A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Friday, April 27, 2012
Wk17/Dy6(118) ~ April 27 - Vantinti Paatlu
The asbestos east facing kitchen counter kind of takes away all my energy.. remember that energy drink ad where sun takes the energy through straw...!
ఇప్పుడే మేముండే ఇల్లు వంటిల్లు, చుట్టిల్లు, స్నానాల గది, పైన గదులు, కింద గదులు, కొట్ల గదులు అని ఊరంతా ఉన్నట్టు ఉంటుంది.. రోజులో అటు ఇటు నడిచిందే ఈజీగా రెండు మైళ్ళు ఉంటుందేమో... అవన్నీ అటుంచితే రేకుల్లో తూర్పు మొహం పొయ్యి దెగ్గర వంట చెయ్యడం అంటే పొద్దున్నే ఎనిమిది దాటితే కుయ్యో మొర్రో అయ్యో కుయ్యోనే... స్నానం చెయ్యకుండానే చెమటల తోటి ఒళ్ళంతా తడిచిపోతుంది...
ఎండాకాలంలో ఎప్పుడెప్పుడు వంట చేసి పారిపోయి వచ్చేద్దామ అనేంత ఘోరం.

Thursday, April 26, 2012
Wk17/Dy5(117) ~ April 26 - Baby's Love
kid's favorite Bheem, Chutki, Raju, Indumati, Jaggu.. and Kalia, dolu-molu at one end..
పండు గాడి గోడల మీద తలుపుల మీద ఇంత కాలం నేను పెట్టె బొమ్మలు ఉండేవి ఇప్పుడు తనంతట తనే ఏమి కావాలి అని చెప్పి పెట్టేసుకుంటుంది.. చోటా భీమ అంటే చాలు ప్రపంచం తల్లకిన్డులైపోయినా ఇంకా పట్టించుకోను అనే పరిస్తితిలోకి వెళ్ళిపోతుంది... పైనవి నేను తను చిన్నప్పుడు పెట్టినవి కిందవి తను అంటిన్చుకున్నవి.

Wk17/Dy4(116) ~ April 25 - Mande Kaalam
crows eating the flowers.. this is the first time I saw them doing something like that.
మండే ఎండలకి పాపం కాకులు తిండి కోసం ఎగిరి వెళ్ళలేక ఇలా చిట్ల నీడన ఉన్న మొక్కలకి ఉన్న పూలు పొడుచుకుని తింటూ ఉన్నాయి... పక్కనే ఉన్న తొట్టి నీళ్ళు తాగి మళ్ళీ చెట్టు కొమ్మలెక్కి కూర్చుంటున్నాయి... ఇంకా మనుషుల సంగతి వేరే చెప్పాలా.. పది దాటితే రోడ్ మీద ఈ మధ్య పురుగు కూడా కనిపించట్లేదు..

Wk17/Dy3(115) ~ April 24 - Easy Life
వంటిల్లు అంటే రుబ్బు రోలు, పొత్రం, రోకలి బండ, గాడి పొయ్యి, ఇవన్నీ పూర్వ కాలం... ఇప్పుడు అన్నిటికి అన్ని మిషన్లు... గిర గిర తిరిగి మనుషులని బద్దకస్తుల్ని చేసేస్తుంది... నా కంటే మా అమ్మ బలంగా, మా అమ్మ కంటే మా అమ్మమ్మ ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఉండరు మరి ఇవన్ని చేతితో చేసుకుని వంట చెయ్యడం ఒకెత్తు... వీటన్నిటిని పక్కన పెట్టి కర్రీ పాయింట్ కి పరుగెత్తడం ఇంకో ఎత్తు మరి :).
Wk17/Dy2(114) ~ April 23 - Koolina Godalu
Breaking down a 100-year-old home....!
PS: This house
చిట్టి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు.. మా ఇంటి ఎదురుగా ఇంత కాలం ఎవరు వాడకుండా చెదలు పట్టేసి ఉంది అని మామయ్యా వాళ్ళు, వాళ్ళ కొడుకులు వచ్చి కలప, నాప రాయి, మిగిలిన సామాను అంటా కలిపి టోకున అమ్మేసారు వాళ్ళు నిన్న నించి ఊడపీకేస్తున్నారు... మేము చిన్నప్పుడు గంతులేసిన ఇల్లు ఇప్పుడు ఇంకోటి నేలకూలిపోయింది :).
PS: This house
Sunday, April 22, 2012
Wk16/Dy7(112) ~ April 21 - Yaadein Yaad Aati hai..!
Found the greeting cards and a few more pics in the excavations :))... cant be more happy!
నా సామాన్లు నేను ఇండియా, అమెరికా, ఊరు అని తిగుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఉండిపోయాయో కూడా తెలియకుండా ఉండిపోయాయి ఇప్పుడు అవి మా ఊరు వెళ్ళినప్పుడల్లా తవ్వకాల్లో ఏదో ఒకటి బయట పడి, నాకు చేరుతున్నాయి... :).

