Monday, November 29, 2010

November 30 - Rock Star

The rock star checks her mobile
ఎక్కడో బొమ్మల తవ్వకాలలో బయటపడిన గిటార్ తీసుకుని ఇవ్వాళ పొద్దున్నించి ఇల్లంతా మోత మొగిన్చేస్తున్నాం.. దానికి తోడు అమ్మకూడా rockstar long t -shirt  వేసింది.. ఇంక ఇల్లంతా రగడ :).

November 29 - Pilla Gantulu

Yaasin jumping on to the sun-dried mattresses

మా అమ్మ ఊరేల్తే మేము చేసే మొదటి పని ఇల్లు దులిపి, సర్ది, అన్ని కడిగేసి పెట్టెయ్యడం, తను ఉంటే మమ్మల్ని చెయ్యనివ్వదు, డస్ట్ allergy అని.. సో, పండు గాడిని యాసిన్ ఆడిస్తుంటే, నేను నాగు శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో పడిపోయాం :)...
భలే మంచి ఫోటోలు వచ్చి ఈ గంతులవి.. సాగర సంగమం సినిమాలో భంగిమ టైపు కాదులెండి, మంచివే.. కాని ఇంకా ఫొటోస్ పబ్లిక్ షేర్ కి  పెట్టడం ఇష్టం లేక ఇది పెట్టాను.

November 28 - the pebble assembly

the colored stones for the fish bowl.. washed and cleaned and now used to count and make shapes..

చేపల బౌల్ లో ఉండే colored స్టోన్స్ ఈ మధ్య మా ప్లే objects .. అప్పుడప్పుడు గిరాటేసి మళ్లీ గిన్నెలోకి పోగు చేసుకోవడం, ఒక్కోటి లేక్కపెట్టుకోడం, రంగులు రాళ్ళు వేరు చెయ్యటం.. అన్ని ఒక్కటి, రెండు.. మళ్లీ ఒక్కటి రెండు.. ఎందుకంటే మాకు అంతవరకే వచ్చు.. ఎన్ని ఉన్న అవి బోల్డు.. ఒకోటి, నొన్ను, బోలు.. :)..  మధ్య మధ్యలో మూడ్ ఉంటే అమ్మతో సియ రాయిన్చుకుంటాం :)... మొత్తం మీద ఇవి తినేవి కాదు అని అమ్మకి పది సార్లు చెప్పి, నోట్లో పెట్టుకోను అని నమ్మించడానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది.

PS:  The photo is an intentional blur with soft focus just on the kid's name.

November 27 - the morning mess

the mess we leave in the morning hours..

clay, crayons, puzzles, blocks, stacks, pens.. ఇది అని లేకుండా ఏది దొరికితే అది పీకి పడేస్తాం పొద్దున్నే ;).

November 26 - idemi chettu?

branches of the two plants, flower and fruit got mixed up so badly that you cant really figure out which yields what :).

నూరువరహాలు పూలు అంటే నాకు చాలా ఇష్టం, గుత్తులు గుత్తులుగా పూస్తూ, భలే ముచ్చటగా ఉంటాయి.. సీతాఫలం అంటే నాకు ఇష్టమైన పండు.. ఈ రెండు చెట్లు కలిసిపోయి అక్కడక్కడ పండ్లు, అక్కడక్కడ పూలు చూడటానికి భలే ఉంటాయి.

Wednesday, November 24, 2010

November 25 - Tailor shop

The local tailor shop..

dont go by the looks.. if given proper directions, they stitch the model you give to perfection at a throwaway price.

ఊర్లో బట్టలు కుట్టే కొట్టు.. పేరు కూడ భలేగా ఉంటుంది.. ప్లేబాయ్ టైలర్స్ :).. చూడటానికి ఇలా ఉన్నా ఆ దర్జీకి భలే మంచి పనితనం ఉంది.. ఏది ఎలా చెప్తే అలా చాలా బాగా కుట్టి ఇంటికి తెచ్చి మరీ ఇచ్చి వెళ్తాడు..

PS:  the photos in the dimly lit areas are a blur.. flash settings are not working in the camera, so the blurred pictures.. need to buy a new one after some biiig budgeting.

