Tuesday, February 28, 2012

Wk9/Dy3(59) ~ Feb 28 - ooge kurche

My new cane swing chair... ooh la laaa...

నాకు ఒక వింత పైత్యం ఉంది, నాకు ఏదైనా బాగా నచ్చి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అది నా దెగ్గర డబ్బులు ఉన్నా సరే కొనను, ఏదోకటి నా ఇష్టమైన పనిని/వస్తువుని మానుకుని ఆ డబ్బు దాచుకుని కొనుక్కుంటేనే అదొక సరదా .. అలాగ ఏదోకటి చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ దాచుకున్న డబ్బులతో పుస్తకాలు కోనేసుకుంటూ.. ఏదో లాగించేసా ఇన్నాళ్ళూ..


ఇప్పుడు కూడా నేను దాచుకుని కొనలేదు... OA  కి వల వేసి ;).. అంటే ఏమి లేదు లెండి మణులు అడిగాన మాణిక్యాలు అడిగాన అని గాలం వేసి కొనిపించుకున్నా.. ఎంచక్కా ఇందులో ఊగుతూ పుస్తకాలు చాడుకుంటుంటే ఉంటుందీ .. చెప్ప  లేని ఆ హాయి ఎంతో కమ్మగా ఉంటున్దోయి :).

Wk9/Dy2(58) ~ Feb 27 - Pongadaalu...

something cooking... made by yours truly!!

మూడు పూటలా వంట చేసి దాదాపు నాలుగు ఏళ్ళు ఐపోయింది నాకు ఈ మధ్య మా అమ్మ ఊరు వెళ్తే పండు గాడికి బాగోలేదు కాబట్టి బయటకి వెళ్ళడం ఇష్టం లేక, నాకు నచ్చినట్టు వంటిల్లు మా అమ్మ సర్దిపెట్టి వెళ్ళడం వల్లా, నేను ఇంకొంచెం సుబ్రం చేసుకోడం వల్లా, మొత్తం మీద ఏదైతేనేమి నేను వంట మొదలెట్టేసాను...

మధ్యానం మూడింటికి తినడానికి అట్టు పిండిలో రాగి పిండి అల్లం, పచ్చి మిర్చి, ఉల్లి, కొత్తిమీర కలిపి కొట్టేసి ఎసేసా... భలే ఉన్నాయని పండుగాడు ఒకటి మొత్తం తినేసాడు.. నేను ఇంకా గంతులే గంతులు :).

Wk9/Dy1(57) ~ Feb 26 - Maa Intlo Ballulunnaay

A lizard on the wall...

పాపం నన్ను ఎప్పుడు ఏమి చెయ్యకపోయినా సరే నాకు ఏంటో ఈ బల్లులని చూస్తె చచ్చే చిరాకు... ఒళ్ళు గగుర్పొడుస్తుంది... ఇంట్లో బయట గోడల మీద ఎక్కడ చూసిన లైట్ దెగ్గర పురుగులు అవి తినడానికి బల్లులు, వీటిని ఎత్తుకెల్లడానికి అప్పుడప్పుడు గబ్బిలాలు... :(((... పల్లెటూరిలో ఇవి ఎప్పుడూ కనిపించే దృశ్యాలే.


బల్లి సంగతి అటుంచితే ఈ కిటికీకి ఉన్న చిన్ని గడ లాంటి దాన్ని చిలక అంటారు.. భలే ఉంది కదూ.

Wk8/Dy7(56) ~ Feb 25 - Bulli Matti Muntalu

Tiny clay sweet bowls cleaned and stored :)

చుట్టాలింట్లో నిశ్చితార్ధం సకుటుంబ సపిరివార సమేతంగా అక్కడ వాలిపోయాం మేము, అక్కడ బాసుంది లాంటి స్వీటు ఏదో ఈ బుల్లి ముంతల్లోపెట్టారు... చూడటానికి బాగున్నాయి పండుగాడు ఆడుకుంటాడు అని ఎంచక్కా తినేసినాక ఎవరిదీ వాళ్ళు పట్టుకోచ్చేసాం... నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు మాకు నచ్చింది మాకు పెట్టారు మేము తెచ్చుకుని దాచుకుని అన్నం కూర ఆట అడుకుంటున్నాం అంతే.

