు వాళ్ళని, ఆఖరికి ఇంట్లో వస్తువులు, బట్టలు కూడా అమ్మేసుకోవాల్సిన పరిస్తితి.. ఎందరికో అన్నం పెట్టిన చెయ్యి ఒకరి ముందు చాచడం చూసిన నాకు చాలా అసహాయంగా అనిపించేది, ఏమి చెయ్యలేని వయసు, ఎంతో చేసెయ్యాలి అనే మనసు.. నాకు ఒక స్తోమత వచ్చేపాటికి వాళ్ళెవరు మిగలలేదు, చెల్లా చెదురు అయిపోయారు ఆ ఇల్లు చూసినప్పుడల్లా, డాబా ఎక్కి మేము ఆడుకున్న ఆటలు, ఆవిడ నవ్వు, ఆ హంగు అన్ని గుర్తొస్తాయ్. నేను ఆఖరి సారి బడి సెలవల్లో ఆవిడని కలిసినప్పుడు తనకి నాకు ఇచ్చి పంపటానికి ఏమి లేక గోడ మీద ఉన్న painting ఇచ్చారు ఎంత వద్దన్నా, ఇంక తరవాత నువ్వు అడిగినా ఏమి లేదు నా దెగ్గర అని ఒక నవ్వు నవ్వి.. అది ఎప్పటికి మర్చిపోలేను.. ఆ చూపు గుర్తొస్తుంది నాకు ఈ మొండి గోడలు చూస్తుంటే

Saturday, July 16, 2011

Day 196 ~ July 15 - Kitty-Twitty Door :)

.. and we bring a couple of new friends, kitty and twitty to adorn our entrance.

ఇంటిని చూడగానే ఇంట్లో పిల్లలు ఉన్నారు అని చెప్పెయ్యొచ్చు మా ఇంటిని చూస్తె..

Day 195 ~ July 14 - Piled Up

The trash piled in the backyard thanks to the constant rains.

It is not raining continuously but it is very humid and the wetness just does not go away to burn it away.
చెత్త పేరుకుపోవడం ఒకటి వాన కాలంలో ఉండే పెద్ద సమస్య, తగల బెడదాం అంటే ఎండట్లేదు, ఏదో ఒక మాదిరి ఎండా వచ్చిన్దిలే అనుకునేలోపు తుంపర వాన... నా చిన్నప్పుడు పెంట పోగులు అని పెరడు వెనక చెత్త అంత పోగు చేసి ఆఖరికి ఏడాదికొకసారి పొలంలో ఎరువు కింద వాడేవారు, ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు ఆ పద్దతులు అసలు.



PS:  I just take a strong vow not to use plastic at all but it creeps in each time.. the day there is not a single plastic cover/item in trash I would consider myself successful.

Day 194 ~ July 13 - In a Row

Plowed, planted and laid a few bricks in a row to stop sand from getting into the balcony...

రెండు రోజులు నడుములు పడిపోయేలాగా మట్టి తవ్వి, మోసి, ఇటుకలు పేర్చి ఆఖరికి ఒక ఆకారినికి తెచ్చినందుకు భలే సంతోషంగా ఉంది.

Day 193 ~ July 12 - Preparing a garden patch

With it raining, I decide to turn another patch green... so some ploughing, manuring and settling being done..

వానలు పడితే మొక్కలు పెట్టాలి అని ప్రతి వారం సంతలో ఎదురు చూసి చూసి వాళ్ళు రాక ఆఖరికి ఎలాగైతేనేమి మట్టి తవ్వి, ఎరువు వేసి నెల చదును చేసి అట్టిపెట్టాను.

Monday, July 11, 2011

Day 192 ~ July 11 - Toli Ekaadasi, Pelaala Pandaga

Freshly ground henna, popcorn powder with sugar is all that I remember of this Toli Ekadasi Day.. memories that live on and things that we do to remember them..

పేలాల పండగ అని మాత్రమే నాకు గుర్తుండే పండగ తొలి ఏకాదశి అమ్మమ్మ ఉన్నప్పుడు గోరింటాకు రుబ్బి, పేలాలు పిండి పట్టించి బలవంతాన తినిపించి, తను ఉపవాసం చేసి మమ్మల్ని గుడికి పంపించి చాలా హడావుడి చేసేది.. ఇప్పుడు తను లేదు, నాకు చేసే ఓపికా లేదు కాని పండు గాడి కోసం చాకలి రుక్మిణమ్మ ప్రేమగా తెచ్చిన గోరింటాకు తనకి కాస్త బలవంతాన పూసి నేను పెట్టుకుని నాలుగు పేలాలు నమిలి పండగ అయ్యింది అనిపించాం ఎలాగోలాగ.

