Sunday, October 31, 2010

October 31 - Atla Taddi, Uyyalalu

Swinging high and swinging low

It has been raining real bad these past couple of days, hence posting the pictures from my old archives.

అట్ల తద్ది రోజు ఉయ్యాలలు ఊగటం చాలా బాగుంటుంది.. తెల్లవారు ఝాము తలంట్లు, నోములు, వాయనాలు, వంటలు, వగైరా వేరే వాళ్లకి వదిలేసి ఉయ్యాల ఊగటం, అట్లు తినడం మాత్రం చేస్తే అసలు ఆ పండగ నా దృష్టిలో ;).   పోయినేడాది మా అమ్మమ్మ వాళ్ళ దొడ్లో ప్రత్యేకంగా పండు గాడితోటి ఆడుకోటానికి వచ్చే బడి పిల్లల కోసం కట్టించాడు మామయ్య దీన్ని.. పిల్లలు వెళ్ళాక ఖాళి ఉన్నప్పుడు పక్కింటి శీను పద్మ ఆంటి (నన్ను పెంచారు చిన్నప్పుడు, ఇప్పుడు పండు గాడిని).. నాకు వీళ్ళంటే చాలా ఇష్టం ఇప్పటికి కొత్త జంటలాగా చాలా అన్యోన్యంగా ఉంటారు.

October 30 - Awesome Mirror Work

Ceiling in Baba Temple at Angaluru, Krishna District.

ఇది అద్దాల మేడ కాదు, కేవలం అద్దాల పై కప్పు మాత్రమే, చూడటానికి ఏంటో ముచ్చటగా, శుభ్రంగా ఉంటుంది.. నాకు ఈ గుడి అన్నా, గుళ్ళో ప్రదేశాలన్న చాలా ఇష్టం, పండు తల్లిని షికారు తీసుకెళ్ళాలి ఊరు దాటి అంటే ఇదే మా ఫస్ట్ choice.

October 29 - Angaluru Gudi

The most serene baba temple I have been to to-date . a must visit place if you appen to be in Krishna district.

అంగలూరు లో ఉన్న బాబా గుడి అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఆ వాతావరణం, ఆ విగ్రహం, ఆ చోటు, ఆ శుభ్రత, అన్నిటికి మించి అక్కడ ఇంకా వేరే దేవాలయాలకి పట్టినట్టు దేవాదాయ శాఖ చీడ పట్టలేదు.  లంచాలు, అడ్డ దారులు ఇంకా లేవు.  ఒక కుటుంబంలోని సభ్యులంతా కలిసి నిర్మాణం చేసి నడిపిస్తున్న ఒక మంచి ఆలయం.   గుడికెళ్ళి దేవుడికి మనసార దణ్ణం పెట్టుకోవాలి అంటే ఇలాంటి చోటికే వెళ్ళాలి.   ఇక్కడ ఫొటోస్ not allowed.  నేను గుడి బయట నించి చాలా దూరం జూమ్ చేసి తీసిన పిక్చర్ ఇది.  ఎక్కువ మాటలు ఉండవు, అరుపులు ఉండవు, గుడిలో ఉండే నిర్మలత్వం చెప్పడానికి వీలు లేనంత బాగుంటుంది.

Thursday, October 28, 2010

October 28 - Dishti Bomma

A common anti-evil eye device
ఊర్లో ఎక్కడ చూసినా ముందు కనిపించేవి ఇవి.   మా ఊర్లో అందరికంటే మాంచి popular ఫోటో ఇది.

Wednesday, October 27, 2010

October 27 - Stray puppies బుజ్జి కుక్క పిల్లలు

Stray puppies taking rest after game time
వీధి కుక్కకి పుట్టిన బుజ్జి పిల్లలు నాలుగు, మిగిలింది రెండు.. ఎంచక్కా రెండు పడి లేచి, నాకి పాకి డొల్లి డొల్లి ఆడుకుంటాయ్.. భలే ముచ్చటగా తిరుగుతూ ఉంటాయి.  సాయంత్రం పూట నాకు పండు తల్లికి మంచి కాలక్షేపం.