Phew... I used to be sooooooooooo thin about 3 yrs. ago... sigh
Friday, April 20, 2012
Wednesday, April 18, 2012
Wk16/Dy5(110) ~ April 19 - Taati Munjelu
Tuesday, April 17, 2012
Wk16/Dy4(109) ~ April 18 - Thirty Four and Counting....!
Me in B/W and the kid in color... a baby pic of mine 3 months old and the newborn kid..
మూడేళ్ళ క్రితం చిచ్కూ గాడికి కూడా ఏప్రిల్ 18 due date ఇచ్చినప్పుడు ఇంకో బుల్లి రాకాసి అనుకున్నా.. తను నా పుట్టిన రోజున పుడుతుంది అనే సంతోషం కంటే నా రాత దానికి రాకూడదు అని ఒక భయం ఉండేది.. మొత్తానికి తను ఏప్రిల్ 9 న పౌర్ణమి రోజున పుట్టేసింది... అక్కడికి కదా సుఖాంతం..
ఇప్పుడే కాదు నా చిన్నప్పుడు కూడా వెతికి పట్టుకుందాం అన్న ఒక్కటంటే ఒక్కటి కూడా నా పోలిక లేదు :((... bwaaah ...!
Wk16/Dy3(108) ~ April 17 - Veyyinnokka Vidhaanam :)
Wk16/Dy1(106) ~ April 15 - Taabeti Kaaya
The earthen pots for cool water to beat the summer heat
మా చిన్నప్పుడు ఫ్రిజ్ అనేది లేనప్పుడు ఎండలు వస్తే రాత్రి పూట ఎవరి బుల్లి కూజ వాళ్ళది, కుండలో నీళ్ళు... తాబేటి కాయ ఒకటి ఉండేవి ఎప్పుడు ఎండా కాలంలో.. ఈ మధ్య కుండలు తప్ప వేరేవేమి కనిపించట్లేదు నాకు, కూజాలు కూడా అక్కడక్కడ ఉంటున్నా ఈ తాబేటి కాయ మాత్రం అస్సలు కనిపించలా.. మొన్న రోడ్ మీద కనిపిస్తే ఎంచక్కా తెచ్చేసుకుని నీరు చిమర్చడానికి కుండ పక్కన పెట్టి వాడటం మొదలు పెట్టా.
Sunday, April 8, 2012
Wk15/Dy2(100) ~ April 9 - The Day My World Changed
This day, 3 yrs. ago born at 9:14 a.m. this cute little bundle altered my life like nothing else did..
నా చిన్నారి చిట్టి ముత్యం, అరచేతిలో పట్టిన పసి కూన, మూడడుగులు సాగి, మూడో ఏట్లో అడుగు పెట్టేసింది అప్పుడే అంటే ఒక వైపు ఆనందం ఇంకో వైపు ఆరాటం... ఆరోగ్యంగా, తృప్తిగా.. నలుగురికి వీలయితే సాయపడేలా ఎదగాలి అని నిండు మనసుతోటి అందరు దీవించెయ్యండి..

