Wednesday, September 5, 2012

Wk37/Dy3(249) ~ September 5 ~ Back To The Grind

all set for school after a long break

చాల రోజుల తరవాత మల్లి పిల్ల బడికి వెళ్తుంది, ఈ రోజు నించి మళ్ళీ తనకి పరీక్షలు అంట.. టీచర్ కబురు పెట్టారు ఏమి రాకపోయినా ఏమి అనొద్దు తనకి గడిచిన పది రోజులు చాల మార్పులు వలన ఏమి తోచక పోవచ్చు అని చెప్పి పంపించాను 

Tuesday, September 4, 2012

Wk37/Dy2(248) ~ September 4 ~Clueless

all said and done, no one can really understand or relate or feel the pain the immediate family she left behind clueless and shocked

అందరు దెగ్గర ఉండి  తలా ఒక మాట చెప్పి తలా ఒక పని చేసి ఆ  లేకుండా చేసినా కూడా, చివరికి మిగిలిన ఆ ముగ్గురికి ఈ పరిణామాన్ని తట్టుకునే శక్తి నివ్వమని ఆ పైవాడిని కోరుకోడం కంటే చెయ్యగలిగింది ఏమి లేదు.

Wk37/Dy1(247) ~ September 3 ~ Back Home

a pleasant garden full of flowers welcomes us home, soothing our souls off  the pain

ఒక పన్నెండు రోజుల్లో జీవితంలో చాల చాలా పాఠాలు నేర్చుకుని ఎంతో  ఎదిగిపోయి గూటికి చేరినట్టు అనిపించింది 

Wk36/Dy7(246) ~ September 2 ~ Sivaalaya Sikharam

a memorable monument in OA's life..

ఈ శిఖరం వైపు తను చూస్తూ ఉండగా చేతిలో చెయ్యి వేసి తన తల్లి ప్రాణం పోవడం అనేది చాలా చాల బాధాకరమైన విషయం... నిన్నటి రోజు శివాలయం గుడిలో నిద్ర చేసి తల్లికి పిండ ప్రధానం చేసి ఒక తంతు ముగిసింది అని చెప్పేశారు కాని ఆ బ బాధని ఎవరు తీర్చేది 

Wk36/Dy6(245) ~ September 1 ~ In Memory

final memory left on the box

ప్రాణం పోయినాక మనిషి జ్ఞాపకం ఒక గిన్నె, ఒక గ్లాసు గా మిగిలిపోతుంది :(.. పదకొండో రోజు పెద్ద ఖర్మ.

Wk36/Dy5(244) ~ August 31 ~ Mixed bag

a lot of buds and a little greenery, loved the fact that all the rose plants have survived

ఊర్లో ఇన్నాళ్ళు లేకపోయినా అన్ని మొక్కలు ఎంచక్కా పడిన వానలకి మొగ్గలు తొడిగి పూలు పూసాయి.

Wk36/Dy4(243) ~ August 30 ~ Erra Gulaabi

one  more ..

బుజ్జి గులాబి మొగ్గలు తొడిగి భలే ముచ్చటేస్తుంది.

Wk36/Dy3(242) ~ August 29 ~ Nooru Varahaalu

a few more

ఈ నూరు వరహాలు మంచి ఎరుపు రంగులోఉండి  భలే గుత్తులు గుత్తులు గా బాగుంటాయి.. అంతకు ముందు పూజ అని ఎవరో ఒకరు కోసుకుపోతూ ఉండేవారు.. అసలు ఎప్పుడు సరిగ్గా చూడలేకపోతున్న అని చిరాకేసి ఇవ్వను అని కతినంగా చెప్పేసాను.. పువ్వులు తుమ్పితే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది నాకు, అదొక పిచ్చి మరి... ఇప్పుడు ఎంత చక్కగా అవి కూడా ఆనందంగా మనకి ఆనందం పంచుతున్నాయి.

Wk36/Dy2(241) ~ August 28 ~ Gulaabi

another  bloom

ఈ పది రోజులు ప్రతి రోజు లెక్క పెట్టుకుంటూ బాధ పడుతున్న OA  ని చూసి ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితి లో అలా కాలం కరిగించాం

Wk36/Dy1(240) ~ August 27 ~ Purulu

traditional method of paddy storage

ఈ రోజుల్లో పురులు చాల తక్కువ కనిపిస్తున్నాయి కృష్ణా  జిల్లాలో కల్లాల్లో ధాన్యం అమ్మేసుకోవడమో, కాటా పట్టించి బస్తాలు అమ్ముకోదమో తప్ప ఇలా పురులు వేసి నిలవ చెయ్యడం బాగా తగ్గిపోయింది..  ఈ ఊర్లో మాత్రం ఎక్కడ చూసిన పురులు కనిపిస్తూ భలే ముచ్చటేసింది.