Tuesday, October 26, 2010

October 26 - Cute Little Stuff

Sorting stuff to give away... the store-all-the-memories me says to keep them while the practical me says to give it to needy.. the practical one wins but the senti one has a tough time leaving them... This was done in the middle of night, not able to sleep not able to let go.. a photo reminder for those cute little things.


పండు తల్లి జ్ఞాపకాలు, అమ్మ నా వస్తువులు ఇచ్చేసినప్పుడు నేను ఏడ్చి గొగ్గోలు పెట్టేదాన్ని, ఇప్పుడు నేను చేస్తుంది అదే.. పెట్టెలో దాచి ఇదిగో అది డే 200 కి  వేశా, ఇది నీ ఫస్ట్ sweater , అది నీ ఫస్ట్ diaper అంటూ దాయటం కంటే.. ఇంకో పిల్లకో, పిల్లాడికో ఉపయోగపడతాయ్ అనిపిస్తుంది.. చాలా మటుకు ఇచ్చేశాను, కాని ప్రతిసారి కాలం చెయ్యి దాటిపోయింది అని ఒక బాధ.  బుజ్జి బుజ్జి బట్టలు, బొమ్మ గుడ్డల్లాంటి చొక్కాలు, చెప్పులు, గౌనులు... ఏదో ఒక చెప్పలేని బాధ.

Monday, October 25, 2010

October 25 - Dolu, Sannaayi

performing before a happy kid

పనుల్లేని పండగ రోజుల్లో చాలా మంది ఇంటికి వస్తూ ఉంటారు, తుమ్మెదలు, దొమ్మరి వారు, పగటి వేష గాళ్ళు.. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.  అట్ల తద్ది పండగ రోజున ఈ సన్నాయి డోలు వాళ్ళు వచ్చారు.. మామూలుగా ఐతే కలిసి వస్తారు కాని నిన్న మాత్రం ఒకోకరు ఒక్కో ఇంటికి వెళ్లారు... సన్నాయి మా ఇంటికి డోలు పక్కింటికి... పేపర్ చదివేసుకుంటున్న పండు గాడికి పెద్ద పండగ ఇంక... ఆయన వాయిద్యం ఈవిడ నాట్యం... అదే కదా బాల్యంలోని మాధుర్యం.. తనకి చెయ్యాలనిపిస్తే చేసేస్తుంది.. అదే మనం చేస్తే పట్టుకుని ఎర్రగడ్డలో పడేస్తారు ;).

October 24 - Graama Chaavadi

The almost in shambles village revenue office

నేను మా వాకిట్లోంచి తీసే అన్ని photoslo పడే ఈ కట్టడం మా ఊరి గ్రామ చావడి లేదంటే స్టేషన్.. ఇక్కడ VRO ఉంటారు.. పన్నులు కట్టించుకుంటారు, ఊరి భూముల layoutlu,  రుసుము కాగితాలు అన్ని ఇక్కడే ఉంటాయ్.   నా చిన్నప్పటినించి ఇదే పరిస్తితి.  లోపల కనీసం ఫ్యాన్ కూడ లేదు.. bulb సంగతి సరే సరి.. అందుకే ఆఫిసురు బయట కూర్చుంటాడు... దీనికి ఎప్పటికి మోక్షం వస్తుందో... రోజు చూసి చూసి నాకే విసుగొస్తుంది అందులో పని చేసి చేసి వాళ్ళకెంత రావాలో.

