Tuesday, July 31, 2012

Wk32/Dy4(214) ~ August 1 ~ More Books

a few more from complete yandamoori collection..

తెలుగు పుస్తకాలు చదవడం పెంచాను ఈ మధ్య, OA  తెచ్చిపెట్టిన యండమూరి సెట్టు మొత్తం, శ్రీ శ్రీ, మాలతి చందూర్ బాపు రమణ సాహిత్యం , మెల్లిగా చదువుతున్నా.

Monday, July 30, 2012

Wk32/Dy3(213) ~ July 31 ~ Roses This Year

The new lot for this year..

ఈ ఏడాది వానలు బాగానే ఉన్నాయి, ఇప్పుడు పెట్టడం మొదలు పెడితే కొంచెం మంచి తోట తయారు అవుతుంది... మా అమ్మ కొని తెచ్చిన గులాబీలు 

Wk32/Dy2(212) ~ July 30 ~ Honey Boy

Meet Mr. Honey, the kid's playtime buddy.

పండుగాడి స్కూల్  బస్సు వచ్చే టైం కి కొంచెం ముందు మేము రోడ్ మీద ఒక అరుగు మీద కూర్చుని ఉంటాం అప్పుడు మాకు తోడూ హనీ గారు కూర్చుని, తోక ఊపుతూ వీడ్కోలు చెప్తారు :).

Wk32/Dy1(211) ~ July 29 ~ 2 schools in 2 weeks

Kid ready to school in her uniform

మొత్తానికి ఒక తొందరపాటు నిర్ణయం అని చెప్పలేని నిర్ణయం మార్చుకుని, పసిదాని మనసుకి తగ్గట్టు ఉండే బడికి వెళ్ళటం మొదలు పెట్టింది బుజ్జిది... ఆ రెండు వారాలు తలుచుకుంటే గుండె జారిపోతుంది, మూడు కిలోల బరువు తగ్గిపోయింది పిల్ల, నాకు ఆ బరువు పెంచడానికి సంవత్సరంనర్ర పట్టింది :(.. పొతే పోయింది దిష్టి పోయింది పిల్ల ఇప్పటికైనా ఒక దారిలో పడింది అని తృప్తిగా ఉంది  

Wk31/Dy7(210) ~ July 28 ~ New Beginnings

Covering kids books... a walk down the memory lane

పండు గాడు మొత్తం మీద పెద్ద బడికి వేల్లిపోతున్దోచ్.. ఎలాగా వెళ్ళింది ఏమి జరిగింది అనేది పక్కన పెడితే తను ఈ మధ్య సుబ్బరంగా బడికి వెళ్తుంది అనేది శుభవార్త.

కొత్త పుస్తకాలకి అట్టలు  వేసి, labels  అతికించి పేరు రాసుకోవడం అంటే భలే సరదాగా ఉండేది చిన్నప్పుడు ఇప్పుడు పండుగాడికి వేస్తుంటే అంతకు మించి ఆనందం అదొక తృప్తి.

Wk31/Dy6(209) ~ July 27 ~ Virtual to Real

A real sweet virtual buddy makes time to meet me and the kid all the way from US during her short trip.. love you K for you sweet gesture

స్నేహం అనేది ఎప్పుడు ఎవరితో ఎలా ఏర్పదిపోతుందో తెలియదు కాని సృష్టిలో దాని కంటే తీయనిది లేదు అని మాత్రం నిజం.  ఏంటో దూరం నించి నన్ను చూడటానికి వచ్చిన నా కంప్యూటర్ నేస్తం నా మనసుని చెప్పలేని ఆనందం తోటి నింపేసింది.. 

Wk31/Dy5(208) ~ July 26 ~ Cattle Shed

Buffalo with her newborn calf grazing in the shed

ఊర్లో మనుషులు దొరకక, చాలా మంది పాడి తీసేశారు, పాల కేంద్రంలో కొనుక్కోటం సుఖం అనుకుంటున్నారు వీటి చాకిరి చెయ్యలేక..