Wk8/Dy6(55) ~ Feb 24 - Cheera Kattu

Saree just put for sun-drying wearing  for just an hour or so...!

అప్పుడెప్పుడో ఆరు ఏడు సంవత్సరాల  కింద కొన్న చీరలు ఇప్పటికీ కొన్ని మడతలు కూడా విప్పనివి ఉన్నాయి నా దెగ్గర... అసలు విప్పదీస్తే పిగిలిపోతాఎమో అని ఒక పక్క భయం కూడా, ఇంకో నిజం అంటే నాకు చీర కట్టడం రాదు, చుట్టడం అంటే ఏదో చేసేస్తా :).. కీర్తి నీకు బాగా తెలుసు కదా ఆ సంగతి ;).


ఇంతకీ సంగతేంటి అంటే నా కూతురు కి నేను చీర కట్టుకుని తను పట్టు లంగా వేసుకుంటే ఇట్టం అంట, ఎక్కడైనా భోజనాలకి వెళ్ళాలి అంటే చాలు అమ్మ చీర అని మొదలు పెడుతుంది.. తన పోరు పడలేక ఈ మధ్య చుట్టడం...అదేలెండి కట్టడం చేస్తున్నా.

Wk8/Dy5(54)~ Feb 23 - Punjulaata

A picture of two cocks fighting in front of our house...

కోళ్ళ పందేలు అని కాదు కాని మా ఇంటికి రెండు వైపులు ఉండేవాళ్ళకి చెందిన ఈ రెండు పుంజులు కనిపిస్తే చాలు కయ్యానికి కాలు దువ్వేస్తూ ఉంటాయి, వీటి కేకలకి, గోలకి వీటి యజమానులు వచ్చి విడదీసి కప్పెట్టేస్తూ ఉంటారు.

Wk8/Dy4(53) ~ Feb 22 - Chaakmaar

The contents in the kid's pencil box..

చిచ్కూ గాడికి చాక్మార్ (sharpener ) అంటే పిచ్చి, పెన్ను కూడా దాంట్లో పెట్టి తిప్పుతూ ఉంటుంది... చిన్నప్పుడు నేను కూడా దాన్ని అలాగే పిలిచేదాన్ని నోరు తిరగక.. ఇప్పుడు పండుగాడికి వచ్చు అనడం కాని చాక్మార్ అనే అంటుంది..

Tuesday, February 21, 2012

Wk8/Dy3(52) ~ Feb 21 - Pani Leni Panulu

... putting a cover for my personal books...

ఖాళీగా ఉంటె పండుగాడి జ్వరం గురించి తలుచుకుని పిచ్చెక్కి పోతుంది అని ఈ పని లేని పనిని ఇవ్వాళ పెట్టుకున్నా... తను కొంచెం పరవాలేదు ఆడుతుంది.. సాయంకాలం అవ్వబోతుంది అంటే చాలు గుండెల్లో గుబులు పుడుతుంది ఈ మధ్య నాకు... దేవుడా.... ఇంకా చాలు ఈ ఏడాదికి సరిపడా నొప్పులు తనకి ఇచ్చేసావ్, కోలుకునే ఓపిక రానివ్వు!

Wk8/Dy2(51) ~ Feb 20 - Night out buddies!!

My new lot arrives to keep me company when I stay awake to keep a watch on the kid

చిచ్కూ గాడికి పగలు అలా అలా ఉన్నా రాత్రి మాత్రం పిల్ల అల్లాడిపోతుంది జ్వరానికి.. టెస్ట్లు ఏమి చూపించట్లేదు, హీమోగ్లోబిన్ తక్కువ ఉంది resistance  లేదు అంటారు... ఎన్నాళ్ళో తనకి ఈ గోల పాపం..

ఎప్పుడూ చదివే నాకు ఇప్పుడు ఈ చదువే కాస్త నిమ్మళంగా అనిపించేలా చేస్తున్నాయి.

Wk8/Dy1(50) ~ Feb 19 - Sick of Seeing A Kid Sick!!!

.... we like the doctor patient stuff but only in games and toys, God!!!!! spare the kids these illnesses!!