Saturday, October 23, 2010

October 23 - Manchi Neeti Baavi

The only drinking water well for the village

ఊర్లో ఉన్న ఏకైక మంచి నీటి బావి, ఇప్పుడంటే నాంది నీళ్ళు అని వచ్చాయి కాని అంతకు మునుపు అందరం ఇవే నీళ్ళు తాగేవాళ్ళం.  దీని పేరు బాపయ్య నుయ్యి.  ఊరికొచ్చిన వెంటనే మా కోతి వేషాలు పెరిగిపోతే అమ్మమ్మ "అప్పుడే బాపయ్య నూతి నీళ్ళు పట్టేసినయ్యా" అని అనేది.. పచ్చి బాలింత కూడా నీరు కాయకుండా తాగేంత తియ్యగా, శుభ్రంగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు దగ్గరలోచేపల చెరువులు, heritage కేంద్రం తెరవడం మూలాన గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతుంది అని అంటున్నారు.. ఇప్పటికీ 2 రూపాయలు పెట్టి నీళ్ళు కొనుక్కోలేని  వాళ్ళు అక్కడే తెచ్చుకుంటారు.. పొద్దున్న లేచినప్పటినించి ఎప్పుడు చూడు ఇదే దృశ్యం.  మగవారికి రచ్చబండ ఐతే, ఆడవారికి ఈ బావి, ఊర్లో కబురాలన్నీ చెప్పుకోడానికి.  చెరువులో నీళ్ళు ఇప్పుడు పుంపు నుంచి ఇంటికొచ్చినా కూడా పండు గాడికి ఇక్కదినించే తెప్పించి పోయిస్తాను బాగా మురికి అడుగున తేరినప్పుడు.

Friday, October 22, 2010

October 22 -- Saamarasyam

Posted by Picasa

Rama, Seetha and Lakshmana marble statues along with a tomb-like structure near the pooja rack.

ఎక్కడో సాయిబులు హిందువులు కొట్టేసుకుంటున్నారు అని అంటున్నారు కాని, మా ఇళ్ళల్లో అలాంటివేమి లేవు.. బయట వినటమే కాని.. మా ఇళ్ళల్లో దర్గాల నించి తెచ్చిన తావీజులు ఉన్నాయ్... కొన్ని మాట చిహ్నాలు కూడా ఉన్నాయ్... వాళ్ళు దేవుడికి మొక్కుతారు, మేము పీర్ల పండగకి వెళ్తాము... సాయి తాత గారి ఇంట్లో అడుగు పెట్టగానే ఇదే కనిపిస్తుంది.

Wednesday, October 20, 2010

October 21 - Gurrapu Dekka, Toodu... Khazaana Ki Kannam

The weeds commonly found in canals which are a bane to the farmers and cleaning them up is a huge task every year.

గుర్రపు డెక్క, తూడు అని ఎన్నో రకాల పేర్లతోటి పిలవబడే ఈ పిచ్చి మొక్క పూలు ఆకులు ఏంటో అందంగా కాలవలలో నీళ్ళని కప్పేసి అద్బుతంగా కనిపిస్తుంది నేను రోడ్ మీద వెళ్ళేటప్పుడు... తెలియక చిన్నప్పుడు అసలు ఎంత అందమో అది ఇది అని మురిసిపోయి.. ఆ color combination , అంత గ్రీనేరి ఆహ ఓహో అని తెగ మురిసిపోయేదాన్ని.. ఇప్పుడు ఈ మొక్క మూలాన ఏడాదికి అయ్యే కర్చు, నష్టాలు అన్ని చూసాక, అగ్రిసుల్తురేకి పట్టిన పెద్ద చీడలాగ అనిపిస్తుంది... తెల్లోడు పోతూ పోతూ మన దేశానికీ అంటిచి పోయిన తెగులు ఇది :(((.. ఎక్కడో చదివా ఒక దొరసాని తన ఇంటి ముందు ఉన్న చిన్న water pond లోకి ornamental plant గా తెప్పించింది అంట.. ఇంకేమి అది మన దేశంలో ఉన్న అవినీతి, లంచగొండితనం అంత లోతుగా ఎవరు ఏమి పీకలేనంతగా పాకిపోయింది.

