Friday, September 30, 2011

Day 273 ~ Sep 30 - Buddham Saranam!!

Found this old broken stool in the storage area and tried fixing another Buddha corner at home... in the process, right now just with a base coat of yellow paint!!!

ఇంట్లో వస్తువుల్ని కెలికి చాల రోజులయ్యి కొంచెం చేతులు దురదలు మొదలయ్యాయి ఈ మధ్య, అలా తిరుగుతూ ఉంటె కొట్లలో అడుగు ఊడిపోయిన ఈ ఎత్తు పీట దొరికింది, ఇంకా కోతికి కొబ్బరికాయ దొరికినట్లే.. ప్రస్తుతానికి ఇలా ఉంది, తరవాత దీని మీద లతలు తీగలు వెయ్యాలని ఉంది మరి చూడాలి ఆఖరికి ఎలాంటి అవతారం ఎత్తుతుందో.

Day 272 ~ Sep 29 - Gorinta Kaayalu

the tiny fruits on the henna  leaf plant..

నేను గోరింటాకు చెట్టు ఎప్పుడు చాల చిన్నదిగా ఉన్నప్పుడే చూసాను, ఎప్పటికప్పుడు అడివేసిపోకుండా అమ్మమ్మ కొమ్మలు కత్తిరిస్తూ ఉండేది.  తను పోయాక ఆ చెట్టు కూడా కొట్టేసారు... ఎదురింట్లో ఒక గోరింటాకు చెట్టు ఉంది, ఆ ఇంట్లో ఉంటె రాణి ఆంటీ పోయినేడాది కాన్సెర్ వచ్చి పోయారు, చూసే వాళ్ళు లేక ఆ చెట్టు ఇలా పెద్దగా పెరిగిపోయి కాయలు కూడా కాసేస్తుంది :(.


Day 271 ~ Sep 28 - Navaratrula Mandapam

The local temple readied for Navaratri poojas with a mandap made out of coconut and plantain branches.

ఇంటి వెనకాల యాదవుల రామాలయంలో నవరాత్రులు సంబరంలాగా చేస్తారు... దాని కోసం పిల్లలందరూ చందాలు పోగు చేసి ఆటలు పాటలు రాత్రి భజనలు చేస్తూ ఉంటారు.   ఈ తొమ్మిది రోజులు మోత మోగిపోతుంది :(.. కాని తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమా పాటలు చెత్త చెదారం చెవులు చిల్లులు పడేటట్లు పెట్టకుండా కాస్త గట్టిగానే చెప్పాను, మరి చూడాలి... ఈ మధ్య పండగ అంటే చాలు ఈ గోలకి భయమేసేస్తుంది.

Day 270 ~ Sep 27 - Peerla Jandaalu

the flags placed in the place assigned for the mosque in village...

ఊర్లో సాయిబ్బులు ఏదైనా మొక్కుకుంటే పీర్ల పండగ చేసుకుంటారు, ఊరేగుంపుగా వెళ్లి ఈ జెండాలను తిప్పి తీసుకొచ్చి పాతేస్తారు.. ఆ ఊరేగింపులో దప్పులన్నా పంచి పెట్టె ప్రసాదం అన్నా నాకు చాల చాల ఇష్టం.

Day 269 ~ Sep 26 - Magnets!

Fridge magnets, had quite a few of them back in Atlanta and a few of them made it all the way back joining the kid's pic on the cupboard!

కుక్క పిల్లల బొమ్మలు నాకు భలే నచ్చేసిన మాగ్నేట్లు, వాటిని చూస్తుంటే బుజ్జి కుక్కపిల్లలాగా వాటిని కొన్న రోజు నేను వేసిన గంతులు గుర్తొస్తున్నాయ్.

Day 268 ~ Sep 25 - Zora maamma Chichkoo Vihaaraalu

the kids go to the Hanuman statue  for a walk, a daily ritual they had formed of late...

చిచ్కూ  గాడికి  ఊరంతా చుట్టాలే, జోరా మామ్మ మా ఇంట్లో పని చేసే అవ్వ, వాడికి తనంటే భలే ఇష్టం, తను ఉన్నంత సేపు తన లాగే వాకిలి ఊడుస్తూ, అంట్లు తోముతుంటే పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ, అంతా అయిపోయాక చక్కగా రోడ్లెంమాట పడి తిరిగొస్తారు కాసేపు.