చిచ్కూ గాడికి మళ్ళీ విపరీతంగా జ్వరం.... పాపం ఒళ్ళు కాలిపోతుంది, అమ్మ మంటలు, అమ్మ నొప్పి అని ఏడుపు... చిట్టి బిడ్డని ఏమి చెయ్యకుండా అలా వణుకుతూ ఏడుస్తూ చూడటం చాల చాల దారుణంగా ఉంది.. తను మాత్రమె కాదు ఏంటో ఊరు ఊరు అంట పిల్లలకి జబ్బు చేసినట్టుంది... తుమ్ములు, దగ్గులు, జ్వరాలు, ఏడుపులు, కీసర బాసర గా ఉంది :(((... నోరు విప్పి చెప్పను కూడా రాని పసిబిద్దలకి ఎందుకు దేవుడా ఈ పాట్లు!

Wk7/Dy7(49) ~ Feb 18 - ... and a little more with love

... got this lovely mug and mints as well!!!

నాకు అన్ని పనులు వెంటనే చేసేస్తాను కాని ఏంటో ఎవరికైనా ఏదైనా పోస్ట్ చెయ్యాలి అంటే మటుకు తగని బద్ధకం, అలాగే తెచ్చుకోవడం కూడా... shutterfly లో update  చేసిన ఫొటోస్ తోటి మగ్ చేయించి పంపించారు... భలే భలే నచ్చేసింది నాకు.  ఇవి paadavanivi  కాబట్టి సరిపోయింది.. లేకపోతేనా.. అప్పుడెప్పుడో కీర్తి పండుకి కొన్న బట్టలు ఇప్పటికీ పంపలేదు :(, ప్రవీణ్ కూతుళ్ళకి పుట్టినప్పుడు కొన్నవి పంపలేదు...ఈ లెక్కన వాళ్ళ పిల్లలకి అందేటట్లు కూడా చెయ్యలేనేమో... వాళ్ళు చక చక ఎదిగిపోవడం, ఇవి పొట్టి అయిపోవడం నా దెగ్గరే జరిగిపోయింది :(.

Wk7/Dy6(48) ~ Feb 17 - Down and Out :(((

the opening screen of my gift Kindle from OA's cousin :((.. I am not able to use the charger for some reason... any suggestions to help me out!!!!!

నాకు సుధాకర్ అన్నయ్య అని ఒక అన్న ఉన్నారు ఆయన నాకు పుస్తకాలు ఇష్టం అని సోనీ రీడర్ కొనిపెట్టారు అప్పుడెప్పుడో.. అది వచ్చిన కొత్తల్లో నాలుగేళ్ల కిందట.. ఇప్పుడు అది పాత బడిపోయింది అని కొత్త kindle తను వాడేది 9  inches ఇచ్చి పంపించారు... అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని టైపులో అది చేరింది కాని ఛార్జ్ అవ్వడం లేదు :(((((...!!!  దాని charger  ఇండియా లో ఎక్కడ దొరుకుంటుందో చెప్పి పుణ్యం కట్టుకోండి మహా ప్రభో!

Wk7/Dy5( 47) ~ Feb 16 - Pelli Function

The kid attended her first proper festivity in the village..

చిచ్కూ గాడికి జ్వరం వచ్చి కాస్త తగ్గినాక మొదటి సారి బయటకి తీసుకెళ్లడం, తను ఉహ తెలిసినాక చూసిన మొదటి పెళ్లి, నోము అవ్వడం తోటి వీడికి మటుకు పండగే పండగ ఐపోయింది... గంతులేసి గంతులేసి అలిసిపోయింది ఊరికే.

Wk7/Dy4(46) ~ Feb 15 - Dumpala Bandi

The sweet potato cart that comes once a year :)

ఊర్లో దుంపలు, కంద, పెండలం, చిలగడ దుంప లాంటివి ఒక బండి కట్టుకొచ్చి అమ్ముతారు.. అందరు నాలుగైదు కిలోలు కొనుక్కుని బల్ల కింద ఆరబోసుకుని అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటారు.. ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించలేదు మళ్ళీ తిరుగున్నాయి.

Wk7/Dy3(45) ~ Feb 14 - Only Love!