October 20 - Crossing Bridges

crossing a brick bridge on mud while being watched by అన్న
 వచ్చీ రాని అడుగులు, వచ్చీ రాని మాటలు, ఇదే కదా పసి వయసు... బురద కోసం అడ్డం వేసిన ఇటుక రాళ్ళ మీద నిదానంగా నడుస్తూ, అటు వైపు వెళ్ళాక కేరింతలు కొడుతూ.. అదేదో mount everest ఎక్కేసిన బిల్డ్ అప్ ఇచ్చే నా ముద్దుల మూట.. ఆ కాస్త దూరానికే ఎక్కడ చెల్లి కందిపోతుందో అని వెంట వెంట నడిచే అన్న, అక్క, అమ్మ... అల్లారు ముద్దుగా పెరగడం అంటే ఇదే కదా.. అదీ రేపు ఈ జీవిత గమనంలో తను వంటరి, అన్నా వంటరి, ఇది కేవలం ఒక అల్పవిరామం.
 

Monday, October 18, 2010

October 19 - Token of love

handmade bouquet by kids to mom..

This picture was taken on mom's birthday but since I have no pic for today, I am posting it up.

ప్రేమతో నూరు వరహాలు, చుక్క మళ్లీ పువ్వులు, అశోక చెట్టు ఆకులతోటి చేసిన పూల బొకేలు, బడిలో పిల్లలు మా అమ్మకి ఇచ్చారు.. చాలా బాగుంది కదా.


October 18 - Learning New Things

Learning to cook in a modern way.

తన పుట్టిన రోజు గిఫ్ట్ microwave లో వంట నేర్చుకుంటున్నా అమ్మమ్మ మనవరాలు.. చిన్ని చిన్ని కోరికలు.. కాని అవి తీరడానికి ఎన్నో ఏళ్ళు ఎదురు చూడటం అదేకదా జీవితంలో కష్టపడటానికి motivation !!


Sunday, October 17, 2010

October 17 - Shashtipoorthi

Mom's birthday cake

అమ్మకి షష్టిపూర్తి.  అరవై ఏళ్ళు నిండిపోయినాయి ఈ రోజు తోటి.. కొడుకు దెగ్గర లేదు అని బాధ ఒక వైపు.. మనవరాలు ముద్దు మాటలు ఒకవైపు.. ఇలా రోజంతా గడిపేసింది...

Saturday, October 16, 2010

October 16 - Mekala manda

the goats/lamb walking back home lazily on the narrow cement road to village

అలిసి పోయి ఇంటికి వస్తున్న మాకు దార్లో కనిపించిన మేకల మందలు, రోడ్ అంతా మాదే, మాకోసమే అని దర్జాగా, నిదానంగా ఇంటికి తిరిగి వెళ్తున్న ఒక గుంపు.

Thursday, October 14, 2010

October 15 - Edla Kommulu

A cement platform with two shapes resembling horns of the ox..

ఎడ్ల పందాల కోసం పెంచే వాళ్ళు ఇళ్ళల్లో ఈ కట్టడం చూసాను నేను.. మా చుట్టాలు తాతగారి ఇంట్లో, రోజు దీనికి పూజ చేసి, ఎడ్లకి పూజ చేసి అన్ని తయారు చేసి వాటి పోషణ కార్యక్రమంలో పడేవారు ఆయన.. ఇప్పుడు ఆయన లేరు, ఎడ్లు, గొడ్లు ఏమి లేవు కాని ఇవి మాత్రం ఉండిపోయాయి.

October 14 - Neella Kaagu

Traditional way of hot water for bath

కట్టెల పొయ్యి, మసి పట్టేసిన తెల్ల కాగు, మసి బూడిద, కొబ్బరి దొప్పలు... కాగిన నీటిలో కర్రల వాసన, ఇది నా కనుమరుగైపోయిన నా బాల్య జ్ఞాపకం.  పండు తల్లి పుట్టినాక పల్లెటూరిలో ఉండటం మూలాన తనకి కూడా అదే జ్ఞాపకం... కరెంటు నీళ్ళు పట్నంలో ఎలాగో తప్పవు, ఇప్పటికి ఇవి ఆస్వాదించాలి అంతే.

October 13 - Pacchati Chelu

green fields and the fish tanks behind them..