Wk35/Dy7(239) ~ August 26 ~ Neeti Sampu

a common siting for water storage

ఇంచు మించు ప్రతి ఇంటి కప్పు మీద ఇలాంటిది ఒకటి కనపడుతుంది నీటి సరఫరా కోసం 

Wk35/Dy6(238) ~ August 25 ~ Oori Cheruvulu

the water source of the village, 2 lakes which when dried is kind of drought situation... one is on the verge of drying

ఊర్లో రెండు చెరువులు, పక్కా పల్లెటూరు కావటాన ఇంకా కుల వ్యవస్థ ఉన్నందువలన, చిన్న చెరువు పెద్ద చెరువు అని.. పెద్ద చెరువుకి నీరు ఎత్తున ఉంటాయ్, చిన్న చెరువుకి పల్లాన ఉంటాయి... వానలు రాక విపరీతమైన ఎండలకి ఊర్లో ఇంచు మించు కరువు వాతావరణం, నాట్లు ఇంకా పడలేదు, కాలవలు వదలట్లేదు అయోమయం గందరగోళం లాగా ఉందిపరిస్తితి .

Wk35/Dy5(237) ~ August 24 ~ Cracked

the cracked ipad screen

పండు గాడు పరుగెడుతూ ఆడుతూ నెల మీద పడి  పగిలిపోయింది... కొంచెం ఉసూరు మనిపించింది కాని పిల్లకి ఏమి కాలేదు దిష్టి పోయింది అని సరిపెట్టుకున్నాం.

Wk35/Dy4(236) ~ August 23 ~ Cheruvu Gattu

a place that gave us its shade and filled us with peace in toughest times

ఊర్లో చెరువు గట్టున కూర్చుని ఈ వేపు చెట్టు దెగ్గర సేద తీరడం మా ఈ పది రోజుల ఆటవిడుపు.

Wk35/Dy3(235) ~ August 22 ~ RIP

Rest in Peace... never in my dreams did I expect this to be so early

కొన్ని జన్మలు కేవలం ఇతరులు వాడుకుని వదిలేయ్యదానికే ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు, తను నమ్మిన దానికోసం మొండిగా పోరాడిన మనిషి... బ్రతికి ఉన్నన్నాళ్ళు నిత్యం తనలో తను సంగర్షణ పడుతూ ఉన్న తనకి, ఆ పై లోకంలోఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


Wk35/Dy2(234) ~ August 21 ~ Yellow Fellow

First yellow bloom

బుల్లి గులాబి, ఈ చెట్టుకి ఇదే మొదటి పువ్వు.

Wk35/Dy1(233) ~ August 20 ~ Vepa Chettu

Neem tree, a common siting in every household in the village

వేప చెట్టు గాలి పీల్చుకుంటూ పందుం పుల్ల, వేప చిగురు నములుతూ ఆరోగ్యం ఎక్కడో లేదు మన పెరట్లోనే ఉంది అనుకునే రోజులు ఇంకా పల్లెటూర్లో మిగిలే ఉన్నాయి 

Wk34/Dy7(232) ~ August 19 ~ Refill

Time to change the filter assortment in Pure-It

చిన్నప్పుడు ఎంచక్కా ఎక్కడ పడితే అక్కడ బావి బోరు ఏది ఉంటె అక్కడ కొట్టేసుకుని తోదేసుకుని నీళ్ళు తాగేసేవాళ్ళం, ఇప్పుడు నాంది నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని తాగాల్సిన దౌర్భాగ్యం 

Wk34/Dy6(231) ~ August 18 ~ Firangi Paani

The first blossoms

నాకు ఈ మొక్క అంటే చాల ఇష్టం... పోయినేడు తెచ్చి పెట్టింది ఈ ఏడాది పూలు పూసింది 

Wk34/Dy6(230) ~ August 17 ~ Home

visiting the village home for the first time

మొదటి సారి  OA  వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళాము... అత్తగారిని చూడటానికి... అక్కడ గుమ్మం దెగ్గర సింహాలు కట్టి కొన్ని తరాలు అయ్యింది అంట.. పండు గాడు వాటిని ఎక్కి స్వారీ ఆటలు ఆడుకుంది .

Wk34/Dy5(229) ~ August 16 ~ Graded


and the kid gets her first marks list...

మార్కుల పోరు మొదలయ్యింది...  ఎన్ని వచ్చినా పర్లేదు తల్లి అంటే నాకు పెన్ను ఇవ్వు 21 ని 25 చేసుకోవాలి అంట.