Thursday, November 24, 2011

Day 329 ~ Nov 25 - Knobbed Puzzle

Kid with her favorite pass time knob alphabet puzzle.. she can play this for hours, telling stories about characters next to each alphabet..

చిచ్కూ గాడికి ఈ ఆట చాలా ఇష్టం, తెచ్చినప్పుడు రెండు రోజులు మేము పెట్టి నేర్పించాం ఇప్పుడు తను పెట్టి నేర్పిస్తుంది రోజు మాకు చెప్తుంది.

Wednesday, November 23, 2011

Day 328 ~ Nov 24 - The Ultimate Journey

A coffin maker just outside Gdw Raithu Bazaar

గుడివాడ రైతు బజారు వెళ్ళిన ప్రతి సారీ నాకు ఈ శవం పేటిక ఒకటి ఎప్పుడు కనిపిస్తుంది.. దాన్ని చూసినప్పుడల్లా ఏదో ఒక వింత భావన, అది అమ్ముడు పోకుండా ఉంటె బాగుండు అని అనిపిస్తుంది ఒక్కోసారి, ఒక్కోసారి ఎన్ని ఉన్నా ఆఖరికి ఇందులోనే కదా ఈ కట్టె పోయేది అనిపిస్తుంది, ఒక్కోసారి ఇతని జీవనాధారం ఇంకొకరి చావు మీద ఆధారం కదా అనిపిస్తుంది.. ఆలోచన లేకుండా ఒకసారి కూడా అటు దాటి రాలేను.. ఒక్కోసారి ఒక్కో రకం.

Day 327 ~ Nov 23 - Kaarteeka Anna Samaaraadhana

people waiting for their turn at the annual ceremony in Siva temple.

కార్తీక మాసంలో మా ఊర్లో శివాలయంలో నెలంతా పూజలు చేసి ఆఖారున మహా అన్న సమారాధన/వన భోజనాలు చేస్తారు... నేను ఊర్లో ఉంటె ప్రతి సారి తప్పకుండా ఎల్లి వస్తాను.. ఈ సారి చిచ్కూ గాడిని కూడా తీసుకెళ్ళాం.. తన మొదటి వనభోజనాలు ఇవి.

Monday, November 21, 2011

Day 326 ~ Nov 22 - Junk Yard?

unused vehicles which are rendered useless in the local magistrate's office building premises

మామయ్యకి ఏదో పని ఉంది magistrate  ఆఫీసుకి వెళ్ళాల్సి వస్తే కాసేపు నేను అటు కాకి తిరుగుడు తిరిగాను, అప్పుడు నా కంటికి ఈ పాడు పడిపోయిన బళ్ళు కనిపించాయి.. తుప్పట్టి పోయి, మట్టి కొట్టుకుని ఎందుకు పనికి రాకుండా తయారయ్యాయి.

Day 325 ~ Nov 21 - Raavi Chettu - Poojalu

people waiting below the raavi plant for pooja on last Kaartheeka Somavaaram.

రావి చెట్టు కింద జనాలు అందరు నుంచుని ఒక చిన్న పిల్లవాడితోటి బేరాలు ఆడుతుంటే ఎందుకో అర్థం కాలేదు నాకు.. తీరా చూస్తె చెట్టు మీద ఇంకో పిల్లాడు కొమ్మలు తుంచి విసురుతుంటే ఈ బుడతడు వచ్చిన వాళ్లకి అమ్ముతున్నాడు.  కార్తీక నోములకి ఈ రావి చెట్టు ఆకులని, వెళ్ళని వాడతారంట.. అదీ విషయం.

Day 324 ~ Nov 20 - Work in Progress

kid engrossed in painting her tiny planters.

పండు గాడికి కూడా ఈ మధ్య నా painting పైత్యం పట్టింది.. తనకి ఈ రంగుల బ్రస్షులు ముంచి పుయ్యడం భలే ఇష్టం.