పచ్చటి చేలు, వెనకగా చేపల చెరువులు, వాటి మీది వలలు, మధ్యన కొబ్బరి చెట్లు.... ఇదీ ఒక చల్లని సాయంత్రాన మా ఊరి పొలిమేరలో కనిపించే దృశ్యం.  ఎప్పుడు ఈ బీద వారు ఏమి తింటారని ఇంత బలంగా ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాను నేను.. ఈ మంచి గాలి, ఆ ప్రకృతి మాట వడి ఇంతకంటే ఏమి కావలి... ఇంకా పట్నం మలినాలు సోకలేదు కాని చేపల చెరువుల కాలుష్యం మెల్లిగా ఈ అందాల్ని హరించేస్తుంది.

October 12 - Eeta Aakula Bomma

A beautiful stand made of Mogili puvvu

This was a gift to my cousin on her birthday from our lorry cleaner.. so sweet and lovely gesture.. he had nothing much to give her but his love and talent. This according to me is the best gift she received.


మొగలి పువ్వు రేకులతోటి చేసిన ఈ బొమ్మ నా వరుకు నాకు ఎంతో విలువైనది, వెలకట్టలేనిది, ఎంతో నైపుణ్యం ఇంకా ఎంతో ప్రేమ నాకు అందులో కనపడుతుంది.... ఆ బుడ్డోడి మనసు ముందు ఎన్ని విలువైన బహుమతులైన దిగదుడుపే కదా.

Monday, October 11, 2010

October 11 -- Sampangi puvvu

Sampangi flower

 One of the childhood memories associated with its scent... one flower and the entire neighborhood knows about it, such strong scent it is.

సంపంగి పువ్వు.. వాసన, రంగు అన్ని ప్రత్యేకమే దానికి.  ఎండాకాలంలో అలా సాయంత్రం వేళ నడిచి వెళ్తుంటే ఊర్లో దార్లన్నీ ఇదే పరిమళం. ఎవరి దొడ్లో ఆ పువ్వు పూచిందో అనుకుంటూ వెళ్ళటం.  కాని ఈ చెట్టు ఉంటే పాములు ఉంటే అని నమ్మకంతోటి చాల మంది కొట్టించేసారు ఇప్పుడు.. మేము కూడా కొమ్మలు అవి బాగా నరికిన్చేసి చిన్నగానే ఉంచుతాం, ఉండి ఉండి సారం తగ్గిపోయి ఇలా చిన్న చిన్న పువ్వులు వస్తున్నాయ్ ఇప్పుడు.. కాని వీటికున్న ప్రత్యేకత ఎ పువ్వుకి ఉండదేమో.

Sunday, October 10, 2010

October 10 - Sidhilamautunna gnaapakaalu

abandoned house in the village

It suddenly seems to me that my childhood memories are being wiped out just in front of my eyes.  I remember playing in this house, so very clean and full of life with people in it.. come holidays there was festivity in air, happiness could be palpated.. where is it all now, gone with the people in it to another world?

closed/unused temple

This place right now just serves as a place for people to play or just squat and chat or protection against rain, no longer a temple, not even used as a shelter for homeless just left to rot and crumble.

జ్ఞాపకాలు శిధిలం అవ్వడం అంటే ఇదేనేమో.. నా కంటి ముందే ఊరు ఖాళి ఐపోతోంది.. పెద్దవారు పోయాక చూసే వారు లేక మొక్కలు మొలిచి, సవుడు పట్టిపోయి, పుచ్చి పోయి, చెదలు పట్టేసి.  ఎక్కడో ఉంటె ఒక్కసారి బాధ పడేదాన్నేమో, రోజు రోజుకి నా కంటి ముందే అది జరుగుతుంటే అదొక రకమైన అవ్యక్తమైన బాధ.  ఎండా కాలంలో సెలవలకి వచ్చిన ప్రతి సారీ ఆ ఇళ్ళలో తిరిగి వాళ్ళు పెట్టినవి పుష్టిగా తిని గోల చేసిన జ్ఞాపకం ఇంకా లీలగా కంటి ముందు మెదులుతూనే ఉంది కను రెప్ప వేసి తీసే లోపు మాయం అవుతూనూ ఉంది.  నాకు బాల్యం అంటే డాబాలు మేడలు కాదు, పూరిళ్లు, పాకలు, పెంకుటిల్లు, మండువా లోగిళ్ళు.. అవి ఎక్కడ???

