Saturday, April 30, 2011

Day 120 ~ April 30 - Girls and painted nails..

The kid's latest muse.. painted tips and toes..

ఎక్కడ చూసిందో కాని చిచ్కూ గాడికి ఈ గోళ్ళ గోరింటాకు సంబరం మొదలయ్యింది.. కొంచెం రంగు పోయి గోరు కనపడగానే మళ్ళీ  అమ్మా గోరింట అని మొదలు.. తను ఒక్కటే వేయించుకుంటే పర్లేదు నేను కూడా వేసుకోవాలి ఇద్దరు గోళ్ళు పెట్టుకుని చూసుకోవాలి.  నేను చూసింది ఏంటి అంటే నా గోళ్ళకి రంగు ఉంటె నేను చెయ్యి ఎక్కువ తిప్పుతూ మాట్లాడతా అందుకని అస్సలు ఇష్టం ఉండదు... కాని ఎవరి గోర్లు అన్న చక్కగా ఉంటె కాసేపు చూసి తృప్తి పడిపోతా.. అలాంటిది ఇప్పుడు తప్పట్లేదు... కష్టపడి చెయ్యి కదపకుండా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్న :).

Day 119~ April 29 - Trying Times.. Spoonfuls

One of those testing foods time for kid... almost an hour to get half spoonfuls in :((

చిచ్కూ చిన్నప్పుడు భలేగా తినేసేది ఏది పెట్టినా.. అంటే అయిదు, ఆరు, ఏడు నెలలు అప్పుడు అన్నమాట.. అసలు బ్రాహ్మీ లాగ లోట్టేసుకుని మరీ.. అబ్బో ఆహ ఓహో అసలు నా అంత అదృష్ట వంతురాలు ఈ ప్రపంచంలోనే లేదు పిల్లలు పేచి పెట్టేది తిండి విషయంలోనే నేను అసలు మురిసి ముక్కలు ముక్కలు ఐపోయాను అన్నమాట... అందరు తినట్లేదు అని చెప్పుకుని బాధపడుతుంటే నాకు అమ్మో అమ్మో నేను ఎంత కష్టం తప్పించుకున్నా అనుకునేదాన్ని.. అప్పుడు తెలియలేదు  in front crocodile festival ani... తరవాత చుక్కలు కాదు, నక్షత్ర మండలం ముత్తం కళ్ళకి చూపించడం మొదలు పెడుతుంది అని.. ఒక్కో రోజు అసలు మరీను.. ఈ గిన్నె, ఆ గిన్నె, ఇది వద్దు అది వద్దు, అది కావలి, ఇంకోటి కావలి, వద్దు వద్దు... ఆఖరికి రోజులు తరబడి తినకపోతే వెనక్కి పట్టుకుని నోట్లో పోసేసెంత అన్నమాట :((((.

నాలుగు సగం స్పూన్ ఓట్స్ తినడానికి గంట, ఇల్లంతా పరుగులు, నాలుగు వేరు వేరు స్పూన్లు... ఇంతకీ నోట్లోకెల్లింది మనం తినే ఒక స్పూన్ అంత.  ఎన్ని సార్లనుకుంటానో తను అమ్మ ఆకలి అనేంత వరుకు వదిలేద్దాం తరవాత పెడదాం అని... ఆ మాట నాకు వినే యోగం ఇప్పుడప్పుడే లేదు అనుకుంటా :(.

దీనికి తగ్గట్టు పిల్ల పొడుగ్గా సన్నగా నేను అడ్డంగా పెరిగిపోతున్నాం తను వదిలేసినవి పారేయ్యలేక లాగించేస్తూ... :((((...


Wednesday, April 27, 2011

Day 118 ~ April 28 - Ticket, Ticket...

Promoting bus journey... by the way, I entered the lucky "deep" :).. you do too when you happen to take a bus.

ఊర్లో నించి బందరు బస్సులు తప్ప వేరే బస్సులు అన్ని తీసేసి చాల రోజులయ్యింది మాకు, దాంతోటి గుడివాడ వైపు వెళ్ళాలంటే ఆటోలో పక్క ఊరు ఎల్లి అక్కడ బస్సెక్కాలి, ఇది పండు గాడితో అయ్యే పని కాదు కాబట్టి తను లేకుండా నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా బస్సులోనే వెళ్తాను.  ఆటోలో జనాలు కిక్కిరిసిపోయి, ఎటు ఎల్తుందో, ఎందుకెల్తుందో కూడా తెలియకుండా పోతా ఉంటాయ్ కాబట్టి అసలు తగ్గించేస్తే ఊర్లు సగం బాగు పడిపోతాయి అని నేను గట్టిగా నమ్ముతాను.  ఇలా స్కీములు పెట్టి ఆకర్షించడం మంచిదే.. అలాగే పనిలో పని ఊర్లన్ని కలుపుతూ కొన్ని సర్వీసు బస్సులు వేస్తె.. పల్లె వెలుగులు కొన్ని మా ఊర్లో కూడా ప్రసరించినట్లు అవుతుంది అని RTC వారికి నా మనవి.  బస్సులు లేక ఉన్న నాలుగు ఎప్పుడొస్తాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆటోల్లో ఎక్కే ముసలి తాతల్ని మామ్మల్ని చూస్తె ఒక్కోసారి భలే బాధేస్తుంది. 

