Wednesday, August 31, 2011

Day 242 ~ August 30 - H For Handmade


I found these trash to treasure handmade vases made with beads and wires.. first one using the glass top of a traditional lamp and the other from a bulb and a bangle as base structures in the collection that I got from the house owner :).

మా చిన్నప్పుడు ఇలాంటివి చాల చూసే వాళ్ళం, చేసేవాళ్ళం కూడా.. వైర్ బుట్టలు అల్లడం, వగైరా , వగైరా.. చాలా ఏళ్ళ తరవాత మొన్న ఇల్లు దులిపేటప్పుడు ఇవి బయట పడ్డాయి.. ఈ రోజుల్లో నాజూకు సోకులు మొదలయ్యాక ఇలాంటివి చేసే ఓపిక, తీరిక, పెట్టుకునే స్థలం ఎవరికీ ఉండట్లేదు.. నేను కూడా ఇప్పుడు వీటిని ఎక్కడ పెట్టాలా అని దీర్గాలోచనలో ఉన్నా.. 

దీపం బుడ్డి మీది గ్లాసు తోటి పూసలు, వైర్, గట్టిగా అల్లి చేసింది కనీసం పాతిక ఏళ్ళ కిందటిది, ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

Sunday, August 28, 2011

Day 241~ August 29 - G for Ga-Ga Over Parenting!

This and of course the numerous websites that I researched and kept for parenting needs!!! sigh!! little did I know that parenting just happens and not learnt!!

చిచ్కూ పుట్టకముందు అసలు బోలెడు పుస్తకాలు కొనేసుకుని, న్యూస్ లెటర్స్ కి మెయిల్ అడ్రెస్స్లు ఇచ్చేయ్యడం లాంటివి చాల చేసేసుకున్నాను... కాని నేను వీటి అన్నిట్లో నేర్చుకున్నది చాల చాల తక్కువ, తను ఎదుగుతున్న కొద్దీ తను నాకు నేర్పించిందే ఎక్కువ.. అనుకుంటాం కాని స్వయంగా నేర్చుకునేదే ఎక్కువ అని అర్థం అయ్యింది.  కాబట్టి కొత్త తల్లి తండ్రులకి నా అనుభవ పూర్వక సలహా ఏంటి అంటే parenting comes naturally, good to be enthusiastic to learn and seek advise BUT kid's needs vary, our circumstances, societies and individual and collective family behaviors and natures vary, traditions and customs vary so just use your discretion in how much and what you actually want to take from it.

PS: what is the telugu one word for parenting.. pempakam, aalana paalana are for raising the kids but any specific term for PARENTING??? HELP PLS.

Day 240 ~ August 28 - F For Fresh Paint

Freshly painted unused clay pot, waiting to dry up to be painted later on with designs

paint చేసిన తరవాత బాగానే ఉంటుంది కాని చేసేటప్పుడు, ఆ తరవాత బ్రష్లు కడిగేటప్పుడు, దానిని చిచ్కూ ముట్టుకోకుండా చూసేటప్పుడు మాత్రం సినిమా కనపడుతుంది. 

Friday, August 26, 2011

Day 239 ~ August 27 - Enchanting Entrances!

The main door leading to the hall.  Very strong and simple detailing gives it an old world charm.

సామాన్యంగా ఇంటికి ముఖ ద్వారం చాల అందంగా భారీగా ఉండేటట్టు చూసుకుంటారు జనాలు, లోపల ఏమున్న ముందర బయటకి కనిపించేది అదే కదా.. ఈ దర్వాజ నేను పుట్టాక మునుపు చేయిన్చుంటారు, అయినా పీప్ హొలెస్  పెట్టించారు అంటే ఆ కాలానికి ఇది చాలా భారీ కిందే లెక్క.. :).

Thursday, August 25, 2011

Day 238 ~ August 26 - D For Dairy Exercise

Churning curd and water to extract butter the traditional way...

చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సావిడికి దెగ్గర ఉండే పెద్ద వాసానికి నులక తాడుతోటి  కట్టి ఉంచిన ఒక పెద్ద చల్ల కవ్వం, దాని దెగ్గర బోర్లించిన కుండ ఉండేవి, ఎప్పుడో తప్ప తను ఎక్కువ వాడటం నేను చూడలేదు, చాలీ చాలని బ్రతుకులకి పాడి లేకపోతె వెన్న తియ్యడం ఒక గొప్ప పని.  కుదిరినప్పుడు మటుకు చేసేది తను, చూస్తె భలే అనిపించేది.

The butter gradually separated from the curd starts layering around the vessel and the traditional wooden churner.

ఇప్పుడు అంత దాచి చేసే ఓపిక లేకపోయినా బాగా తరిపి కట్టేసిన గేద పాలు కాచినప్పుడు విపరీతంగా మీగడ కట్టేస్తుంది అది తినేస్తే యమా రుచిగానే ఉంటుంది కాని తరవాత ఒళ్ళు మోసుకోవడం చాల కష్టం అందుకని ఇలా వారానికి రెండు సార్లు పెరుగు మీద మీగడ తీసి వెన్నతీసే కార్యక్రమం.

Finally done and collected and made into a ball of butter.... yum, yum, yum.. I love eating it with pickles and even just like that.

ఇలా ఇంట్లో తీసిన వెన్నతోటి కాచిన నెయ్యి తింటే ఉంటుందీ... కొంచెం కరివేపాకు వేసి నెయ్యి కాచినాక దాని అడుగున అంటిన గోదారికి పోటీలు పడి తినేసే వాళ్ళం.  నాకు మాత్రం పాలు, పెరుగు, నెయ్యి అంటే చాల ఇష్టం కాని వెన్న అంటే మటుకు పడి చస్తా.

PS:  When I complain of layers of fat on the body, you know which layers to blame it on :).

Wednesday, August 24, 2011

Day 237 ~ August 25 - C For Children Against Corruption

School kids forming a chain standing on the roads supporting Anna..

నిన్న సాయంత్రం పనుండి ముదినేపల్లి వెళ్తే అక్కడ రోడ్డు మీద బడి పిల్లలు, ఇంటర్ కాలేజి పిల్లలు, కాన్వెంట్ పిల్లలు అందరు చల్ల బడ్డాక సాయంత్రం నాలుగింటికి ఇలా అన్న జిందాబాద్, we want no corruption అని అరుచుకుంటూ తిరిగారు, ఇందులో వాళ్లకి అర్థం అయ్యింది ఎంతో తెలియదు కాని అలా రోడ్లెంమాట పరుగులు కేకలు, ట్రాఫ్ఫిక్ లో ఆటోలు, బస్సుల మధ్య నడవటాలు, పక్కన టీచర్లు, కొందరు పోలీసులు ఉన్నా కూడా నాకు చాల భయమేసింది.. మూడు నాలుగు తరగతుల పిల్లలు కూడా ఇలా highway మీద తీరడం అస్సలు నచ్చలేదు.


Tuesday, August 23, 2011

Day 236 ~ August 24 - B for Boxed Lunch

Lunch box picked up by the kid recently at a store and her water bottle.. packed for lunch!!

చిచ్కూ ని బడికి పంపడానికి ముఖ్యమైన కారణం అక్కడి పిల్లల్ని చూసి తను కొంచెం అన్నం తింటుంది అని, అంతకు ముందు నేను వెళ్లి తినిపించి తెచ్చేదాన్ని ఇప్పుడు సారు డబ్బా కట్టి ఇచ్చేస్తే తనే అలవాటు చేసేస్తాను అని చెప్పారు.. రెండు రోజుల నించి... దేవుడా, ఓ మంచి దేవుడా వీడికి తిండి మీద మనసు వెళ్ళే లాగ చూడు తండ్రీ.