Saturday, October 9, 2010

October 9 - Tummedaa

A group of ladies singing folk songs and seeking alms during Dussera season.. called tummedalu

Things from gradually forgetten past, these groups of ladies sing songs which are very melodious and request for alms nothing much some rice or some money, go from house to house and that is when we know the festival has kick started.

పాండవులో పాండవులో తుమ్మెద అంటూ ఒక గుంపులో వచ్చిన ఆడవారు అంతా పాడటం, అమ్మమ్మ ఒక సోలెడు బియ్యమో, అటుకులో, రూపాయో ఇవ్వడం మా దసరా సెలవల జ్ఞాపకాలలో ఒకటి.. మెల్లగా అంతరించి పోతున్న సాంప్రదాయాల్లో ఇది కూడా ఉంది.  విన సొంపుగా పాటలు పాడుతూ ఈ ఏడు వాళ్ళు పడ్డ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఇంటింటికి తిరిగే ఈ ఆడవారు ఎంతో ముచ్చటగా పాటలు పాడి మనసుని అలరింప చేస్తారు.. అంటే మన మానసిక స్థితిని బట్టి లెండి... మాంచి నిద్ర టైములో వస్తే అవే కేకలుగా కూడా అనిపిస్తాయి మరి :).

October 8 - Gaajula Purugulu

millipedes on the wall

Thanks to constant raining, in fact daily for the past 4 months the walls have turned green with layers of green growth.. the millipedes on the wall are a common sight in the village during the rainy season, seen everywhere, anywhere and in groups..hundreds or thousands even.. walking becomes a mess with them crawling around.. scores of them die under feet.. my daughter likes to crush them :(((((((((((((((( because they turn into a coil when touched and she thinks they are something to eat and play with!!

వానా కాలం వచ్చింది అంటే ఊర్లో మొదలయ్యేది గాజుల పురుగుల గోల.. వందలు వేలు ఇంకా చెప్పాలంటే లక్షల సంఖ్యలో వచ్చి చేరి పోతూ ఉంటాయ్, ఎక్కడ కొంచెం తడి ఉంటె అక్కడే వాటి నివాసం, నడిచేటప్పుడు కాళ్ళకి అడ్డం, మంచి నీళ్ళ బిందె దెగ్గర చెమ్మ కోసం వాటి స్థిర నివాసం.. ముట్టుకోగానే గుండ్రంగా ఉండ చుట్టుకుని పోతాయి.. అది చూసి నా కూతురు వాటి చుట్టు పరుగెత్తి వాటిని కర్రతోటి ఆపి ముడుచున్నాక తీసుకుని చేత్తో పిసకడం.. ఎక్కడ అలాంటి కార్యక్రమాలు చేస్తుందో అని నేను తన చుట్టు పరుగెత్తడం ఇదండీ ఈ వానల కాలంలో మా దినచర్య.. వానలు పడి పడి పాచి అంగుళం మందాన పట్టిపోయింది గోడలకి.. ఎంచక్కా అక్కడ కూడా కాపురం పెట్టేశాయి మన పురుగు రాజాలు :).

Wednesday, October 6, 2010

October 7 - Selavalu vantalu

An aluminum utensil smeared with mud on a brick stove



Jaggery syrup to a string consistency

mixing the flour in the jaggery syrup.