Tickets to various destinations with fare based on the distance... I get the 7 rs/- one to Gdw.

బస్సు ఎక్కగానే అందరిని తోసుకుని తోసుకుని వచ్చి టికెట్ టికెట్ అనే గొంతు, చిల్లర కోసం గొడవలు, టికెట్ వెనక మిగతా డబ్బులు రాసి దిగేటప్పుడు తీసుకోమనడాలు,  వీలయితే ఎంచక్కా చిల్లర కొట్టేసే కండక్టర్లు, express ఎక్కేసి చార్గీ ఎక్కువైపోయింది అని గోల పెట్టె మామ్మలు, తాతలు, చెయ్యి ఎత్తినా ఆగట్లేదు అని గోల చేసే passengerలు , బారెడు ఎత్తున్న పిల్లలకి ఇంకా నాలుగు కూడా రాలేదు అని అబద్దాలు చెప్పేసే తల్లులు తండ్రులు, బస్సు ఎక్కక ముందే తుండు, కర్చీఫు ఎసేసుకునే జనాలు, మూరెడు పిల్లలకి బారెడు పుస్తకాల బ్యాగ్గులు, రోడ్డు మీద అడ్డదిడ్డంగా ఎల్తున్న ఆటోలని తిడతా రయ్యిమని బండి తోలేసే డ్రైవరు, ఇంకా సీట్లో కూర్చున్నాక జనాల చర్చలు, పిల్లల ఆటలు, కేకలు.. కీసర బాసర.. ఇవన్ని నాకు చాల చాల ఇష్టం.. నచ్చనివి కూడా చాల ఉన్నాయ్, ఇవ్వాల్టికి కేవలం నచ్చేవి తలచుకుంటా :).

One of the things that I love doing when I can spare time is travel in a bus, get to see and study a lot of people, use govt. resources, reduce traffic congestion on the roads and usually get the feel of how the state of the AP state is in my own personal way :).

Edited to Add

Just checked a real yet fun post on conductors, cute coincidence :).. check here..

Tuesday, April 26, 2011

Day 117 ~ April 27 - Retaining the personal touch

The postmaster filling the savings passbooks and putting a seal on them...

చిన్న డాబా, అందులో ఫ్యాన్ కింద చెమటలు తుడుచుకుంటూ, ఉత్తరాలు చూస్తూ, ఒక పక్క డబ్బులు కట్టించుకుంటూ, పాస్ బుక్ లో entries చేస్తూ, ఫోన్ బిల్లులు కట్టించుకుంటూ, stampలు అమ్ముతూ, ఉత్తరాలు తీసుకుంటూ, బట్వాడా చెయ్యడానికి ఉత్తరాలు వేరు వేరు సంచుల్లో వేసుకుంటూ, ఎవరైనా ఉత్తరాలు రాయమంటే వచ్చిన వాళ్ళకి పని అప్పచేప్తూ.. అబ్బో అష్టావధానం చేస్తున్నట్టుగా తెరిచి ఉన్నంత సేపు యమా బిజీ... పాపం ఈయనకి తోడూ ఇంకో పోస్ట్ మాన్ ని వేసింది ప్రభుత్వం..

ఆ సీలు, స్టాంపు, ఆ నల్ల ఇంకు.. తుప్పు పట్టిపోయిన పాత సామాను, ఒక పార్సిలు బరువు చూసే మిషను, రెండు బల్లలు, నాలుగు కుర్చీలు.. ఇద్దరు మనుషులు.. ఇదండీ మా బుల్లి బుజ్జి పోస్టాఫీసు.  

One department that retains its personal touch everywhere in the world is, I guess, the Postal Department... in the world full of computers, mechanical sorting and stuff it is still that happy postman who delivers us those letters, who is there with us in times of good, bad, ugly and everything.. of course with cell phones and emails the snail mails have taken a back seat but majority of my communication happens through this post office in this remote area, my books, my papers, documents,  everything.  I love to see the face of the postman and that happy smile on his face with the screams "postuncle" in the background from the kid..

