Tuesday, May 29, 2012

Wk23/Dy4(151) ~ May 30 ~ ఐ - ఐసబ్బాయి (Ai - Aisabbaayi)

The rural icecreams... this guy has been selling ice since my childhood...

మండుటెండల్లో పుల్లైసు తింటూ మధ్యలో తగిలే సేమియాలు,  సగ్గు బియ్యం గింజలు, సబ్జా గింజలు,  నములుతూ ఆడుకుంటూ ఉండే వాళ్ళం... కొంచెం ఎండ తిరగ గానే ఎప్పుడు  అని గ్లాసు పట్టుకుని పావలా బిళ్ళ టకటక లాడించుకుంటూ కూర్చునేవాళ్ళం.. పది పైసులు పుల్లైసు, పావలా సగ్గుబియ్యం ఐసు ఇప్పుడు అన్నీ రెండు రూపాయలే :).

Monday, May 28, 2012

Wk23/D3(150) ~ May 29 ~ ఏ - ఏటికొప్పాక బొమ్మలు (Ae - Aetikoppaaka Bommalu)


The whistles, tops and traditional names all made of vegetable dyes and nontoxic... small-scale cottage industry beautifying life and entertaining kids.. just love them.

నాకు ఈ చెక్క బొమ్మలు అంటే చాల ఇష్టం  కూడా,  అప్పుడు కేవలం అవి చూడటానికి ఆడటానికి నచ్చేవి, పెద్దయ్యే కో, వాటి గురించి తెలుసుకునే కొద్దీ, వాటి తయారీ చూడాలి, వాటిని తయారు చేసే వారి జీవితాలు చూడాలి, అందులో మార్పులు చూడాలి అని ఒక తెలియని కోరిక... ఎలాగైతేనేమి ఆఖరికి  పోయిన ఏడాది పని కట్టుకుని ఆ ఊరు ఎల్లి చూసి కొని తెచ్చుకున్నాను తనివి తీరా... అసలు ఎవరికైనా బహుమతులు ఇవ్వటానికి కూడా ఇంతకూ మించి ఉంటాయ అనేంత పిచ్చి ఇవంటే నాకు...

కాకపొతే నేను వెళ్ళినప్పుడు  జనాలు కరెంటు లేక చాల పాట్లు పడుతున్నారు, అందుకే బొమ్మలు ఎక్కువగా చెయ్యలేకపోతున్నట్టు చెప్పారు... ఈ మధ్య ఈనాడులో ఆర్టికల్ కూడా వేసారు.. బయట కొట్లలో కొన్నవాటికి వాళ్ళ దెగ్గర తెచ్చుకున్నడానికి ధరలో చాల చాల తేడా ఉంది... 

ఆ ఈలలూ బొంగరాలు రైలు బండి, లక్క పిడతలు.. చిన్నతనానికి పరుగులు పెట్టించేస్తుంటాయి  నన్ను.

మా చిన్నప్పుడు బంక మట్టితోటి చేసుకునే వాళ్ళం వాటిని, ఇప్పుడూ చెయ్యొచ్చు కాని అవి వాళ్ళు  పెట్టేసుకున్తారేమో అని భయం కదా...

Sunday, May 27, 2012

Wk23/Dy2(149) ~ May 28 - ఎ - ఎడ్ల పోటీలు (A - edla poteelu)


The famous oxen races in coastal AP.

సంక్రాంతి వచ్చిందంటే ఎడ్ల  పోటీలు పెడతారు మా ఊరి దేగ్గర్లో, ఒంగోలు గిత్తల తోటి... ఒక పెద్ద బండ పెట్టి దాన్ని ఈ రెండు ఎడ్లు ఎంత దూరం ఎంత తొందరగా లాగ గలవు అనేది పందెం.

ఎ - ఎడ్ల పోటీలు 

Saturday, May 26, 2012

Wk23/Dy1(148) ~ May 27 ~ ఌ, ౡ (Alu - Aloo Extinct Alphabets)

Just like extinct species.. these two alphabets, I was made to learn as a kid are no longer found in any text books for kids..

తెలుగులో మనకి ఇక వాడుక లోని ఈ రెండు అక్షరాలూ, అసలు మా చిన్నప్పుడు  నేర్పించినప్పుడే అలు  అలూ  అని చెప్పారు తప్పితే దానితో పాటు వచ్చే పదం నేర్పలేదు ఇప్పుడు ఆ అక్షరాలూ కూడా నేర్పట్లేదు.. RIP!