Friday, November 18, 2011

Day 323 ~ Nov 19 - Daily Ritual

A daily ride for the kid on her som taata's old kawasaki bike :).

ఎండా వాన అని లేకుండా ప్రతి రోజు ఒక్క రవుండు తాత అని గోల చేసి మరీ ఊరి పొలిమేరల దాక ఒక సారి చుట్టి రావడం ఇక్కడి ఆనవాయితీ అయిపొయింది.

Day 322 ~ Nov 18 - Du Du Basavanna

Traditional oxen performance...

బసవన్న ప్రతి ఏడాది ఒకసారి వచ్చి వెళ్తాడు.. ఈ సారి కొంచెం తొందరగానే వచ్చేసాడు... దణ్ణం పెట్టి, ఆటలు ఆడించారు కాసేపు... పాపం పాస్ కూడా పోసేసింది ఇంట్లోనే :((... అందరు మంచిది చాలా అన్నారు అలా జరిగితే.

Thursday, November 17, 2011

Day 321 ~ Nov 17 - Back Home

Ducks in SOS village...

ఆ సిటీ గొడవ నించి బయట పడి పల్లెటూర్లో పడి పొతే ప్రాణానికి చెప్పలేనంత హాయిగా ఉంది... ప్రసాంతమైన ఈ ఖజానా బాతులాగ ఉంది నా పని :).

Wednesday, November 16, 2011

Day 320 ~ Nov 16 - Dashing Love

me belting up the kid for her favorite dashing cars.. yes, she is illegal, underage for riding even this toy.. yet we managed to do it ;).

చిచ్కూ కి బీబత్సంగా నచ్చేసిన ఆట ఇది.. ఎంత ఆడిన అమ్మ మళ్ళీ గుద్దేద్దాం అని గోల :).

Day 319 ~ Nov 15 - Pidata Kinda Pappu

Love this yummy stuff, a vendor selling in front of Indira Park.

ముంత మషాలా, పిడత కింద పప్పు, పేరు ఏదైనా రుచి యమహో.

Day 318 ~ Nov 14 - Child Plays

Kid plays with another kid in Balbhavan at JNTU.

ఎప్పుడు ఊర్లోనే ఉండే పండు గాడికి ఇవన్ని చూస్తె భలే పండగ, చాల చక్కగా ఆడుకుంది

Day 317 ~ Nov 13 - Mudupu Kobbari Kaayalu

coconuts offered as "mudupu" for Goddess Chamundeswari in Chitkula, Medak.

చిట్కుల లోని ఈ అమ్మవారి గుడిలో ఏమైనా కోరికలు కోరి ముడుపు కడితే అది తీరినాక ఆ కొబ్బరి కాయ కొట్టి అమ్మవారి దర్సనం చేసుకోవాలి.  మా అమ్మ నాతోటి పండు గాడు పుట్టాలి అని కట్టించింది ఒకప్పుడు.. ఇప్పుడు ఎలాగో అంత దూరం వెళ్లాం కాబట్టి ముడుపు చెల్లించి వచ్చాం.

మనది ఇది తెలియదు అన్నిటి మధ్యలో, మొక్కు తీరితే వచ్చి ఏదోకటి విప్పదీసి కొట్టి దణ్ణం పెట్టుకోవచ్చు అని చెప్పారు.

Day 316 ~ Nov 12 - SOS village

A prayer and news-sharing meet at SOS village where all the kids from the 12 families assembled.. a memorable evening with kids and my kid.

వట్టి నాగులపల్లి దెగ్గర ఉన్న ఈ చోటు చాల ప్రశాంతంగా ఉంది.. పిల్లలు అందరు భలే సంతోషంగా ఆడుకున్నారు చిచ్కూ గాడితోటి.. నాకు ఈ ఊరు, ఈ కాన్సెప్ట్, అన్ని చాల నచ్చేసాయి.. ఆ రాకాసి ట్రాఫిక్ నించి బయటి పడి హైదరాబాద్లో ఇంట ప్రసాంతంగా ఉండటం ఇంకా ఇంకా నచ్చింది.

trip here.

