.. and we bring a couple of new friends, kitty and twitty to adorn our entrance.
ఇంటిని చూడగానే ఇంట్లో పిల్లలు ఉన్నారు అని చెప్పెయ్యొచ్చు మా ఇంటిని చూస్తె..
A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Showing posts with label tiny pleasures. Show all posts
Showing posts with label tiny pleasures. Show all posts
Saturday, July 16, 2011
Tuesday, June 14, 2011
Day 161 ~ June 10 - Painted
Wanted to pep up the corner a bit more..
సాయి తాతగారి గుర్తుగా తెచ్చుకున్న మొక్క కుందీకి రంగులేయ్యాలి అనిపించి కింద అంచు మొదలు పెట్టిన నాకు చిచ్కూ గారి సాయం కూడా దొరికింది, మొదలు పెట్టిన కాసేపటికి లేచేసింది కాబట్టి తన చెయ్యి పట్టుకుని మెల్లిగా బ్రష్ పట్టుకుని గీయిన్చా అందుకే ఆ వణుకుడు గీతలు, తుడుపులు వగైరా వగైరా...కాసేపు పట్టుకుని గీసినాక ఒక చోట కుదురుగా కూర్చోలేక తుర్రుమంది, మళ్ళీ వచ్చి నువ్వు గియ్యి అమ్మ నేను నీ చెయ్యి పట్టుంటా, సియ పండుగాడు ఎయిస్తాడు అమ్మతోటి అని కానిచ్చింది :)... ఇది మేమిద్దరం సమిష్టిగా సృష్టించిన మొదటి కళాఖండం గా చరిత్రలోకి ఎక్కబడును :).
Tuesday, June 7, 2011
Day 158 ~ June 7 - Buddha Scapes
A green Zen corner....
A closeup shot..
నిన్న ఎగ్జిబిషన్ కి వెళ్లాను అనుకోకుండా ఆఖరి రోజు శనివారం అంట కాని రెండు రోజులు ఊరికే అలా గుడారాలు ఉండిపోయి మిగతా సరుకు కొంత మంది అమ్ముతూనే ఉన్నారు... నిజం ధర ఎంతో తెలియదు కాని విపరీతంగా బేరాలు, చెప్పినదాంట్లో పావు ధరకి కొనుగోలు... నేను మామయ్యా వెళ్లి పెద్ద తెలివి గల వాళ్ళలాగా సగం అడిగి ముప్పావుకి కొనుక్కుని మురిసి ముక్కలు అయిపోయాం.
అక్కడ కొన్నదే ఈ బుద్ధుని టేరాకోట బొమ్మ.. అసలు కేవలం మొహం ఉండే బొమ్మ కొనాలని వెళ్లి చాల పెద్దది గార్డెన్లో పెట్టుకోవచ్చు అని తెచ్చుకున్నా.. తీరా తెచ్చాక మమ్మీ చిచ్కూ ఇద్దరు కూడా ఎండా, వాన దుమ్ము మట్టి అని తినేశారు.. ఆఖరికి చించి చించి ఇలా తయారు చేసి డాబా మెట్ల పక్కన కుదిర్చేసా :).
A closeup shot..
ఆ పెట్టిన స్టాండు ఒక పాత ఉల్లిపాయలు వేసుకునేది విరిగిపోతే ఇంటి ఓనరు పక్కన పారేసినది, దానికి రంగులేసి మెట్ల దెగ్గర స్తంబాలకి గాలికి, చిచ్కూ గాడి లాగుడికి పడిపోకుండా గట్టిగ వైర్లు పెట్టి కట్టేసి బీబత్సంగా బందోబస్తు చేసి చచ్చీ చెడి తయారు చేశా, ఫెంగ్ షుయి కోసం వెదురు మొక్క, నా దెగ్గర ఉన్న తామర పువ్వు ఒకటి, అడపా దడపా చిన్న జాడీల్లో పెట్టిన మొక్కలు వగైరా పెట్టి ఏదో చేసేశా... చిచ్కూ ఏమో వాన పడకుండా తన టోపీ గొడుగు ఇచ్చారు గోతం కి, ఇంతకీ గోతం తన కొత్త ఫెండు అంట.. గౌతం బుద్దా కి వచ్చిన తిప్పలు లెండి... :).. ఇద్దరం కలిపి కష్టపడి చేసుకున్నాం కాబట్టి నాకైతే యమ యమా నచ్చేసింది.
Tuesday, May 31, 2011
Day 150 ~ May 30 - Another Angel Comes Home
Subscribe to:
Posts (Atom)