Tuesday, October 11, 2011

Day 280 ~ Oct 7 - Srikaakuleswara Swamy

The idol of lord, there was this divine radiance and an old world charm to this place, all through I had this feeling that I had been to this place some time, seen this premises but I had never ever been there.. loved the feeling.

మహిమ గల గుడి తప్పకుండా వెళ్ళండి వెళ్ళండి అని ఇంటి దేగ్గరి VRO గారు పీక్కుని తినేస్తుంటే తప్పేటట్లు లేదురా బాబు అని బయలు దేరి వెళ్లాం కాని అక్కడి వెళ్తే మనసుకు చెప్పలేనంత హాయిగా అనిపించింది.

The temple existing since 1010 AD, reconstructed twice, now renovated and looks like this but the sanctum sanctorum gives you an old world feel.


This existing temple is said to be built by Sree Krishna Devaraaya.. there are inscriptions from Chola dynasty time and this is Amukta Malyada Room!

తెలుగు వాళ్ళు అంత గొప్పగా పొగిడే ఈ ఆముక్త మాల్యద ని చదవాలని ఎంతో ఆశగా ఉంది కాని ఏంటో దాన్ని ముట్టుకోగానే నిద్రోచ్చేస్తుంది నాకు :(.

It is in Krishna District on the way between Movva and Challapalli..

Day 279 ~ Oct 6 - Another Year...

Mom's birthday cake... yumm!!

మా మమ్మీ పుట్టిన రోజుకి పండు గాడి తరపున కోసిన కేకు.

Day 278 ~ Oct 5 - Piggy Gang

Saw pigs after a real long time, their presence in the temple premises was a little disturbing and yucky but the kid loved watching them..

మా చిన్నప్పుడు పందుల రామ రావు అని ఒకాయన పండులని కొని ఊరి మీద వదిలేసి అవి పెరిగినాక పట్టుకుని అమ్ముకునేవాడు, వాటిని చూస్తె చచ్చే భయం వేసేది, వాటిని పట్టుకునేతప్పుడు వాళ్ళ కేకలు, వాటి పరుగులు అరుపులు నానా బీబత్సంగా ఉండేది.. తరవాత ఆయన పోయాక వాళ్ళ పిల్లలు బాగా సంపాదించుకుని వీటిని పెంచడం మానేశారు... మళ్ళీ ఇంచు మించు ఒక పది పదిహేను సంవత్సరాలకి ఈ పండి పరివారం కనిపించింది.

Monday, October 3, 2011

Day 277 ~ Oct 4 - Baccha Bhajana Batch

Local children doing bhajans at the Navaratri Mandap.

నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చాల బాగా భజనలు పాడేది అంట, పూజలు జరిగితే ఆవిడ భజన లేకుండా ఉండేది కాదు అంట, నేను మటుకు తను పాడటం బయట వినలేదు ఎప్పుడు.. ఈ గుడిలో కూడా చాల సేవ చేసేది అంట ఆవిడ, బోలెడంత మంది జనం వచ్చేవారంతా, ఇప్పుడు టీవీ లకి అతుక్కుపోయి ఎవరు రాట్లేదు, ఈ పిల్లలే పాడుకుంటున్నారు భజన బృందం దెగ్గర కూర్చుని...తొందరలో వీళ్ళు కూడా మిగలరేమో



Sunday, October 2, 2011

Day 276 ~ Oct 3 - Saraswathi Namasthubyam

Today's diety form is Saraswathi, the goddess of education, so we promptly go to the temple to pooja done!

మూల నక్షత్రం సరస్వతి పూజ అని చిన్నప్పుడు చాల చాల హడావుడి చేసేవారు, ఈ రోజు కొందరు అక్షరాభ్యాసం కూడా చేయించుకుంటారు పిల్లలకి.. ఊర్లో శివాలయంలో అమ్మవారి అలంకరణ ఇది.. 

Day 275 ~ Oct 2 - Tiny Pond

Converted an old cement water filler into our tiny lotus pond.. !

పాత సిమెంటు తొట్టి ఉంటె దానికి కాస్త రిపేరు చేసి నీళ్ళు పోసి నాచు పెంచి మా బుల్లి తటాకము తయారు చేసుకుని బుద్ధుడి దెగ్గర పెట్టేసామోచ్!

Day 274 ~ Oct 1 - Buddi Deepaalu??

light bulbs fixed up in traditional lantern design...

రామగుండం సమ్మె పుణ్యమా అని రోజులు సంగం సేపు కరెంటు ఉండట్లేదు... inverter  కూడా ఎక్కువ సేపు రావడం లేదు, మల్లి recharge  అయ్యే లోపు కరెంటు డాం  అంటుంది అందుకోసం దీపం బుడ్డి దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఎక్కడా ఎవరు వాడట్లేదు అని చెప్తున్నారు..