Showing posts with label me. Show all posts
Showing posts with label me. Show all posts

Tuesday, August 14, 2012

Wk33/Dy5(222) ~ August 9 ~ Un-Follow'ed

though the folder says productivity, it is exactly the opposite when it comes to my life.. most unproductive time spent is in these sites

మెల్లిగా ఒక్కోటి నా వ్యసనాలని పక్కన పెడుతున్నా... 

Monday, July 30, 2012

Wk31/Dy6(209) ~ July 27 ~ Virtual to Real

A real sweet virtual buddy makes time to meet me and the kid all the way from US during her short trip.. love you K for you sweet gesture

స్నేహం అనేది ఎప్పుడు ఎవరితో ఎలా ఏర్పదిపోతుందో తెలియదు కాని సృష్టిలో దాని కంటే తీయనిది లేదు అని మాత్రం నిజం.  ఏంటో దూరం నించి నన్ను చూడటానికి వచ్చిన నా కంప్యూటర్ నేస్తం నా మనసుని చెప్పలేని ఆనందం తోటి నింపేసింది.. 

Wk30/Dy5(201) ~ July 19 ~ Shopping for Self

Dupattaas of the dress materials I have purchased on an impulse

ఆస్తమా వచ్చి అయ్యో కుయ్యో అనుకుంటూ మల్లి మంచం మీద పడ్డాను కొన్ని రోజులు అప్పుడు ఇంట్లో ఉంది ఉంది విసుగెత్తి కొనుక్కొచ్చిన బట్టలు.. కుట్టడానికి ఇచ్చాను, మూడు ఏళ్ళ నించి అవే కట్టి కట్టి విసుగొచ్చేసి ఆఖరికి చూసేవాళ్ళకి విముక్తిని ప్రసాదించా :).

Wk30/Dy2(198) ~ July 16 ~ Weight Loss Tamaasha

Got myself into this friendly wt. loss competition for self-motivation

అడ్డంగా నేను పొడుగ్గా పిల్లా పెరుగుతూ పోతుంటే నాకు అప్పుడప్పుడు కొంచెం సిగ్గేస్తూ ఉంటూనే ఉన్నా మళ్ళీ ఆ అని నాలిక తిప్పేసుకుని నా తిండి గోల నాదే అన్నట్టు ఉండిపోయా.. ఫ్రెండ్స్ కొందరు మొదలు పెడితే నేను టింగు రంగా అంటూ పేరు ఇచ్చి, కాస్త తిండి తగ్గించా కాని వ్యాయామం గట్రా చెయ్యట్లేదు.. అప్పటికి ఇప్పటికీ ఏమైనా తగ్గావా అని అడుగుతారు కదూ.. తగ్గితే కొత్తగా దిగి ఆ ఫోటో పెట్టేద్దును.. గ్రాము బరువు కూడా తగ్గలేదు.. కాకపొతే తృప్తి ఏంటి అంటే పెరగను కూడా లేదు.

Sunday, April 22, 2012

Wk16/Dy7(112) ~ April 21 - Yaadein Yaad Aati hai..!

Found the greeting cards and a few more pics in the excavations :))... cant be more happy!

నా సామాన్లు నేను ఇండియా, అమెరికా, ఊరు అని తిగుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఉండిపోయాయో కూడా తెలియకుండా ఉండిపోయాయి ఇప్పుడు అవి మా ఊరు వెళ్ళినప్పుడల్లా తవ్వకాల్లో ఏదో ఒకటి బయట పడి, నాకు చేరుతున్నాయి... :).
Phew... I used to be sooooooooooo thin about 3 yrs. ago... sigh

Tuesday, April 17, 2012

Wk16/Dy4(109) ~ April 18 - Thirty Four and Counting....!


Me in B/W and the kid in color... a baby pic of mine 3 months old and the newborn kid..