రెండో చ రెండో జ కూడా ఇప్పుడు వాడుకలో లేవు.. కాబట్టి అన్నిటికి కలిపి ఇదే పోస్టు.

Friday, May 25, 2012

Wk22/Dy7(147) ~ May 26 - ౠ - ? (Aroo -?)


Hunting high and low for a picture on Aroo... but not even a single concrete plan...

ఋ అంటే రు  అని కీర్తి అరు  అని నేను అనేసుకుని.. confuse అయిపోయాం ముందు, తరవాత ఎటూ తేల్చుకోలేక వదిలేసాం... ఆ తరవాత అక్షరం తోటి బొమ్మ కోసం మా పాట్లు ఒకటి రెండూ కాదు.. రూత్వం దీర్ఘం మీద వచ్చే మాటలు కూడా ఆలోచించాం, ఏమి ఫోటో తీయాలా అని కుస్తీలు పడ్డాం ఆఖరికి ఇలా మిగిలిపోయాం... ఎవరికైనా ఏదైనా తోస్తే మాకు చెప్పి పుణ్యం కట్టుకోండి మహా ప్రభో.

Thursday, May 24, 2012

Wk22/Dy6(146) ~ May 25 ~ ఋ - ఋతువు (Aru - Rutuvu)

Kid happily playing with flowers in what I call the Indian fall.. sisira rutuvu :).

శిశిర ఋతువు అంటే ఆకులు రాలే కాలం అని నాకు చాలా రోజులు తెలియదు.. అంటే మనకి తెలుగు బ్రహ్మాండంగా వచ్చేసును అని కాదు కాని చాల మటుకు మంచి తెలుగు వచ్చేది కాదు, ఇప్పటికీ రాదు అనేది పక్కన పెడితే.. ఇది మా బుల్లి బుచికిని చిన్నప్పుడు ఏడో  నెలలో తీసిన ఫోటో.. ఋతువుల్లో ఈ ఋతువు చూడటానికి బాగుంటుంది ఎంచక్కా కింద నేలంతా ఆకులు పువ్వులు పడి, పాచి  వాళ్ళ నడుములు పోతాయి కాని భలే ఉంటుంది కింద నేల, తరవాత చెట్లు బోసి పోతాయి అనుకోండి, కాని అదీ జీవితంలో ఒక భాగమే, మళ్ళీ  కొత్త చిగురు కొత్త సృష్టి. 

PS:  I had initially chosen my favorite spring picture from US but mana ooru conceptki set kaaka, now that the kid no where resembles the one in picture currently, bindaasgaa posting :).

Wk22/Dy5(145) ~ May 24 ~ ఊ - ఊక పొయ్యి (Oo - ooka poyyi)

Traditional paddy husk stove...

మా చిన్నప్పుడు మా పెద్ద మామయ్యకి ఒక హోటలు  అందులో ఈ ఊక పొయ్యి ఉండేది.. ఊక అంటే వడ్లు మిల్లు ఆడించినాక మిగిలిన పొట్టు దాన్ని వాడి ఈ పొయ్యి మీద వంటలు చేసేవారు...  దగ్గరలో మిల్లు ఉంటే  ఇదే వాడతారు  హోటల్ వాళ్ళు.. ఈ ఊక పొయ్యి మీద ఒకతను పిండి వంటలు చేసి బండిలో పెట్టుకుని అమ్ముతాడు ప్రస్తుతం...!


Tuesday, May 22, 2012

Wk21/Dy4(144) - May 23 - ఉ - ఉల్లిపాయ బుట్ట (U - Ullipaaya Butta)


The traditional onion basket.. one of the things that I love to have in my kitchen.

నాకు మా అమ్మమ్మ ఇంట్లో చూరుకు వేలాడదీసిన ఇనప ఉల్లిపాయ బుట్ట అంటే భలే ఇష్టం ఉండేది... ఊర్లో కుదిరినప్పుడు, రేటు తక్కువ ఉన్నప్పుదు ఉల్లిపాయల బస్తా ఒకతి కొనెసి మంచం కిందో , బల్ల కిందో ఆరపోసి వాదుకుంతారు చాల మంది.. పందికొక్కుల సమస్య ఉన్న వాల్లు చూరుకి ఈ బుట్టలొ పోసి తగిలించుకుంటారు..