cleaned banana leaves used to prepare the prepared dough in desired shape

పండగ సెలవలు వచ్చాయి అంటే మా అమ్మమ్మ చేసే ఆర్భాటం ఇంకా నా కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది.  ఇటుకలు పేర్చి పొయ్యి చేసి, మసి అంటకుండా సత్తు గిన్నెకి మట్టి పూసి, పాకం పట్టి, పిండి కలిపి, అప్పలు చేసి నూనెలో వేపి బూరెలు చేసే ఆ కార్యక్రమం మొత్తం ఒక మధురమైన అనుభూతి.. అమ్మమ్మలందరూ వంతులు వేసుకుని ఈ రోజు మా ఇంట్లో అంటే ఈ రోజు మా ఇంట్లో అంటూ సంబరంగా చేసే ఒక పెద్ద పని.  అన్ని వందేసి పెద్ద పెద్ద డబ్బాల్లో సద్దేసి రోజు మధ్యాన్నం మూడింటికి స్వీటు హాటు రెండు పళ్ళెంలో పెట్టి మజ్జిగ లేదంటే పాలు పట్టించి మమ్మల్ని ఊరి మీదకి తోలేవారు.. మా ఆటలు ఆదుకుని మళ్లీ స్నానం వేలకి ఇంటికి చేరేటట్లుగా..

ఈ ఫాస్ట్ ఫుడ్ యుగంలో ఈ అనుభూతులు అసలు ఎక్కడా మిగాలవేమో అని తలుచుకుంటే ఒక బాధ.. సాగినప్పుడు చేసుకోవాలి అనే తపన.


Tuesday, October 5, 2010

October 6 - Visinakarra

Traditional hand fans

The hand fans of various shapes and sizes and material.. used in summers or during the time of power cut time or just like I do now shoo away the houseflies.. the one made of dried palm leaves with the edges sewn with a cloth by hand by me as not to hurt the kid is the most traditional one.. the square one is made from bamboo and the round one is again made from date tree leaves... the last but the cutest tiny one was made by cutting the big one to fit in my daughter's hands by her friends.

విసినకర్ర, అందులోను తాటాకు విసినకర్ర ఈ మధ్య కేవలం పల్లెతూర్లకే పరిమితం ఐపోయింది.  ఈతాకు విసినకర్ర.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయ్.  ప్లాస్టిక్ ప్రపంచంలో వీటిని చూడటం అంటే నాకు ఏంటో ఇష్టం... ఆకు గీసుకోకుండా చివర గుడ్డ ముక్కతోటి కుట్టడం ఒక పని.  ఎండా కాలం అంటే ఈ విసినకర్ర ప్రతి ఇంట్లోను ప్రత్యక్షం.. మేము పడుకుంటే నిద్ర లెగవకుండా అమ్మమ్మ తాతయ్య విసిరుతున్న జ్ఞాపకం ఎంత మధురం.. అస్సో ఉస్సో అనుకుంటూ చమటలు కక్కుకుంటూ కరెంటు వాడిని తిట్టుకుంటూ ఆ కర్ర తిప్పుకుంటూ చేతులు నొప్పి పుట్టి చేతులు మార్చుకుంటూ.. ఎన్నో జ్ఞాపకాలు.. కనుమరుగవుతున్న చిన్ని చిన్ని పనిముట్లు.

ఆ బుజ్జి బుజ్జి విసినకర్ర పండు గాడి కోసం పక్కింటి చిన్ని నాని చేసి ఇచ్చారు.  వాడి మీద ఆ పిల్లలకి ఉన్న ప్రేమ ఆ బుజ్జి వస్తువులో కనిపిస్తుంది.

October 5 - Fruit Forks


This is something really small, a few fruit forks.. something which I always wanted to have but somehow did not materialize!! Finally when I have it, I love it so much so that it is on my lappy table and not the dining table where it is supposed to be ;).

ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్న వస్తువు, చిన్నదే కాని కొనడం పడలేదు ఇప్పటివరుకు.. చాలా అపురూపంగా అనిపిస్తుంది నాకు దీన్ని చూస్తుంటే.. చిన్ని చిన్ని ఆశ అంటూ మనసు తుళ్ళి తుళ్ళి పడుతుంది.. ఏంటో పిచ్చిమాలోకం లాగ తాయారు అవుతున్నా.

Monday, October 4, 2010

October 4 - Milk and Cookie

Anjeer cookies and a cup of hot milk.. yummy

Our breakfast on a lazy day!!  I love this cup, picked up when carrying the kid with a silly thought of handing it over to her telling that she drank from it when in tummy ;).. from lioness to a cub (Telugu calender says I am simha raasi).