మూడేళ్ళ క్రితం చిచ్కూ గాడికి కూడా ఏప్రిల్ 18 due date ఇచ్చినప్పుడు ఇంకో బుల్లి రాకాసి అనుకున్నా.. తను నా పుట్టిన రోజున పుడుతుంది అనే సంతోషం కంటే నా రాత దానికి రాకూడదు అని ఒక భయం ఉండేది.. మొత్తానికి తను ఏప్రిల్ 9 న పౌర్ణమి రోజున పుట్టేసింది... అక్కడికి కదా సుఖాంతం..

ఇప్పుడే కాదు నా చిన్నప్పుడు కూడా వెతికి పట్టుకుందాం అన్న ఒక్కటంటే ఒక్కటి కూడా నా పోలిక లేదు :((... bwaaah ...!



Thursday, March 8, 2012

Wk10/Dy5(68) ~ March 8 - Rangeli Holi...

The colors masti with the kid...!

చాలా చాలా ఏళ్ళ తరవాత హోలీ ఆడాను పిచ్చి పిచ్చిగా... మీ అందరికి కూడా ఈ హోలీ మీ జీవితంలోకి బోలెడు రంగులని నింపాలి అని కోరుకుంటున్నా.

Wk9/Dy7(63) ~ March 3 - Aakulo Aakunai

The first ever time the kid has allowed me to put mehendi on her hands when awake and with full consent...

చిచ్కూ గాడు పెద్దోడు ఐపోతున్నాడు దానితో పాటు ఆడపిల్ల లక్షణాలు కూడా కొన్ని వంట బట్టిన్చుకుంటుంది... ఎంచక్కా గోరింటాకు పెట్టించుకుంటుంది.. cone తోటి వెయ్యడం వరుకు బాగానే ఉంటుంది కాని ఇలా ఆకు నూరి పెట్టించుకోవడం ఇదే మొదటి సారి బుద్ధిగా పెట్టిన్చుకుంది.. పక్కన చుక్కలు అడిగి మరీ... 

Tuesday, February 28, 2012

Wk8/Dy6(55) ~ Feb 24 - Cheera Kattu

Saree just put for sun-drying wearing  for just an hour or so...!

అప్పుడెప్పుడో ఆరు ఏడు సంవత్సరాల  కింద కొన్న చీరలు ఇప్పటికీ కొన్ని మడతలు కూడా విప్పనివి ఉన్నాయి నా దెగ్గర... అసలు విప్పదీస్తే పిగిలిపోతాఎమో అని ఒక పక్క భయం కూడా, ఇంకో నిజం అంటే నాకు చీర కట్టడం రాదు, చుట్టడం అంటే ఏదో చేసేస్తా :).. కీర్తి నీకు బాగా తెలుసు కదా ఆ సంగతి ;).


ఇంతకీ సంగతేంటి అంటే నా కూతురు కి నేను చీర కట్టుకుని తను పట్టు లంగా వేసుకుంటే ఇట్టం అంట, ఎక్కడైనా భోజనాలకి వెళ్ళాలి అంటే చాలు అమ్మ చీర అని మొదలు పెడుతుంది.. తన పోరు పడలేక ఈ మధ్య చుట్టడం...అదేలెండి కట్టడం చేస్తున్నా.

Tuesday, February 21, 2012

Wk7/Dy6(48) ~ Feb 17 - Down and Out :(((

the opening screen of my gift Kindle from OA's cousin :((.. I am not able to use the charger for some reason... any suggestions to help me out!!!!!

నాకు సుధాకర్ అన్నయ్య అని ఒక అన్న ఉన్నారు ఆయన నాకు పుస్తకాలు ఇష్టం అని సోనీ రీడర్ కొనిపెట్టారు అప్పుడెప్పుడో.. అది వచ్చిన కొత్తల్లో నాలుగేళ్ల కిందట.. ఇప్పుడు అది పాత బడిపోయింది అని కొత్త kindle తను వాడేది 9  inches ఇచ్చి పంపించారు... అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని టైపులో అది చేరింది కాని ఛార్జ్ అవ్వడం లేదు :(((((...!!!  దాని charger  ఇండియా లో ఎక్కడ దొరుకుంటుందో చెప్పి పుణ్యం కట్టుకోండి మహా ప్రభో!