నాకు వంటింట్లో ఇది ఉంటె ఎందుకొ అమ్మమ్మ ఉన్నట్టు ఉంటుంది... దుంపలకి ఒకటి, ఉల్లిపాయల కి ఒకటి ఉన్నాయ్.. చూరు లేదు కాని గోడకి  తగిలించా :).

Wk21/Dy3(143) - May 22 ~ ఈ - ఈనెల చీపురు (Ee - eenela cheepuru)

This is how a broom stick is made from coconut leaves..


మా అమ్మమ్మ మధ్యానం ఖాళీ ఉన్నప్పుదు కూర్చుని ఎండిన మట్టల నించి కొబ్బరి ఈనెలు తీసి చీపురు తయారు చేసేది.. కొబ్బరి చీపురు పెత్తి ఊడిస్తే తప్ప మత్తి వాకిళ్ళలో పాచి పోదు మరి...

ఇప్పుడు మెము కొనుక్కోడమే నదుము వంగదు కదా మనకి.

Monday, May 21, 2012

Wk21/Dy2(142) - May 21 ~ ఇ - ఇరుసు (E - Irusu)the grip that holds the wheels of a cart.

ఇరుసు లేని బండి, ఈశ్వరుని బండి.. అని సుశీల గారు పాడిన పాట వినటమే కాని  ఇరుసు అంటే ఇది అని నాకు చాలా రొజులు తెలియదు.. నిన్న దాకా కూడా ఇరుసు అంతె రుబ్బు రోలు పొత్రం మీద ఉండె కర్ర ముక్క అనుకున్నా :).. బండి చక్రాలు నిలబెట్టేది అని ఇరుసు లేకపొతే అది బండే కాదు అని రామాయమ్మమ్మ చెప్పింది :).

ఈ మధ్య చక్రాల బండ్లు తగ్గిపోయి టైరు బండ్లు మాత్రమె ఉంటున్నాయి ఊర్లో కూడా .

Saturday, May 19, 2012

Wk21/Dy1(141) - May 20 ~ ఆ - ఆకుమడి (Aa - Aakumadi)

The paddy shoots ready to be planted elsewhere.. 

పొలంలొ వరి విత్తనాలు నాటినప్పుడు వాటిని  ఆకుమడి అంటారు.. ఒక మడి చెసి అందులొ విత్తనాలు జిమ్ముతారు.. అవి మొక్క మొలిచినాక తీసి నాటుమడి లొ కూలీల చేత నాటిస్తారు..

After re-planting the paddy shoots..

పండు గాడి చిన్నప్పుడు ఏదో పోటీ  కోసం తీశాను ఈ ఫోటోలని... ఇప్పుడు గాని అలా పొలంలో దింపితే పీకి పాకం పెడుతుంది.

PS:  From the archives.

Suggestions for the next alphabet ????

Wk20/Dy7(140) ~ May 19 - అ - అడితీ (A - Adithee)


The local place that sells wood for household use...

ఊర్లో ఇంట్లో వంట కోసం ఇంచు మించు ఇంట్లో దొరికే ఎండు  మట్టలు అవీ వాడేస్తారు కాని భారీ వంటలకి వాటికీ, స్మశానంలో అవసరానికి ఈ పుల్లల అడితీ నించే తీసుకెళతారు... పెద్ద చెట్లు కొని పేళ్ళు కొట్టించి కిలో పది రూపాయలకి అమ్ముతారు.  చిచ్కూ గాడు చిన్నప్పుడు నీళ్ళు కాయడానికి నేను తెప్పించేదాన్ని ఒక్కోసారి ఇంట్లో కొబ్బరి డొప్పలు ఐపోతే.

PS:  Keerthi... and here we go!!

Wk20/Dy6(139) ~ May 18 - Ready, Steady...

a proof to say that some serious prep has been going on ;)...

నేను కొంచెం కష్టపడి తీసేది తియ్యాల్సింది ఈ ఒక్కసారె అనుకుంటా, ఊరు, ఊరి వాతావరణం అందులొ తెలుగు అక్షరమాల.. నిజంగానె నెను కొంచెం శ్రమ పడుతున్నా అనటానికి సాక్ష్యం.

