A new mom scared like hell with a new life to be taken care of, all by myself, 24x7, looking back it was a pretty decent job that I did back then!!
ఏదో పుస్తకాలు సర్దుతుంటే చిచ్కూ డైలీ లాగ్ బుక్ కనపడింది.. రెండేళ్ళ క్రితం ఒక పసి ప్రాణం, దాని గురించి ఏమి తెలియని ఒక తల్లి, ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పెంచేసా ఏరోజుకారోజు ఈ రోజు గడిస్తే చాలు అనేటట్లు ఉండేవి నా పాట్లు.. అందరు ఒక ఏడాది వస్తే అంతా సర్దుకుంటుంది అనేవారు.. కాని అప్పుడే ప్రాణానికి భలే హాయిగా ఉండేది పట్టినన్ని పాలు తాగి, ఏదో కొంచెం కక్కేసి మొత్తం మీద రోజులో 18 నుంచి 20 గంటలు పడుకుని కదలకుండా మెదలకుండా అస్సలు నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు.. ఇప్పుడు తిండి పాట్లు తలచుకుంటే ఆహా అదే స్వర్గం కదా అనిపిస్తుంది.. ఇలా అన్ని పుస్తకంలో రాసుకుంటూ, కదిలిన, మెదిలిన కెమెరాలో బందిన్చుకుంటూ, ఎంతో అపురూపంగా పెంచుకున్న నా బంగారు తల్లి చెంగు చెంగున గంతులేస్తూ తిరుగుతుంటే ఆరోజు ఎంత మంది ఎక్కిరించినా లైట్ లైట్ లైట్ అనిపిస్తుంది, తోచినట్లే వచ్చినట్లే పెంచుకున్న ఎవరి మీద ఆధారపడి బరువు అవ్వలేదు అని ఒక పిసరు గర్వంగా కూడా ఉంటుంది.... పని వాళ్ళు ఎందరున్నా నా వాళ్ళు లేరు అని ఎవరు ఎన్ని మాటలు అన్నా ఆ పైవాడే నా వాడు అనేదే నా ధీమా నాడు, నేడు, ఎప్పుడు కూడా.
ఒకటి నేను నేర్చుకుంది బిడ్డ పెంపకంలో అందరివి విను, నీకు మంచిది అనిపించిందే, బిడ్డకి క్షేమం అయ్యిందే చెయ్యి.. చేతిలో బిడ్డని చూస్తె ప్రతి ఒక్కరు సలహాలిచ్చే వాళ్ళే.. కన్నావులే మా లావు బిడ్డని అంటే, అవునండి నా పాట్లు నాకే తెలుసు అని ఒక చింపిరి నవ్వు నవ్వడమే :).