Monday, January 31, 2011

February 1 - Fruit Snacking

A bowl of fruit for mid meal snacking..

స్వీట్స్ మానేసినాక అప్పుడప్పుడు నాలిక పీకేస్తుంది కాని పొట్టలో ఏదోకటి పడెయ్యడం మాత్రం మానట్లేదు...

January 31 -- Kotta Pustakaalu

The fresh print scent of new books... aaaaaaaaaaaaaaaha :)... first ever online shopping in India.

పుస్తకాలు కొనడం, చదవడం దాచుకోవడం ఎంత బాగుంటుందో నాకు.. చాలా ఏళ్ళ తరవాత మళ్ళీ నేను నాకోసం కొన్నాను అంటే చాలా సంతోషంగా ఉంది.. జీవితం ఒక గాడిలో పడుతున్నట్టుగా ఉంది.

January 30 - Replacements


New headset and mouse, thanks to Chichkoo... she is way too happy with my discarded ones.

ఎత్తి గిరాటేయడం అనేది ఇంకా చిచ్కూ గారికి రాలేదు కాని అటు ఇటు తీసుకుని పరుగులు పెట్టేటప్పుడు దేనికైనా తగిలి వస్తువులు ఈ మధ్య బాగానే పాడవుతున్నాయ్.. నెల నించి పని చెయ్యకపోయే పాటికి తెలియలేదు, మొన్న చూస్తె headset సౌండ్ లేదు, desktop mouse ఫట్ కొట్టింది, ఇంక మేము ఆచ్చి కి వెళ్లి తెచ్చుకున్నాము.          

January 29 - Ayurvedam to aarogyam

my rack now has a place for these fitness stuff from Chintaluru Ayurvedic store...

అల్లోపతి మందులు మింగి మింగి.. ఒళ్ళు గుల్ల ఐపోయింది, ఆ సైడ్ ఎఫ్ఫెక్టు అది ఇది అని... ఇప్పుడు కొంచెం ఒళ్ళు తగ్గించే కార్యక్రమం మీద పడ్డాను కాబట్టి, సంపూర్ణ ఆరోగ్యం మీద ధ్యాస పెట్టి వీటి మీద పడిపోయాను అన్నమాట... త్రిఫల చూర్ణం, కలబంద రసము, లవణ తైలము అవేవో గుగ్గులు , పండు గాడికి కూడా ఏదో లేహ్యం ఇచ్చారు immunity కోసం... దేవుడి డియ వల్ల ఇంకోసారి ఆ అల్లోపతి మందులు మింగే అవసరం రాకుండా ఉంటే బాగుండు.

Sunday, January 30, 2011

January 28 - Racchabanda

The village officials and workers at the Racchabanda program.

మూడు ఏళ్ళ నించి బాబు నా మొహాన ఒక రేషను కార్డో , వోటరు కార్డో ఇదొక ఫోటో కార్డు తగలబెట్టండి అని బ్రతిమాలి, అర్జీలు మీద అర్జీలు పెట్టుకున్నా సరే ఏమి ప్రయోజనం లేదు... తెల్ల కార్డు కావాలంటే లంచం పెట్టాలి అంటారు, అది నాకు వద్దు మొర్రో గులాబి కార్డు ఒకటి ఇవ్వండి నేను కూడా జనాభా లెక్కల్లో ఉన్నాను అని గోల గోల కనిపించిన ప్రతి అధికారి దెగ్గర పెట్టాను, తీసుకున్నన్ని సార్లు అర్జీ కూడా ఇచ్చాను.. ఈ రచ్చబండలో ఏమి జరుగుతుందో చూడాలి మరి.

FINALLY, after 2 yrs, in fact for the first time in my life I am a registered voter...