Wk20/Dy5(138) ~ May 17 - Chadivesaanoch

Done with complete all the mags and monthlies up to date...

చాలా రొజుల నించి మా అమ్మకి ఒంట్లొ బాగోక నాకు ఖాళీ లేక, చదవ బుద్ధి కాక.. అలా పేర్చి పెట్టిన పుస్తకాల దుమ్ము దులిపేసాను ఆఖరికి.

Wk20/Dy4(137) ~ May 16 - Sugaru BP

Finally... got mom to see a diabetecian...phew!!!

హమ్మయ్య, చివరాఖరికి చచ్చి చెడి, ఏడ్చి-ఏడిపించి, అలిగి - అలక తీర్చి, బెదిరించి - బతిమాలి .. ఏదొ నాన తంటాలు పడి మా అమ్మ దొచ్తొర్ని కలిసేలా చేసాను.. బాబొయ్ తల ప్రాణం తొకకి వచ్చింది.

Wk20/Dy3(136) ~ May 15 - Ee peddollunnare..!!

Long pending gift for mom..

ఉదయ్ కిరణ్ నువ్వు నెను సినిమాలొ ఈ దీలొగ్ అంటే పడి పడి నవ్వుకున్న అతను చెప్పిన తీరుకి.. అనుభవంలొకి వస్తె ఉంది నా సామి రంగా...:(

మా అమ్మకి ఒంత్లొ బాగొలెదు, షుగరు బీబత్సంగా పెరిగిపొయింది, దొచ్తొర్ దెగ్గరకి వెళ్ళను అదె తగ్గిపొతుంది అని మొండికెసింది చాల రొజులు... 

మనం కాస్త తెలివిని ఉపయొగించి లంచం పెట్టాము...

Thursday, May 17, 2012

For a change

For a change, I have been taking pics daily and have not been posting them... busy busy busy... wanted to sort out mess in life, no major issues, health issues of extended family needing attention..

Grrrr... why cant these elders take care of themselves.  Neither will they do it for themselves, nor let us do it for them.. Grrrrr....!!!!!!

Will come back with a bang, meanwhile keep pouring in your suggestions for alphabets..

thank you..

Sunday, May 13, 2012

Wk20/Dy2(135) ~ May 14 - Telugu alphabet అ to ఱ series!,

.. long pending series of telugu alphabet posting...

అ నించి ఱ ఫోటోలు తీయాలి అని ఎప్పటి నించో అనుకుంటున్నాకాని పడటం  లేదు, బద్దకం ముఖ్య కారణం వెరేవన్ని ఆమ్యామ్యాలు :).. ఆఖరికి కీర్తి ని కాల్చుకు తిని తనని కూడ తోడు లాక్కుని మొదలు పెడదాం అనుకుంటున్నా .. పల్లెటూరు వాతవరణంలొ చూసె కనిపించె దౄశ్యాలు .. తెలుగు అక్షరమాలలొ అని నా ఆలొచన, ఎంత వరుకు చేయ్యగలతానొ చూడాలి.  I get a lot of personal mails and even personal calls from the people I know in person appreciating the blog for which I feel extremely happy.

I am indeed very blessed to able to live the life this way in this place and I really want to cherish it forever and ever 'cos I really do not know what life would have in hold for us in the coming future. I never thought I would be staying here, so I am not sure either that I could continue forever and hence the theme, very close to my heart.

well, I have thinking of making this blog a little more interactive with getting suggestions from you as to what the next post for the alphabet should be.


My theme would be Telugu alphabets in a rural setting. So, each day while I post a pic for the alphabet, I would also love to get inputs for the same alphabet and the alphabet for the next day and I will see if I can accommodate in the post.


Two uses of this,
it will keep me on toes.
It will make the project more exciting.


Eagerly awaiting suggestions..!!


 PS:  Keerthi, headsup icchesaa, so we just need to plunge in now :), excuses levu naaku inka ;). 

Wk20/Dy1 (134) ~ May 13 - Maa Inti Vanta

... the kids get into the cookery show mode... by the way she prepared yummy attu, chapati and biyaani :).

ఈ రోజు పండు గాడి వంట నాకు విందు కార్యక్రమం జరిగింది మా ఇంట్లో... అన్నీ కుమ్మెయ్యి అమ్మా సూపర్  వండాను అంది... నేను కొంచెం ఒళ్ళు దెగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని అర్థం  అయ్యింది నాకు. మనం ఏది అంటే వాలూ అదే పట్టుకుంటారు కదా.

