Thursday, March 31, 2011

Day 91 ~ April 1 - Peace.. For a Happy Month

Isnt he an epitome of peace and calm... on my work table.

బుద్ధం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి.
ధర్మం శరణం గచ్చామి.

నాకు బుద్ధుడి బొమ్మని, అది కూడా ఇలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉండే ముద్రలో ఉండేది.. modern art కాకుండా, మామూలుగా ఉండే బొమ్మలని చూస్తె మనసులో ఏదో చెప్పలేని ప్రసాంతత అనిపిస్తుంది.. అలా ఆ బొమ్మ వైపు ఒక ఐదు నిమిషాలు చూస్తె చాలు ఏదో లోకంలోకి వెళ్ళిపోతాను.. ఎంత చిరాకు ఉన్నా, ఒక stabilizing ఫాక్టర్ లాగ..

ఆ మూడు సూత్రాలు పాటిస్తే మనిషికి ఇంకా కావలసింది ఏంటి.  

Day 90 ~ March 31 - Ending Note

Something about Indian families that bothers me the most.. put in words with a real life experience by Mrs. Sudha Murthy..

నేను చాల ఎక్కువ నమ్మే విషయాల్లో ఒకటి, అమెరికాలో నాకు నచ్చే విషయాలు లో ఒకటి ఈ ఆస్తి పంపకాలు.. ఇండియాలో నాకు అస్సలు నచ్చని విషయం కూడా అదే.... పొట్ట కట్టుకుని రూపాయ రూపాయ పోగు చేసి, బ్రతికున్న అన్ని రోజులు కక్కుర్తిగా కూడా బ్రతికి, అందరితో అనిపించుకుని ఆఖరికి చచ్చిపోయినాక కూడా కొట్టుకు చచ్చే విషయంగా మిగిలిపోవడం బాధాకరం ఐన విషయం.  మీ పుట్టింటి వాళ్ళకి ఏమి ఉంది.. అత్తగారు ఎంత ఇచ్చారు.. నువ్వు నీ బిడ్డకి ఏమి దాస్తున్నావ్.. ఇది చాల రొటీన్గా వచ్చే మాటలు.. బిడ్డలు వాళ్ళని వాళ్ళు బ్రతకడానికి ఒక మార్గం చూపెట్టాలి, తమకి తాము, వీలయితే సమాజానికి కూడా సాయం చెయ్యగల స్తోమత తెచ్చుకోవడానికి సాయం చెయ్యాలి.  మనిషిగా బ్రతకడం నేర్పించాలి... ఆళ్ళకి మనం ఏదో నీతులు చెప్పేముందు మనం పాటిస్తే సగం కష్టాలు ఉండవేమో కదా..

Day 89 ~ March 30 - Watching Match..

A good way to let out steam while watching the match :)..

హమ్మయ్య ఆఖరికి పండు గాడి బట్టలు ఇస్త్రీ అయిపోయాయి.. ఈ బుడ్డి బుడ్డి బట్టలు జత పది రూపాయలు అంట, మళ్ళీ ఎక్కడి ముడతలు అక్కడే.. వారి నాయనో.. ఇలాగే ఏదో తీరిక చూసుకుని ఇలా టీవీ చూస్తూనో, ఎవరైనా మరీ నస పెట్టె జనాలు బుర్ర నంజుకుని తినేస్తూ ఉంటేనో, ఇవి ముందేసుకుని చేసి పక్కన పెట్టేసుకోడం హాయి అనిపిస్తుంది.  ఆ తిక్క కాస్త ఈ బట్టల మీద చూపిస్తే అవి నీటు గాను మైండ్ క్లియర్ గాను అయిపోతుంది... అంతకుముందు బట్టలు ఉతికేసేదాన్ని పిచ్చ కోపం వస్తే, మధ్యలో పిచ్చి కేకలు.. ఇప్పుడు ఇస్త్రీ.. అన్నిటికంటే దారుణం మాత్రం పిచ్చి కేకలు, అది తప్ప ఇంకా ఏదైనా ఓకే... ఇలాగ పని జరిగి పోయే పనులైతే ఇంకా డబల్ ఓకే.

Day 88 ~ March 29 - A Phone Speaks...

A new addition... loyal to Samsung :).