Wk31/Dy4(207) ~ July 25 ~ Good Old Antennae

How can one forget the days we used to adjust these with huge bamboo poles to get clarity in TV

టీవీ ఉన్న ప్రతి ఇంట్లో ఒకప్పుడు ఇవి కనిపించేవి కర్ర తీసుకుని అటు ఇటు వీటిని తిప్పి సిగ్నల్ రాట్లేదు అని హైరానా పడిపోవడం అనేది మా కాలంలో పెరిగిన పిల్లలందరికీ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది :).

Wk31/Dy3(206) ~ July 24 ~ Creepers on the wall

Beautiful jasmine creepers in the homes

పచ్చటి ఆకులు పూలు లతలు ఇంట్లో ఉంటె ఆ ఇంటి సొగసు వేరు.. సన్నజాజి పందిరి మా బేబీ అమ్మమ్మ ఇంటి గేటు ముందర అల్లుకుని భలే ముచ్చటగా ఉంటుంది.. ఈ వయసులో కూడా ఆవిడ పని మినిషి లేకుండా ఎంత ముచ్చటగా ఉంచుకుంటుందో ఇల్లు వాకిలి చూస్తె చాల నేర్చుకోవాలి అనిపిస్తుంది.

Wk31/Dy2(205) ~ July 23 ~ Old World Homes


Typical doors and windows of olden days in villages

ఊర్లో చెక్క తలుపులతో చేసిన పెంకుటిళ్ళు  ఇంచు మించు అని శిధిలం అయిపోతున్నాయి, ఇంకా ఒకటి అరా ఏమైనా ఉంటె అవి కూడా ఆ ఇంట్లోని పెద్దలు చనిపోగానే పాడు పెట్టేస్తున్నారు.. మా ఊర్లో లింగ తాతగారి ఇల్లు ఇది  ఆయన తరవాత కొన్నాళ్ళకి ఇది చెదలకి నిలయం, లేదంటే కొత్తగా కొన్న వాళ్ళు కూల్చేసి కొత్తది కట్టించుకోడం..

Wk31/Dy1(204) ~ July 22 ~ Worn and Torn

Holes in the circus tent

వానలు విపరీతంగా పడటం బురద ఇలా చిరుగులు పడ్డ డేరాలు, ముసలావి ఐపోయి ఉన్న జంతువులూ, ఎక్కువగా రాని  జనాలు, అసలు వచ్చిన డబ్బు ఆ ఏనుగుల తిండికి సరిపోతుందా అనేంత ఘోరంగా ఉంది పరిస్తితి.. మరుగున పడిపోతున్న వాటిలో సర్కస్ కూడా ఒకటి.. ఒకందుకు అదే మంచిదేమో కూడా..

Wk30/Dy7(203) ~ July 21 ~ Circus Lives

A very elderly lady performing tricks at circus..

సర్కస్ వచ్చింది ఊరి దెగ్గరకి అంటే చిన్నప్పటి లాగ ఉంటుందేమో అనుకుని చెంగు చెంగు మంటూ పండు గాడిని తీసుకుని బయలు దేరాం నేను OA  పిల్లని తీసుకుని, విపరీతమైన వానలు, ఎవరూ రాట్లేదు అని బాగా దిగులు పడిపోయారు వాళ్ళు.. చూస్తున్నంత సేపు చిన్నప్పుడు ఏమి సరదా పడే వాళ్ళమో కాని ఏదో గుండెల్లో మెలి  తిప్పెసెంత బాధ, పొట్ట కూటి కోసం వాళ్ళు చేసే విన్యాసాలు, వారి జీవితాలు, వారి కడుపు కూటి కోసం పడే వ్యధలు  ఏంటో చాల చాల అసంతృప్తి గా అనిపించింది.