Wk19/Dy7 (133) ~ May 12 - Kobbari Chettu Kadhalu

Finally got someone to cut down the branches and dry and formed coconuts from the trees... was scared to death with the winds, rains and thunders and them falling left, right and center all around the place.

కాయలు అన్ని తయారు ఐపోయి కోసే వాళ్ళు లేక, మట్టలు ఎండిపోయి గాలికి ఎప్పుడు పడతాయో తెలియక, అడపా దడపా రాలే కాయలు ఎక్కడ గుండు పగల కొడతాయా అని భయం భయం గా  ఉంటున్నా ఈ మద్య .. అసలు చెట్టు ఎక్కే  లేదే నాధుడే లేకపోయాడు ఊర్లో..  అందులో ఇవి కాడుల్లగా ఇంత బారున ఉన్నాయి.. ఎలాగైతేనేమి చెట్టుకి 50/- అని చెప్పి బతిమాలి బామాలి ఎక్కించి కొట్టించి ఊపిరి తీసుకున్నా.. అసలే ఈ మధ్య ఈదురు గాలులు, వానలు, హడిలి పోతూ బ్రతికాను ఎవరి మీద పడతాయో అని... హమ్మయ్య 

Friday, May 11, 2012

Wk19/Dy6(132) ~ May 11 - The poser

After long the kid asks me to take her pics and also poses.. here she says she is krishna.!

పండు గాడు ఈమధ్య ఫొటోలకి సరిగా కుదురుగా ఉండట్లేదు అలాంటిది నిన్న ఏమి  పూనిందో ఏమిటో  అడిగి మరీ భంగిమలు పెట్టింది.. నన్ను తియ్యి అమ్మా అని.

Wednesday, May 9, 2012

Wk19/Dy5(131) ~ May 10 - Littu Ready

kids give me her shopping list.. :).  Thank God, she really does not mean anything over here, but I see my future bright and clear.

చిచ్కూ గాడు నేను బయటికి వెళ్ళేటప్పుడు నా చేతికి గబా గబా నాలుగు గీతలు గీకి ఒక కాయితం ఇస్తాడు.. బజారులో కొనడానికి లిట్టు అంటాడు..

Tuesday, May 8, 2012

Wk19/Dy4(130) ~ May 9 - Kobbari Maamidi Mukkalu

yet another summer treat :)... raw mango variety sweet and sour and yummmm taste!

కొబ్బరి మామిడి కాయలు అంటే చాలు ఉప్పు  కారం పెట్టుకుని తింటుంటే ఉంటుంది ఆహా ఏమి  రుచి అనరా మైమరచి.

Wk19/Dy3(129) ~ May 8 - Allukunna Latalu

I love this green creeper giving out yellow flowers, put it last year during rains.. it was a task getting it to climb the first floor but then it caught up really fast once there :)...

నాకు ఇల్లు అంటూ ఉంటె ఎంచక్కా ఒక బుల్లి వరండా అందులో ఒక ఊగుడు బల్ల అందులో కూర్చుని చూడటానికి చుట్టూ పచ్చదనం ఉండాలి అని కోరిక.. అదెలాగో ఎప్పుడు తీరుతుందో తెలియదు అంతలోపు ఈ ఇంట్లో పోయినేడాది ఈ మొక్క నాటాను వానల్లో, అది పెరిగి డాబా మీద అల్లుకుని గాలికి ఊగుతూ పచ్చటి పూలతోటి ఎంతో ముద్దుగా ఉంది ఇంకా అల్లుకోవాలి కాని నాకు ఎక్కడ ఆగుతుంది ఆనందం.. ;).

Wk19/Dy2(128) ~ May 7 - Taataaku Paaka

These kind of thatched roof huts are becoming a rarity even in villages... palm leaves used to cover the structure made out of bamboos covered by dry grass as roofing.

ఎండా కాలం వస్తే తాడి చెట్లు మట్టలు నరికించి ఇల్లు కుట్టించుకుని, గడ్డి కప్పించుకుని చినుకులు పడక ముందే ఇల్లు బాగు చేసుకునే వారు పూర్వ కాలంలో, మా అమ్మమ్మ వాళ్ళది కూడా పూరిల్లే కాబట్టి ప్రతి ఏడు భలే సంబరంగా తిరిగే వాళ్ళం ఆకులు మోసుకుంటూ గడ్డి మోసుకుంటూ... ఈ మధ్య అన్ని ఇందిరమ్మ ఇళ్లు  వచ్చేసి  డాబాలు, రేకులు వచ్చాయి.