ఫోన్ చూసి కూడా మనిషిని అంచనా ఎయ్యొచ్చు అని విషయం మొన్న బిగ్ C లో తెలిసింది... నన్ను చూడగానే బీబత్సమైన మోడల్స్ చూపించడం మొదలుపెట్టాడు కౌంటర్ లో అబ్బాయ్.. ఇది ఐ ఫోన్ ఇది బెర్రీ ఫోన్ అని.. బాబూ నాకు బేసిక్ మోడల్ కావాలి గట్టిగా ఉండాలి అని.. ఐన వినడే.. ఆఖరికి నా పాత ఫోన్ తీసి ఇది నాయన అని చెప్తే ఎగా దిగా చూసి ఇంకో అమ్మాయిని అప్పచెప్పి ఎల్లిపోయాడు... :).. నాకు ఫోన్ అంటే చెయ్యడం, లేదంటే ఎత్తడం, అంతవరకే, ఇప్పుడు ఐతే మరీ ఏదైనా నాకు కావాల్సి వస్తేనే అది నా దెగ్గర ఉంటుంది.  సెల్ నన్ను జనాలు రీచ్ అవ్వడానికి కాదు నేను ఏదైనా అవసరానికి వాడటానికి .. ఫొటోలకి కామెర ఉండాలి, నెట్ కి కంప్యూటర్ ఉండాలి.. దేని పని అది చెయ్యాలి. ల్యాండ్ లైన్ అన్నిటికి సెల్ మాత్రం కేవలం మన ఇష్టానికి :).

The older one, GSM mobile, is the most used and abused and liked phone considering how the kid uses it IF she can lay hands on it.


Monday, March 28, 2011

Day 87 ~ March 28 - Veedina Nestam

A ring that had been on my finger for the past 15 years..

చిన్నగా, ముద్దుగా పల్చగా ఉండే ఈ లక్ష్మి దేవి ఉంగరం అంటే ఎందుకో నాకు చాల ఇష్టం, అలా నా చేతికి ఎప్పుడు ఉండిపోయింది.. మెల్లిగా, రాయి నించి కొండ నించి పర్వతం టైపులో పెరిగిపోయిన నా ఆకారానికి తగ్గట్టు పెరగలేక పాపం వేలికి బిగిసిపోయింది.. సబ్బు పెట్టి తియ్యాలి అని చూసినా రాలేదు, వేలు మీద లోపాలకి దిగిపోయి అక్కడ అర కూడా కట్టేసింది.. ఆఖరికి ఈ ప్రియ నేస్తాన్ని కోయించేయక తప్పలేదు.. 

Day 86 ~ March 27 - Radio Paatalu

The teeny tiny radio, a gift to a sweet grandmother in the village.

కరెంటు కోతలు మొదలు అయిపోయాయి :(.. రోజుకి ఈ మధ్య దాదాపు 10 గంటలు.. అది కూడా మిట్ట మధ్యాన్నం వేళలో.. ఇంటి దెగ్గర అమ్మమ్మ తనకి ఒక radio కొనాలి, కరెంటు పోయినప్పుడు పెట్టుకుంటాను అని చెప్తే తనకోసం ఏమి కొనాలో అర్థం కాక ఎదురు చూస్తున్న నేను ఎగిరి గంతేసి మరీ తెచ్చేశాను..

Day 85 ~ March 26 - Amma, Aavakaaya

Tomato and Amla pickled and stored.

అమ్మ, ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టవు.. నిజంగా నిజం :).. మా అమ్మ పొద్దున్నే పది గంటలకి వంటల కార్యక్రమాలు అని టీవీ ముందు కూర్చుంటే ౩ గంటల దాక, ఆ వంట, ఈ వంట, ఆ ఊరు, ఈ ఊరు, ఆ రుచి, ఈ రుచి అనుకుంటూ రకరకాల వంటలు చూసేసి, నా అల్పప్రాణం మీద ప్రయోగాలు చేసేస్తుంది :(.. దానికి తోడూ ఈ మధ్య పుస్తకాలు కొని మరీ వంటలు చేసి, అన్ని కలిపి ఏదో చెయ్యబోయి, ఇంకేదో చేసేసి, పైనించి టీవిలో యాంకర్ లాగ నేను కూడా ఆహ, ఓహో, సూపరు, బంపరు అని పొగడాలి అని నా వైపు ఎంతో ఆశగా చూస్తుంది..పాపం చిచ్కూకి అలవాటు ఐపోయింది.. ఏదైనా సరే ఒక ముద్ద పెట్టేసుకుని.. అచ్చం యాంకర్లాగే  కోటి రూపాయలిచ్చినా రెండో ముద్ద నోట్లో పెట్టని టైపులో జీవిన్చేస్తుంది... స్థంబం, నా తల, ఒక సౌండు..అన్ని కనిపించి వినిపిస్తున్నాయా?