Day 116 ~ April 26 - Get, Set, Go........

The village library, has some very very old books and the latest editions are like a fresh breeze...

పుస్తకాలు అంటే పడి చచ్చే నాకు ఈ గ్రంధాలయం ఎంతో ఇష్టమైన చోటు.. మా ఊర్లో నాకు చాల నచ్చే విషయం ఏంటి అంటే ఒక గ్రామాభివృద్ది కమిటీ వేసుకుని డబ్బులున్న దాతలు, అమెరికాలోనో ఇంకో చోటెక్కడో ఉన్న వాళ్ళు కూడా ముందుకొచ్చి స్థలాలు, డబ్బులు, వాళ్లకి చేతనైనంత సాయం చేస్తారు.  వేరే చోట్ల లాగ అద్దె ఇళ్ళల్లో కొట్లలో ఉండవు గ్రంధాలయం, పంచాయితీ, కచేరి సావిడి, పోస్ట్ ఆఫీసు, సొంత స్థలాలు ఉన్నాయి.  దాతల సాయంతో సొంత స్థలాలు గ్రామానికి అంకితం చేస్తారు... చాల ముచ్చటేస్తుంది నాకు.. అంతకు ముందు ఈ లైబ్రరీ ఎన్నో చోట్లకి మారింది అద్దెకి... వచ్చినప్పుడల్లా ఒకో కొత్త చోటు.. వానలకి తడిచి, మారేటప్పుడు పుస్తకాలు పోయి, అట్టలూడి పోయి, కాయితాలు  పోయి చాల నష్టం జరిగేది ఇప్పుడు చాల పటిష్టమైన డాబా ఉంది.

అన్నదాత సుఖీ భావ అంటారు కాని ఆ అన్నం సంపాదించుకునే విద్యని ప్రసాదించే దాతా సుఖీభవ అని నేను అంటాను.

PS:  That is the little one in the inset on the wooden panel browsing through the magazines while I do my book hunt.

I love the latest kid collection they have... sponsor a kid to a library if you get a chance to and open windows of world to them..

Sunday, April 24, 2011

Day 115 ~ April 25 - Full and Final..

The final get up for this year..

ఇవ్వాళ ఆఖరి రోజు, ఆఖరి వేషం, ఒక్కొక్క ఇంటికి వెళ్లి మళ్ళీ వచ్చే ఏడు బతికి బాగుంటే వస్తాం అని చెప్పి వెళ్తారు... 

Saturday, April 23, 2011

Day 114 ~ April 24 - Maaremma Vesham

The getup which amuses the kids of the village...

అన్నిట్లోకి ఈ వేషం అంటే పిల్లలకి భలే సరదా ఇతని వెనక తిరుగుతూ మారెమ్మ మారెమ్మ అని కేకలేస్తూ ఇతను వెనక్కి తిరిగి వాళ్ళని కాస్త దూరం తరుముతున్నట్టు పరుగెడుతూ ఊరంతా గోల గోల చేస్తారు..  పండు గాడు కూడా అమ్మ మారెమ్మ వెళ్లి, రాజ చూసి అని డప్పు వినిపిస్తున్నంత సేపు ఒకటే గోల..

నిన్నటితో నాలుగు ఐపోయినట్టున్నాయ్ ఇవ్వాళ ఆఖరి వేషం కట్టి భిక్ష మొదలు పెడతారు.. పొలంలో పనులు ఉన్న రోజులు కదా ధాన్యం, కూలి చేతికి అందుతాయి వీళ్ళకి ఇవ్వడానికి ఉంటాయి అని ఈ రోజుల్లో వస్తారు.

Friday, April 22, 2011

Day 113 ~ April 23 - After The Rain

The coconut flowers that fell down due to wind and rain..

చిచ్కూకి ఈ రాలిపోయిన కొబ్బరి పువ్వులు అంటే భలే ఇష్టం ఒక గిన్నె తీసుకుని అందులో ఏరుకుని అన్ని ఒక చోటో పెట్టుకుని రాలిన పోయిన కొబ్బరి పిందెలు కూడా పోగేసుకుని పూలు, కాయలు అంటూ ఆడుకుంటుంది..

ఈ వానల మూలాన సుబ్బరంగా పండి చేతికి వచ్చిన పంట కాస్త మళ్ళీ పాడైపోతుంది, దిగుబడి తగ్గుతుంది చాల బాధగా ఉంది.. అసలు ఈ  గోలంతా లేకుండా corporate agriculture వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది, చిన్న రైతుల కష్టాలు చూస్తుంటే.