Wk15/Dy1(99) ~ April 8 - Pure and Clean
keeping aside the fact that they add up yet another layer to the fatty girth on me, I just cant help but think about the hygienic measures they take in the prep.
అబ్బో ఇంత రేటు పెట్టి తినడం అవసరమా అనిపించేది చిన్నప్పుడు, ఎంచక్కా పిప్పెర్మేంట్ బిళ్ళలు ఎన్ని వస్తాయో అనిపించేది, ఒక్కోసారి నెయ్యి ఎక్కువై మొహం కొట్టేస్తుంది కాని నాకు మెల్లిగా నాన్చుకుంటూ తినడం భలే ఇష్టం..
ఎవరైనా హైదరాబాద్ నించి వస్తున్నారు అంటే పుల్లా రెడ్డి తెచ్చిపెట్టండి అనో వాళ్ళు తేవడమో ఉండేది ఒకప్పుడు ఇప్పుడు మా వంట మీ ఇంట అంటూ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన స్వీట్ హోమ్స్ ఉన్నా వీటి దారి వీటిదే.

Thursday, April 5, 2012
Wk14/Dy6(97) ~ April 6 - A Thing of Past
I used to love these soft toys a lot, I remember them carrying along wherever I went and not as a kid but a 22-plus year old... tastes, passions, priorities change
ఒకప్పుడు నాలో ఉన్న పసితనం, అమాయకత్వం, ఈ బొమ్మల చుట్టూ తిరిగిన నా ప్రపంచం అంటా ఇప్పుడు ఒక పిచ్చి లాగ అనిపిస్తుంది కాని ఒకప్పుడు ఇవే నా లోకం, ఇంకో ఒక గుట్ట ఉండేవి, ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదు నాకు.
PS: A 7 yr. old picture from archives.

Wk14/Dy5(96) ~ April 5 - Miss You Maamu :(!
budda mama cooking for us on the day of my engagement... I miss him like hell on his daughter's engagement today..
మా అమ్మకి చెల్లి లేని లోటు తీర్చేవాడు బుడ్డమామ... నువ్వు కూర్చో అక్క అని సుబ్బరంగా బ్రహ్మాండమైన వంట చేసి పెట్టేవాడు, ఒక పులి లాంటి అండ, నా లాగే మొన్దోడు, కాదు కాదు నేను తనలాగే మొండి దాన్ని, నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ఎవరు ఏమి అన్నా తను మాత్రం, నువ్వు సంతోషంగా ఉండు తల్లీ, నాకు నా బిడ్డకి కొండంత ధైర్యంగా ఉండేవాడు, అది నా బిడ్డ అనేవాడు.. ఎవరైనా ఎక్కడైనా మల్లెపువ్వు లాంటి తెల్ల బట్టలేసుకుని బండి మీద వెళ్తుంటే ఒక్కసారి గుండె పిందేసినట్టు అవుతుంది. కొండంత బాధని మనసులో పెట్టుకుని మహారాజు లాగ వెళ్ళిపోయాడు తిరిగి రాని లోకాలకి... దుద్దాయి స్వామి తాత ఐపోయాడు, ఆకాశంలో ఉన్నాడు అని పండు గాడు చెప్పినంత తేలికగా నేను చెప్పలేకపోతున్నా... మామూ, కైసే హో రే, హమ్ బహుత్ యాద్ కర్తే హాయ్ తుజ్హే...!

Tuesday, April 3, 2012
Wk14/Dy3(94) ~ April 3 - Mehendi Time
.. and then the kid decides to apply cone to amma's hands 'cos she does it to her all the time..
ఎప్పుడు అమ్మే ఎందుకు పెట్టాలి ఈ సారి నా వంతు అనుకుని చిచ్కూ గాడు ఈ మధ్య నాకు అప్పుడప్పుడు గోరింటాకు పెడుతున్నాడు... చెయ్యి పందినాక చూడటానికి చండాలంగా ఉన్నా, ఆ.. చూసేవాడికి కదా బాధ అని నాలిక తిప్పేసుకుని మురిసిపోతున్నా నేను :).. ఇలాగే పూసి, రాసి ఏదో ఒక రోజు బ్రహ్మాండంగా నేర్చేసుకుంటుంది చూస్తూ ఉండండి... హమ్మా..!