November 24 - Grandhaalayam

The dailies, weekly and monthlies on the library reading table

కాలు నొప్పి కొంచెం తగ్గితే మనం ఇంట్లో ఎందుకు ఉంటాం... నిదానంగా ఈడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ.. అడుగులో అడుగు వేసుకుని చిచ్కూ గాడి సైకిల్ ఆసరాగా పట్టుకుని ఆచ్చికి లైబ్రరీ కి వెళ్లాం.. కాసేపు అక్కడ అన్ని చెక్ చేసి.. అన్ని బాగున్నాయ్ అని తేల్చుకున్నాక కొన్ని పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని తిరిగి ఈసురో మంటూ ఇంటికి చేరాను.. చిచ్కూ గాడికి మాత్రం పండగే.. చాలా రోజుల తరవాత బయటికి వెళ్ళడం.

the golden oldies reading the newspaper in the library sit-out area.

November 23 - Cute Ganesha - పసిడి జ్ఞాపకం

Cute little Ganesha statue at a house which faces the main road

ఇంటికి రోడ్డు శూల ఉంటే వినాయకుడి బొమ్మ పెట్టాలి అంటారు... ఇంత అందంగా అద్దాల గూట్లో పెట్టి బుజ్జి వినాయకుడికి రోజు ఒక మామ్మ గారు పూజ చేస్తారు.. నేను ఆ రోడ్డున వెళ్ళినప్పుడల్లా ఎంతో ముచ్చట పడి చూసేది ఆవిడ ఇంటిని.

ఈ వయసులో కూడ ఎంతో ఒపికతోటి ఆ మొక్కలు పెంచడం, ఒక్కరే ఊర్లో ఉంటూ కూడ ఓపికతో ఇల్లంతా అద్దంలా ఉంచుకోవడం.. నేను చిచ్కూగాడు ఆచ్చికి వెళ్ళినప్పుడల్లా అటు వైపు కూర్చోపెట్టుకుని.. ఏదో ఒకటి తినడానికి పెట్టి పంపడం... ఇంక కొన్నాళ్ళకి ఈ ఇల్లు కూడ పాడ్పదిపోతుందేమో అని తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది.

November 22 - Kaartheeka Somavaaram

Meat sellers take a break.. an unusual scene on a Monday.. it happens only in Kartheeka Maasam.

ఎప్పుడు పొద్దున్న సాయంత్రం మాంసం విక్రయాలతోటి బిజీగా ఉండే ఈ కొట్లు.. కార్తీక సోమవారం మూలాన ఖాళీగా ఉన్నాయ్...  ఇది మా ఊరి మాంస విక్రయం జరిగే చోటు.. రోడ్డు వారన ఒక పక్కన ఎప్పుడు సందడిగా ఉండే చోటు.

November 21 - Oobakaayam... waaaaaaaaaaaaaaaahhhhh...

Final resort.. yoga for obesity :((

ఊబకాయం వినటానికి అస్సలు బాగోలేదు... :(( అది నాకు అంటే అసలు అస్సలు నమ్మలేకపోతున్నాను... అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది కాని ఒక డాక్టర్ చెప్పడం.. ఫ్రాక్చర్ మూలాన బరువు తగ్గమనడం... అన్ని కలిపి నేను ఎప్పుడు ఒక్కసారి కూడ చూడని రాం దేవ్ బాబా యోగ కూర్చుని చేసే లాగ చేసాయి :(((...

Friday, November 19, 2010

November 20 - Ganji

Starching and sun drying cotton dresses after a long time.

ఎండలు లేక.. ఉన్నా వెంటనే వానలు పడిపోయి, నానా బీబత్సం అయిపోయి ఎప్పటినించో పేరుకు పోయిన గంజి పెట్టాల్సిన బట్టల గుట్టకి ఈ రోజు మోక్షం...

November 19 - jelly balls

jelly balls... made in china.. the latest fad

చిన్న చిన్న రంగు పూసల్లా ఉన్న వాటిని నీళ్ళల్లో పోస్తే ఇలా జెల్లీ బాల్స్ లాగ తయారు అయిపోతాయ్.. మళ్లీ నీళ్ళు తగ్గిపోగానే మామూలు పూసలు అయిపోతాయి.. బళ్ళో పిల్లలు అందరు కొంటుంటే నేను కూడ కోని turtie బౌల్లో వేసాను.   చిచ్కూ గాడు మింగకుండా.. ఎక్కడో ఎత్తున పెట్టాల్సి వస్తోంది.... అమ్మ బాల్ అని రోజు అడిగి అడిగి అలిసిపోతుంది పాపం.

November 18 - Clay Moulds

playing with the play dough shapes

క్లే డో తోటి చేసిన బొమ్మలతోటి ఆడుకుంటున్న చిచ్కూ... ఆఖరికి ఇప్పుడు ఏమి తినకుండా నోట్లో పెట్టుకోకుండా నేర్చుకుంటుంది.. హమ్మయ్య.

I just wish molding child's future and good habits is as simple as molding clay..cute, sweet, simple and innocent.