ఊర్లో జరిగే అన్ని కార్యక్రమాలకి నేను వెళ్లి రావడం మామూలే, అందరికి ఎప్పుడు కనపడుతూనే ఉంటాను, ఇంటి ఎదురుగానే మా గ్రామ చావడి, కచేరి సావిడి (రెవిన్యూ ఆఫీసు) ఉన్నాయి.. రోజు చూసే నా దెగ్గర కూడా residence proof కోసం లంచం అడిగే ఘనుడు VRO .. అరపైసా కూడా ఇవ్వను అని నేను మొండికేసి కూర్చున్నా,  వచ్చినప్పుడు నేను పెట్టిన  అర్జీ మొన్న జూలై దాక కదలలేదు, ౩ సార్లు 2008 నించి తిరుగుతుంటే మొన్న 26th కి కార్డు ఇష్యూ అయ్యింది.. వచ్చింది అని ఊపిరి తీసుకోవాలో, ఫోటో తప్ప మిగతా ఎ ఒక్కటి కర్రెక్టు కాదు అని ఏడవాలో అర్థం అవ్వట్లేదు. 

Wednesday, January 26, 2011

January 27 - Cleaning Up..

Cleared one side of the kid's closet... lot more to do
నెల రోజుల నించి సర్దకుండా ఉండిపోయిన చిచ్కూ గారి రోజువారి  అలమారాకి ఇవ్వాళ మోక్షం.. ఇంక అద్దాలు అవి తుడవాలి.. ఆ పనికి ఇంకో పది రోజులు ఆగాలి, పీట ఏసుకుని ఎక్కి తుడిచేదాకా ఆ మరకలు ఇంక భరించక తప్పదు :(.

January 26 - Tiny Bakes..

Traditional Indian oven-baked stove-top cake..the ring shaped round with a hole... yum!!

పండు తల్లి కోసం అప్పుడెప్పుడో cooker కేకు చేసిన నేను మళ్లీ పాతకాలపు ఓవెన్లో కేకు చెయ్యాలని చూసాను... బాగానే వచ్చింది, రెండు నిమిషాల్లో మొత్తం ఐపోయింది కూడా, పిల్లలందరూ తిన్నారు, పండు తప్ప.. చిచ్కూ గారికి షాప్లో కేకా (కేకు) మాత్రమే కావాలంట మరి.

Tuesday, January 25, 2011

January 25 - Lemon, honey..

A glassful of warm water with lemon and honey is what I take first thing in the morning these days...

బరువు తగ్గుతుంది అంటే ఏదైనా చేసెయ్యడానికి రెడీ అయి పోతున్నా ఈ మధ్య.. పొద్దున్నే లేగవగానే ఒక గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో ఒక అర చెక్క నిమ్మ కాయ రసం, రెండు స్పూన్లు తేనె వేసుకుని పరగడుపున తాగి ఒక గంట తరవాత ఏదైనా తినాలి.. పెద్ద తేడా ఏమి లేదు కాని అలవాటు మాత్రం ఐపోయింది.  బరువు కోసం కాదు కాని ఆరోగ్యానికి జీర్ణ క్రియకి మంచింది అని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను.

by the way.. the long spoon in this pic is called Amitabh Bacchan spoon, no I am not kidding, that is how the shopkeeper called it..

Sunday, January 23, 2011

January 24 - Finally

Finally, getting down to some serious prep after long..

ఏదో చించేయ్యాలి, పొడిచేయ్యాలి అని అనుకుంటూ ఉండటంలోనే ముప్పావు active జీవితం గడిచిపోయింది.. ఎప్పుడు ఏదో వంక చెప్పి ఒక మూలన పడేసిన చదువు ఇప్పుడు మళ్లీ తిరిగి మొదలు పెట్టడం బాగుంది.  Uma లాంటి వాళ్ళతోటి ఒక్కసారి మాట్లాడితే చాలు ఎన్నో రెట్లు ఉత్సాహం వస్తుంది.. ఎంతో నేర్చుకోవాలి తనని చూసి 

January 23 - Pulse Polio

We take part in the drive this time too.. Polio, the word that takes my everything to be what I am.. what scares me the most..

నన్ను వణికించే ఒక టీకా ఈ పోలియో చుక్కలు... అసలు మొదటి సారి తనకి ఆ చుక్కలు వేసిన రోజు నా ఏడుపు ఇంతా అంతా కాదు, ఇప్పుడు అలవాటు ఐపోయింది

January 22 - Playlists..

