Monday, January 30, 2012

Wk5/Dy2(30) ~ Jan 30 - Bobby Ribbons

The once popular fashion bobby ribbons... got them made personally.
మా చిన్నప్పుడు షాప్లో దొరికేవి, మెత్తగా, రంగు రంగుల్లో ఉండి జడలు వేసుకుని కుచ్చులు పెట్టుకుంటే భలే భలేగా ఉండేవి, ఇప్పుడు పండుగాడికి అరటికాయ జడలు వేద్దాం అని వెదికితే polyster రిబ్బన్లు మాత్రమె ఉంటున్నాయ్ ఎక్కడ చూసిన, అందుకే మా టైలర్ దేగ్గరికెళ్ళి కొన్ని పీలికలు పెట్టి ఓవర్ లాకు చేయించి  కుట్టించుకొచ్చా 

Saturday, January 28, 2012

Wk5/Dy1(29) ~ Jan 29 - Paper Flowers

New blooms....

చెట్టు నిండిపోయి రంగు రంగుల్లో పూసే ఈ కాగితపు పూల చెట్లు అంటే నాకు భలే ఇష్టం... కడియంలో బుజ్జి మొక్కలు తెచ్చుకుని పెట్టా అవి ఇప్పుడు కొన్ని కొన్ని పూలు పూస్తున్నాయి.

Friday, January 27, 2012

Wk4/Dy7(28) ~ Jan 28 - In the Name of Kid

Kaleidoscope and flexi-ball...

పండు గాడి పేరు చెప్పి పండగ చేసుకోడం నాకు బాగా అలావాటైన పనే కదా :).. నాకు నచ్చినవన్నీ కొనేసుకుని వాడికి అని ఒక పేరు.  ఏదో నా సంబరం నేను తీర్చుకోడం కాకుండా నా ఇష్టాలు తన మీద రుద్దడానికి నేను చెప్పే కబుర్లు, కధలు.. అసలు ప్రపంచంలో వీటిని మించి బొమ్మలు ఉంటాయ అన్నట్లు కహానీలు... పాపం పిచ్చి కుంకడు చెప్పినవి ప్రస్తుతానికి నమ్మేస్తున్నాడు ;).

Wk4/Dy6(27) ~ Jan 27 - Toli Manchu Kurisindee..

Fog in the early hours in a typical village setting.

దట్టంగా మంచు ఉంటుంది ఈ మధ్య పొద్దున్న ఎనిమిది గంటల దాక, ఊరి పోలమేరల్లో, పొలాలు, కాలవలు ఉన్న చోట్ల మరీను... నీళ్ళలోంచి పొగలు లాంటి మంచు.. కనీ కనిపించనట్టుగా ఉన్న సూరీడు, చల్ల గాలి... ఆహ!

Wk4/Dy5(26) ~ Jan 26 - Republic Parade and Speech


Been to the police parade grounds in MTM to give the kid her first look at the parade.. felt good!

నేను కలెక్టర్ అవ్వాలి అవ్వాలి అని కనీసం బిల్లు కలెక్టరు ఉద్యోగం కూడా చెయ్యట్లేదు గోవేర్న్మెంట్లో... ఏదైనా చెయ్యగల సామర్ధ్యం ఉండి, ఒక చట్రంలో ఉండిపోయిన పదవి ఐపోయింది ఈ మధ్య కాలంలో.. ఐదేళ్ళు కూడా ఉంటారో లేదో తెలియని వాళ్ళ కోసం వీళ్ళు మధ్యలో నలిగిపోవడం... ప్చ్.

Just about ready to start the march..

గణతంత్ర కవాతు :).. అబ్బో నా తెలుగు కెవ్వు..

Wk4/Dy4(25) ~ Jan 25 - Unexpected Surprise - Cloud 9!

A banner welcoming CBN to Raitu Poru Bata in Koneru Center, Bandar...

కైకులురు మీదగా బందరు వెళ్ళాలి అంటే మా ఊరు దాటి వెళ్ళాలి, బాబు ఎల్లె దార్లో మా ఊరుంది, తను వస్తాడు అని అనుకున్నాం కాని జనాలు తొక్కిడి ఎక్కువ ఉంటుంది ఎందుకొచ్చిన్దిలే అని గాంధీ బొమ్మ దెగ్గర అందరు TDP వాళ్ళు ఏదో బండి ఆపేద్దాం మాట్లాడిద్దాం అనుకున్నా నేను మటుకు ఎల్లలేదు, ఎలాగు ఇంటి ముందు నించే కదా అని ఆఖరికి ఊర్లోకోచ్చిన మోత విన్నాక వెళ్లి నిన్చున్నాం.. పండు గాడికి నాకు భలే చేతులూపాడు, మేము తన కోసం వెతుకుతుంటే, ఏ బండిలో ఉన్నాడో, ఎక్కడున్నాడో అని.. :).. భలే పండిన జామ్పండులాగా అనిపించాడు... నేను మటుకు ఫుల్లు ఫిదా :).