ఒక అరవై ఏళ్ల  వయసు ఉండే స్త్రీ ఈ నాటికీ అంట కష్టపడటం చూస్తె మనసు కేలికేసినట్లు ఐపోయింది.. అన్నీ ఉంది ఎప్పుడు ఈసురో మనే వాళ్ళు ఎంత మంది ఉన్నారు, నేను కూడా ఎప్పుడు ఏదో ఐపోయింది అన్నట్టే ఉంటున్నాను అని దేవుడు ఒక నిజాన్ని చూపించినట్టు అనిపించింది 

Wk30/Dy6(202) ~ July 20 ~ Jackfruit Fun

Yummy Jackfruit for sale

పనస పండు తొనలు అంటే నాకు భలే ఇష్టం, ఏది ఇష్టం లేదు అని ఒక నవ్వు నవ్వుకుంటున్నారు అయినా పర్లేదు నాకిష్టం అంతే :).

పనస పొట్టు కూర అని ఇంకా పనస పలావు అని ఈ మధ్య పెళ్లి భోజనాలలో బాగా పెడుతున్నారు.. నాకు మాత్రం   పిక్కలు పొయ్యి మీద కాల్చుకుని తినడం చిన్నప్పుడు గుర్తుంది.  ఇప్పుడు ఎందుకో తినాలి అనిపించట్లేదు, ఎంతైనా నా తిండి గోల కాస్త తగ్గినట్టే అనిపిస్తుంది :).

Wk30/Dy5(201) ~ July 19 ~ Shopping for Self

Dupattaas of the dress materials I have purchased on an impulse

ఆస్తమా వచ్చి అయ్యో కుయ్యో అనుకుంటూ మల్లి మంచం మీద పడ్డాను కొన్ని రోజులు అప్పుడు ఇంట్లో ఉంది ఉంది విసుగెత్తి కొనుక్కొచ్చిన బట్టలు.. కుట్టడానికి ఇచ్చాను, మూడు ఏళ్ళ నించి అవే కట్టి కట్టి విసుగొచ్చేసి ఆఖరికి చూసేవాళ్ళకి విముక్తిని ప్రసాదించా :).

Wk30/Dy4(200) ~ July 18 ~ Pineapple From Garden

Pineapples grown in kitchen garden.. 

అనాస పండు ఎప్పుడు కొని తినడమే కాని పందిచుకుని తినడం అనేది చెయ్యలేదు, కాయ తిన్నాక పైన ఉండే ఆకులని తీసి పాతిపెడితే ఇలా మొక్కలు మోలిసి బోలెడు కాయలు కాస్తాయి :).

రామాయమామ్మ ఇంట్లో ఆవిడ ఓపిక పుణ్యమా అని నాకు ఈ అదృష్టం దక్కింది :).

Wk30/Dy3(199) ~ July 17 ~ Health Conscious :)

OA got me this collection to see if it helps in my personal goal :)

సరే తిండి ఎలాగో తగ్గించావ్ ఇంకా ఏమి చేస్తున్నావ్ అని అడుగుతారు కదూ, ఏమి లేదు ఇలా ఎవరైనా ఏదైనా తెచ్చి ఇచ్చి చూసి చేయ్యమనో, చదవమనో చెప్తే తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తూ అప్పుడప్పుడు దుమ్ము దులుపుతూ ఉంటున్నా..

ఈ రోజు పోస్ట్ చేసాను కదా రేపు తప్పకుండా ఒక్క  CD  అయినా చూస్తా, చూడటమే కాదు ఏదో ఒకటి తప్పక పాటిస్తా :).