Sorted the mp3 songs to Hindi and Telugu and copied them to a different hard disk too based on our favorite playlists.. the most tedious thing I have done in the recent past..

అబ్బో ఎప్పటికప్పుడు చేసుకోకపోతే ఈ సార్టింగ్ అంత కష్టమైనా పని ఇంకోటి లేదు... ఈ రెస్ట్ పుణ్యమా అని అన్ని నిదానంగా చేసేస్తున్నాను.

good to get back to the music in life.. it is amazing to go through that tide of divinity.. back to my long lost love..

January 21 - The Whirlwind Trip

Finally, we get to see the thesis that gave the kid the much deserved title of Dr. VVV.

Living out of the suitcase, it has been for the past 10 days..

నేను, అమ్మ వెళ్ళలేము అని తను మధ్యలో ఊరు కూడా వచ్చి వెళ్ళాల్సి వచ్చింది.. మొత్తం మీద కాళ్ళకి, పెట్టెలకి కూడా చక్రాలు కట్టుకుని తిరగడం ఐపోయింది తనకి..  ఎన్నో ఏళ్ళు అందరు ముఖ్యంగా నేను కళ్ళు కాయలు కాచేలాగ ఎదురు చూసిన డిగ్రీ చేతికి వచ్చింది..

Wednesday, January 19, 2011

January 20 - Shelling peas

Ammamma's little helper shelling peas, tear them open in two halves and throw them on each side simple!!

చిచ్కూకి చిక్కుడు కాయలు ఒలవడం అంటే చాలా ఇష్టం, ఎంచక్కా మధ్యకి విడదీసి అటోటి, ఇటోటి గిరాతేస్తుంది.. ఒక్కటి కూడా మిగల్చదు.. తరవాత అవి ఏరుకుని కడుక్కోడం ఒక పెద్ద పని కాని అబ్బో అబ్బో అని మురిసి ముక్కలు అయిపోవడం అమ్మమ్మ గారి వంతు.   

January 19 - Kuchipudi Kalakshetram


kid praying in one of the class rooms at Kuchipudi Siddhendra Yogi Kalakshetra..

ఆఖరికి ఇన్ని ఏళ్ళకి నేను మా ఊరికి దగ్గర లోఉన్న కూచిపూడికి వెళ్ళగలిగాను.. ఆ రోజు కాలేజికి సెలవు కాని అక్కడ ఒక గురువు గారు కనిపించారు.. రోజు ఖమ్మం నించి వచ్చిపోయే శిష్యురాలు కూడాను... చిచ్కూకి కూడా తను చేసే ఎలాంటి పనిలో ఐన అంతే ఏకాగ్రత కుదరాలి అని కోరుకుంటున్నాను... ఆ వాతావరణంలో ఒక ప్రశాంతత ఉంది, ఇక్కడ నేర్చుకోగలగడం నిజంగా అదృష్టమేమో అనిపించింది... కాని పండు తల్లికి ముందు నచ్చాలి కదా...

January 18 - On the Walls

Yet another visit to the Angaluru Baba Temple..
 ఎన్ని సార్లు వెళ్ళినా ఏంటో ప్రసాంతంగా అనిపించే గుడి అంగలూరు సాయి బాబా గుడి.. ఎక్కడ గోడల మీద రాతలు ఉండవు, అన్ని ఎంచక్కా ఫ్రేము కట్టించి ఉంటాయి, ఎంతో ముచ్చటగా.


Monday, January 17, 2011

January 17 - Kallu Taata

Man with freshly taken toddy from the palm tree..

చాలా రోజుల తరవాత పొలాల వైపుకి వెళ్ళాం నేను చిచ్కూ పెద్ద రాచకార్యాలు వెలగబెట్టి వచ్చాం.. ఏంటి అనేది కొన్ని రోజులయ్యాక చెప్తాం :).. వచ్చేటప్పుడు  దార్లో ఈ కళ్ళు తాత కనిపించాడు.. పండుగాడికి అతని దెగ్గర కొడవళ్ళు భలే నచ్చాయి.