PS:  Like old wine, he is ageing beautifully :).  He looks so damn good in person, no photos/videos justify his physical presence!

Wk4/Dy3(24) ~ Jan 24 - Kotta Savaari

Yet another MILESTONE.. a successful transition from tryke to a bicycle..!

చిచ్కూ గాడు ఈ మధ్య కావాలని పోరు పెట్టి, అల్లరి చెయ్యను, అన్నం తింటాను అని మాటల గాలం వేసి మరీ కొనిపించుకున్న సైకిల్ సుబ్బరం ఎక్కి తొక్కడం మొదలు పెట్టేసింది.. ఇంకా safety  wheels తీయదల్చుకోలేదు కాని గిర్రు గిర్రున ఇల్లు చుట్టి వస్తుంది అప్పుడే.. నడక వచ్చాక పరుగు, తొక్కడం వచ్చాక స్పీడు ఆపడం మన వాళ్ళ కాదేమో. 

Wk4/Dy2(23) ~ Jan 23 - Work From Home

A typical wfh scene at home..! 

ఇంట్లోంచి పని చెయ్యాలి అంటే అబ్బో చచ్చేంత motivation కావాలి ఎంచక్కా సినిమా చూడటమో, పడుకోతమో చెయ్యక ఏంట్రా బాబు అనిపిస్తా ఉన్నా అవన్నీ చెయ్యాలి, మన కుప్పి గంతులు సాగాలి అంటే బువ్వ పెట్టె ఉద్యోగం తప్పదు అని జేల్లకాయ కొట్టుకుని పని చేసుకోడం.... మరీ అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు కదా.!  

PS:  Occasional Me and the OA WFH scene, though work hours vary.

Wk4/Dy1(22) ~ Jan 22 - Graameena Roadlu

Road laid with funds from PMGSY.. the second one we had seen..!

ఇలాంటివి ఉంటాయి అని ఏదో పరీక్షలకి చదువుకోడమో, పేపర్లో చూడటమో తప్ప, ఈ పదకాలని ఉపయోగించి చేసిన పనులు చూసింది నేను చాల తక్కువ, ఏటికొప్పాక దెగ్గర ఒకటి చూసాము మళ్ళీ మా ఊరి అవతల బంటుమిల్లి దార్లో ఇంకోటి చూసాం.

Wk3/Day7(21) ~ Jan 21 - Peda Lorry

Men loading the lorry with cattle dung... a biweekly sight near my home.

మా చిన్నప్పుడు పేడ అంటే పిడకలు కొట్టడమో, లేదంటే ఏడాదికొకసారి పెంటపోగు తోలి పొలంలో ఎరువు కింద వెయ్యడమో, ఇంకా తరవాత తరవాత గోబర్ గ్యాస్ అని ఏదోకటి చేసేవాళ్ళు... ఈ మధ్య రెండు వారలకోసారి ఈ లోర్రి వచ్చి అందరి ఇళ్ళలో పేడ పోగేసుకేల్తుంటే ఏంట్రా ఇది అనుకున్నా.. చేపల చెరువులో వెయ్యడానికి అంట... వారి నాయనో అందుకే చెరువు వైపుకేల్తే చాలు ముక్కు పగిలే కంపు అని అప్పుడు అర్థం అయ్యింది.

Wk3/Dy6(20) ~ Jan 20 - On the Way

Started another stitch kit thing after a real long time.. just traced the outline of the shepherd on the way back home..!

నేను చేసే కుట్లు గట్రా ఎప్పుడో అటక ఎక్కిసినా అప్పుడప్పుడు మళ్ళీ చేస్తే బాగుండు అనిపిస్తుంది, ఈసారి కొంచెం తేలికైన దారిలో వెళ్లి ఇది మొదలెట్టా..

Wk3/Dy5(19) ~ Jan 19 - Indoor Greens

some natural green inside the house...

నేను పాత పచ్చడి జాడీలో పెట్టిన మొక్క భలే నవ నవ లాడుతూ ముద్దోచ్చేస్తున్దోచ్!