Wk30/Dy2(198) ~ July 16 ~ Weight Loss Tamaasha

Got myself into this friendly wt. loss competition for self-motivation

అడ్డంగా నేను పొడుగ్గా పిల్లా పెరుగుతూ పోతుంటే నాకు అప్పుడప్పుడు కొంచెం సిగ్గేస్తూ ఉంటూనే ఉన్నా మళ్ళీ ఆ అని నాలిక తిప్పేసుకుని నా తిండి గోల నాదే అన్నట్టు ఉండిపోయా.. ఫ్రెండ్స్ కొందరు మొదలు పెడితే నేను టింగు రంగా అంటూ పేరు ఇచ్చి, కాస్త తిండి తగ్గించా కాని వ్యాయామం గట్రా చెయ్యట్లేదు.. అప్పటికి ఇప్పటికీ ఏమైనా తగ్గావా అని అడుగుతారు కదూ.. తగ్గితే కొత్తగా దిగి ఆ ఫోటో పెట్టేద్దును.. గ్రాము బరువు కూడా తగ్గలేదు.. కాకపొతే తృప్తి ఏంటి అంటే పెరగను కూడా లేదు.

Wk30/Dy1(197) ~ July 15 ~ Rechargeable Lantern

The rechargeable lantern that HAD to be bought along with second cylinder

బలవంతంగా అంటగట్టటం అయినా కూడా ఇది నాకు బాగానే ఉపయోగ పడుతుంది, పల్లెటూర్లో బాబోయ్ ఒకానొక టైములో ఇంచుమించు ఇరవై గంటలు పవర్ కట్స్ ఉన్నప్పుడు చీకట్లో తిరిగేందుకు బాగానే పని చేసింది.

హమ్మయ్య, మూడున్నర్రేల్లకి  నాకు గ్యాస్ రెండు బండలు అమిరినవి.. ఇంక నా పాట్లు తప్పినట్టే 

Wk29/Dy7(196) ~ July 14 ~ శుభం ~ Subham

Done with the alphabet series!!

హమ్మయ్య ఆలస్యంగా అయినా ఎట్టకేలకి పూర్తి చేసాను, అక్షరమాల ఫోటోలు, చాల ఉత్సాహం తోటి మొదలు పెట్టినా ఎన్నో ఐడియాలు వచ్చినా అమలు పరచలేక అనుకున్న విధంగా చెయ్యలేకపోయినా ఏదోకటి మొదలు అంటూ పెట్టాను కదా అని ఒక లాంటి తృప్తి.

వీలు చూసుకుని నేను అనుకున్నవి కూడా బొమ్మలు తీసి పెడతాను పల్లెటూరి మీద ఎక్కువ ఫోకస్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను, చూడాలి మరి ఎంతవరుకు చెయ్యగలనో.

PS:  The most challenging and close to the heart series so far, enjoyed doing it thoroughly though I wish I were more sincere in putting in the required effort.

The theme had to be rural and I personally put in the kid's pic wherever possible, so it was dual masti for me :).

Hope you guys enjoyed it as much as I did doing it


Wk29/Dy6(195) ~ July 13 ~ ఱ - గుఱ్ఱము ~ (Bandi Ra - Gu'rr'amu)

The yellow toy horse, first kid to the kid

పండు గాడికి వచ్చిన మొదటి బొమ్మ బహుమతి ఈ గుఱ్ఱం  బొమ్మే. అసలే పసుపు అంటే పిచ్చి ఇష్టం ఏమో ఎప్పుడు దీని తోక పుచ్చుకుని ఆడుకుంటూ ఉండేది తను.. సింగరాయపాలెం తిరణాలలో సోమ్మామ కొని తెచ్చాడు తన ఉయ్యాలకి పైన వేలాడదీసి ఉండేది చాల రోజులు, తరవాత నోట్లో పెట్టడం మానేసాక చేతికి ఇస్తే ఎంచక్కా తోక పిసుక్కుంటూ అది కుయ్ కుయ్ లాడుతుంటే ఆడుకునేది.