Sunday, July 10, 2011

Day 191 ~ July 10 - Kandireega Goollu


I really don't know what we call them in English but it is a mess over here, the nests, the insects all of them.. any place, wood or concrete, flooring or ceiling just find some undisturbed place and pile up that sticky mud like material and build a nest.. sigh!!


కందిరీగ కుడితే ఒళ్ళు మంటలు పుట్టేస్తుంది అని అందరు చెప్పి నన్ను విపరీతంగా హడలు కొట్టేసారు, నన్ను ఎప్పుడు కుట్టలేదు, కాని ఆ గూల్లని చూసినప్పుడల్లా నాకు గుండె దడ పెరిగిపోతూ ఉంటుంది.. నాకు ఉన్న పనులకి తోడు ఈ గూళ్ళ నాశనం ఒకటి.. దేవుడా నా చేత ఇంకా ఎన్ని పాపాలు చేయిస్తావు తండ్రి.

Saturday, July 9, 2011

Day 190 ~ July 9 - Eena, Meena, Deeka

The doll slides (tic-tac pins) for the kid's hair.  The first one I got last year and the next two this year from the exhibition.  These come in pairs and I just love them.

ఆడపిల్ల ఉంటే ఆ ముచ్చటే వేరు, ఎన్ని షోకులైన చేయొచ్చు, ఈ క్లిప్పులంటే నాకు భలే ఇష్టం.  


PS:  Keerthi, guess you figured out the backdrop :).

Day 189 ~ July 8 - Unopened

For a no-tea person like me, it is a huge task to even try the much touted green tea...

ఒళ్ళు తేలిక పడుతుంది అని చాలా మంది చెప్పగా చెప్పగా కోని తీసుకుని వచ్చా కాని ఇప్పటికి ఒకసారి కూడా టాగ లేదు.  ఇంచి కూడా తగ్గని ఒంటికి నిమ్మ నీళ్ళు కూడా దండగ అని మానేశాను ఈ మధ్య.

అసలు టీ అంటేనే ఇష్టం ఉండదు నాకు, జీవితంలో ఒక్కసారో, రెండు సార్లో తాగి ఉంటాను.. అసలు అది తాగకుండా ఉంటే తల నొప్పి అనే మా అమ్మ ని చూస్తె నాకొక వింత.  అలాంటి నాకు ఈ గ్రీన్ టీ ఏమి ఎక్కుతుంది అని అసలు దాని జోలికేల్లట్లేదు.. మా అమ్మేమో అది ఎప్పటికైనా తాగాలి అని నా lappy పక్కన కనిపించేట్లు పెట్టింది.

Day 188 ~ July 7 - The Round Figure

Well, the round figure is referring to both my physique as well as the weight score.. there I go!!

గుండ్రంగా గుండ్రాయిలాగా కనిపించినా ఒంట్లో ఓపిక ఉంటే అదొక ఆనందం.. తింటే ఆయాసం, తినకపోతే నీరసం లాగ ఉండి పరిస్తితి.  డాక్టరేమో ఇంకో 16 కిలోలు తగ్గమ్మా అంటాడు, నాకేమో అమ్మో పదహారు గ్రాములు కూడా తగ్గే సూచనలు కనిపించవు.. జీవితంలో ఎప్పుడు కూడా అయ్యో సరిగ్గా తిండి తిను, చీపిరి పుల్ల లాగ ఏంటి అనేవాళ్ళ చుట్టూ ఇప్పుడు నిండుగా పిల్ల తల్లిలాగా సరిపడా ఉన్నావు, కడుపు మాడ్చుకోకు అనే చెప్పే వాళ్ళు ఉండగా ఏమి తగ్గుతాను.

Day 187 ~ July 6 - Nootilo Kappa

The frog that we had to forcibly get out of the well thanks to its unbearably continuous musical concert overnight!

నూతిలో కప్ప అని ఎందుకు అంటారో అర్థం అయ్యింది కాని అవి చేసే పిచ్చి గోల మాత్రం దారుణం. బోండ్రు కప్ప అని ఒక లాంటి భయంకరమైన శబ్దం వాన పడ్డంత సేపు, బయట పడుకున్తున్నామేమో అసలు చెవులు బద్దలు కొట్టేసినంత గోల.. ఆఖరికి బుకెట్లు వేసి, లాగి ఎలాగోలా ఒక గంట తపస్సు చేసి దాన్ని బయటకి తెచ్చి పారేసి ఊపిరి పీల్చుకున్నా.. పోనీ దీనితో పోయిందా అనుకుంటే, ఎక్కడా వానకి చేరిన బురద గుంటల్లో వాటి గోల వాటిదే.