Day 267 ~ Sep 24 - A Cartonful of Memories

Memories come flooding back from the depths I had thought buried them down under of a life left behind..Finally, the shipment arrives after 4 months and this is my box.

అమెరికా లో నేను వదిలేసి వచ్చిన బట్టలు బుల్లి బుజ్జి సామాన్లు, పుస్తకాలు, అన్నిటికి మించి బోలెడన్ని జ్ఞాపకాలు ఈ అట్ట పెట్టిలో మూటకట్టుకుని ఆఖరికి ఇంటికి చేరాయి.  ఒకప్పుడు మా అమ్మ నా వస్తువులన్నీ ఇచ్చేసింది అని కుయ్యో మొర్రో అని లబ లబ లాదిపోయిన నేనేనా ఈ రోజు వీటిని చూసి అంట వైరాగ్యం వెళ్ళ గక్కుతుంది అనిపించింది.   

Friday, September 23, 2011

Day 266 ~ Sep 23 - Kaluva Haaraalu

garlands made out of the water lilly stalks.

మామిడాకు తోరణాలతో పాటు కట్టిన కలువ పూదండలు నాకు చాల చాల చాలా నచ్చేసాయి.. ఎంతో ఓపికగా కట్టిన పిల్లలని చూస్తె భలే ముచ్చటేసింది... 

Day 265 ~ Sep 22 - View Mirror

The view mirror placed in the flower-pattern wood work on the front door.

ముప్పై ఏళ్ళ క్రితం కట్టిన ఇంటిలో ఇది ఉండటం నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది.. అప్పటికి నేను కనీసం పుట్టలేదు, పల్లెటూర్లో ఇంట నాజూకు పనితనం.. 

Day 264 ~ Sep 21 - Ganesha In the Making

Ganesha idols, the painter gives the final touches a week or so before the festival.

పండగ ముందు ఏదో పని మీద ముదినేపల్లి ఎల్తే అక్కడ బొమ్మలకి రంగులేస్తున్న ఈయన కనిపించాడు, చేతిలో సిగరెట్ పొగ, పైనించి పని.. ఈ మట్టి రూపాన్ని దేవునిగా మలిచేటప్పుడు అయినా  కాస్త ఆగితే బాగుండేమో

If you closely observe there is a cigarette in the hands of the worker.. it struck me as odd considering this very idol would become sacred and this guy wont even dream of doing it before God.

Day 263 ~ Sep 20 - Journey back home

This is one sight that brings in so much of joy to the kid... a common site in the evenings, the kid sees them until they go out of vision periphery.. birds, birds, birds.

సాయంత్రానికి ఇంటికి బయలుదేరే పక్షుల గుంపులు... చూడటానికి భలే ముచ్చటగా ఉంటాయ్... నాకు హమ్మయ్య మనింట్లో చెట్ల మీద వాటి గూళ్ళు లేవు, లేకపోతె ఆ పెంటలు కడగలేక చచ్చేదాన్ని అని సంబరం.. ఛి ఎదవ బతుకు పిట్టలు అని సంతోషించాకుండా వాటి పెంట గోల :(.

Day 262 ~ Sep 19 - Kondanta Devudiki Pisaranta Patri

A vendor selling various fruits and leaves to make up for 21 varieties of patri for Ganesh Pooja.


PS:  Because of the alphabet theme, had not been able to post some pictures, so the next few days will be from archives :).

Day 261 ~ Sep 18 - Kaluva Poolu


Water lillies from the village pond... collected and stored for Ganesha festival

తెల్ల కలువ పూలు కోసుకొచ్చి దేవుడికి దండ చేసి పెడితే భలే అందంగా ఉంటుంది.. ఊరి కాలవలో చాల పూలు ఉంటాయ్, కాని చుట్టూ చాలా బురద, కొయ్యడం కూడా కష్టమే, పండగ కోసం పిల్లలు కోసుకొస్తే నేను నీళ్ళ ట్యాంక్ లో వేసి దాచి ఉంచా.

Friday, September 16, 2011

Day 260 ~ Sep 17 - Z for Zipped

This is the cutest zip that I have ever set my eyes on.... behind my cute little bunny key chain!