Friday, February 3, 2012

Wk5/Dy7(35) ~ Feb 4 - My First School

This is a sepia picture of the school that I first went to... right in front of my grandparents' home... 30 yrs. ago and still the same..

చిన్నప్పుడు నేను వెళ్ళిన బడి.... నాకు బాగా గుర్తు కొన్ని బియ్యం, మురమురాలు పోసే వాళ్ళు సంచిలో నెలకోసారి అనుకుంటా :).. ఇప్పటికీ ఆ బడి ఉంది కాని పండు గాడిని పంపాలంటే పచ్చి బూతులు నేర్చుకోస్తాడు అని భయం.   

Thursday, February 2, 2012

Wk5/Dy4(32) ~ Feb 1 - Nenadoka Type...

Two contradictory things that I plan to do at the same time.. Pro and Anti Ramayana Epic.

ఊరందరిది ఒకదారి నాది ఇంకో దారి.. ఇది జగమెరిగిన సత్యం :).. ఊరందరిది ఒక దారి నాది మాత్రం రహదారి అనేది నేను అనుకునే సత్యం.   RGV తెగ పొడిగిస్తే ఏంటబ్బా ఇది ఒకసారి చదవాలి అనుకున్న, మళ్ళి నవ్యలో కళ్ళు తెరిచినా సీత చదివినాక ఈసారి చదివేయ్యల్సిందే అని గట్టి నిర్ణయం తీసుకున్నా.. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు..

The playlist containing Chaganti gaari discourses on Ramayana and Human Values in Today's Society..
రామ భక్తుడైన చాగంటి గారి రామాయణం మానవీయ విలువలు అనే ప్రసంగం వింటూ ఇది చదవడం ఈ కధకి మీరెవరు అనుకోని మలుపు... అదొక పైత్యం అనుకోండి ఏమైనా అనుకోండి.. ఒక ప్రయోగం అని మాత్రం నేను చెప్పగలను.

Friday, January 27, 2012

Wk4/Dy7(28) ~ Jan 28 - In the Name of Kid

Kaleidoscope and flexi-ball...

పండు గాడి పేరు చెప్పి పండగ చేసుకోడం నాకు బాగా అలావాటైన పనే కదా :).. నాకు నచ్చినవన్నీ కొనేసుకుని వాడికి అని ఒక పేరు.  ఏదో నా సంబరం నేను తీర్చుకోడం కాకుండా నా ఇష్టాలు తన మీద రుద్దడానికి నేను చెప్పే కబుర్లు, కధలు.. అసలు ప్రపంచంలో వీటిని మించి బొమ్మలు ఉంటాయ అన్నట్లు కహానీలు... పాపం పిచ్చి కుంకడు చెప్పినవి ప్రస్తుతానికి నమ్మేస్తున్నాడు ;).

Monday, January 16, 2012

Week 2, Jan 13 ~ Readymade Henna Blocks

Identical peacock pattern blocks for me and the kid..

ఇలా రంగులో ముంచి అలా చేతి మీద అచ్చు వేసి తియ్యడం ఎంత హాయిగా అయిపోయిందో :).

Friday, January 6, 2012

Week 1, Day 7 - Jan 7 - Quirky Collection

Collection currency :).

ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు కాని, నాకు ఉహ తెలిసాక నా దెగ్గర ఉన్న కొత్త నోటు ని ఒక దాన్ని తీసి దాచిపెట్టేదాన్ని, అది వాడేదాన్నికాదు ఒకవేళ తీసినా అవసరం పడి మళ్ళీ ఏదో అప్పులోడికి బాకీ అన్నట్లు తిరిగి పెట్టేసేదాన్ని.. మళ్ళీ అవి పెట్టుకోడానికి ఒక పర్సు కూడా ఉండేది.. మొన్న తిరిగొచ్చిన నా సామాన్లలో అది కూడా వచ్చిందోచ్!