Bowled over with this gift from the kid's cousin all the way from NC... just love the way only kids can write so happily.. to Doctor Sreya from Teacher Sneha.. God bless them both... wish they never outgrow this unadultered feeling.

చిచ్కూ గాడికి బోలెడన్ని గిఫ్ట్లు ఇచ్చి పంపించారు మా చుట్టాలన్నయ్య... వాళ్ళ పాప రాసిన ఈ మాటలు మాత్రం నన్ను నిజంగా కట్టి పడేశాయి... ఇది ఇలాగే దాచి frame  కట్టించాలి అన్నంత నచ్చింది.

Monday, February 13, 2012

Wk7/Dy2(44) ~ Feb 13 - Vantaa Vaarpu :)

... the kid plays her cooking games while my mom watches her cookery shows.. sigh!!! life seems to be falling back in a routine...

పదిన్నర అయ్యిందంటే చాలు ఆ టీవిలో ఈ టీవిలో, ఆ వంట ఈ వంట అంటూ బియ్యం కడిగి పొయ్యి మీద విడిగా ఉండటం కూడా మహా వంట అనే రేంజ్లో ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ వాటినన్నిటిని చూసి మా అమ్మ ప్రయోగాలు, నా పాట్లు.. నాదనేమి ఉంది లెండి అందరి ఇళ్ళల్లో ఇదే గోల ఉండొచ్చు ఇంచు మించు కొంచెం పెద్ద వాళ్ళు ఉంటె... ఆవిడ చూస్తుంటే మా బుడ్డది కూడా పొయ్యి గిన్నెలు పెట్టుకుని, ఇప్పుడు పొయ్యి వెలిగించాలి, దాని మీద గిన్నె పెట్టాలి అని ఆటలు... 

ఒకప్పుడు ఇదంతా విసుగు అనిపించినా జ్వరం పడి లేచిన పిల్ల ఏమి చేసినా ఏనుగు ఎక్కినంత ఆనందంగా ఉంది.. ఇంకా కళ్ళల్లో ఊపిరి పెట్టుకుని ఉంది కాని చాల చాల మెరుగు.

Wk7/Dy1(43) ~ Feb 12 - ... and we color


పిల్ల కొంచెం తేట పడి ఒక రెండు ముద్దలు తిని కక్కకుండా నిలుపుకుంది.. కొంచెం కాలు చెయ్యి ఆడితే ఇంక ఆగం కదా గంతులేస్తుంటే కూచోపెట్టి ఈ స్టెన్సిల్ రంగుల బొమ్మలు వేసుకున్నాం... ఇక్కడ బొమ్మ ఇంత అందంగా కనిపించినా చుట్టూ పక్కల నానా బీబత్సం చేసి పెట్టాం... ఏదైతే అది అయ్యింది కాని పిల్ల కాస్త నవ్విన్దోచ్!!!

Wk6/Dy7(42) ~ Feb 11 - Kid's Books..

... and we finally get to read our this year's book buys from the exhibition and watch the kid rhyme/dance CDs and DVDs!!

చిచ్కూ గాడి జ్వరం పుణ్యమా అని వాడికి కొన్న పుస్తకాల దుమ్ము దులిపాము, నీరసంగా పడుకుని వింటూ ఉండిపోయింది పాపం.

Wk6/Dy6(41) ~ Feb 10 - Injikki :(

The hospital prescription booklet of the kid, this place really rocks!  Maganti Children's Hospital...

నిను  వీడని నీడని నేనే అంటూ పైశాచికంగా పీడించుకుని తింటుంది పిచ్చి దగ్గు చిచ్కూ గాడిని... ఏది తిన్నా, ఆఖరికి మందులు కూడా ఎసుకోవడం కక్కడం ఇంకా ఇంజెక్షన్ కోర్సు ఇవ్వక తప్పలేదు.. నా కంటే ఎక్కువ మా డాక్టర్ గారు బాధ పడిపోయారు, చిన్ని ప్రాణానికి ఎంత ఇవ్వకూడదు అనుకున్నా తప్పట్లేదు అని.. గుడివాడలో ఉన్నఅన్నిట్లోకి సుబ్రతలో కాని, ట్రీట్మెంట్లో కాని, అన్ని రకాలుగా మంచిది ఈ హాస్పిటల్... ఈయన చేతిలో పండు గాడు ఉంటె అన్ని సర్దుకుంటాయి అని నా గట్టి నమ్మకం..!!