Wk3/Dy4(18) ~ Jan 18 - Geeta Makarandam

Different Geeta translations I happen to have...

గీత చదివి మన గీత మార్చుకోవడం అనేది ఎప్పటినించో నేను వింటున్న మాట, నేను చాల బాధగా ఉన్నప్పుడు విని తెరిపిన పాడేది కూడా ఇది వినే, ఘంటసాల గారి గొంతులో అమృతం పోసి మరీ పాడినట్లు ఉంటుంది, బాధ తీసి పెట్టినట్టు పోతుంది.  ఎలాంటి ప్రశ్నకైన అందులో దాగి ఉన్న సమాధానం తెలిస్తే చాలు అనిపిస్తుంది... మళ్ళీ వినడం మొదలు పెట్టాలి, చదవడం మొదలు పెట్టాలి అనుకుంటూ ఉన్న పుస్తకాలన్నీ పోగేసి చూసుకుని మురిసిపోవడమే కాని చదివిన విన్న పాపాన పోట్లేదు :(.

Monday, January 16, 2012

Week 3, Day 17 - Jan 17 ~ Ready to School

The lunch boxes outside the classrooms in the school premises.

పొద్దున్నే పిల్లలు బడికి ఎల్లిపోతే ఎనకాల తల్లి తండ్రులు అన్నం కట్టుకుని తీసుకెళ్ళి ఇచ్చి వస్తారు, అలా ఇచ్చినవి అన్ని ఇలా కనిపిస్తాయి.

Week 3, Day 16 ~ Jan 16 - Clay Moulds

clay mould shapes made by school kids..

చిన్నప్పుడు మేము కూడా ఇలాగే బంక మట్టి పెట్టి బొమ్మలు చేసేవాళ్ళం, ఇప్పటి కాలం పిల్లలకి మెత్తటి మట్టి ఇచ్చి చెయ్యమంటే భలే భలే తయారు చేస్తున్నారు.

Week 3, Day 15 - Jan 15 ~ Bonding over A-Z

Father daughter bond over with Henna A, B, Cs

చిచ్కూ గాడు ఈ మధ్య ఎంచక్కా గోరింటాకు పెట్టుకుంటున్నాడు.. !

Week2, Day 14 ~ Minnu Comes Home

The limited edition Minnu calender finally in my hands... and that is the kid's Raju cup next to it.

OA ని చావగొట్టి చితగ్గొట్టి గేలరీకి పంపించి తెప్పించుకున్న మిన్ను క్యాలెండరు. 

Week 2, Jan 13 ~ Readymade Henna Blocks

Identical peacock pattern blocks for me and the kid..

ఇలా రంగులో ముంచి అలా చేతి మీద అచ్చు వేసి తియ్యడం ఎంత హాయిగా అయిపోయిందో :).

Wednesday, January 11, 2012

Week 2, Day 12 - Jan 12 ~ Taala Patra Grandhaalu

Hanuman Chalisa and Ashtalakshmi Stotram on palm leaves... reviving old with new technology..

అప్పుడెప్పుడో ట్యాంక్బండ్ మీద ఎల్తుంటే నన్నయ్య, తిక్కన మొల్ల లాంటి వాళ్ళ చేతుల్లో చూసినవి, లేదంటే బొమ్మల్లో చూసినవి ఇవి.. అప్పుడు వీటి మీదే రాసేవాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తున్నారు అని చూపెట్టారు... ఒక్కోటి 250 /- అన్నారు... నేను కొనలేదు, ఎందుకో చదవనేమో అనిపించింది.. కొని దాయడం కూడా నచ్చలేదు.

Tuesday, January 10, 2012

Week 2, Day 11 - Jan 11 ~ Harilo Ranga Hari

Young Haridasu... Each day throughout the Sankranthi month these people come singing to each and every home collecting rice from the fresh harvest in the bowl above their heads and wish us prosperity.

మెల్లిగా పల్లెటూర్లలో కూడా అంతరించిపోతున్న సాంప్రదాయాలు ఒక్కోటి అందులో హరి దాసులు కూడా, మా చిన్నప్పుడు చూడటమే కాని మళ్ళీ ఈ మూడేళ్ళలో ఎక్కడా కనిపించలేదు... ఇతనిని చూడగానే ఏంటో పండగ పరుగేట్టుకోచ్చినట్టు ఇంటికి అనిపించింది.