Wk29/Dy5(194) ~ July 12 ~ క్ష - క్షవరం ~ (Ksha - Kshavaram)

A typical village barber shop

ఊర్లో క్షవరం చేయించుకోవాలి అంటే మంగలి అతను ఇంటికే వచ్చి చేసేవాడు తాతయ్య వాళ్లకి... ఇప్పటికి దాసు అని ఆయన మా ఇంటికి వచ్చే చేస్తాడు OA  కి కావాల్సి వస్తే కాని గడ్డం తనే చేసేసుకుంటాడు కాబట్టి అంత  అవసరం ఉండట్లేదు, తాతయ్య ఉన్నప్పుడు రోజు పొద్దున్నే వచ్చి చేసి రూపాయి తీసుకుని వెళ్ళేవాడు.  ఎండాకాలం వచ్చిందంటే మా తమ్ముడిని కూచోపెట్టి సమ్మర్ క్రాఫ్ అని అంట కత్తెర వేయించేవాడు వాడు లబో దిబో అని మొత్తుకుని ఇల్లు పీకి పందిరేసేవాడు.. ఇప్పుడు తలుచుకుంటే భలే నవ్వొస్తుంది కాని అప్పుడు మటుకు తాత మనవడు కలిసి ఇల్లు రణరంగం చేసేవారు.

ఇప్పటికీ ఊర్లో సొంతగా గెడ్డం ఎక్కువ మంది చేసుకోరు.. ఇలా కొట్టు కెళ్ళి కాసేపు కబుర్లు చెప్పి, నెలకోసారి జుట్టు, వారానికి ఒకటో రెండో సార్లు గెడ్డం చేయించుకుంటూ ఉంటారు

Wk29/Dy4(193) ~ July 11 ~ ళ - తాళం ~ (Lha - Taa'Lh'am)

Good old copper lock.

ఆకుపచ్చటి చెక్క తలుపులు, గొళ్ళెం, తాళం కప్ప.. ఊర్లో ఒకప్పుడు ఇంచు మించు అన్ని ఇళ్ళకి ఇలాంటివే వేలాడుతూ ఉండేవి... ఇప్పుడు టేకు తలుపులు, కొత్త safety  locks  అని వచ్చేసాయి కాని.

Saturday, July 28, 2012

Wk29/Dy3(192) ~ July 10 ~ హ - హారము ~ (Ha - Haaramu)

A beautiful long chain on a beautiful girl

అందమైన ఆడపిల్ల ఒంటి మీద అందమైన నగ , ఒక బంగారు హారం.  పల్లెటూర్లో అనే కాదు కాని ఎక్కడ ఏ వేడుక జరిగినా ఇలా ముద్దుగా ముద్దుగుమ్మలు తయారు అయిపోవడం కంటికి పండగే.

Wk29/Dy2(191) ~ July 9 ~ స - సంత ~(Sa - Santha)

village fair held every Monday

మా ఊర్లో మా చిన్నప్పుడు ప్రతి శుక్రవారము సంత జరిగేది.. అక్కడికి రైతులు ఇంట్లో పండించిన కూరలు అవి తెచ్చుకుని అమ్మేవారు, ఈ మధ్య అది జరగట్లేదు, అందరు కావలసినవి కొట్లో కొనేసుకుంటున్నారు. కాని పక్కూర్లో ప్రతి సోమవారం ఇంకా జరుగుతుంది నాకు నేను పండు గాడు అక్కడికి వెళ్లి కూరలు తెచ్చుకోవడం అంటే భలే ఇష్టం .

Wk29/Dy1(190) ~ July 8 ~ ష - షట్పదము ~ (Sha - Shatpadamu)

A playful butterfly

చాగంటి గారి ప్రవచనాలలో లలితా అమ్మవారి గురించిన ప్రవచనం ఏదో వింటూ ఉంటె అందులో షట్పదము అంటే ఆరు పాదాలు కలది అని సీతాకోక చిలుక గురించి చెప్పారు, ఆరు పాదాలు కలది అని అర్థము.  

Wk28/Dy7(189) ~ July 7 ~ శ - శఠగోపం ~ (Sa - Satagopam)

temple priest blessing the kid on her uyyala, cradle ceremony

గుడిలో పూజారి గారు శఠగోపం పెట్టడం అనేది నా చిన్నప్పటినించి చూస్తున్నా అది ఎందుకు ఏమిటి అనేది ఈ మధ్య దాక నాకు తెలియదు. ఏదో కానుకలేయ్యడానికి ఇప్పుడు ఇది టైం అని చెప్పినట్టు టింగ్ మని బుర్ర వంచి జేబులో చిల్లర తీసి పెట్టడం తప్ప..