ఇడ్లీ, దోస ఉప్మా, పెసరట్టు, బ్రెడ్ టోస్ట్ తిని తిని ఒళ్ళు బద్ధకం పెరిగినప్పుడు మేము తినే అల్పాహారం ఈ పాలు కూకీస్.. ఆ డబ్బా కప్ రెండు నాకు చాల ఇష్టం, ముచ్చటపడి తెచ్చుకున్నవి.. చిన్ని చిన్ని సరదాలు అవే లేకపోతె ఇంక ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది నా మటుకు నాకు.  పండు తల్లి బొజ్జలో ఉన్నప్పుడు తీసుకున్న కప్ అది.. దీన్లోంచే నువ్వు బొజ్జలో ఉన్నప్పుడు పాలు తాగావు అని చెప్పి తనకి ఎప్పటికైనా ఇవ్వాలి అని నా కోరిక.  వెర్రి మనసుకి ఎన్ని కోరికలు కదా.. అది కూడా తలా తోక లేనివి.

Saturday, October 2, 2010

October 3 - Reliving Childhood

Bhendi tattoos

I get off work to complete surprise.. this is exactly what we used to do as kids.. when amma used to cut lady fingers we used to grab the crowns and stick them on to the legs and hands and roam around showing them as trophies, just like the kid did..

బెండకాయలు కొయ్యడం అంటే  చిన్నప్పుడు ఒక పెద్ద పండగ.. జిగురుగా ఉండి ఒంటికి అతుక్కుపోయే ఈ కూర అంటే తినడానికి ఆడుకువడానికి కూడా చాల చాల ఇష్టం మాకు.. ఆ బుడిపెలు ఒంటికి అంటించుకుని సంబరంగా గంతులు వెయ్యడం ఒక తీపి జ్ఞాపకం.. ఇంక నిన్న మొన్న చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు చెయ్యాలనిపిస్తుంది కాని మా మమ్మీ తిట్లు తట్టుకోలేక చెయ్యను ;).

పండు తల్లి అవి అంటించుకుని గంతులేస్తుంటే నా కళ్ళ ముందు నా బాల్యం ఒక్కసారి కనిపిస్తూ వినిపించింది.. మనసును ఉల్లాస పరిచింది.

October 2 - Our Time


Animal world of Baby Einstein series, which has a completely enthralled audience.. the kid!!!

This what we do when I finish the work, the kids get her treat for being the good kid she is.. she gets to pick a video of her choice, one among the 4 and watch it in the lap on the lappy!!

In Twos

We have everything that I use brush, glasses, phone and all but end up using each others.. yeah, me holding hers and she trying to use mine.. sigh!!

నాకు పండు తల్లికి అన్ని వస్తువులు సమానంగా ఉంటాయి కాని తనకి ఎప్పుడు నావే కావాలి :(... తీరిక వేళలో మా లాప్ టాప్ లో మేము చూసుకునే వీడియోలు..

October 1 - Letting go


It is sad to let go off memories, childhood be it mine or my kid's.. just want to hold on to it for ever and ever..

The newborn pattu langaas, which seemed too big for a tiny baby are now too small for her.. tough to let go of things but I need to at some point.. so cleaning them all and putting them aside for daily use and then give away eventually.

నా బుజ్జి బంగారు తల్లి ఎదుగుతుంది అని ఒక వైపు ఆనందం అప్పుడేనా అని బాధ ఒక వైపు ... ఆడపిల్లలు యిట్టె ఎదిగిపోతారు అని ఊరికే అనరు.. పుట్టినప్పుడు కొన్న పట్టు లంగాలు, అప్పుడు ఇంత పెద్దగా అందులో మునిగిపోయిన చిన్ని తల్లికి అవి ఇప్పుడు పొట్టిగా ఐపోతున్నయ్.. జారిపోతున్న బాల్యం చూస్తూ ఏమి చెయ్యలేని నిస్సహాయత.. కనుల ముందు రూపు దిద్దుకుంటున్న నా కూతురిని చూస్తూ నిట్టూరుస్తూ ఉండటం తప్ప ఏమి చెయ్యగలను