Day 112 ~ April 22 - Another Getup

He missed one day due to the rain.. just one more to go I guess..

మళ్ళీ డప్పు డాన్సు, మళ్ళీ కొత్త వేషం... 

Day 111 ~ April 21 - Pulpie Joy

For some reason, these were out of stock in Gdw and Vja for a while.. now I ensure I always a rack full of them.

మండే ఎండల్లో, కొబ్బరి నీళ్ళు కూడా తాగని చిచ్కూకి ఈ పల్పీ అంటే మటుకు చాల ఇష్టం, ఏదోకటి సూరి తాత పిల్లల energy straw  పెట్టి జుర్రేసే టైములో కాసిని నీళ్ళు ఎలాగోలాగ పొట్టలో పడితే చాలు అనుకునే నాకు ఇది అమృత పానీయం తోటి సమానం.  కొబ్బ జూస వద్దు, పల్పీ జూస ఇవ్వమ్మా అంటుంది, ఇవేమో నా ప్రాణానికి ఈ మధ్య ఎక్కడ దొరకట్లేదు, చివరాఖరికి ఒక కొట్లో దొరికితే నెలకి సరిపడా dates చూసి తెచ్చి పెట్టుసుకుంటున్న ఈ మధ్య.. నాకు కూడా భలే భలే ఇష్టం ఇది.

Day 110 ~ April 20 - ID'd

 Finally my corporate ID/swipe card... feel good to be back.

ఇంట్లోంచి పని చేసినా కూడా పూర్తి స్థాయి ఆఫీసు ఫీలింగ్ తెప్పించే ఈ ఆఫీసు అంటే నాకు భలే ఇష్టం... పని మటుకు మోత మొగిన్చేస్తాంది ప్రస్తుతానికి, కాని పరవాలేదు, బాగుంది.

Wednesday, April 20, 2011

Day 109 ~ April 19 - Pagati Veshagaallu

Another soon-to-be extinct tradition...

ఐదు రోజులు రోజుకో వేషం కట్టి డప్పు వాయిస్తూ ఊరంతా ఇల్లిల్లు తిరిగి కనిపించి వెళ్లి ఐదో రోజున భిక్షకి వస్తారు.. వీళ్ళనే పగటి వేషగాళ్ళు అంటారు.  ఇది మూడో రోజు, రెండు రోజులు నేను చిచ్కూ డప్పు సౌండ్ విని కెమేరా లేకుండా పరుగెత్తుకెళ్ళి చూసేసాం, పని కట్టుకుని ఇవ్వాళ మటుకు ఆపి ఫోటో తీసుకుని రేపు ఎల్లుండి కూడా ఫోటోకి ఆగాలి అని చెప్పాం.. డప్పు డాన్సు లో రోజు రోజుకి కొత్త ప్రయోగాలు చేస్తుంది పండు గాడు, ఆ గంతులు చూస్తా ఫోటో సంగతి మరచిపోతున్నా.. 

Day 108 ~ April 18 - The Magic Number

పుట్టిన రోజు అంటే వారం ముందు నించి అడిగినోళ్ళకి అడగనోళ్ళకి అందరికి చెప్పి హడావుడి చేసుకునే రోజులు పోయాయి.. మన పుట్టిన రోజు మనం చేసుకోడం కంటే దాన్ని అందరు గుర్తుంచుకునే విధంగా జీవించాలి అని కోరిక పెరిగిపోతోంది, ఆ దిశగా అడుగులు వెయ్యాలి ఈ ఏడాది అని దీవిన్చేయ్యండి నన్ను అందరు.

Considering 3 is my lucky number and it comes twice in the current age of mine, I am very positive this year will see the best of me and vice versa :).

Gift myself some plants, the special for the day was that I lazed around the whole day, a bunch of buddies wished me on FB on phone and in the messengers, Caps forced me to treat myself so eventually I went ahead and did, what best way than to plant in a new corner altogether.

The plant in the inset is from the taatagaru I so liked and admired in the village, Sai Tatagaru, my cute old buddy, we had so many similarities in life, so I go pick a plant from his now abandoned house in the same pot he planted it in to keep with me as his reminder.  I am sure he would be happy wherever he is!!!


Sunday, April 17, 2011

Day 107 ~ April 17 - Wound Up...

Slinky, one of the toys that I had gotten for the kid... it so resembles my life, tangled.. disentangled with effort only to be tangled...

