Friday, November 5, 2010

November 1 -- Yummy Yummy

The yummy yummy panipuri bandi..

పానీపూరి అంటే  నాకు చాలా చాలా ఇష్టం.. నేను ఊర్లో ఉండటం మూలాన నేను బాగా మిస్ అయ్యేది ఇది.  కాని రాను రాను మా ఊరు కూడ పట్నం సోకులు అలవర్చుకుంటుంది.  నీటుగా, శుబ్రంగా మినెరల్ వాటర్ ఎసి చేసిచ్చే వాటికి ఈ రోడ్ మీద చేసే వాటికి అసలు పోలికుండదు.. ఆహ ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ plateలు plateలు లాగించేస్తాను నేను.    ఆ దుమ్ము ధూళి మట్టి మురికి మూలాన వస్తుందేమో అంట రుచి అని ఎంత మంది ఎక్కిరించినా అది నాకు ఎక్కదు కాక ఎక్కదు.... ఆ ఫోటోలో ఉండి నేనేనోచ్.. అంత ఒల్లేసుకుని రోడ్డు తిళ్ళు అవసరమా అంటారా... దాని దారి దానిదే నా దారి నాదే. 

3 comments:

  1. పానీ పూరీలు (లేదా చాట్) ఇలా రోడ్డ్ల మీద తినొద్దు అని చెప్పను, కానీ ఒక చిన్న పని చెయ్యండి. మీరు ఇలా పానీ పూరీ తిన్నప్పుడల్లా క్యాలెండర్ లో నోట్ చేసుకోండి (A అని). అలాగే వాంతులు లేదా జ్వరం వచ్చినప్పుడల్లా కూడా నోట్ చేసుకోండి (B అని). మీ శరీరానికి గాని పానీ పూరీలు ఇష్టం లేకపోతే, A, B లు దగ్గరగా ఉంటాయి. ఒక వేళ A, B లు దూరంగా (అంటే 3 రోజుల కన్నా ఎక్కువ) ఉంటె మీ ఇష్టం వచ్చినట్లు మీరు పానీ పూరీలు లాగించేయ్యోచ్చని మీ శరీరం చెప్తున్నట్ట్లే.

    :((( నాకైతే A ఉన్న చోటల్లా B తగలడి చస్తుంది. అందుకనే A లు నా క్యాలెండర్ లో కనపడకుండా చేసేసా, అందువల్ల B లు చాలా వరకు తగ్గి పోయాయి.

    I really miss roadside pani poori/chat. :(

    ReplyDelete
  2. as of now.... thankfully.. A and B are not even remotely close.. nenu pushtigaa laagistunna.. with asthma and decreased immunity i cant say in the future.. though.

    ReplyDelete
  3. hmm na fav kuda...panipuri enta tinna em kadu naku....devudi dayavalla

    ReplyDelete