Monday, August 22, 2011

Day 235 ~ August 23 - A for Awesomeness

.. the kid in her Radha attire.. awesomeness and kids kind of go together :)... err.. they are actually synonyms!

పసితనంలో చీరలు చుట్టబెట్టి, జడలు అల్లి, పెద్ద ఆరింద  లాగ తయారు చేసుకుని చూసుకుని మురిసిపోవడం, మళ్ళీ అంతలోనే అమ్మో ఎంత ఎదిగిపోయింది నా చిట్టి తల్లి నా దిష్టి తగిలిపోతుంది అని బాధ పడిపోవడం అదే అనుకుంటా కన్నతల్లికి ముచ్చట.

కృష్ణాష్టమి రెండు రోజులు వచ్చింది కదా అని ఈ రోజు రాధ రేపు కిచనా లాగ తయారు అవుతాను అని అందరి పిల్లల్ని చూసి తనే చెప్పింది.. ఎయ్యటం దాక బాగానే ఉంది కాని దాంట్లో ఫోటోలు తియ్యటానికి వచ్చిన తిప్పలు :((((.. బాబోయ్.

.. and inspired by the alphabet photo series, I begin mine with the kid as usual :).

PS:  Keerthi, this is for you!

Sunday, August 21, 2011

Day 234 ~ August 22 - Naachu...

I loved these green water plants which were shaped like flowers a lot.. aren't they beautiful.

నాచు మొక్కలు, మంచి పూలు లాగ ఉన్న నాచు, పచ్చగా అందంగా పెద్ద పెద్ద కుండీలలో పెరుగుతూ చాల బాగుంది హైలాండ్ లో పేరు తెలియదు కాని చాల బాగా అనిపించి కొన్ని తెచ్చుకున్నాను... 


Day 233 ~ August 21 - Haleem.. Slurrrrp!!

Yummy Haleem, all the way from Vja.. taste buds were starved for this for the past 4 yrs. or so, earlier each year Ramzaan month, it was a must have!!

హైదరాబాద్లో ఉంటె రంజాన్ నెల వచ్చిందంటే చాలు హలీం, హరీస్ అనుకుంటూ గంతులేసుకుంటూ సాయిబ్బులకంటే ఎక్కువ సంబరపడి పోయేదాన్ని నేను.  ఇటు వైపు వచ్చేసాక ఎప్పుడు దొరకలేదు అసలు ఏంటో తినాలి అని పెద్దగా ప్రయత్నించలేదు కూడా.. మళ్ళీ మొన్న గుంటూరు వెళ్తే అక్కడ మళ్ళీ దీన్ని చూసి లొట్టలు వేసుకున్నా కాని తినడం కుదరలేదు, అందుకే పని గట్టుకుని విజయవాడలో ఉంది అంటే వచ్చేటప్పుడు తెచ్చేసుకున్న...

Day 232 ~ August 20 - Haailand

A trip to Haailand, near chinna Kaakani in Guntur just about 7 km from Vaaradhi is a nice place to chill out!

కృష్ణ జిల్లాలో పెద్దగా పిల్లలని తీసుకెళ్ళడానికి ఆడించటానికి అవకాశాలు చాల తక్కువ, ఒక థీమ్ పార్క్ మొదలు పెట్టారు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఆఖరికి ఇప్పటికి పడింది.. వాటర్ రైడ్స్ మాత్రమె వెళ్ళాము అప్పటికే బాగా అలిసిపోయింది పండు గాడు, సాయంత్రం డాన్సు ప్రోగ్రాం, పాటలు, ఏవేవో పెట్టారు  అన్నీ బాగానే ఉన్నాయ్, కొంచెం కాస్ట్లీ అనిపించినా కూడా ఎడారిలో ఒయాసిస్సు లాగ అనిపించింది నాకు మాత్రం.

the kid enjoys a banana peel slide pool with my cousin :).