Wednesday, November 17, 2010

November 17 - Nirbandham

walker and the bandage.. my buddies for a month!!

సిమెంటు కట్టు కట్టి ఒక మూలాన పడేస్తే నా ప్రాణానికి హాయిగా ఉండేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి.. దానికంటే ఇది బెటర్ రాత్రి పూట తీసేసి పడుకోవచ్చు.. recovery టైం చాలా బాగుంటుంది అది ఇది అది.. అని చెప్పి ఈ crepe కట్టు ఒకటి పొద్దున్నే కట్టేసుకుని.. రాత్రి దాక తియ్యకుండా, అడుగు కింద పెట్టకుండా ఒక నెల ఉండమని ఒక బ్రహ్మ పరీక్షా పెట్టారు నాకు... ఎంత గట్టిగా ఉందీ అంటే ఈ కట్టు పొరపాటున నేను కింద కాలు పెట్టాలన్న పెట్టలేను :(.. 

Tuesday, November 16, 2010

November 16 -- Dantaavadhaanam

a brush for each tooth.. yeah this is how many teeth LO has right now :).. and thank God for that machine brush.

చిచ్కూ గాడికి ఉన్నవి ఆరు పళ్ళు.. బ్రష్ లు ఒక డజను దాక ఉన్నాయి.. అలాగే పేస్టు కూడ.. అమ్మగారు ఏది అని డిసైడ్ చేసుకుంటే మనం దానికి కొంచెం పేస్టు పూసి ఇస్తే గుటుక్కున మింగేసి కాసేపు బ్రష్షు ఆడించి నోట్లో ఇస్తారు... నాకు మాత్రం ఈ మెషిన్ బ్రష్షు కనిపెట్టినోడికి కోటి దండాలు పెట్టాలి అని ఉంది.. ఎన్ని ఉన్నా మళ్లీ నా వాటి మీదే కన్ను దొంగ గాడికి.

Monday, November 15, 2010

November 15 - Pelli Kooturu

The bride ready to enter the mandap

మండపం ఎక్కబోతున్న పెళ్ళికూతురు

PS:  Had an ankle fracture.. 4 weeks of bedrest... so posting the wedding pictures :(.

November 14 - Kalyaana Tilakam

applying tilakam to the bride

నుదుటన కళ్యాణ తిలకం.

November 13 - Pasupu Paaraani

Traditional application of turmeric and paaraani to the bride's legs

పసుపు పారాణి పెళ్ళికూతురు చేసేటప్పుడు...

Thursday, November 11, 2010

November 12 - Sambarallo bommalu

a woman selling toys and balloons out side the temple and kids just looking at them.
సంబరాలు ఈ రోజు తోటి అయిపోతున్నాయ్... దీపావళి తో మొదలు పెట్టి ఇప్పటిదాకా రోజు పూజలు, ఆటలు , పాటలు అన్ని ఐపోయాయి... ఆ సందడిలో బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, ఐస్ లు, మిఠాయి బడ్డీలు, ఎన్నో పెట్టారు... 

November 11 - pillodu/bobulu

a school kid bringing home colored chicken from school.. we stop him on the way and take the picture :).

పిల్ల బోబులు.. ఒక బడిలో అబ్బాయి వీటిని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తుంటే దార్లో ఆపేసి కాసేపు వాటితో ఆడుకుని ఫోటో తీసి పంపించాం.

Tuesday, November 9, 2010

November 10 - Manchineella Kaavidi -- మంచి నీటి కావిళ్ళు

Carrying drinking water home from the well, 2 at a time.

మంచి నీటి కావిళ్ళు, ఈ రోజుల్లో కూడ ఇంకా జనాలు వీటిని వాడుతున్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు... నా చిన్నప్పుడు తెల్లవారగానే, ఆడవారు పాచి వాకిళ్ళు ఊడవటం, మగవారు మంచి నీరు తెచ్చి పోయడం.. ఆ రోజుల్లో పాలేర్లు ఎక్కువ ఉండేవారు, బుడ్డాళ్ళు అందరూ సరదాగా చెంగు చెంగు మంటూ తెచ్చేసేవారు... ఇప్పుడు అందరు సైకిల్ కి కట్టుకుని జుయ్యి మని తెచ్చి పడేస్తున్నారు... చాలా మందికి ఇంట్లో చెరువు నీళ్ళ పంపులు ఉన్నాయ్, నీళ్ళకి నాంది ఉంది కాబట్టి ఏదో ఒక నలుగురైదుగురు కనపడతారేమో మొత్తం మీద.