స్ప్రింగు లాగ దూకడం, అంటారు కాని స్ప్రిన్గులో ఉండే టెన్షన్ చాల ఎక్కువ... నాకు ఈ స్లిన్కీ రంగులన్నా, దీనితోటి ఆడటం అన్నా, చిచ్కూ ఆడుతుంటే చూడటం, తను మెలికలు పడేసి ఇస్తే తియ్యడం ఒక ఆట... తీసి తీసి వంగిపోయి ఇరిగిపోయి అయినా ఇదంటే నాకు ఇష్టం ఎందుకో నా జీవితం లాగ అనిపిస్తుంది...

Day 106 ~ April 16 - Capped

We set about for a walk for a break in hot sun...

ఎండలకి గుండు మాడిపోతుంది పొద్దున్నే తొమ్మిదింటికి బయటకి వెళ్ళినా సరే, మూడు రోజులనించి వరస పెట్టి ఆ laptop లోకి  కళ్ళు పెట్టి చూసి చూసి, ఆ ఫోన్ మాట్లాడి మాట్లాడి చెవులు చాటలంత ఐపోయి కొంచెం change కోసం అలా చిచ్కూ నేను ఆచ్చికి వెళ్లి వచ్చాం.. ఎండల్లో వెన్నెల లాగ అదొక ఆనందం...

Day 105 ~ April 15 - All Day Long

The work table for the past couple of days.. on the phone, in front of the laptop, for the new beginnings ..

ఆఖరికి నాలుగేళ్ల తరవాత మళ్ళీ నాకు నచ్చిన చోటు పని మొదలు పెడుతున్నా... నాకు జీవితంలో ఎన్నో నేర్పించిన ఈ చోటు అంటే చాల చాల ఇష్టం.  ఎప్పటికి ఆఫీసు కి వెళ్తానో కాని ముందు అడుగు మాత్రం వేసేశాను కష్టమో నష్టమో, కొంచెం ఓపిక పట్టి మళ్ళీ కెరీర్ ని ఒక గాడిలో పెట్టుకోవాలి అని..

Wednesday, April 13, 2011

Day 104 ~ April 14 - Zen Corner

Got this Buddha figurine after a lot of search... in a quite corner.

ఎంతో వెతకగా వెతకగా దొరికిన బుద్ధుడి బొమ్మ, లాఫింగ్ బుద్ధ అంటే అబ్బో గుట్టలు గుట్టలు ఉంటున్ని కాని నిజంగా బుద్ధుడి బొమ్మలు అంటే దొరకడం చాల కష్టంగా ఉంది.. modern art అంటూ ఏవో ఉంటున్న అవి నాకు నచ్చట్లేదు.. కొంచెం పెద్దది మొక్కల మధ్యలో ఆరుబయట పెట్టటానికి చాల రోజులని వెతుకుతున్న, plaster of paris ఐన పర్లేదు అంటే ఎక్కడ కనిపించట్లేదు. 

ఆ ముఖంలో నవ్వు, ప్రసాంతత ధ్యానం చెయ్యాలి అంటే ఒక మంచి ముద్ర....  

Day 103 ~ April 13 - Minnie Door

Finally, we got to stick the Minnie House stickers on my work room door, view from where she plays..

నేను పని చేసుకునేటప్పుడు ఎప్పుడు నాకు కనిపించేలాగా చుట్టూ పక్కల్లోనే ఆడుకుంటూ మధ్య మధ్యలో తన కంప్యూటర్ ని కీ బోర్డు ని నోక్కేసుకుంటూ, తిరుగుతూ ఉంటుంది చిచ్కూ, ఈ మధ్య కొంచెం సీరియస్ పని ఉంటె తలుపు వేసేసుకుని చేస్తున్న లేదంటే concentration రావట్లేదు.. అప్పుడు దూరంగా తలుపు దెగ్గర బొమ్మలేసుకుని ఆడుకుంటుంది ఎప్పుడు తెరుస్తాన అని చూస్తూ, సో అక్కడ అంటిన్చేసాం :).

Day 102 ~ April 12 - Painted

Painted the flower pots to make it a bit colorful..

చిచ్కూకి తన మొక్కలని చూసుకోడం బాగానే అలవాటు అయ్యింది, రోజు లేచి అన్ని లెక్కలు పెట్టుకుని, గుడ్ మార్నింగ్ చెప్పి ముట్టుకుని చూసి వచ్చేస్తుంది, సాయంత్రం నీళ్ళు పోసి, తరవాతే తను స్నానం చేయించుకుంటుంది. ఫోటోలో ఉన్న కుండీలు, హ్యాండ్ పంపు అన్నిటికి వరసపెట్టి రంగులు వేసేశాను.  ఎవరితో అన్న వేయిస్తే ఆ తృప్తి రాదు కదా.. ఎలాగున్నా నేను వేసాను, తను పెంచింది అంటే అబ్బో అసలు ఇదే మాకు బృందావనం లాగ ఉంది.