Day 315 ~ Nov 11 - Yummy Memories

with my favorite onion-chicken Teriyaaki from subway and french fries from Mc'D.. reliving memories from US..

inorbit మాల్ లో ఫుడ్ కార్నెర్ లో ఇవి కనపడగానే సొల్లు కార్చుకుంటూ కుమ్మింగ్... :).

Day 314 ~ Nov 10 - Child Labor

The kid runs away with a small bucketful of her washed handkerchiefs so that she can dry them herself.

చిచ్కూ గాడికి బట్టలు ఆరెయ్యడం, ఇల్లు ఊడవటం అంటే మహా సరదా చూసే వాళ్ళు నేను బండ చాకిరి చేయిస్తున్న అనుకునేలాగా చేస్తాడు పనులు.

Day 313 ~ Nov 9 - Gurjari Memories

Stuff I used to love buying back in early 2000s.. now the place has just gotten smaller but the collection brings back nostalgia.

గుర్జరి అంటే అదొక రకమైన ఇష్టం నాకు, మొదట్లో నాకు జీతం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినవి కొనుక్కోవాలి అన్నప్పుడు ఇక్కడే తెచ్చుకునేదాన్ని.. బట్టలు,ఫైల్స్, పూసలు... ఆ నాటి ఆ జ్ఞాపకాలెంతో మధురం.

Day 312 ~ Nov 8 - Main Door

Door at the entrance of Garvi-Gurjari.. something I have a distinct memory of, something that I really like, that old world stuff..

బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఈ తలుపు చూసి భలే ముచ్చట పడేదాన్ని, దాని కోసమే మొదటి సారి గుర్జరికి కూడా వెళ్లాను అంటే అది అర్థం ఆటుంది.. మళ్ళీ ఇన్నాళ్ళకి.

Day 311 ~ Nov 7 - Horrible Traffic

peak time traffic in front of JNTU campus main gate.. the same stretch extends to nearly a mile, honks, lights... scary!!!!

ఐదేళ్ళ తరవాత హైదరాబాద్లో అడుగుపెడితే నన్ను హడాలగోట్టేసింది ఈ ట్రాఫిక్, దారుణం.. గాలి పీల్చడం మానేసి జనాలు దుమ్ము, పొగ పీల్చడం మొదలు పెట్టారు అనడం అతిశయోక్తి కాదేమో.

Day 310 ~ Nov 6 - Dommari Aata

a girl performing tricks on rope in hot blazing sun...

నా చిన్నప్పుడెప్పుడో చూసిన దొమ్మరి ఆట మళ్ళీ ఇన్నాళ్ళకి హైదరాబాద్లో చూసాను.. మండుటెండలో ఈ చిన్ని పిల్లని చూస్తె విపరీతమైన ఏడుపు వచ్చేసింది.. ఏమి చెయ్యలేని నిస్సహాయత... ఇదే జీవితం అని ఒక సముదాయింపు.

Day 309 ~ Nov 5 - Kaaki rescue

me applying turmeric to the injured crow after rescuing it from the well

పొద్దున్నే లేచి టిఫెన్ తింటుంటే ఒక్కసారి కొన్ని వందల కాకుల కేకలు గోల, ఏంటా అని చూస్తె నూతిలో ఒక కాకి పడిపోయి రాలేకపోతుంది, పైన ఉన్నవి ఏమి చెయ్యలేకపోతున్నాయి.. దానికి ఒక పార పెట్టి ఊతం ఇచ్చి పైకి తీసి నున్చోపెడితే వణికిపోతుంది, మిగిలిన కాకులు నన్నేక్కడ పొడిచి చంపుతాయో అని భయం వేసినా కూడా కాస్త ధైర్యం చేసి వెళ్లి చూస్తె గొంతు కింద చీరుకుపోయింది, పసుప రాసి కాసేపు ఎండలో ఇడ్లీ ముక్కలు కాసిని పెట్టి కూచోపెడితే మెల్లిగా ఒపికోచ్చినాక ఎగిరిపోయింది..