January 16 - Post Festival Shopping

Went to the doctor and on the way to return something was surprised to find so many people in the early hours after the festival..

పొద్దు పొద్దున్నే ఇంత మంది షాపింగ్కి వచ్చేస్తారు అని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు అది కూడా పండగ ఐపోయినాక..

January 15 - Fruit Shopper

The kid does fruit shopping from her toys :)

తన బుల్లి బుట్టలో ఆకులు కోసి, బొమ్మ పండ్లు వేసుకుని షాపింగ్ చేస్తారు అమ్మాయి గారు.

Friday, January 14, 2011

January 14 - Toy Koluvu..

Chichkoo's friends continue the last year's tradition of putting up a koluvu of the toys the kids plays most with..
This was how it was last year.. this year she graduated from the swing to a booster chair.. time flies!!!!

బొమ్మల కొలువు అందరు పెడతారు మనం కొంచెం వెరైటీ కదా.. పండుగాడి బొమ్మలనే కొలువుగా పెట్టి పోయినేడాది ఉయ్యలేసి దానికింద సోఫా వేసి బొమ్మల మధ్యలో బుల్లి పిల్లకి భోగి పళ్ళు పోసాం.. ఈ ఏడు, నేను చెయ్యలేకపోయినా, చిచ్కూ ఫ్రెండ్ గ్యాంగ్ అంతా కలిసి వాళ్లకి తోచినట్లు వాళ్ళే చిచ్కూకి నచ్చిన బాగా ఎక్కువ ఆడుకునే బొమ్మలన్నీ మెట్ల మీద పేర్చి పెట్టి, అన్ని వాళ్ళే  కొనితెచ్చుకుని ఆఖరికి వాళ్ళే భోగి పళ్ళు కూడా పోసేసి, హంగామా చేసి ఏమి తక్కువ లేకుండా చూసుకుని వెళ్ళారు... ఈసారి వచ్చిన వాళ్ళందరూ కేవలం పండు గాడి ఫ్రెండ్స్, మాకు ఇంట్లో పని సాయం చేసే వాళ్ళు.. వాళ్ళే వాడికి పెద్ద వాళ్ళు.. పిల్లలు దేవుళ్ళు అంటారు కదా, వాళ్ళ దేవెనలు ఉంటే పండుగాడు పండు లాగ ఉంటాడు :)... మీరు కూడా పని లో పని దీవించెయ్యండి!!

January 13 - Bird Buddy

Kid patting a rescued pigeon to sleep :))).

ఎక్కడో పడిపోయిన పావురాయిని చిచ్కూ ఫ్రెండ్స్ పట్టుకొచ్చారు.. దానికి నీళ్ళు పట్టి, దాణా పెట్టి, ఆఖరికి పడుకోపెట్టే ప్రయత్నం :).. కొంచెం సేపటికి అటు ఇటు నడిచి, రెక్కలకి కాస్త బలం పుంజుకున్నాక ఎగిరిపోయింది.

January 12 - Sorted

Finally sorted all the photo and video dvds/cds of the kid and the ones that I play for her.

ఆఖరికి 21 నెలల తరవాత ఓపిక చేసుకుని చిచ్కూ ఫోటోలు, వీడియోలు, ఉన్న DVD/CD అన్ని కాపీ చేసి, వేరే వేరే storage locations కి save చేసి చక్కగా label చేసి  sort చేసి పెట్టేసా.. హమ్మయ్య :).  ఇప్పటినించి ఎప్పటికప్పుడు చేసేస్తే మంచిది అని నేను నేర్చుకున్న గుణపాటం..  పనిలో పని తనకి నేను వేసి చూపించే తెలుగు/ఇంగ్లీష్ rhymes అన్ని కూడా ఒక బుల్లి బుట్టలో పెట్టేసా.. ఇంట్లో సగం చెత్త తగ్గినా ఫీలింగ్ వచ్చింది నాకు :).