Tuesday, July 5, 2011

Day 186 ~ July 5 - Dream Homes

Wish it were as easy to build and break dream homes as in these blocks the kids play.

కష్టపడి ఏర్పరుచుకున్న ఇల్లు/ఆశలు  కూలిపోతే కట్టుకోవడం పెద్దవాళ్ళకి ఎంత కష్టమో పిల్లలకి అంత తేలిక కదా.  వాళ్లకి అదొక సమస్యే కాదు ఒక ఆట.  ఒకటి పొతే మరోటి ఇంకా మంచిది, పసి పిల్లల్లో ఉండే ఆ సర్దుబాటుతనం చాల గొప్పది అనిపిస్తుంది నాకు.  కోపాలు, భయాలు, ఆశలు నిరాశలు అన్నిటికి అతీతంగా ఆ బాల్యంలోకి జారిపోతే ఎంత బాగుంటుంది కదా.

Day 185 ~ July 4 - New Arrivals

The kid gets a few more toy gifts.

చిచ్కూ గాడికి బొమ్మలు, బట్టలు మటుకు వద్దన్నా గుట్టలు గుట్టలుగా వచ్చేస్తున్తాయ్, ఎంత నేను కొనకూడదు అనుకున్నా, ఏంటో అలా అమిరిపోతూ ఉంటాయి.  ఈ మధ్య కాలంలో నాకు నేనుగా కోనేవి చాల తగ్గించేసాను.

Day 184 ~ July 3 - A Horse Ride

A joyride in the exhibition.. yaasi bhayya holding the kid safe and tightly secured on the horse.

గుడివాడలో ఎగ్జిబిషన్ పెట్టారు అని తెలిసి చాల రోజులనించి వెళ్ళాలి అనుకున్నా కాని కుదరలేదు, ఆఖరికి తెమిలే పాటికి అది ఆఖరి రోజు అని అన్నారు.  ముందు రోజు వాన మూలాన లైట్ల దెగ్గర పురుగులు, విపరీతంగా జనాలు అలావాటు తప్పి పోయి నాకు తలపోటు, అలవాటు లేక పండు గాడికి చాల చిరాకేసింది.. కాని ఈ గుర్రం, కారు, చేప, ఏరోప్లెను ఎలాగోలా ఎక్కేసింది.  

It was the last day, the place was very small and suffocating, the kids enjoyed joy rides and LO had fun though she was tired.

Day 183 ~ July 2 - A Very Special Gift

A very cute mutyaala jada which I fell in love with the moment I saw it on Keerthi HERE which she got custom made for Sreya.  Thanks a ton Keerthi, you know how much I really loved it.

నాకు కాస్త పైత్యం ఎక్కువ చిచ్కూ గాడి విషయంలో అని అందరి అభిప్రాయం, నిజమేనేమో కూడా లేకపోతె ఇప్పుడిప్పుడే మొలకలు కూడా రాని పండు గాడి జుట్టుకి ఈ వాలు జడ అవసరమా?  కీర్తి పెట్టిన ఈ బొమ్మ చూసినప్పటినించి దీని కోసం బెజవాడలో చాల తిరిగాను కాని ఎక్కడ దొరకలేదు, ఆఖరికి బొమ్మ పెట్టిన పాపానికి తనకి ఆ కొనిపెట్టే పాట్లు కూడా తప్పలేదు.  

and a special thanks to Suman garu!

Day 182 ~ July 1 - Windmills of God..

We find a place for the paper mill.

అందంగా గాలికి రెప రేపలాడుతూ తిరుగుతూ ఉందీ ఈ పేపర్ మిల్లు అంటే నాకు చాల ఇష్టం.. కనిపించని గాలికి కనిపించే ఈ బొమ్మ కదులుతూ ఆ భగవంతుడి లీలని గుర్తు చేస్తున్న్నట్టు అనిపిస్తుంది.

Day 181 ~ June 30 - Paper Dreams

Young boy selling these toys at a fair..could not get a clear picture thanks to my very basic camera and dim light.

చదువుకోవాల్సిన వయసులో ఈ పిల్లాడు ఈ కాగితపు బొమ్మలు, బూరలు అమ్ముకుంటూ తిరుగుతుంటే చాల బాధ అనిపించింది కాని అక్కడే ఆ దేగ్గరలోనే ఒక పళ్ళెం పుచ్చుకుని, వాళ్ళకంటే చిన్న పిల్లల్ని ఎత్తుకుని అడుక్కునే పిల్లల్ని చూస్తె ఇదే చాల మెరుగు అనిపించింది.