Wk14/Dy2(93) ~ April 2 - Vacche Vacche Railu Bandi
... kid is delighted to see this sign... each time we pass by a railway line, she wishes a train passes and she waves to the train :)..
చిలకలపూడి దెగ్గర గేటు పడ్డప్పుడు పండుగాడికి పండగ :)... గేటు పడితే పెద్దవాళ్ళకి ఎంత బాధగా అనిపించినా పిల్లలు మాత్రం ఎంత సంతోష పడతారు కదా.. ఆ కూ మోత, జనాలకి చేతులు ఊపుతూ కేకలు పెట్టడం... ఉందొ లేదో స్వర్గం.. నా బాల్యం నాకిచ్చేయ్ పాట గుర్తొస్తుంది.

Wk14/Dy1(92) ~ April 1 - Bird's Eye View...
Kid climbs the bird watch tower at Aatapaaka with Paunaa..
చిచ్కూ గాడికి ఆటపాకలో పిట్టలన్నా, వాటిని చూడటానికి ఎక్కే బోటు అన్నా, ఆ బోటు వెళ్ళేటప్పుడు ఎగిరిపడే బుల్లి చాప పిల్లలన్నా, జపం చేసుకునే కొంగలన్నా భలే నచ్చేసింది... ఇంకొక వారం మాత్రమె ఉండొచ్చు, ఇప్పటికే నీటి నిలవ తగ్గిపోయి, పిట్టలు తిరిగి వెళ్ళిపోయే సమయం దెగ్గర పడింది.... ఈ సారి తను బాగా ఆడుకుంది, అంతకు ముందు ఎందుకు తీసుకెళ్లలేదా అని బాధ అనిపిస్తుంది.

Wk13/Dy7(91) ~ March 31 - Alalu, kalalu, aatalu...
The kid having fun as the waves hit her tiny legs...
మొదటి సారి చిచ్కూ గాడిని బీచ్ కి తీసుకెళ్ళినప్పుడు కాళ్ళ కింద ఇసక జారిపోతుంటే బెదిరిపోయింది, ఇసక నీళ్ళు పోసుకుని ఆదుకుంది కాని అలల జోలికి రాలేదు, అలాంటిది ఒకటి రెండు సార్లు వెళ్ళేపాటికి మనకి విసుగు పుట్టాలి తప్పితే తను మాత్రం అమ్మ కాసేపు, అమ్మ కూసేపు, అంటూ అలలు వస్తూ పోతూ ఉంటె తనని ఎత్తు పట్టుకుని నీళ్ళని తోయించాలి అని భలేగా ఆడుకుంటుంది... బలవంతంగా మనం లాక్కుని వస్తే తప్ప రాకుండా తయారయ్యింది.. బీచి దెగ్గర ఇల్లు పెట్టుకుందాం అని అడుగుతుంది :).

Wk13/Dy6(90) ~ March 30 - Reku Dabbaa
An oil tin made into a container...
ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు వాడి పారేసిన నూనె డబ్బాని జోరా అమ్మ తీసుకుని వెళ్లి రేకు కొట్టించి మాట్లు వేసే వాళ్ళతోటి ఇలా తయారు చేయించుకుంది.. బియ్యం పోసుకుంటుంది అంట... ఒకప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలాంటివే వాడేది... అయినా మనిషి ఎంతో తృప్తిగా ఉండేది.. చిన్న చిన్న వాటితోటి విపరీతంగా సంతోష పడిపోయే వాళ్ళని చూస్తె మనం ఎందుకు ఉండలేం అనిపిస్తుంది...

Subscribe to:
Posts (Atom)