Week 2, Day 10 - Jan 10 ~ Vijayawada Book Exhibition

Yay, finally before the close tomorrow, I went to the place I look forward to go to each year, missed it last year due to multiple fractures :)

పుస్తకాలు నమిలి మింగేసే టైపు నేను.. అలాంటి నాకు పుస్తకాలన్నీ గుట్టలు గుట్టలుగా ఒకే చోట కనిపిస్తే ఇంకా చెప్పేదేముంది పెద్ద పండగ :).. ప్రతి ఏడు దీని కోసం భలే ఎదురు చూస్తాను నేను.

Rain played a spoil sport... but I did not give up.

మొత్తం రోజంతా తుప్పర పడుతూనే ఉంది.. ఉంది ఉంది వాన ఝాడించి కొట్టడం, మళ్ళీ తుప్పర పడటం.. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడి జాతి కదా మనది వదలలేదు...

Leaving English to Flipkart buys, just focused and bought Telugu books.

కొత్త పుస్తకాల వాసన అంటే పడి చచ్చే నాకు ఆహా ఓహో అమోఘం.

PS:  Missed you Keerthi.. BG gaaru, Olga books choosinappudu I remembered you a lot! 

Sunday, January 8, 2012

Week 2, Day 9 - Jan 9 ~ Nostalgia!

.... the first 4 pairs that I bought with my own pay, loved and used the most at some point.  I bought a few more later on but these remain favorites!

నాకు బంగారం అంటే పెద్ద పిచ్చి ఎప్పుడు లేదు కాని బుల్లి బుల్లి పోగులు అన్నా, వేళ్ళకి ఉంగరాలన్నభలే ఇష్టం ఉండేది, ఎప్పుడు మారుస్తూ ఉండేదాన్ని.. ఉంగరాల సాంబయ్య లాగ ఇంచుమించు ఆరు, ఏడు కూడా పెట్టుకునేదాన్ని ;).  ఇప్పుడు ఆ పిచ్చి లేదు... పండు గాడు చెవి రింగులు తీసి చేతిలో పెట్టాడు నిన్న వాడివి దెబ్బకి దడిచి వేరేవి మార్చినప్పుడు ఇవి కనిపిస్తే ఎందుకో ఒక్కసారి ఒక నిట్టూర్పు వచ్చేసింది. 

Saturday, January 7, 2012

Week 2, Day 8 - Jan 8 - Banthi Chaamanti

Winter blooms in my tiny garden..

చలి కాలం వచ్చింది అంటే ఎంచక్కా చెట్లకి బంతి, చామంతి, కారపు బంతి పూలు కళ కళ లాడుతూ ఉంటాయి.  నా బుల్లి తోటలో కూడా పూశాయి..

ఎంచక్కా బంతీ చామంటీ అని పాత గుర్తొస్తుంది నాకు వీటిని చూస్తె.

Friday, January 6, 2012

Week 1, Day 7 - Jan 7 - Quirky Collection

Collection currency :).

ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు కాని, నాకు ఉహ తెలిసాక నా దెగ్గర ఉన్న కొత్త నోటు ని ఒక దాన్ని తీసి దాచిపెట్టేదాన్ని, అది వాడేదాన్నికాదు ఒకవేళ తీసినా అవసరం పడి మళ్ళీ ఏదో అప్పులోడికి బాకీ అన్నట్లు తిరిగి పెట్టేసేదాన్ని.. మళ్ళీ అవి పెట్టుకోడానికి ఒక పర్సు కూడా ఉండేది.. మొన్న తిరిగొచ్చిన నా సామాన్లలో అది కూడా వచ్చిందోచ్!

Thursday, January 5, 2012

Week 1, Day 6 - Jan 6 ~ Hung High

My favorite chimes hung up finally, one from Etikoppaaka and the other from Michaels, most melodious chime that is very soothing.

వాకిట్లో కూర్చున్నప్పుడు అలా పిల్ల గాలి వస్తూ, ఆకులు అల్లల్లాడుతూ ఉంటె భలే బాగుంటుంది... అదే చిరుగాలి ఈ స్టీల్ బద్దీలని తగిలి చిరు శబ్దం చేస్తే నాకు చాలా చాలా ఇష్టం.  ఎన్నో చోట్ల ఎన్నో చూసాను కాని ఈ ఆకు chyme చేసే ధ్వని మాత్రం ఎక్కడా తిరిగి దొరకలేదు.. వినగానే భలే హాయిగా అనిపిస్తుది ఏదో డబ్బాలో రాళ్ళు పోసినట్లు గార గార లాడకుండా. చెక్క, terakota ,  ఇంకా ఆ బద్దీలకి వాడిన పదార్ధాల వాళ్ళ అయ్యుండొచ్చు.

