A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Showing posts with label mess. Show all posts
Showing posts with label mess. Show all posts
Tuesday, August 14, 2012
Friday, November 4, 2011
Day 308 ~ Nov 4 - Every Day Pills. Eeks!!!
Ever-filled pill box thanks to wheezy cough!!!....
నిత్య రోగికి నిలువెత్తు రూపంలా ఉంది నా పరిస్తితి.. మూడు బిళ్ళలు, ఆరు అరుకులు, మధ్యలో ఇంహలేర్లు...ఈ దిక్కుమాలిన దగ్గు చూసేవాడికి ఇప్పుడో అప్పుడో చస్తానేమో అనేంత చండాలంగా ఉంది... దేవుడా.. తొందరగా తగ్గాలి. నడలనేను, కూర్చోలేను, నున్చోలేను.. పాపం పండుగాడిని నేను పెద్దగా బెదిరించాకుండానే అన్ని పనులు చేసేసుకున్తున్నాడు ఈ దగ్గు దెబ్బకి దడిసి.
Wednesday, October 26, 2011
Day 295 ~ Oct 22 - Fallen Glory
I find more hair in the bin than on my head :((( when I look at it each time I comb my hair.
జుట్టు రాలడం అనే మాట వింటే నాకు ఈ మధ్య వణుకు వస్తుంది.. ఎవరైనా ఆ మాట అంటే రోలు ఎల్లి మద్దేలకి చెప్పటం అంటే ఇదే అని ఏడవలేక నవ్వడం చింపిరి చూపులు చూడటం. అసలు ఇంకా నెత్తి మీద మిగిలిన నాలుగు పరకలు ఎప్పుడు రాలిపోతాయో అని బెంగ.. కుయ్యో, మొర్రో, లబో దిబో.. లబ లబ లబ.
Day 294 ~ Oct 21 - Dent -o- Car
A car full of dents, could not dare to click a pic from the front view where the real damage is visible.. the buffalo menace!!
కారు తోలడం అంటే ఆషామాషీ కాదు రోడ్ మీద పెద్దగా ట్రాఫిక్ లేకపోయినా అని అర్థం అవ్వాలి అంటే గేదలు తిరిగే రోడ్ల మీద బండి తోలాలి.. నాయనో, తెలంగాణా సమ్మె పుణ్యమా అని ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు దీనికి, అప్పుడే లెక్కలేనన్ని సొట్టలు.. తలుపులు తోసుకు పోయి, బోయినేట్ లేచిపోయి.. ముందు నించి చూడటానికి దారుణంగా ఉంది.. గుద్దిన గేదలు దేవుడి దయ వల్ల సుబ్బరంగా ఉన్నాయి కాని తలుచుకుంటే గుండె దడ మాత్రం ఆగదు
Day 293 ~ Oct 20 - Shredded
I am amazed at my capability of piling up junk and paper all over and when I begin shredding it usually means at least a couple of bucketfuls of waste..phew!!!
నెలకోసారో, ఎప్పుడో ఈ చెత్త చిమ్పుడు కార్యక్రమం పెట్టినప్పుడల్లా అనుకుంటా ఎందుకొచ్చిన గోల ఎప్పటికప్పుడు పారెయ్యాలి అని... ఏళ్ళ తరబడి అనుకోటమే కాని పాటించటం లేదు.
Tuesday, September 13, 2011
Day 255 ~ Sep 12 - U for Under Covers
This is a very bad habit of mine, keeping change when I find a cover or a sheet covering something, under the mattress, under table cloth, under tv covers... everywhere and anywhere..!! sigh
నేను చిల్లర ఖర్చు పెట్టను ఎక్కువ, అంతా కలిపి ఒక చోట పోగేసి ఒక గిన్నెలో పడేస్తాను బ్యాగ్ బరువు ఐనప్పుడు.. ఒక్కోసారి ఏ గుడి దెగ్గర కూర్చుని వచ్చావు అని అడిగేంత ఉంటుంది నా దెగ్గర :).
and a quirk to go with it is.. I dont usually spend the change.. if there is a note, it goes first all the change goes into the bag, bowl or any place like this!!!