Day 84 ~ March 25 - Meter Down

The electric meter taken down to be placed at 5-feet height level as per the latest norms...

కరెంటు మీటరు రీడింగ్ కోసం వచ్చినతను నేను ఎక్కలేను మొర్రో అని అరిచి గీపెట్టి, ఏడ్చి మొత్తుకుని ఆఖరికి నేను చూడను పొండి అని మినిముం రీడింగ్ రాసుకుని పోయేదాకా దీనిని కింద పెట్టించే ముహూర్తం కుదరలేదు... పాత కాలపు ఇంటికి పాతకాలపు మీటరు.. ఎక్కడో 8 అడుగుల ఎత్తు నించి దిమ్పించి పెట్టిన్చేపాటికి నా తల ప్రాణం తోకకి వచ్చింది... 1000 రూపాయలు వదిలింది.

Day 83 ~ March 24 - Utter Chaos

Clutter around, chaos within... this was how the day began and ended for us.

డబ్బు కోసం మనిషి ఎంతకి దిగజారవచ్చో ప్రత్యక్షంగా చూసి, విన్న ఈ రోజు చాలా చాలా బాధాకరమైన రోజు.

Wednesday, March 23, 2011

Day 82 ~ March 23 - On The Tips

Gadgets and their controllers kind of control our life.. a new addition.

ఆఖరికి ఎలాగైతేనేమి రెండేళ్ళు ఆచి తూచి కొనాలా వద్దా, ఎందుకు ఏమిటి ఎలా లాంటి అనేక ప్రశ్నలు వేసుకుని, సమాధానాలు మనసులో రాసుకుని మొత్తం మీద నేను కూడా ధైర్యం చేసి కొనేసా.. చెప్పొద్దూ జీవితం చల్లగా వెన్న ముద్దలాగా ఉంది... వీటికి బానిస కానంత కాలం అమర్చుకోవడంలో తప్పు లేదు అనే అనిపించింది... వీటన్నిటి లోకి ఆఖరున ఉన్నSony  ఆడియో సిస్టం మనసుని చల్లబరుస్తుంది... One of my best buys.

Day 81 ~ March 22 - Utility Bottle


I found  this on one of my random shopping trips for the kid who loves drinking out of bottle caps..

sipperలో నీళ్ళు పోసి చిచ్ఖూకి ఇచ్చి రోజు ఆ sipper కడిగి, ఆ గోల కంటే ఈ సీసా నాకు చాల ముచ్చటగా అనిపించింది.. సీసా మూతల్లోంచి నీళ్ళు తాగటానికి అలవాటు పడిపోయిన తనకి కూడా ఇది బాగా నచ్చేసింది.  గ్లాసులో నీళ్ళు ఇంట్లో ముంచుకుని తాగి అసలు ఎన్నాళ్ళయిపోయిందో, ఒలికి పోవడం, మిగిలిపోయి పారెయ్యడం, ఈగలు, దుమ్ము, ఇది అది అని సాంతం సీసాలమయం  చేసేసుకున్నాను నేను.. మూడు నెలలకోసారి సీసాలు మార్చెయ్యడం, వారానికోసారి కల్లుప్పుతో కడగటం... మార్చాల్సిన అలవాట్లలో ఒకటి, No plastic means no plastic without such exceptions...

Day 80 ~ March 21 - A break

A relaxed and lazy day after a hectic emotionally draining roller-coaster day.

అలసిన మనసుకి, శరీరానికి చిచ్కూ తోటి ఆడుకుంటూ, రోజంతా ఏమి చెయ్యకుండా.. అలా వేలాడిపోయి పడుకుని, టీవీ చూడటం, పుస్తకం చదువుకోడం... ఇంకో కొత్త రోజుకి ఉత్సాహాన్ని, బలాన్ని, ధైర్యాన్ని నింపుకోవడం.

PS:  I am a beanbag person, considering the heavy weight issues and the comfort factor, these are the obvious replacement :).

Day 79 ~ March 20 - The spiral of life

So much happening in a single day.. happy beginnings, sad endings, health and sickness, peace and violence, calm and chaos... one of its kind day!!!!


ఎండల్లో పిచ్చ తిరుగుడు తిరిగి.. మనిషి జీవితంలో ఎన్నో అంశాలు ఒకే రోజు చూసి, విన్న నాకు ఏంటో ఒక లాంటి నిస్సారమైన భావం.. ఎందుకీ పరుగు, ఏమిటీ అర్థం అని.. మొత్తం మీద ఒక పెళ్లి, ఒక చావు.. రెండు జీవితమైన ముఖ్య ఘట్టాలలో పాలు పంచుకున్నాను.   ఎవరో తెలిసిన చుట్టాల్లో ఒక పెద్దాయన పోయారు, అంతకు ముందు ప్రతి దానికి దడుచుకు చచ్చే నేను ఈ మధ్య ఇలాంటి వాటికి మాత్రం తప్పక వెళ్లి వస్తున్నాను..

ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిజాలు, ఎన్నో కలలు, కొత్త జీవితాలు, కొన్నిటికి చరమాంకాలు... ఈ క్షణం మాత్రమె శాస్వతం .. మిగతా అంతా భ్రమ...  

Saturday, March 19, 2011

Day 79 ~ March 20 - Summer Costs...

This is how much keeping the air conditioned in summer costs in AP.. and not to mention the power bills.....

కూలర్లో వట్టి వెళ్ళు మార్చి, నీళ్ళు పోసుకుని ఎండాకాలం మొదలుపెట్టే రోజులు పోయాయి... ఆ మోత భరించలేకపోతున్నాను, ఆ గాలికి చెవి పోటు ఒకటి నా ప్రాణానికి, కాసేపటకి ఒళ్ళంతా జిడ్డు జిడ్డు వేరే :(((... రెండేళ్ళ నించి ఎలాగోలా లాగించేస చిచ్కూకి కూడా.. ఏమి ఎంతమంది పిల్లలు మండుటెండల్లో రేకుల ఇళ్ళల్లో, పెరగట్లేదు, మేము ఉండలేమా అని... ఇప్పటికీ అదే ఫీలింగ్ కాని పండు తల్లికి ఇప్పుడే చెమట పొక్కులు మొదలు ఐపోయాయి :(((.. 

ఎండలు పేలిపోతున్నాయి ఇంకా ఎండాకాలం మొదలు కూడా అవ్వలేదు.. ముందు కాలం తలుచుకుంటే గుండె జారిపోతుంది నాకు మటుకు.. నాలుగు అడుగులు అటు తిరిగి వస్తే కరెంటు షాక్ కొట్టిన కాకి పిల్లలాగ ఉంది నా పరిస్థితి,  వడ దెబ్బ తగిలేలా ఉంది.. 

జనాలు గదికో a/c ఎలా పెట్టిన్చుకుంటారో కాని ఒకటి అనగానే నాకు ముచ్చెమటలు పట్టేస్తున్నయ్.. బాబోయ్ ఏంటి ఆ  రేట్లు... 

Friday, March 18, 2011

Day 78 ~ March 19 - Moon, Me and Kid

Collage of 4 different moon pics I took from both my cameras tonight, and the kid's pillow... I so badly want to buy a good and grand telescope..

ఏదో నెట్ surfing చేస్తూ ఉంటె కన్య రాశి ఆడవారికి ఈ చంద్రుని స్థితి వలన ఆరోగ్య హాని ఉంటుంది అని చదివాను, అమ్మకి చెప్పాను కూడా పండు తల్లిని జాగ్రత్తగా కూడా చూడాలమ్మ అని.. తను ఉలిపి పనులు చేసేటప్పుడు భద్రంగా ఉండాలి అని.. కాని నా కంటి ఎదురుగా నా చిట్టి తల్లి పడిపోతే చూస్తూ అలాగే ఉండిపోయా, అసలు అర్థం కాలేదు, ఒకలాంటి షాక్ ఐపోయింది.. తనకి ముక్కు అంతా డోక్కుని పోయింది.. తను బాగా ఐపోయి అందరికి ఎలా పడిపోయింది చెప్తూ తిరిగింది కాని నేను చాల సేపు మామూలు అవ్వలేకపోయా.. అందరి హార్ట్-ఫెల్ట్ prayersకి చాలా చాలా థాంక్స్.

to add to the words on the pillow... God bless the people and world affected by the position of the moon....

Day 77 ~ March 18 - Naandi Neellu..

The water treatment plant in the village, where the water is purified and sold at 2 rs/- per 12 Lts and 3 rs/- per 20 Lts..