ఈ బుల్లి బుజ్జి బన్ని అంటే నాకు చాల చాల చాలా ఇష్టం, నేను ఒంటి పిల్లి రాకాసిలాగా అమెరికాలో అపార్ట్మెంట్ గ్రౌండ్లో తిరిగుతూ ఉండేటప్పుడు ఇది నా తోడుగా ఉండేది.. ఇప్పుడు నా షిప్మెంట్ లో తిరిగి క్షేమంగా నా దెగ్గరకి వచ్చి చేరింది.

I got this bunny at an Easter sale at Michaels and this was my buddy during all my walks in the gated community in Mt. Vernon back in US :).

With this, I come to the end of Alphabet Theme pictures in this blog.. It was fun, challenging because it would have been easy if it had to be random posting but with a theme and to be able to associate an alphabet to life every day is not as it seems and like Usha says, after I am through with the alphabet, a lot more ideas pop up suddenly.

I would love to do one with Telugu alphabets some time, completely related to the village backdrop, exclusively.. maybe I will some time :).

Thursday, September 15, 2011

Day 259 ~ Sep 16 - Y for Yellow Blooms

Lovely yellow blossoms that take my breath away in the early morning hours... that lovely combination of colors, yellow and green in an orange, white and blue backdrop of the early morning sky... heaven!

గుత్తులు గుత్తులుగా ఉండే ఈ పచ్చ గన్నేరు పూలు అంటే నాకు చాల ఇష్టం...

Wednesday, September 14, 2011

Day 258 ~ Sep 15 - X for Xylo'fun'.. :)

This is how kid entertains herself and me with her one-man..err.. one-girl music band!.. a beat here and a beat there..

చిచ్కూ గాడి సంగీత ప్రావీణ్యం, దాంతో నా మీద ప్రయోగాలు :).

Tuesday, September 13, 2011

Day 257 ~ Sep 14 - W for Watch Lover

I was kind of crazy about watches and had a lot of them at one point, crazy, quirky, kiddish, stylish.. anything will do for me :)..

నాకు ఒకప్పుడు వాచీలంటే పిచ్చి, ఏదంటే లేదు అని అడగొద్దు.. అదేంటే, పిచ్చిల్లో ఒకటి అన్నమాట... అన్ని అందరికి ఇచ్చేయ్యటమో, పారేసుకోవదమో అయ్యాక మిగిలినవి ఇవి అన్నమాట... ఆ నల్ల తోలు వాచీ నా పదో తరగతిలో మా అమ్మ ఇచ్చింది.. HMT వాచీ.. ఆ గోల్డ్ చైను వాచీ నా పెళ్ళికి ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్టు.. ఈ బెన్ టెన్ వాచీ నచ్చి తెచ్చుకుంది... ఇప్పుడు ఇవి మాత్రం ఉన్నాయ్ :).

Day 256 ~ Sep 13 - V for Variety

Since Mysore Sandal spells out Quality for soaps in our household, we do get some variety to not get bored of the same scent :) and still get the sandal benefit.

సబ్బు అంటే మైసూరు సాన్డిల్ అని మా అమ్మ గట్టి నమ్మకం... నాకు కూడా ఇష్టమే, దానితో వచ్చే ఈ డబ్బా అంటే కూడా ఇష్టమే.. సబ్బులు వాడేసాక పోపుల పెట్టేలాగా కూడా వాడుకోవచ్చు.. అమెరికాలో నేను అదే వాడేదాన్ని :).

Day 255 ~ Sep 12 - U for Under Covers

This is a very bad habit of mine, keeping change when I  find a cover or a sheet covering something, under the mattress, under table cloth, under tv covers... everywhere and anywhere..!! sigh

నేను చిల్లర ఖర్చు పెట్టను ఎక్కువ, అంతా కలిపి ఒక చోట పోగేసి ఒక గిన్నెలో పడేస్తాను బ్యాగ్ బరువు ఐనప్పుడు.. ఒక్కోసారి ఏ గుడి దెగ్గర కూర్చుని వచ్చావు అని అడిగేంత ఉంటుంది నా దెగ్గర :).

and a quirk to go with it is.. I dont usually spend the change.. if there is a note, it goes first all the change goes into the bag, bowl or any place like this!!!


Day 254 ~ Sep 11 - T for Twinkle Stars...