Friday, August 19, 2011

Day 231 ~ August 19 - Feet in Sand

yet another archived picture from the beach!  tried to get the kid to join but she just kept her distance at the shore asking us to be careful... sigh... when did the parenting change from this end to the other... kids grow up fast!!!!!


Foot prints in sands of time, only to be washed away the moment a next wave hits the shore taking things from there and bringing stuff from somewhere!!!!  Changes, new and unexpected, sometimes unwanted, resisted, unavoidable and finally adjusted, isnt that the essence of life.

Day 230 ~ August 18 - Indian Idols :)

cute little figurines of Lord Krishna... pic from a store shelf, loved all the 4 colors

నాకు భగవంతుడు అంటే ఒక శక్తి, దానికి రూపాలు తక్కువ ఇస్తాను, ఎందుకో తెలియదు రాధా కృష్ణ బొమ్మలు అంటే నాకు నచ్చవు పెద్దగా, బుల్లి వినాయకుడు నచ్చినంత నచ్చవు, గీత అంటే ఇష్టం ఆ సారం బోధించి జ్ఞానం పంచిన కృష్ణుడు అంటే ఇష్టం, కాని మొదటి సారి ఒంటరి కృష్ణుడి బొమ్మ నచ్చింది నాకు.. కొనలేదు కాని, చూసి సంతోషించా. 





Wednesday, August 17, 2011

Day 229 ~ August 17 - .. and that's me

... this is one pic on the blog that I haven't clicked and this is me trying and checking out a new SLR with basic lens..

ఇందులో ఉంది నేనేనొచ్.

Day 228 ~ August 16 - A Different Artform

... the guy in the picture writes names on the shells, rice grains and makes key chains, pendants and paper weights out of them, which are indeed very beautiful.

కృష్ణ జిల్లాలో బందరుకి ఇవతల వేమవరం అనే ఊర్లో కొండాలమ్మ తల్లి అని ఒక అమ్మవారు ఉంటారు, శ్రావణ మాసంలో అక్కడ సంబరాలు చేస్తారు.. ఆ సంబరాల్లో ఈ అబ్బాయి పెట్టుకున్న ఈ బుల్లి కొట్టు నాకు భలే నచ్చింది.

Day 227 ~ August 15 - Isaka Goollu

we try to build a modest sand castle and decorate our sand nest.. a team work :)

... we build a nest with the kid's leg  :).

చిన్నప్పుడు బుల్లి కాళ్ళు పెట్టి, దాని మీద ఇసక పోసుకుని, గట్టిగా వత్తి, ఆ పాదాలు తీసేసి గూడు లాగ చేసి పిచిక గూళ్ళు కట్టేవాళ్ళం, మళ్ళీ చాల కాలానికి చిచ్కూ గాడి పాదంతో కట్టిన గూడు.

.... and then we are just about to pack up and move back!!

Day 226 ~ August 14 - Mangenapudi Beach

we went over to watch sun rise at a beach for an early morning long drive but could only catch a glimpse after the sun was well up in the sky due to thick clouds...

బందరు నించి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మంగినపూడి బీచ్ దెగ్గరకి సముద్ర స్నానాలకి మా అమ్మమ్మ తీసుకెళ్ళేది, ఇప్పుడు చిచ్కూని తీసుకుని సూర్యోదయం చూడటానికి వెళ్లాం.

Day 225 ~ August 13 - Chinna Tirupati

.. this is the main entrance to Dwaraka Tirumala that we made an unplanned trip to.

భీమడోలు దెగ్గర ఉండే ఈ చిన్నతిరుపతి అంటే బాగా రద్దీగా ఉండే ఒక గుడి, దీని అసలు పేరు ద్వారకా తిరుమల, ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి ని చిన్న వెంకటేశ్వర స్వామి అంటారు, ఈయనకి కోపం ఎక్కువ అంటారు, అక్కడ మొక్కిన మొక్కులు ఇక్కడ తీర్చినా చెల్లు కాని ఇక్కడివి ఇక్కడే తీర్చాలి అంటారు.