Wk28/Dy6(188) ~ July 6 ~ వ - వరి చేను ~ (Va - Vari Chenu)

kid in a paddy field.

 వరి  కంకులు కాళ్ళకి గుచ్చుకుంటుంటే కితాకితలు అనుకుని పండు గాడు చిన్నప్పుడు భలే సంబర పడిపోయేది.

Wk28/Dy5(187) ~ July 5 ~ ల - లక్క ~ (La - Lakka)


మంగళ సూత్రాలు చూసినప్పుడల్లా నాకు హరిశ్చంద్ర నాటకంలో కాటి కాపరి సీన్లో అది మాంగల్యము కాబోలు అనే డయలాగ్ గుర్తొస్తుంది.. కామెడీ పక్కన పెడితే మంగళ సూత్రాలు బోలుగా ఉన్నప్పుడు అవి నొక్కుకుని పోకుండా ఇలా లక్క పోయిన్చుకుంటారు మా వైపు...

Wk28/Dy4(186) ~ July 4 ~ ర + ఓ - రో - రోలు (Ra+o - Ro - Rolu)

good old traditional grinder..

ఏదైనా రుబ్బాలి అన్నా దంచాలి  అన్నా మా అమ్మమ్మ ఎప్పుడు రోలు రోకలి పొత్రం వాడుతూ ఉండేది తనకి వంటింట్లో గ్యాస్ పొయ్యి తప్ప ఎలాంటి ఆధునిక సదుపాయాలూ ఉండేవి కాదు, రుబ్బడం, నూరడం, దంచడం అని ఎప్పుడు ఇదొక పని చేస్తూనే ఉండేది రోజు.  ఇప్పుడు తను పోయాక  దాన్ని ముట్టుకునే వాళ్ళే  లేరు 

Wednesday, July 25, 2012

Wk28/Dy3(185) ~ July 3 ~ య - యంత్రము (Ya - Yantramu)

the motor connected to a well.

ఎంచక్కా  నూతిలో బకీటు వేసి నీళ్ళు తోడుకుంటూ, ఒంటికి కాస్త శ్రమ కలిగిస్తూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అంతా  ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడ చూడు బావి ఉంది అంటే దాని పక్కన ఈ మోటారు దర్సనం ఇస్తుంది..

యంత్రాలతో పని గడుపుకుంటూ ఒళ్ళు పెంచుకుంటూ, ఒంట్లో రోగాలు పెంచుకుంటూ, ఇన్ని తెలిసి ఎప్పుడైనా ఒక్క బిందెడు నీళ్ళు తోడిన పాపాన పోలేదు :నేను (.



Wk28/Dy2(184) ~ July 2 ~ మ - మడత మంచం (Ma - Madata Mancham)

handy bed arrangement to lie down.. 

అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నవ్వారు మంచాల తో పాటు బోలెడన్ని మడత మంచాలు కూడా ఉండేవి, ఎంత మంది వచ్చినా పాడుకోటానికి  లేకుండా.గచ్చు మీద పడుకోవాలి అంటే ఏదైనా పురుగు పుత్రా ఉంటుంది అని భయం ఒకటి ఎప్పుడు ఉంటుంది కాబట్టి, ఇవి ఐతే గోడ వారన  ఒక మూల మడిచి ఎత్తి పెట్టేస్తే చోటు ఎక్కువ తీసుకోవు కాబట్టి, ఒక పరదా కుట్టిన్చేస్తే సరిపోతుంది కాబట్టి ఎక్కువగా వాడేవారు, ఇప్పుడు మా ఇంట్లో లేవు కాని తెలిసిన వాళ్ళింటికి వెళ్లి ఈ ఫోటో తీసుకుని వచ్చా.

ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు కూర్చుంటేనో, ఎగిరి గంతులేసేతప్పుడు అవి పర్రున చిరిగి డాం అని పడిపోవటం, అందరు నవ్వుకోవటం,  తరవాత తాత బెత్తం పుచ్చుకుని వెనక పడటం చిన్న నాటి జ్ఞాపకాలు .

Wk28/Dy1(183) ~ July 1 ~ భ - భస్మం (Bha - Bhasmam)

the ashes remaining inside a mud stove...

భస్మం అని అసలు గ్రాంధిక పేరు అయినా బూడిద అనే పిలుస్తాం దీన్ని. పొయ్యి వెలిగించి కర్రలతోటి పిడకల తోటి వంట చేసినాక మిగిలిన ఈ బూడిదని కూడా కచికలు ఏరుకుని అంట్లు తోమడానికి పళ్ళు తోముకోడానికి వాడుకుంటారు పల్లెటూర్లో వాళ్ళు ఇప్పటికి కూడా. సబ్బు పెట్టి రుద్దినా కూడా ఈ బూడిద కాస్త అద్దాల్సిందే .

Wk27/Dy7(182) ~ June 30 ~ బ - బరందు (Ba - Barandu)

the black soil deposited to level the ground before building a structure.


పొలాల్లొ కోతలు ఐపొయినాక ఇంచు మించు అందరు చేసె పని నల్ల మన్ను తెప్పించుకుని బరందు పొయించడం.

నల్ల మన్ను పొసి, వానలు పడి అది తడిసి, అణిగినాగ చదను చెసి అట్టిపెట్టుకుంటారు.. మొక్కలకి బలం, ఏదైనా కట్టుకొవడానికి ఎత్తు చేసుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగ పడుతుంది.

కొందరైతే వాకిళ్ళు రోడ్డు కంటే ఎత్తుగా ఉండాలి అని ఏళ్ళ తరబడి అలా మన్ను పోయిస్తూనే 

Wk27/Dy6(181) ~ June 29 ~ ఫ - ఫణి (Pha - Phani)

The Nagendra Swamy Temple.. giving the kid the first banana scrape, first solid..


ఊర్లో ఉండే నాగేంద్ర స్వామి గుడిలొ ఏది మొదలు పెట్టినా శుభం జరుగుతుంది అని నా నమ్మకం... ఊరు దాటి వెల్లిపోయేటప్పుడు అమ్మమ్మ ఎప్పుడు ఇక్కడ కొబ్బరి కాయ కొట్టకుండా పంపించేది కాదు.. ఒక్క పూట ఊరికి వచ్చినా ఈయనని కలవకుండా మాత్రం తిరిగి వెళ్ళము.

ఫణి అనేది నాగేంద్ర స్వామికి ఇంకొ పేరు.

కృష్ణా జిల్లాలో పల్లెటూర్లలో కనీసం ఒక్క నాగేంద్ర స్వామి గుడి తప్పకుండా ఉంటుంది, పుట్టలో పాలు పొయ్యడం అనేది పెద్ద పండగ చెవులు కుట్టాలన్నా ఉయ్యాల వెయ్యాలన్న, అన్నప్రాసన చెయ్యాలి అన్నా, పిల్లలు పుట్టాలి అని మొక్కుకోవాలి అన్నా, చెవి పోటు  వచ్చి పాలు పోస్తాం అని మొక్కుకున్నా ఏది ఎలా అయినా నమ్మకం మాత్రం బలంగా ఉంటుంది.



Wk27/Dy5(180) ~ June 28 ~ ప - పచ్చదనం (Pa - Pacchadanam)

the green backdrop is such a pleasure to the eyes!!!

పచ్చటి పంట పొలాల వంక అలా చూస్తూ ఉంటేనె కడుపు నిండిపొతుంది నాకు.. బస్సు లో కూర్చుని అలా రోడ్ పక్కన పచ్చటి పొలాలు చూస్తూ వెళ్తుంటే ప్రయాణ బడలిక కూడా తెలియదు