The radium glow stars attached on the kid's wardrobe in the bedroom..

చిచ్కూ చిన్నప్పుడు వీటిని టింకు టారులు అనేది... కాసేపు లైట్ వేసి పడుకునే ముందు తీసేస్తే ఎంచక్కా టింకు టార్లు చూసుకుంటూ తోరీస్ చెప్పుకుంటూ పడుకోవచ్చు!

Day 253 ~ Sep 10 - S for Shells

picked up the shells from the beach visit and the brown speckled ones are the "gavvalu"or the Indian dice to play traditional games.

గవ్వలు అష్టా చెమ్మ, పరమ పద సోపాన పటము లాంటి ఆటలు ఆడుకోడానికి వాడే వాళ్లము చిన్నప్పుడు.... ఇందులో చిన్ని గవ్వలు నేను అమ్మమ్మ ఆడుకునే వాళ్ళం, జ్ఞాపకంగా దాచుకున్నా.

Friday, September 9, 2011

Day 252 ~ Sep 9 - R for Roses

These beautiful roses are from our garden.. they fill us with so much of happiness within their short lifespan, exemplary.

మా కుండీలలో ఈ రోజు పూసిన పూలు :).

These are also a virtual gift to Vicky Pandu whose 2nd birthday happens to be today and for Sreya who turns 2-1/2 today :).. for lil akka and lil tammu :).

Day 251 ~ Sep 8 - Q for Queued Up

If you are wondering what those tiny animals, insects and sea creatures doing all lined up.. the kid says they are in a queue to board the train you see in the far corner above the rangoli :).

చికు చుకు రైలు వస్తుంది అని కూతలు పెట్టుకుంటూ పాడుకుంటూ తిరుగుతుంది చిచ్కూ ఈ మధ్య, ఈ అనిమల్స్ అన్ని రైలు ఎక్కడానికి క్యు లో నున్చున్నాయ్ :).

Day 250 ~ Sep 7 - P for Pigtails

Love the kids in pigtails, wonder why they are called so :).. time to learn more hairdos :).

చిచ్కూ గాడికి ఎప్పుడు చూసినా అంట కత్తెర ఉండేది చాల రోజులు, ఈ మధ్య అలా వదిలేసాం, ఇప్పుడు మెల్లిగా రెండు పాయలు అల్లెన్త అయ్యింది.. జడలు ముద్దుగానే ఉన్న, అవి వేయించుకోకుండా గంతులు వేసే పిల్లలకి అవి అనవసరమేమో, మన ముచ్చతేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి.

Tuesday, September 6, 2011

Day 249 ~ Sep 6 - O for Outdated

Good old way of listening to songs on the tape recorder, the cassettes, listening to movies on the tape, nostalgic!

టేప్ రికార్డర్ లో పాటలు, సినిమాలు వినడం, చిన్నప్పుడు టీవిలో మ్యూజిక్ చానల్స్ రానప్పటి మాట, మా అమ్మ తెచ్చిన షోలే dialogues cassette ఇంకా చాల మూవీస్  విని విని బట్టీ పట్టేసిన బాపతు జ్ఞాపకం, క్యాసెట్ stuck
ఐపోతే పెంసిలో పెన్నో పెట్టి తిప్పి రీలు లాగడం... అన్నీ జ్ఞాపకాలు మాత్రమె, ఇప్పుడు mp3, deck, ipod ఇవన్ని వచ్చేసాక అవి మరుగున పడిపోయాయి.  రేడియో కూడా ఏదో FM కోసం వాడటం మినహా ఎప్పుడో అతకేక్కిపోఎది.

Day 248 ~ Sep 5 - N for Noise PollutionMike facing our home near the local Ganesh Pandal!  Festivals in India bring along a lot of noise along with celebrations... the songs from the mike set all through the day... God!!!