Day 224 ~ August 12 - The Wash Team

and this is how we clean a muddy car.. and we actually do a good job of it.

Day 223 ~ August 11 - Pooja Kalasam

A piece that I picked from my trip to Mysore, it had accompanied me across the globe and back..

పూజ గదిలో పెట్టుకునే ఈ బుల్లి కలశం నాకు ఎందుకో చూడగానే భలే నచ్చేసింది.. కొబ్బరి కాయలో బుల్లి వినాయకుడు, ఆకులు, అన్ని... ఈ మధ్య నేను పూజలు మానేసాక ఇలా ఒక మూలకి చేరింది.

Day 222 ~ August 10 - Pedana Kalamkaari

The girl dyeing the blankets with natural colors and dyes.

కృష్ణ జిల్లాలో బందర్ దెగ్గర ఉండే ఈ చిన్న ఊరు పేరు పెడన, అక్కడి కలంకారి పని, కార్మికులు దేశం మొత్తం మీద ఎంతో పేరు బడినవి.. నాకు ఎప్పటి నించో వీటి తయారీని చూడాలని ఒక కోరిక ఉండేది...

The wooden design models or dye casts are dipped in the colors provided.. these girls are paid by the item for the amount of work they do in a day.

A closer look at the dye cast.

Day 221 ~ August 9 - Lovely Chappal

A gift to the kid from US.. a cute and simple design that I fell in love with.

నా చిన్నప్పుడు కాలేజి కి వెళ్ళేదాకా కూడా పారగోన్ చెప్పులు మాత్రమె వేసుకునేదాన్ని.. అప్పుడు కూడా బాట చెప్పులు మాత్రమె.. ఈ రోజుల్లో పిల్లలకి దొరికే డిజైన్లు చూసి కళ్ళు తిరుగుతున్నాయ్.

Day 220 ~ August 8 - Gootiki Chere Vela

A regular view in the evenings which the kid loves, the way the cranes go home in groups!!

సాయంత్రం వేళ ఇంటికి చేరే కొంగల గుంపులు.


Day 219 ~ August 7 - Done with 365!!!

Wanted to click something special on completing the pic a day 365-day project successfully!!! and what better than the roses that grew in our garden and the hands that have been taking these pics throughout the year  :).

ఒక ఏడాదిలో ఎన్నో మార్పులు...!

Began this blog a year ago on August 7th, it has been my buddy all the while, gave me something to look forward to in a day.. thanks Usha for the idea!!

Day 218 ~ August 6 - Pindi Enugu

Chapati dough turned elephant for the kid to play with ;).

నలుగు పిండితో అమ్మవారు వినాయకుడిని చేస్తే చపాతి పిండి తో పండుగాడికి ఏనుగు బొమ్మ చేసాం మేము.. పోలిక అస్సలు బాగోలేదు కదా... తల తోక లేకుండా ఆలోచించడమే నా పని కాబట్టి లైట్ లైట్

Thursday, August 4, 2011

Day 217 ~ August 5 - The Dame From Archives

I am somehow reminded Mary from the rhyme Mary had a little lamb..when I see this pic of the kid, the long gown, the hat, the bearing and all.. just perfect minus the lamb and the stick in her hand.

కొన్ని నెలల క్రితం మేము మా విహార సమయంలో, అదేలెండి బలాదూరు తిరుగుళ్ళకి వెళ్తున్న సమయంలో అక్కడ అక్కడ వెలగబెట్టే రాచకార్యాలలో ఒకటైన ఈ పూలు తెమ్పే కార్యక్రమంలో తీసిన ఫోటో ఇది.  అలా రోడ్లేమ్మట పడి తిరిగుతూ కనిపించే అందరిని పలకరించుకుంటూ, లేదంటే వాళ్ళు పలకరిస్తే సమాధానాలు చెప్తూ, ఆగుతూ, పరిగెడుతూ, అన్ని చూసుకుంటూ తీరికగా తిరిగొచ్చే కాలక్షేప సమయం, ఈ ఊర్లల్లో తప్ప ఇంకా ఎవరికీ అంత తీరిక ఉంటుంది.. 