నేను చిల్లర ఖర్చు పెట్టను ఎక్కువ, అంతా కలిపి ఒక చోట పోగేసి ఒక గిన్నెలో పడేస్తాను బ్యాగ్ బరువు ఐనప్పుడు.. ఒక్కోసారి ఏ గుడి దెగ్గర కూర్చుని వచ్చావు అని అడిగేంత ఉంటుంది నా దెగ్గర :).
Tuesday, September 6, 2011
Day 248 ~ Sep 5 - N for Noise Pollution
Mike facing our home near the local Ganesh Pandal! Festivals in India bring along a lot of noise along with celebrations... the songs from the mike set all through the day... God!!!
పండగ వస్తే సంతోషం, అది అప్పుడే అయిపోయిందా అని బాధ ఉండడం మామూలే, కాని వినాయక చవితికి దసరాకి ఈ మధ్య నాకు ఎప్పుడు వెల్లిపోతుందా అని బెంగ పట్టేసుకుంటుంది.. మైకు సెట్టు ఒకటి అద్దెకి తెచ్చి, ఊర్లో ఉండే బేవార్సు కుర్రకారు పాటలు మోత మోగించుకుంటూ, చెవులు చిల్లు పడేలాగా చెయ్యటం.. ఇది ఒక ఎత్తైతే సాయంకాలానికి ఆ సందులోని చిన్న పిల్లలందరూ పోగయ్యి పాడే సినిమా బాణీల భక్తీ పాటలు.. చెవుల్లోంచి నెత్తురు కారిపోతుందేమో అనేంత దారుణంగా పిచ్చి కేకల్లాంటి ఆ గానాలాపన విని గుండె నొప్పి వచ్చేస్తుంది నాకైతే.. నాయనో.. విగ్ననాయక వినాయక, గణ నాయక వినాయక అంటూ పండగ కోసం ఎదురు చూసే నేను విసిగించే వినాయక అని వాళ్ళ మైకు సెట్టు పాడైపోవాలని కోరుకున్తున్ననంటే ఏ రేంజ్ లో ఉందొ గోల అర్థం చేసుకోవాలి :(. భక్తీ మొత్తం పోయి విరక్తి మాత్రం మిగిలింది.
ఊర్లో మొత్తం నాలుగు విగ్రహాలు పెడితే ఒకరు మాత్రం ఐదో రోజు తీసేశారు, నాలుగు వైపుల్లోంచి ఒకటి తగ్గింది అని నేను సంబరం చేసుకున్నాను.
Bye Ganesha, love you loads!
Bye Ganesha, love you loads!
Saturday, July 16, 2011
Day 195 ~ July 14 - Piled Up
The trash piled in the backyard thanks to the constant rains.
It is not raining continuously but it is very humid and the wetness just does not go away to burn it away.
చెత్త పేరుకుపోవడం ఒకటి వాన కాలంలో ఉండే పెద్ద సమస్య, తగల బెడదాం అంటే ఎండట్లేదు, ఏదో ఒక మాదిరి ఎండా వచ్చిన్దిలే అనుకునేలోపు తుంపర వాన... నా చిన్నప్పుడు పెంట పోగులు అని పెరడు వెనక చెత్త అంత పోగు చేసి ఆఖరికి ఏడాదికొకసారి పొలంలో ఎరువు కింద వాడేవారు, ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు ఆ పద్దతులు అసలు.
PS: I just take a strong vow not to use plastic at all but it creeps in each time.. the day there is not a single plastic cover/item in trash I would consider myself successful.
It is not raining continuously but it is very humid and the wetness just does not go away to burn it away.
చెత్త పేరుకుపోవడం ఒకటి వాన కాలంలో ఉండే పెద్ద సమస్య, తగల బెడదాం అంటే ఎండట్లేదు, ఏదో ఒక మాదిరి ఎండా వచ్చిన్దిలే అనుకునేలోపు తుంపర వాన... నా చిన్నప్పుడు పెంట పోగులు అని పెరడు వెనక చెత్త అంత పోగు చేసి ఆఖరికి ఏడాదికొకసారి పొలంలో ఎరువు కింద వాడేవారు, ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు ఆ పద్దతులు అసలు.
PS: I just take a strong vow not to use plastic at all but it creeps in each time.. the day there is not a single plastic cover/item in trash I would consider myself successful.
Wednesday, January 26, 2011
Subscribe to:
Posts (Atom)