Wednesday, January 4, 2012

Week 1, Day 5 - Jan 5 ~ Battala Teega

Finally get to wash and sun-dry all the kid's party wear dresses after the trip and the ceremony.

వైజాగ్ నించి తిరిగి వచ్చిన వెంటనే మామయ్య పోవడం, ఆ పనులు, తరవాత వానలు, వీటితోటి నేను ఉతకాల్సిన చిచ్కూ గాడి దాపుడు బట్టలు అన్ని అలాగే ఉండి పోయాయి.. ఆఖరికి నిన్న ఎలాగైనా సరే అని ఆ పని పెట్టేసుకున్నాను.

Tuesday, January 3, 2012

Week 1, Day 4 - Jan 4 ~ Matti Poyyi

clay stove which uses wood and coal as fuel..

మట్టి పొయ్యి ఇంకా ఈ రోజుల్లో కూడా వాడుతున్నారోచ్... అరుకు కొండ దిగగానే కింద ఉన్న ఊర్లో టీ కోసం వెదికితే ఒకావిడ ఇంట్లో పెట్టి ఇచ్చారు..

PS - Archived pic

Week 1, Day 3 - Jan 3 ~ Buffet Breakfast

A filling Indian breakfast by APTDC :).

వండుకుని తినడం అంత కష్టమైనా పని ప్రపంచంలో మరొకటి లేదు అని నమ్మే మొదటి వ్యక్తిని నేను... ఇలాంటిది ఎవరైనా రోజు చేసి పెడితే బాగుంటుంది కదా.
PS - Archived pic

Monday, January 2, 2012

Week 1, Day 2 ~ Jan 2 - The Fresh Lot

The new lot from the British Library

నాకు మళ్ళీ చదువుకోవడానికి బోలెడు పుస్తకాలు వచ్చేసాయోచ్చ్!

Sunday, January 1, 2012

Week 1, Day 1 - Jan 1 ~ Mamma Sweetoo Wishes

For some reason, I really love this formless form a lot.

ఈ బొమ్మ అంటే నాకు చాల చాల ఇష్టం, నేను చిచ్కూ గాడు అనుకుంటాను చూసినప్పుడల్లా, అందరి తల్లులకి అలాగే అనిపిస్తుందేమో కూడా :).  మా ఇద్దరి తరపునా మీ అందరికి కొత్త సంవత్సర subhaakaankshalu

A Pic A Day For An Year - Project - 365 (2011)

What began casually kind of became a habit over a period of time.  I do not really focus on taking a picture on that particular day but in general designate a picture for a day from the happenings in and around my life and dwelling.  All the posts were necessarily not on the same day as they got posted as in the actual concept of photo-bloggers' project 365, certainly it was my life in pictures that came across, I guess, beautifully, nothing really arty or classy but everything very life-like :).

It was/is fun, challenging at times with theme-based posting, some thing to look forward to do at the end of the day or at the day break.  There were pauses and collective posts in between, some scheduled posts, some double posts.. a mixed bag of emotions, extreme highs and deepest lows.. but in general, a year well-lived!!!

For a compulsive blogger like me, pictures posts are an easy way to still be blogging and not really putting in a lot of time :).

I am not really sure if I would take it forward as enthusiastically this year but I would love to 'cos when I look at things with my eye, the mind is tuned to show it through the lens... so an year ends and new one begins, a leap year at that bringing in a lot of freshness.  Completely aware that no matter an year ended or a new one begins, the fact is that life continues and time flies, we take a step into technically a new calender year -2012.!

Day 365 ~ Dec 31 - Final Farewell :((

Packing the boxes with sweets and putting them in covers to give away after the final ceremony for mama..

పది రోజులు ఐపోయాయి అప్పుడే, ఈ ఏడాది ఆఖరి రోజున ఆయనకి మేము చేసే ఆఖరి కార్యక్రమం ఐపోయింది.. అంత మనిషి జ్ఞాపకం అంటూ ఒక బుల్లి గిన్నె మిగిలింది, మనసులో తను కచ్చితంగా ఉంటాడు, మంచి గాను, చెడు గాను, బాధగాను, ఆనందం తోనూ...