Day 216 ~ August 4 - Morning Rays

I love the way, early morning sun rays cheer up the home giving indoor plants and the house itself that perky cheerful look.

నును వెచ్చటి లేత సూర్య కిరణాలు, ఇలా ఇంటి మీద వంటి మీద పడుతూ, భలే ముచ్చటగా ఉంటుంది పొద్దున్నే... 

Day 215 ~ August 3 - Grown UP

The kid's first frock with her latest... kids grow up in a flash, just like that...

చిటికేసే లోపు చిటుక్కున పెరిగిపోతారు ఆడపిల్లలు అంటారు, నిజంగా నిజం.

The tiny pink one seemed like a night gown when she wore it first time and now the lavender one just about below the knees, phew, the tall kids!!!

Day 214 ~ August 2 - Sorted Thoughts

People do tend to misunderstand me as a sorted individual but in reality, am much too far from it, sorting out the blast from the past... a fresh beginning!

జీవితం నేర్పిన ఎన్నో పాఠాలు... కరిగిన కలలు, తెలిసిన నిజాలు, తీపి, చేదు... అప్పటి కలలు రాసుకున్న కాగితాలు, చింపేసిన ఆనవాలు.. ఇదే ఇదే జీవనం... రేపటి గమ్యం తెలుసు, గమనం తెలుసు, ఇది కేవలం ఒక మజిలీ అని కూడా తెలుసు.

Life somehow seems easier when you kind of swim against the tide to the other end, resting at the bank but again something pops up and you find yourself in the need to actually be at the other bank and the struggle begins again... phew!!

Day 213 ~ August 1 - A new ball game

and then we graduate in terms of the ball games we play and even learnt to put it in a hoop.. yay!!

చిచ్కూకి బంతి ఆటలంటే మహా ఇష్టం, ఈ మధ్య కాలంలో కొత్తగా నేర్చుకున్న ఆట.. వంటింటి కిటికీకి పెట్టేసుకుని ఆడుకుంటున్నాం ప్రస్తుతానికి..

Day 212 ~ July 31 - A new lease of life

My Musanda plant that is re-flowering after some massive crow attack... and so all the more precious to me.

నేను తెచ్చి నాటిన కొన్ని రోజులకి ఈ మొక్క మీకా కాకి కూర్చుని ముక్కుతో పూలని పొడిచేసింది, అలా చేస్తుంది అని నాకు మొదటి సారి తెలిసింది, ఏమి లేకుండా కేవలం ఒక కాడ మిగిలింది.. ఇంకా బ్రతకదేమో అని బెంగేసింది నాకు మల్లి ఒక కర్ర ఊతం ఇచ్చి కట్టి భద్రంగా ఉండేలు కట్టి పెంచితే ఆఖరికి ఇలా చిగురు తొడిగి మొగ్గలేసి పూలు పోసేసింది... :).

Day 211 ~ July 30 - Souvenir

A reminder of my visit to Niagara, got this glass bottle filled with water and some golden flakes as a souvenir for that trip.

ఎంత వద్దు అనుకున్న కొన్ని మనకి వచ్చి చేరతాయి, ఎంత కావాలి అనుకున్నా కొన్ని దొరకవు అదే జీవితం... అమెరికాలో నా సామాను మెల్లి మెల్లిగా ఒకోటి వస్తుంటే ఒకలాంటి నిర్లిప్తత, గిరాటు వెయ్యలేని జ్ఞాపకాలు.