Sunday, April 10, 2011

Day 101~ April 11 - Hariyaali

The Hariyaali stores on the way between Angaluru and Gudiwada, a huge surprise for me..

చిచ్కూ పుట్టిన రోజున గుడికెళ్ళి అటు నించి గుడివాడ వైపు వెళ్లాం, ఆ దారిలో ఈ హరియాలిని చూసి ఒక్కసారి భలే ఆశ్చర్యం వేసింది నాకైతే.. అచ్చం అమెరికాలో షాప్స్ గుర్తొచ్చాయి నాకు, గ్యాస్ స్టేషన్, పక్కనే పెద్ద స్థలంలో ఒక చాల పెద్ద షాప్.. లోనికేల్తే ఇంకా ఆశ్చర్యం అందులో లేనివి లేవు.. అసలు ఇది మా ఊరేనా బొమ్మలు, electornic వస్తువులు, బట్టలు, చెప్పులు, groceries , ఒకటి అని ఏంటి సమస్తం ఒకటే చోట.. అది కూడా అంతస్తు మీద అంతస్తు లో కాదు ఒకే చోట.. నాకు భలే నచ్చేసింది... కాకపోతే ఎవరు వచ్చి కొంటారు ఈ చేల మధ్యలోకి అని ఒక పెద్ద అనుమానం... 

Day 100 ~ April 10 - Summer Style Statement

This is our style statement for this summer..

చిచ్కూకి మొన్నటిదాకా హెయిర్ స్టైల్ అంటే అంట కత్తెర.. మేము అందరమూ అరేయ్ ఒరేయ్, వాడు వీడు అని పిలుస్తూ ఉండటం వలన, ఆ జుట్టు వలన అందరు తను నా కొడుకు అనుకోవడం, పైగా చూసి చూసి విసుగు వచ్చెయ్యడం వలన  జుట్టు పెంచడం మొదలు పెట్టా... సరిగ్గా ఎండా కాలం వచ్చేపాటికి అది మొహం మీద కళ్ళలో పడి, మెడ మీద పడిపోతూ చెమట పట్టేస్తుంటే పాపం తను చెప్పలేక చిరాకు పడిపోతుంది... మొత్తం ఒక వైపు లాగి కట్టడానికి ఇంకా మొలకలు అంతగా పెద్దవలేదు.. కాబట్టి ఇంట్లో తిరిగేటప్పుడు ఎండల్లో ఇలాగే రెండు, మూడు, పిలకల్లో కనిపిస్తాం :).

Saturday, April 9, 2011

Day 99 ~ April 9 - Happy Birthday Siya Bangaam

The kid in the middle of a beautiful rangoli..

కన్ను మూసి తెరిచేలోపు రెండేళ్ళు గడిచిపోయాయి.. పొత్తిళ్ళలో పాప, పరుగులు పెట్టేస్తోంది... ఎందుకు బంగారం అంత తొందర అని అమ్మ మనసు గోల చేస్తుంది.. 

నా చిన్నారి తల్లికి మీ కోటి దీవెనలు అందించి దీవించండి.

Day 98 ~ April 8 - Gomaata Pooja

The cow and calf tied to the navagraha temple as part of same santhi pooja..

దానాల్లోకెల్లా గోదానం గొప్పది అని అంటారు... ఈ మధ్య గోదానం చెయ్యడం కూడా విడ్డూరమే ఐపోయింది.. గోవుకి సరిపడా డబ్బులు పూజారికి ఇచ్చేస్తే ఆయనే తన ఇంట్లో ఉన్న ఆవుని తోలుకుని వచ్చి గుడి దెగ్గర కట్టేసి తనే మళ్ళీ దానం తీసుకుంటారు...

నాకు ఈ ఆవుని దూడని చూస్తె చిన్నప్పుడు చదువుకున్న ఆవు - పులి కధ గుర్తొచ్చింది, చాల ముచ్చటేసింది.. చాల ప్రేమ కనిపించింది వీటి మధ్య.. తల్లి బిడ్డ బంధం, ఆ కళ్ళలో కనిపించింది..  

Wednesday, April 6, 2011

Day 97 ~ April 7 - Chilaka Josyam

The parrot ramu without the tail picking up a card for Sreya...