Monday, January 10, 2011

January 11 - The Study Hour :)

Finally some sun-time after long.. me and the kid the artists of the page, scribbling hers doodling mine ;)

చిచ్కూ సిప్పర్ పట్టుకుని పుస్తకాలు అని సర్దిపెట్టుకుని ఒక బుక్కు పెన్ను పట్టుకుని పేరు చెప్పి బొమ్మలు గీయించుకుంటుంది.. తల, బొజ్జ, కాలు చెయ్యి, జుట్టు, గుండు అని మళ్లీ దానికి పేరు కూడా రాయాలి.. ఇంక నంబర్స్ బొమ్మలు కూడా వెయ్యాలి.. అన్ని ఐపోయాక అలా పిచ్చి గీతలు గీసి గుడ్ జాబ్ అని చెప్పి మళ్లీ వేరే ఆటలోకి వెళ్ళిపోతారు పిల్ల రాజా వారు.

January 10 - On My Tips

The best place, according to me, to be in the world right now is the world of books... 

Running out of things to take a pic of from the bed, I take this cue from Siri :).

ఎప్పుడు ఏడుస్తూ కుయ్యో మొర్రో మంటూ నొప్పిని తలుచుకునే కంటే.. అన్ని మరిచిపోయి ఏదో లోకాల్లో విహరించడానికి నాకు ఉన్న మార్గాలు రెండు.. చిచ్కూ, పుస్తకాలు... పుస్తకంలో తల దూర్చి.. ఈ ప్రపంచం నించి మరో లోకంలో అలా వెళ్లిపోవచ్చు.. మరో కళల ప్రపంచం, కష్టం, సుఖం, కన్నీళ్ళు, నవ్వులు, నిజాలు, అబద్దాలు అన్ని అందులోనే.. మన ఊహలే మనకి ప్రతిబంధకాలు.... ఇక చిచ్కూ విషయానికొస్తే ఈ ప్రపంచంతో నాకు ఉన్న లింకు :).

Saturday, January 8, 2011

January 9 - Baby Log

Updated Baby Book :)

Sad to see the book get complete, it was a collection of memories from birth to a toddler... happy to see the milestones met, sad to see this chapter come to end in a wink.
చిచ్కూ పుట్టక ముందు నేను కొని అట్టిపెట్టుకున్న పుస్తకం, తీరిక ఉన్నప్పుడు నింపి నింపి.. ఈ రోజుకి పూర్తి ఐపోయింది... ఒక తృప్తి, మళ్లీ ఇదేదీ తిరిగి రాదు అని వెలితి... ఇలాంటి పుస్తకం ఇంకోటి ఎప్పటికైనా కొని నేను చిచ్కూ కలిసి నింపాలి.. తన బిడ్డది కాదు, మేము కలిసి పెంచుకోబోయే, మా జీవితాలలో వెలుగు మరో సారి నింపే మరో బిడ్డది కావాలి అని ఒక పెద్ద కోరిక.. ఒక రకంగా చెప్పాలి అంటే ఒకే ఒక కోరిక :).. రెండు పంచ వర్ష ప్రణాళికలు వెయ్యాల్సిన కోరిక.

One of the first entries

such teeny tiny hands, dresses, even her dolls have a bigger size than these :).
అంత బుజ్జి బుజ్జి పాదాలు, బట్టలు చూస్తుంటే అసలు ఆ బిడ్డెన అనిపిస్తుంది.. చిచ్కూ కూడా పాప, బేబీ అంటుంది కాని సియ బేబీ అనట్లేదు.


Friday, January 7, 2011

January 8 - A boxful of bands

A small boxful of clips, bands, pins etc for the kid 
 చిచ్కూ కి ఇవన్ని పెట్టి భలే తయారు చెయ్యాలి అనే నా కోరిక దాదాపు రెండు ఏళ్ళ నించి అలాగ ఉండిపోయింది.. లార్డ్ పుస్కి గారి తల మీద చెయ్యి పెడితే రణరంగం ఇంట్లో.. ఏది పెట్టినా  ఇసిరి నేలకేసి కొట్టడమే, అది కూడా పుట్టిన రెండో రోజునించే.. తల మీద చిన్న గుడ్డ ఉన్న సరే పీకి కేవ్వుమనడం :(.. అప్పుడప్పుడు ఇలా ఆ డబ్బా చూసుకుని మురుసుకోవడమే నేను చేసేది.