పండగ వస్తే సంతోషం, అది అప్పుడే అయిపోయిందా అని బాధ ఉండడం మామూలే, కాని వినాయక చవితికి దసరాకి ఈ మధ్య నాకు ఎప్పుడు వెల్లిపోతుందా అని బెంగ పట్టేసుకుంటుంది.. మైకు సెట్టు ఒకటి అద్దెకి తెచ్చి, ఊర్లో ఉండే బేవార్సు కుర్రకారు పాటలు మోత మోగించుకుంటూ, చెవులు చిల్లు పడేలాగా చెయ్యటం.. ఇది ఒక ఎత్తైతే సాయంకాలానికి ఆ సందులోని చిన్న పిల్లలందరూ పోగయ్యి పాడే సినిమా బాణీల భక్తీ పాటలు.. చెవుల్లోంచి నెత్తురు కారిపోతుందేమో అనేంత దారుణంగా పిచ్చి కేకల్లాంటి ఆ గానాలాపన విని గుండె నొప్పి వచ్చేస్తుంది నాకైతే.. నాయనో.. విగ్ననాయక వినాయక, గణ నాయక వినాయక అంటూ పండగ కోసం ఎదురు చూసే నేను విసిగించే వినాయక అని వాళ్ళ మైకు సెట్టు పాడైపోవాలని కోరుకున్తున్ననంటే ఏ రేంజ్ లో ఉందొ గోల అర్థం చేసుకోవాలి :(.  భక్తీ మొత్తం పోయి విరక్తి మాత్రం మిగిలింది.

ఊర్లో మొత్తం నాలుగు విగ్రహాలు పెడితే ఒకరు మాత్రం ఐదో రోజు తీసేశారు, నాలుగు వైపుల్లోంచి ఒకటి తగ్గింది అని నేను సంబరం చేసుకున్నాను.

Bye Ganesha, love you loads!

Saturday, September 3, 2011

Day 247 ~ Sep 4 - M For Movies

The latest to watch dvds from British Library... I don't quite like their collection and their platinum membership which is a gift to me, I think, is actually a waste considering the options available and my tastes and preferences :(.

సినిమా పిచ్చికి పరాకాష్ట నేను అనుకుంటా, ఎలాంటి సినిమా అయినా ఓపికగా సాంతం చూసి తరించే టైపు. :).  ప్రస్తుతం నేను చూడబోయే సినిమాలు ఇవే..

PS:  Currently exploring British authors and movies courtesy forced membership :).

Day 246 ~ Sep 3 - L For Library System


Wherever I go, there is a library to keep me company... AFP, by far is the best library system that I have seen and used.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నా తోడుగా ఉన్న నా నేస్తాలు పుస్తకాలు, అక్కడ కొంచెం సర్డుకోగానే నేను వెతుక్కునేది ముందుగా అక్కడ ఉండే లైబ్రరీ కోసం.  ఊర్లో గ్రంధాలయంలో ఇలాంటి కార్డు ఇవ్వరు కాని పుస్తకంలో రాసి తెచ్చుకోవడమే.

Day 245 ~ Sep 2 - K For Kissed

An archived picture from the beach... the sloppiest, most loveliest and best kissers are the kids!

అలా పరుగెత్తుకుంటూ వచ్చి ఎలాంటి కారణం లేకుండా నే అమ్మ అంటే నాకు ఇట్టం అని ముద్దుపెట్టుకుని మళ్ళీ ఏమి పట్టనట్టు వాళ్ళ ఆటల లోకంలోకి వెళ్ళిపోతూ మనని ఇంకో లోకానికి తీసుకుని వెళ్ళిపోతారు పసి పిల్లలు.. సృష్టిలో అన్నిటికంటే తియ్యనిది ఒక పసి బిడ్డ ముద్దేనేమో, ఎంత చింపిరిగా ఉన్నా వాళ్ళలో అందం ఎవరికీ రాదు.

Day 244 ~ Sep 1 - J For Jasmine and Jai Maala

Another one from Jasmine family, virajaajulu, delicacy and fragrance.....

పండగ అంటే ఇల్లంతా పూల వాసన.. రకరకాలు రంగు రంగులు... ఈ వినాయక చవితికి మా గుమ్మం :).

A marigold garland adorning the doorstep, festivities all over the home.


Thursday, September 1, 2011

Day 243 ~ August 31 - I for Id Special Dinner

a makeshift dining area in the front yard with a delicious Id special carriage meals from Yasin's home.. yum!

రంజాన్ నెల వచ్చిందంటే పండగ మా అందరికి చిన్నప్పటి నించి హాలీం, సేమియాలు.. కాని ఈ ఊర్లో మటుకు యాసిన్ తెచ్చే ఇంటి దెగ్గర వండిన పలావు :).