ఉగాది రోజున పని మీద బయటకి వెళ్ళినప్పుడు సోమవారం సంత మీదగా వెళ్ళాల్సొచ్చింది, అప్పుడు ఈ చిలక జోస్యం అతను ఒక్కడే ఈ చిలకని తనని తిట్టుకుంటూ కూర్చుని కనిపించాడు.. మామూలుగా ఇలాంటి వాటి జోలికి ఇంటి దెగ్గర తప్ప వెళ్ళని నేను, పండగ రోజు అతనికి పని ఇద్దాం అని ఎంత అని అడిగితె 11 రూపాయలు అన్నాడు, సరే కదా  అని అక్కడ డబ్బు పెట్టాక మొదలు పెట్టి, వరసపెట్టి ఏదో చెప్తూనే ఉన్నాడు, ఒకటి నిజం లేదు, నిజమా కాదా చెప్పు అంటాడు ఏమి చెప్పను ఒక్కటి కూడా కాకపొతే.. సరే ఇలాక్కాదు మూడు గవ్వలు వెయ్యి అప్పుడు కచ్చితంగా చెప్తా అన్నాడు.. తిరగబడ్డ గవ్వ కి పది రూపాయలు అవుతుంది అని చెప్పాడు.  పోన్లే కదా మూడు కూడా తిరగబడ్డ ౩౦ కదా పది రూపాయలకి ఏమి వస్తుంది పండగ పూట అని సరే అని చెప్తే.. ఆపకుండా తొమ్మిది సార్లు వేయించి అన్ని లెక్క కట్టి అక్కడ పెట్టు అంటాడు.. తొమ్మిది వేసినందుకు నాకు అస్సలు బుద్ధి లేదు, కరెక్టే, మరి దిగిపోయినాక బాగోదు కదా.. ఏంటిది మూడు గవ్వలు అని 27 లెక్క చెప్తున్నావ్ అంటే.. మొత్తం వినకుండానే గావ్వలేసినాక డబ్బులివ్వకపోతే నాశనం ఐపోతావ్ అని భయపెట్ట బోయాడు... మనమసలె రివర్స్ గేరు కదా, భయపెడితే తిరగబడతాం.. ఎలాగో నాశనం అయ్యేటప్పుడు నీకు డబ్బిచ్చి మరీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చక్కా వచ్చేసా.. కాస్త దూరం వెళ్ళాక వెనక చూస్తె ఇతను.. మెల్లిగా బేరాలు మొదలు పెట్టాడు.. అప్పటికే పిచ్చి పీక్ స్టేజి కి వచ్చేసిన నేను.. లేదు అంటే అడుగు ఎంతైనా పెడతా, ఇలా భయపెట్టి తిడతావా సమస్యే లేదు అని చెప్పా.. దేగ్గర్లో పోలీసు స్టేషన్ ఉంది కాబట్టి వాడు వెళ్ళిపోయాడు.

తరవాత ఇంటికొచ్చాక అమ్మ చావ తిట్టింది అది సంత కాబట్టి సరిపోయింది వాడు మెళ్ళో గొలుసో, చేతిలో బాగ్గో లాక్కుపోయి, పొతే పోనీ నిన్ను ఏమైనా చేస్తే ఏంటి దిక్కు అని.. అప్పటి దాక ఆ అలోచిన రాని నాకు, వెళ్లి వాడిని పోలీసులకి పట్టించాలి అని కోరిక వచ్చింది... పోలీసులు నన్నే నాలుగు వాయిస్తారు అసలు ఎందుకు ఎల్లావ్ నువ్వు అని అమ్మ అంటే మల్లి కిక్కురు మనలేదు .

This was scary as an afterthought... when I looked back at the picture and remember the face and in particular the hands with deep scars like they were cut with a knife or something it gave me shivers and felt like kicking myself.. pandaga poota papam edaina iddaam anta, naa dikkumaalina thoughts malli vaatiki kindheart ani naaku nene pettukune peru... a few more such incidents and I sometimes want to give up on thinking about anyone...

Tuesday, April 5, 2011

Day 96 ~ April 6 - Devataa Pushpalu

The flowers that I so love...

మా ఊరి  వేణు గోపాల స్వామి గుళ్ళో ఈ పూల చెట్టు ఉంటుంది.. నాకు ఆ గుడి అన్న అందులో దేవుడన్న, మొత్తం మీద ఆ వాతావరణం అంతా కూడా ఎంతో ఇష్టం... ధ్వజ స్థంబం దెగ్గరలో ఉండే ఈ పూల చెట్టు నుండి రాలే పూలు, పూల తివాచీ పరిచినట్టు ఎంతో ముచ్చటగా ఉంటాయి.   చాల ఆహ్లాదం కలిగిస్తాయి... వీటి పేరు ఏమైనా గాని నాకు మాత్రం ఇవి దేవతా పుష్పాలు... ఆ తెల్లటి తెలుపు, మధ్యలో పసుపు.. మెత్తగా ఉంటూనే  మరీ అంత సున్నితంగా లేకుండా చాల చాల నచ్చుతాయ్.