ఏది శాశ్వతం కాదు అని తిలిసి కూడా ఒక్కోసారి అప్పుకోలేని కోపం... ఎప్పటికి మారతానో తెలియదు.. తెలిసి చెయ్యని వాడిని ఏమి చెయ్యలేము కదా :(.. ఈ ఏడాది లాగే ఈ కోపం కూడా ఆఖరిది అవుతుంది అని మనస్పూర్తిగా అనుకుంటున్నాను.

Day 364 ~ Dec 30 - Ananta Giri Waterfall

the kid looks back at the very thin stream flowing down the rocks...

అరకు  నించి తిరిగి వచ్చే దారిలో అనంత గిరి దెగ్గర ఏదో జలపాతం ఉంది అంటే పోలో అనుకుంటూ ఎల్లిపోయాం కాని ఆ దారిలో పడ్డాక చుక్కలు కనిపించాయి, సన్నటి దారి, ఎత్తులు పల్లాలు, ఇంకో బండి ఎదురొస్తే ఏంట్రా బాబు పరిస్తితి, ఇద్దరం ఊరుకోకుండా చిచ్కూగాడు ఉన్నప్పుడు ఈ సాహసాలు ఏంటి అని అమ్మ నా బూట్లు తిట్టేసుకుసుని, ఎలాగోలా అక్కడ చేరి పడ్డాము కాని తీరా అక్కడ పెద్దగా ఏమి లేదు.. నీరు చాల చాల తగ్గిపోయింది.

Day 363 ~ Dec 29 - The Borra Climb

a view from level-2 stairs to get into the caves.

నేను మామూలుగా దూరాలు నడవడం మానేసి బోలెడు రోజులు అయ్యింది, అలాంటిది ఈ గుహలు దిగటం, ఎల్లి చూడటం అంటే బాబోయ్... నిక్కుతూ నీలుగుతూ అయ్యో కుయ్యో గొయ్యో అనుకుంటూ కొన్ని మెట్లు దిగి నడిచి, కొంచెం తొంగి చూసి వచ్చాను.. చిచ్కూ గాడు కూడా తనే అన్ని మెట్లూ దిగి వెళ్ళింది, పాపం తిరిగి వెళ్ళాక ఒళ్ళు తెలియకుండా పడి పడుకుండి పోయింది.

PS - Archived pic

Day 362 ~ Dec 28 - Kadiyam Halt

 The rose and chrysanthemum flower beds..

కడియం నర్సరీ అంటే నాకు పెద్దగా తెలిసింది చిచ్కూ గాడి హాస్పిటల్ లోన.. డాక్టర్ గారికి కూడా నాకు మల్లె కొంచెం ఆహా బోలెడంత మొక్కల పిచ్చి.. తరవాత ఈనాడులో ఒక ఆర్టికల్ చూసినాక నేను ఎప్పుడు ఎల్తానా అక్కడికి అనిపించింది.. మొన్న ట్రిప్లో అక్కడ ఆగి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను... ఇంకా చాల సేపు అక్కడ ఉండిపోవాలి, ఎంతో తెలుసుకోవాలి అనిపించినా కూడా హడావుడిగా తిరిగి వచ్చేసాం. :(.

various crotons and creepers...

Day 361 ~ Dec 27 - Breathtakingly beautiful...

An awesome view from Titanic View Point at Kailash Giri in Vizag

సుబ్బరంగా కాసేపు బీచ్లో ఆడుకుని, పాలు, టీ, జావ ముగ్గురం ఎవరికీ కావలిసింది వాళ్ళు తాగేసి, అలా కైలాస గిరి కొండ  మీద తిరిగి వచ్చాం, అక్కడి నించి బీచ్ చూస్తుంటే, అలాగే అక్కడో ఒక ఇల్లు కట్టేసుకుని ఉండిపోతే చాలు అనిపించింది.

PS - Archived Pic

Day 360 ~ Dec 26 - Raagi Majjiga Jaava


Street vendor near RK Beach... everything ranging from tulasi tea to raagi malt, healthy and affordable after a refreshing sea-side pleasure

బీచ్లో కాసేపు ఆదుకుని కూర్చుని వచ్చినాక తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఈ బుల్లి టీ బడ్డీ లాంటిది కనిపిస్తే ఆగాము అక్కడ కనిపించిన రక రకాల ఐటేమ్స్ చూసి భలే ముచ్చటేసింది, ఎంచక్కా ఆరు రూపాయలకి రాగి జావ అంటే ఇంకా ఇంకా నచ్చేసిన్దోచ్.

A glass of millet and buttermilk shake with a tinge of lemon... not exactly what you would call yum... but health-wise Superb!!

PS:  Archived pic