Wk19/Dy1(127) ~ May 6 - Intlonoo Ontloonoo

When we start manufacturing sugar in our bodies beyond control and need to measure the extent, we fall back on these.... sad to see mom and maams fall into this category!!

ఇంట్లోను వంట్లోను దండిగా షుగర్ పెంచుకుంటున్నారు ఈ మధ్య మా  ఇంట్లో జనాలు.  

Wk18/Dy7(126) ~ May 5 - The Teacher Kid

If you notice there are 4 more slates under the one she is currently writing all hers... she says she writing it for her school kids.

పండు గాడు పలకలు పట్టుకుని ఏదో గీకి పిల్లలూ దిద్దండీ అని చెప్తుంది ఎవరా అని చూస్తె ఎవరు  లేరు.. గాలికి ఏదో పేర్లు పెట్టి ఇది నువ్వు దిద్దు, ఇది నువ్వు రాయి అని చెప్తుంది.

Friday, May 4, 2012

Wk18/Dy6(125) ~ May 4 - Malle Poola Jada

Almost every coastal andhra girl has a picture of hers with a poola jada in Summer... so the kid gets hers today :).

ఎండాకాలం వచ్చిందంటే ఊర్లో ఆడ పిల్లలు ఎంచక్కా మల్లె పూల జడలు అల్లించుకుని పట్టు లంగాలు వేసుకుని ఫోటోలు దిగేస్తారు చిన్నప్పుడు  నాకు లేదు  ఇంచు మించు అందరు ఆడపిల్లలకి ఉంటుంది మా ఊర్లో.. ఈ రోజు తనకి వేయించాను చిచ్కూ గాడు ఓపికగా రెండు గంటలు కూర్చుని వేయించుకున్నాడు.

Wk18/Dy5(124) ~ May 3 - Hooked

... the exchangeable S hook tops..just love them.

పండు గాడికి ఎలాంటి పోగులు  అయినా సరే ఎంచక్కా చేతిలోకి పీకి ఇచ్చేస్తాడు, కాని ఎంతైనా ఆడపిల్ల ఏమి లేకపోతె బోసిగా ఉంటుంది అందుకే ఈ పల్చటి పోగులు తీసుకున్నా కింద ఎంచక్కా రకరకాల గుత్తులు  మార్చుకుని పెట్టుకోవచ్చు ఏ రంగుకి ఆ రంగువి.. సిరి తొందరగాకొని పంపు వేరే రంగులు. :).. నీకే పని అది.

Wk18/Dy4(123) ~ May 2 - Bulli Veenalu

.. the temple architecture at Nuziveedu Saraswati Temple.. just loved that place

మదిలో వీణలు మ్రోగే అనే పాట గుర్తు వచ్చింది నాకు ఈ స్తంబం చూస్తె గుడిలో.

Wk18/Dy3(122) ~ May 1 - Phone Cricket


... OA carries this phone just because he happens to like this game and likes taking his all time high pics.. sigh.


నాకు ఈ కంప్యూటర్ ఆటలు అన్నా ఫోన్ ఆటలు అన్నా చచ్చే చిరాకు కాని ఎప్పుడు వెళ్ళు కదుపుతూ జనాలు తెగ ఆడేస్తారు ఏంటో .

Wk18/Dy2(121) ~ April 30 - Podarillu

a typical village household.. 2 room asbestos house, a clay stove outside the house, some place for the cattle..

అన్నీ ఉండి  ఏమి లేనట్టు బాధపడే ఎందరి కంటే మా పక్కింట్లో  వీళ్ళంటే నాకు  భలే ఇష్టం.. ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ  పాడుతూ   అన్నటు బ్రతికేయ్యడం

Wk18/Dy1(120) ~ April 29 - Godla saavidi

Cattle shed..

పక్కింట్లో కుడితి తొట్టి గేదల గడ్డి ఆ పక్కనే వాళ్ళ ఇల్లు... తృప్తి  ఇదేనేమో అనిపిస్తుంది.