Tuesday, December 20, 2011

Day 355 ~ Dec 21 - Dhyana Workshop Ends!!

The books and CDs I  had purchased from the counter after the final ceremony...

నలభై రోజుల ధ్యానం క్లాస్సులు ఆఖరి రోజు.. ప్రతి రోజు రెండు నించి సాయంత్రం నాలుగు గంటల దాక రోజుకి రెండు గంటలు, ఒక గంట ధ్యానం, ఒక గంట సత్సంగం, మనసుకి, శరీరానికి కూడా ఏంటో తృప్తిని ఇచ్చింది.. కొన్ని రోజులు నేను వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లో లేకపోతె ఎక్కడుంటే అక్కడ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే చాల ఫలితం కనిపించింది.


Wednesday, November 16, 2011

Day 320 ~ Nov 16 - Dashing Love

me belting up the kid for her favorite dashing cars.. yes, she is illegal, underage for riding even this toy.. yet we managed to do it ;).

చిచ్కూ కి బీబత్సంగా నచ్చేసిన ఆట ఇది.. ఎంత ఆడిన అమ్మ మళ్ళీ గుద్దేద్దాం అని గోల :).

Day 317 ~ Nov 13 - Mudupu Kobbari Kaayalu

coconuts offered as "mudupu" for Goddess Chamundeswari in Chitkula, Medak.

చిట్కుల లోని ఈ అమ్మవారి గుడిలో ఏమైనా కోరికలు కోరి ముడుపు కడితే అది తీరినాక ఆ కొబ్బరి కాయ కొట్టి అమ్మవారి దర్సనం చేసుకోవాలి.  మా అమ్మ నాతోటి పండు గాడు పుట్టాలి అని కట్టించింది ఒకప్పుడు.. ఇప్పుడు ఎలాగో అంత దూరం వెళ్లాం కాబట్టి ముడుపు చెల్లించి వచ్చాం.

మనది ఇది తెలియదు అన్నిటి మధ్యలో, మొక్కు తీరితే వచ్చి ఏదోకటి విప్పదీసి కొట్టి దణ్ణం పెట్టుకోవచ్చు అని చెప్పారు.

Day 313 ~ Nov 9 - Gurjari Memories

Stuff I used to love buying back in early 2000s.. now the place has just gotten smaller but the collection brings back nostalgia.

గుర్జరి అంటే అదొక రకమైన ఇష్టం నాకు, మొదట్లో నాకు జీతం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినవి కొనుక్కోవాలి అన్నప్పుడు ఇక్కడే తెచ్చుకునేదాన్ని.. బట్టలు,ఫైల్స్, పూసలు... ఆ నాటి ఆ జ్ఞాపకాలెంతో మధురం.

Day 309 ~ Nov 5 - Kaaki rescue

me applying turmeric to the injured crow after rescuing it from the well

పొద్దున్నే లేచి టిఫెన్ తింటుంటే ఒక్కసారి కొన్ని వందల కాకుల కేకలు గోల, ఏంటా అని చూస్తె నూతిలో ఒక కాకి పడిపోయి రాలేకపోతుంది, పైన ఉన్నవి ఏమి చెయ్యలేకపోతున్నాయి.. దానికి ఒక పార పెట్టి ఊతం ఇచ్చి పైకి తీసి నున్చోపెడితే వణికిపోతుంది, మిగిలిన కాకులు నన్నేక్కడ పొడిచి చంపుతాయో అని భయం వేసినా కూడా కాస్త ధైర్యం చేసి వెళ్లి చూస్తె గొంతు కింద చీరుకుపోయింది, పసుప రాసి కాసేపు ఎండలో ఇడ్లీ ముక్కలు కాసిని పెట్టి కూచోపెడితే మెల్లిగా ఒపికోచ్చినాక ఎగిరిపోయింది..