Friday, November 4, 2011

Day 308 ~ Nov 4 - Every Day Pills. Eeks!!!

Ever-filled pill box thanks to wheezy cough!!!....

నిత్య రోగికి నిలువెత్తు రూపంలా ఉంది నా పరిస్తితి.. మూడు బిళ్ళలు, ఆరు అరుకులు, మధ్యలో ఇంహలేర్లు...ఈ దిక్కుమాలిన దగ్గు చూసేవాడికి ఇప్పుడో అప్పుడో చస్తానేమో అనేంత చండాలంగా ఉంది... దేవుడా.. తొందరగా తగ్గాలి.  నడలనేను, కూర్చోలేను, నున్చోలేను.. పాపం పండుగాడిని నేను పెద్దగా బెదిరించాకుండానే అన్ని పనులు చేసేసుకున్తున్నాడు ఈ దగ్గు దెబ్బకి దడిసి.

Wednesday, November 2, 2011

Day 307 ~ Nov 3 - Mankena Puvvu

Love this red color of the flowers...

మా రుక్మిణమ్మ మంకెన పూల చెట్టు అని తెచ్చి ఇస్తే ఎలాగుంటుందో తెలియకపోయినా పువ్వు కదా అని పెట్టేసాను.. ఆ చెట్టేమో కాడిలాగా నా అంత  బారు అయ్యాక కూడా పూలు పుయ్యలేదు.. పీకేసి ఎటైన మూలకి మార్చేద్దాం అని అనుకుంటుండగా మొగ్గ తొడిగి పూత పూసింది.  ఇదే మొదటి సారి నేను మంకెన పువ్వు చూడటం.

Day 306 ~ Nov 2 - Pranava Asramam

Archived pic of kid with the ashram boys.. just love this place, the boys and their brought up..

గుడివాడ లో ప్రణవ ఆశ్రమం అని ఒకటి ఉంది అందులో చదువుకునే ఆసక్తి ఉన్న పేద బాలులకి విద్య చెప్పిస్తూ, హాస్టల్ లాంటిది ఒకటి ఉంది.. వీరు అనాధలు కాదు, అయ్యి కూడా ఉండొచ్చు కాని పేదరికంలోంచి వచ్చిన వారు.  మామూలుగా ఎక్కడికైనా ఇలాంటి చోట్లకి వెళ్తే అక్కడ పని చేసే వాళ్ళు ఎగబడి పోయి అడ్డమైనవి కోరడం, అవి సరిగ్గా చేర్చకపోవడం చూసి చూసి విసుగు చెందినా నాకు చాల ఊరటనిచ్చింది.. మీకు ఏమి కావాలి అని అడిగితె ఎంతో చక్కగా  రాసుకునే అట్టలు కావాలి అని దుప్పట్లు రగ్గులు ఏమైనా ఇంకేదైనా అడగమన్నా.. అన్ని ఉన్నాయి అప్పుడప్పుడు పాపని తీసుకురా అక్క ఆడుకుంటాం అన్నారు... గుండె పిండేసారు

Day 305 ~ Nov 1 - Aahaa Emi Andam...

Fine dining to me means not just food but also the ambiance.. this is from Sweet Magic, Patamata... Love this pic!

మాయాబాజార్ సావిత్రి రెండు తెలుగు సినిమా వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేని మధురానుభూతులు.. ఎంచక్కా భోన్చేస్తాప్పుడు ఆవిడ ముద్దు మొహం కనిపిస్తే ఇంకా చెప్పేదేమీ లేదు..