PS:  We planned on attending Dileep's wedding with Vardhika!! Missed it as were in the hospital the whole day!! Pls. give them your best wishes!

Thursday, February 9, 2012

Wk6/Dy5(40) ~ Feb 9 - Missing Karate Annas...

The kid plays around doing the warm-up runs before the actual class...

పిచ్చి దగ్గు, ఎంతకీ తగ్గట్లేదు... ఎంచక్కా సాయంకాలం వెళ్లి ఆటలాడుకుని వచ్చేది పిచ్చి తల్లి ఖళ్ ఖళ్ళున ఒకటే దగ్గుకుంటూ నీరసంగా ఉంటుంది :(.

Tuesday, February 7, 2012

Wk6/Dy4(39) ~ Feb 8 - Cut Down...

 coconut trees cut down when converting fields into fish ponds :(

ఊరి చుట్టూ ఉన్న పొలాలు చాల మటుకు చేపల చెరువులు తవ్వేసారు, అవి నేను చూడలేదు కాబట్టి అంత బాధ అనిపించలేదు కాని ఈ మధ్యన కొత్తగా తవ్వినప్పుడు తెచ్చి పడేసినవి చిచ్కూ గాడి బడికి వెళ్ళే దారిలో కనిపిస్తే  ఉసూరుమనిపించింది.

Wk6/Dy3(38) ~ Feb 7 - The Black and White of Apple

I did not really think I would like an ipad but I must admit I do :).  Ipod is also something that I gradually got to like.. so it proves these things grow on me!!

చిచ్కూ గాడి ఆటలకి మాత్రమె ఉపయోగించాను ఇన్నాళ్ళు దీన్ని, ఇప్పుడు పుస్తకాలు చదువుతుంటే ఇది కూడా బాగానే ఉంది అనిపిస్తుంది...

Wk6/Dy2(37) ~ Feb 6 - Heartbreakingly Sick...

gulping down a whole lot of medicines, yucky in taste, lying down tired all time so unlike her bubbly self, kid had a nightmarish couple of days with severe cough, cold and fever.

చిచ్కూ గాడికి విపరీతమైన జ్వరం, ఒళ్ళంతా మంటలు మండిపోయినట్లు, దగ్గి దగ్గి గొంతు పుండు పడిపోయినట్టు, చూస్తుంటే వింటుంటే కడుపు తరుక్కుపోయింది.. ఎప్పుడు గంతులేస్తూ తిరిగే పిల్ల తోటకూర కాడలాగా వేలాడిపోయి, నీరసంగా ఉండిపోయింది... 

Saturday, February 4, 2012

Wk6/Dy1(36) ~ Feb 5 - Luring Kids to School

Plans to get kids to school... sadly, even the poor prefer to send them to a convent when the govt. has so much to offer..

అత్యుత్సాహంలో నేను కూడా చిచ్కూ గాడిని దుంపల బడికి, గవర్నమెంట్ బడికి పంపించాలి అని అనుకున్నాను, కాని అక్కడి పరిస్తితులు, పిల్లలు మాట్లాడే భాష, అన్ని చూసి బెదిరిపోయాను... ఎప్పుడు ఒక పంతులే ఉంటాడు ఇద్దరు ఉండాల్సిన చోట, పిల్లలకి శుబ్రత నేర్పించడం, చెడు మాటలు మాన్పించడం ఏమి లేవు... ఈ మధ్య ఇందులో చేరే వారి సంఖ్యా రాను రాను పడిపోతోంది అని అందరు లబ లబ లాడుతున్నారు కాని అరికట్టడానికి ఎవరు ప్రయత్నించారు.  నేను కూడా...!!!

Friday, February 3, 2012

Wk5/Dy7(35) ~ Feb 4 - My First School

This is a sepia picture of the school that I first went to... right in front of my grandparents' home... 30 yrs. ago and still the same..