Monday, November 8, 2010

November 9 - Kolaatam

A traditional dance-form called Kolaatam done by a group with 2 sticks in hand and anklets to the legs

నాగుల చవితి ఈ రోజు రేపు రెండు రోజులు అంటున్నారు.. మేము, నేను చిచ్కూ గాడు ఇవ్వాళే పోసేసాము.. పాపం చిట్టి కూనకి జ్వరం వచ్చింది... :(.  గుడి దెగ్గర ఈ రోజు ఈ కోలాటం పెట్టారు.. చాలా రోజుల తరవాత చూసాను.. పోయినేడాది వేణు గోపాల స్వామి గుళ్ళో పెట్టారు, కాని అప్పుడు ఆడవారు చేసారు.. ఇప్పుడు అంతా కుర్రాళ్ళు... రెండు పోల్చి చెప్పాలి అంటే చెప్పలేను వారు gracefulగా చేసారు, వీళ్ళు energeticగా  చేసారు.. చిన్న పిల్లలు కూడ చేస్తారు ఒక్కో సారి.. కనుమరుగై పోతున్న ఈ కార్యక్రమాలని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది.. రేపు చిచిక్స్ గాడు వాళ్ళ పిల్లలకి వీడియో లోను ఫోటోలోను  చూపించాలేమో.. పాపం ఇంత జ్వరంలోను అమ్మ డాన్సు అని కాసేపు చూసింది.

November 8 - Kicchu Monkey


LO's favorite toy at Ramayammamma's house which she wants to be placed on top of this indoor plant.

 కిచ్చు మంకి, చిచ్కూ గాడికి చాలా ఇష్టం, దాని తోక లాగి, ఎత్తుకుని తిప్పి కబుర్లు చెప్తుంది.  ఊర్లో ఒక అమ్మమ్మ ఉంటారు వాళ్ళ ఉంట్లో ఉండే ఈ బొమ్మ వీడు వెళ్ళగానే ఈ మొక్క మీద పెట్టించుకుని తోక లాగుతూ దాంతో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటుంది... మా సాయంత్రం వాకింగ్కి వీళ్ళ ఇంటికే వెళ్తాం. పుష్టిగా పెట్టినవి తిని, కాసేపు గంతులేసి, ఇచ్చినవి తెచ్చుకుని ఇంటికొచ్చి మళ్లీ తింటాం :).

Sunday, November 7, 2010

November 7 - Saambraani Pogalu

giving sambrani fume exposure to infant after a rigorous traditional bath ritual.

ఒళ్ళంతా పాల మీగడ రాసి, సున్ని పిండితోటి సుబ్బరంగా నలుగు పెట్టి,  రుద్ది రుద్ది వేడి వేడి నీళ్ళు తలంటి పోసి సాంబ్రాణి వేసి పసిపిల్లల్ని పడుకోబెడితే ఆ వాసన చాలా చాలా ఇష్టం నాకు.. ఊర్లో ఉండటం వలన చిట్టి కూనకి ఏడాది నిండేదాకా రోజు పొద్దున్న పూట ఈ కార్యక్రమం తప్పని సరిగా ఉండేది.. ఎంతో చక్కగా గోల చెయ్యకుండా నీళ్ళు పోయించుకుని ౩ గంటలు అలాగ నిద్రపోయి లేచేది.. ఇప్పుడు స్నానం అంటేనే కేకలు, అరుపులు... నావి కాదు పండు గాడివి, వాడి వెనక పరుగులెత్తే మా అమ్మవి.

When I see this done to the infants I really miss it bad.. the smell, the routine, the peaceful happy content and tired sleeping baby with a divine fragrance in the room... every tiny bit of the whole bathing ritual.

November 6 - Toli Pooja

First pooja for the 11-day long Nagendra Swamy Sambaralu in the village... done by mama and atta

నాగేంద్ర స్వామి ఉత్సవాలు దీపావళి తరవాతి రోజు మొదలయ్యి నాగుల చవితి చేసుకుని మళ్లీ తరవాత ఊరంతా సంతర్పణ చేస్తారు.. బీద గొప్ప అని లేకుండా అందరు వెళ్తారు.. గత ౩ ఏళ్లుగా నేను కూడ వెళ్తున్న... ఈ సారి తొలి పూజ బుడ్డ మామ పద్మ అత్తా చేసారు, నేను చిట్టి కూన వెళ్లి దణ్ణం పెట్టుకుని వచ్చాం.

Friday, November 5, 2010

November 5 - Deepaalu

Cute coconut shaped diyas..

మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె, వత్తులు... అవి పెట్టడానికి కింద పసుపు కుంకుమ వేసిన ఆవు పేడ.. ఇది మాకు సంప్రదాయమైన దీపావళి... ఆ అందం ఆ దీపపు కాంతులు రెండు వేటికవే సాటి.. కాని ఈ బుజ్జి కొబ్బరి కాయ దీపాలు రోడ్డు మీద పెట్టి అమ్ముతుంటే ముచ్చటపడి తెచ్చుకున్నా..
 మట్టి ప్రమిదలు... దేవుడి ముందు వెలిగించి గుమ్మాల దెగ్గర పెట్టడానికి రెడీ.

November 4 - Some flowers


In prep for deepavali for naraka chaturdasi.

అసలీమధ్య ఎక్కడ చూసిన దీపాలు, పువ్వులు, టెర్రకోట లేదంటే ఇత్తడి గిన్నెల నిండా నీళ్ళు, అదిరిపోయే decorationలుచూసి చూసి నాకు కూడ చెయ్యాలనిపించింది.. కాని ఏది చేసిన నా ముద్దుల మూట ఏమి పీకి లాగి పెడుతుందో, నీళ్ళలో వెళ్ళు పెట్టేసి ఆడేస్తుందో అని భయం... పైపెచ్చు అందంగా ముద్దుగా నైస్ గా ఉండేవి మా ఊర్లో ఏమి ఉండవు, సో ఇంట్లో ఉన్న వాటితో దొడ్లో కోసుకొచ్చిన పూలతోటి ముందు ట్రై చేసి ఒక trial వేసాను.. పండు గాదికిదేదో సరదాగానే ఉండి దాని జోలికి వెళ్ళలేదు, సో ఈసారి మంచి మంచివి ట్రై చేసుకోవచ్చు.

November 3 -- Tapaasulu

Sun drying the crackers

మాంచి వానల టైములో  వచ్చిన పండుగ ఈ ఏడాది దీపావళి.  పండు తల్లి కోసం చిచ్చు బుడ్లు, కాకరపూవత్తులు, అవ్వాయి సువ్వయిలు, భూచక్రాలు, మతాబులు, వెన్నముద్దలు.  పేరుకి పండుగాడికి కాని కాల్చింది వాడి ఫ్రెండ్స్ అన్నలు, అక్కలు..


చిన్నప్పుడు ఇలా ఎండపెట్టుకోవడం, ఎవరి వాటా వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం, ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఎదురు చూడటం ఎంతో బాగుండేది.. ఇప్పుడు పండు తల్లికి అవేమి తెలియవు కాని అదొక సంబరం, బాంబులు, బాంబులు, డేంజర్ అని వాటి చుట్టు తిరగటం తప్ప.

November 2 - Dharna for the photos?

local grassroot workers of TDP doing dharna

కారణం లేకుండా, లేదా చిన్న కారణానికి కూడ మేము ఉన్నాం అంటూ రోడ్డు మీద ట్రాఫ్ఫిక్ కాసేపు ఆపేసి ఏపార్టీ వారు ఐతే ఆ opposition పార్టీని నాలుగు తిట్లు తిట్టేసి, నానా రచ్చ చేసి, ఫొటోలకి ఫోసేలిచ్చి మళ్లీ ఎందుకు చేసారు అంటే నాలుగు రోజుల తరవాత బుర్ర గోక్కునే రకాలు కొందరు ఉంటారు.. ఈ ధర్నా చేసిన సగం మందికి ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నాము అనేది ఖచ్చితంగా తెలియదు ... అదీ నా దేశపు దౌర్భాగ్యం.

November 1 -- Yummy Yummy

The yummy yummy panipuri bandi..

పానీపూరి అంటే  నాకు చాలా చాలా ఇష్టం.. నేను ఊర్లో ఉండటం మూలాన నేను బాగా మిస్ అయ్యేది ఇది.  కాని రాను రాను మా ఊరు కూడ పట్నం సోకులు అలవర్చుకుంటుంది.  నీటుగా, శుబ్రంగా మినెరల్ వాటర్ ఎసి చేసిచ్చే వాటికి ఈ రోడ్ మీద చేసే వాటికి అసలు పోలికుండదు.. ఆహ ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ plateలు plateలు లాగించేస్తాను నేను.    ఆ దుమ్ము ధూళి మట్టి మురికి మూలాన వస్తుందేమో అంట రుచి అని ఎంత మంది ఎక్కిరించినా అది నాకు ఎక్కదు కాక ఎక్కదు.... ఆ ఫోటోలో ఉండి నేనేనోచ్.. అంత ఒల్లేసుకుని రోడ్డు తిళ్ళు అవసరమా అంటారా... దాని దారి దానిదే నా దారి నాదే.