January 7 - Maramaraala undalu

puffed rice balls.. my favorite sweet..

ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం.. మరమరాలు ఎలా తిన్న ఇష్టమే అనుకోండి :).

January 6 - Mirapakaaya Bajjeelu

Yum Yum Yummy Mirapakaaya Bajjeelu made by mom :)

ఇంట్లో మంచం మీద పడుకుని అమ్మ చేసి పెట్టె  తిండి తప్ప నాకు తీయటానికి బొమ్మలే దొరకట్లేదు మరి... మిరపకాయ బజ్జీలు మధ్యకి కోసి, వేయించిన అటుకులు, శనగపప్పు, పల్లీలు, కొత్తిమీర, నిమ్మకాయ వేసి తింటే ఉంటుంది... భలే భలే... రోడ్ మీద పడి తెగ తినేస్తున్న అని ఈ మధ్య మా అమ్మ నేర్చేసుకుంది... అన్నం మానేసి ఇవన్ని ఒకదాన్నే తినేసిన రోజులు కూడా ఉన్నాయ్ కాని ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా రెండు మాత్రమే :).

Tuesday, January 4, 2011

January 5 - Quote Calender

A 365-day quote calender gifted by my brother...


నాకు ఈ కోట్ క్యాలెండరు అంటే చాలా ఇష్టం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నేను ఇదే ఇష్టపడతాను.. పొద్దున్నే లేచి ఇది చూస్తె అందులో ఉన్నండి చదివితే పని చేసేటప్పుడు భలే మంచి గా అనిపిస్తుంది...
Thanks Caps for resending it :).


January 4 - Idlilu Kidleelu

Deadly idlies and kid-lees :) with chutney and ghee.

ఇడ్లి ఇప్పుడు నా staple diet ఐపోయింది.. steamed ఫుడ్ కదా.. కాని నెయ్యి ఏసుకుంటే ఏమి dieting అంటారా... ఇడ్లీ, పచ్చడి నాకు.. కిడ్-లీ, నెయ్యి చిచ్కూకి.. నాలుగు కిడ్-లీలు పెట్టటానికి నేను తిన్న అర డజను అరిగిపోవాలి మరి :(.  

January 3 - Ninu Veedani Needanu Nene

These don't seem to leave me..

మందులు మింగి మింగి సూదులు పొడిచి పొడిచి.. యాక్క్కి లైఫ్ అనిపిస్తుంది ఈ మధ్య... ప్రతిసారి రెచ్చిపోయి యోగ చెయ్యాలి అనుకుంటూ ఉంటా రెండు రోజులు చేసి మళ్లీ అటక ఎక్కించేసి మళ్లీ ముక్కు మూసుకుని మందులు..

Sunday, January 2, 2011

January 2 - Puzzling

Solving a Telugu puzzle after long!!

 చిన్నప్పుడు పేపరు రాగానే ఆదివారం ఇది పూర్తి చేసి తరవాత ఏదైనా పని చేసేదాన్ని.. ఇప్పుడు చాలా రోజుల తరవాత మళ్లీ చేసాను.. ఉహ్హు ఉహ్హు.. మళ్లీ నా కుడి కాలు బోయిక టుపుక్కు మన్న శుభసందర్భంలో నడవలేక మంచం మీద కూర్చుని చేసిన పని :(((((..


January 1 - Sweet Welcome 2011

cute cold cake from the li'l one :)

The cards from school kids :).

కొత్త సంవత్సరం సందడి అంతా మా ఊర్లోనే కనిపించింది నాకు.  చిన్న పిల్లలు అందరు కలిసి చాక్లెట్లు పంచి పెట్టి కాగితపు కార్డ్లు పంచుకుంటూ భలే హుషారుగా తిరిగారు...

PS:  I had a pretty rough start of the year with a broken right leg which makes one healing and other fresh fracture on both legs making me pretty much limbless..wish it just ends well.