Edited to Add:  I never really thought about finding the name of the flower, 'cos I gave it my own name.. the divine flower... but now I know it Firangi Paani, yet to know the telugu name.  With childhood feelings gone, I think I am ready to know the actual telugu name.. what is it??

Date correction

Thanks Usha for letting me know the slip-up in the day numbers, phew!! corrected them all.. thanks for watching out..

Love..

Monday, April 4, 2011

Day 95 ~ April 5 - Medari Buttalu

Giving shape to the bamboo..

గంపలు, బుట్టలు, కోళ్ళ, బాతుల గంపలు, చాతలు, విసినకర్రలు, పలికలు, నిచ్చెనలు.. అబ్బో ఈ వెదురు కర్రలకి ఇతను ఇచ్చే రూపాలు చూడటం అంటే నాకు భలే ఇష్టం... కాసేపు అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది... 

ఈ basket maker  బొమ్మని నేను ఎంతో ముచ్చటగా పూర్వాశ్రమంలో కుట్టుకున్నాను కూడా.... 

Day 94 ~ April 4 - Ugadi

Ugadi offering to the God and the Panchanga Reading for me and the kid..

ఉగాది అంటే పచ్చడి తో మొదలు పెట్టడం, నాకు అదొక వింత సెంటిమెంట్ పచ్చడిలో ముందు ఏ రుచి పంటికి తగులుతుందో అలా ఆ సంవత్సరం ఉంటుంది అని.. ఈ సారి అమ్మ ఇంట్లో చేసిన పచ్చడి తినటం మర్చిపోయి గుళ్ళో తిన్నా, అబ్బో విపరీతమైన ఘాటు.. 

విరోధి, వికృతి అంటూ నానా బీబత్సమైన పేర్ల తరవాత వచ్చిన ఈ శ్రీ ఖర అనే పేరు ఏదో బాగానే ఉంది అనిపించింది.. ఉగాది అనగానే తెలుగు వాళ్ళకి తోచేది తమ రాసి ఫలాలు చూసుకోడం, చెప్పించుకోడం.. మా ఊర్లో పొద్దున్నే పంతులుగారు పచ్చడి తీసుకుని ఇంటింటికి వెళ్లి పోసి, సాయంత్రం మళ్ళీ వచ్చి పంచాంగం చదివి వినిపించి స్వయంపాకం తీసుకుని వెళ్తారు.. ఈ ఏడు రెండూ జరగలేదు కాబట్టి నేను ఎల్లి పుస్తకం కొనుక్కొచ్చి చూసుకున్నా.. ముందు చిచ్కూది తరవాత నాది.. 

సింహ రాశి నాదేనోచ్ :). 

Day 93 ~ April 3 - Maggam Work

I am not a big fan of the maggam work but I do appreciate the work ..

పండక్కి చిచ్కూకి పట్టు లంగా మీద వర్క్ చేయించాలి అని వెళ్ళినప్పుడు ఈ పని చేసే ఇతనికి సెలవు అంట, లంగా తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక చీర మీద చిన్న చిన్న పూలు వేస్తూ కనిపించాడు.  ఇలాంటి భారి భారి వస్త్రాలు చూడటానికే కాని నాకు వేసుకోడానికి ఎలాగో ఇష్టం లేదు కాబట్టి చూసి సంతోషించాల్సిందే.. అయినా ఏదైనా కంటికి ఆనితే చాలు అది మగ్గం వర్కా, మెషిన్ వర్కా అని తరిచే చూసేంత కళా పోషణ నాకు లేదు కాబట్టి పెద్దగా ఏమి చెప్పలేను కూడా.

Day 92 ~ April 2 - The World Cup Mania

This is how I watched the Epic Match - The World Cup Final 2011...

అరి వీర భయంకరంగా మ్యాచ్ చూసి దేగ్గరుంది టీం ని గెలిపించాం అన్న తృప్తిలో ఎన్నిThumbsupలు తాగాం, ఎన్ని చిప్స్ పాకెట్స్ తిన్నాం అన్నవి మర్చిపోయి మరీ రెచ్చిపోయి చేతి గోళ్ళు, వాటి తోపాటు వెళ్ళు కూడా నమిలి మింగేసేతట్లు చూసిన మ్యాచ్ ఇది..

By the way, I loved the taste of India the best.. Could not get Pakistan, dont know if it was there on the flavor list or not but the shopkeeper refused to have anything named on that in his shop, so no way to know it.