చిన్నప్పుడు నేను వెళ్ళిన బడి.... నాకు బాగా గుర్తు కొన్ని బియ్యం, మురమురాలు పోసే వాళ్ళు సంచిలో నెలకోసారి అనుకుంటా :).. ఇప్పటికీ ఆ బడి ఉంది కాని పండు గాడిని పంపాలంటే పచ్చి బూతులు నేర్చుకోస్తాడు అని భయం.   

Thursday, February 2, 2012

Wk5/Day6(34) ~ Feb 3 - Maa Taata Uttaram...

kid's playing game during school hours :).. traditional game we used to play as kids

అందరు గుండ్రంగా కూర్చుని ఒకళ్ళు మాత్రం జేబు రుమాలు ఒకటి పట్టుకుని మా తాత ఉత్తరం అని అరుచుకుంటూ మిగిలిన అందరూ ఏట్లో పడింది, నీట్లో పడింది అని అరుచుకుంటూ ఎవరి ఎనకాల పడేస్తే వాళ్ళు తీసుకుని పడేసిన వాడిని పట్టుకుని భలే భలే సరదాగా ఆడుకునే వాళ్ళం... చిన్న పిల్లలు ఈ ఆట ఆడుతుంటే భలే ముచ్చటేసింది.

Wk5/Dy5(33) ~ Feb 2 - Karate Kids

Kid plays around as the other children learn Karate...

చిచ్కూ గాడికి ఈ మధ్య ఖాళీ లేకుండా కాకి తిరుగుడు అలవాటు ఐపోయి, అమ్మ ఆచ్చి ఎల్దాం, అమ్మా ఎక్కడికి తీసుకేల్తున్నావ్, అమ్మా ఊరికే అలా రోడ్ మీద తిరిగొద్దాం లాంటి కబుర్లు ఎక్కువైపోయాయి, అందుకే వారానికి రెండు సార్లు పక్కూర్లో జరిగే కరాటే క్లాసు కి పట్టుకు పోతున్నా, ఏమి నేర్చుకోడు, వాళ్ళు ప్రత్యేకించి చెప్పరు.. ఎల్లగానే హోస్ మటుకు చెప్పి పిల్లలు చేస్తూ ఉంటె మధ్య మధ్యలో కాలు చెయ్యి కదుపుతూ వాళ్ళ తో పాటు కాసేపు హాయి హోయ్ అనిపించి కాస్త ఒళ్ళు అలిసినాక ఇంటికి తిరిగి తీసుకొస్తున్నా:). 

Wk5/Dy4(32) ~ Feb 1 - Nenadoka Type...

Two contradictory things that I plan to do at the same time.. Pro and Anti Ramayana Epic.

ఊరందరిది ఒకదారి నాది ఇంకో దారి.. ఇది జగమెరిగిన సత్యం :).. ఊరందరిది ఒక దారి నాది మాత్రం రహదారి అనేది నేను అనుకునే సత్యం.   RGV తెగ పొడిగిస్తే ఏంటబ్బా ఇది ఒకసారి చదవాలి అనుకున్న, మళ్ళి నవ్యలో కళ్ళు తెరిచినా సీత చదివినాక ఈసారి చదివేయ్యల్సిందే అని గట్టి నిర్ణయం తీసుకున్నా.. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు..

The playlist containing Chaganti gaari discourses on Ramayana and Human Values in Today's Society..
రామ భక్తుడైన చాగంటి గారి రామాయణం మానవీయ విలువలు అనే ప్రసంగం వింటూ ఇది చదవడం ఈ కధకి మీరెవరు అనుకోని మలుపు... అదొక పైత్యం అనుకోండి ఏమైనా అనుకోండి.. ఒక ప్రయోగం అని మాత్రం నేను చెప్పగలను.

Wk5/Dy3(31) ~ Jan 31 - Tampara kaayalu

Boiled peanuts.. yum!

వేరు సెనగ కాయలని నీళ్ళలో ఉప్పేసి ఉడకపెట్టి అమ్ముతారు మా ఊర్లో, వాటిని తంపర కాయలు అంటారు.. నాకు పండు గాడికి భలే ఇష్టం, నేలకి కాయని కొట్టి పప్పు తీసుకుని తింటే ఉంటుంది అసలు వావ్.