ఊర్లో ఉండే మంచి నీరు శుబ్ర పరిచే యూనిట్, చెరువులోని నీళ్ళు ఏడు లెవెల్స్ లో శుభ్రం చేసి, ఫిల్టర్ చేసి అమ్ముతారు... అంతకుముందు మంచి నీటి అవసరాలకి నూతి నీళ్ళు వాడుకునేవాళ్ళం, ఇప్పుడు కొంటున్నాం.. వీటినే నాంది నీళ్ళు అంటారు, ప్రభుత్వం నాంది పధకం కింద పెట్టినవి కాబట్టి .. ఇటీవలి కాలంలో సరిగ్గా చెయ్యడం లేదు.. ఈ నీళ్ళు తెచ్చుకుని నేను మళ్ళీ pure -it లో పోసి చిచ్కూకి పట్టించాల్సి వస్తుంది... పని మీద శ్రద్ధ అనేది జనాలలో ఇంతలాగ కొరవడిపోతుంటే చాల బాధ అనిపిస్తుంది, కోపం కూడా వస్తుంది.. తాగే నీరు మంచిది అనే కదా డబ్బు పోసి కొంటున్నారు పేద వారు కూడా.. దీనికన్నానూతి నీళ్ళు మెరుగు అనుకునే స్తితికి వచ్చేశాం.. కాని ఎండాకాలంలో బాపయ్య నూతిలో నీరు అడుగంటి అక్కడ కూడా ఇసక వస్తుంది... drinking water crisis అప్పుడే మొదలు... 

Wednesday, March 16, 2011

Day 76 ~ March 17 - Evening Well Spent

The kid having a one-on-one with some of the performers... akkas she fell in love with...Sridevi, Bhargavi, Gayathri, Jahnavi... superb classical dance performances from them all, both solo and group..

మా ఊరి వేణు గోపాల స్వామి గుళ్ళో ఉత్సవాలు, కల్యాణం జరుగుతుంది, దాంట్లో భాగంగా ఈ డాన్సు ప్రోగ్రాం పెట్టారు.. కూచిపూడి, భారత నాట్యం, జానపద నృత్యాలు.. ఈ చిన్న పిల్లలు చేసారు.. చాల ముచ్చట వేసింది.. ఎలాంటి అసభ్యత లేకుండా, ఎంతో పొందికగా బుడి బుడి నడకలు నడిచే పిల్లల దేగ్గరనించి ఎంతో బాగా చేసారు.. కాని ఊర్లో జనాలే టీవీల ముందు నించి కదలలేదు, ఇంచు మించు ఒక పాతిక మంది వచ్చారేమో.. అయినా సరే చాల ఉత్సాహంగా, విసుగు లేకుండా చేసిన ఈ చిన్నారులని చూస్తె చెప్పలేని హాయి.

చిచ్కూ కూడా ఛాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ ప్రోగ్రాం అంతా.. తను నిద్రపోతుంది అని అందరం అనుకున్నాం కాని, ఆఖరికి వెళ్లి అందరికి థాంక్స్ అండ్ bye కూడా చెప్పి వచ్చింది....

నాకు ఛాలా బాధ అనిపించింది, ఓంకార్ లాంటి చెత్త వెధవలు నాట్యానికి, బాల్యానికి అర్థాలు మార్చేస్తున్న ఈ కాలంలో 
కూడా వీళ్ళు సాంప్రదాయిక నృత్యాలు చేసి అలరిస్తుంటే ఎవరు రాక పోవడం, పైగా కూచిపూడి కదా ఏమి వస్తాంలే అనడం.... ఆఖరి దాక ఉంది రావడం అందరిని పేరు పేరు నా అభినందించి థాంక్స్ చెప్పి రావడం మన కనీస బాధ్యత అనిపించింది.

This was the final performance of the day.. Jaatara... It was 12:30 a.m. and guess what, the kid sat through it all and cheered them with screams of good jobs, claps and tiny jigs... muuaaah to each and every one of them.. Awesome evening.

ఆఖరిలో చిచ్కూని దీవించిన గురువు గారి మాటలు మనసుకి ఎంత సంతోషం ఇచ్చాయో చెప్పలేను... తను కూడా ఒక మంచి కళాకారిణి అవ్వాలి అని, తను  ఏది చేసిన సంతృప్తి పొందాలి, ఎంతో ఎదిగి ఎందరికో వెలుగు కావాలి  అని తనని దీవిస్తే తల్లి మనసుకి ఇంతకంటే ఏమి కావాలి ....

Day 75 ~ March 16 ~ Seema Tumma Kaayalu

A childhood memory, a fruit or whatever it is, I had been yearning to eat for a while now.... after about 20 yrs.......

సీమ తుమ్మ కాయలు అవి కాయలో, పళ్ళో కూడా నాకు సరిగ్గా తెలియదు కాని నా చిన్నప్పుడు తుమ్మల్లోంచి పెద్ద వాసం కర్రకి ఒక చిన్న చెక్క ముక్క కట్టి కంపల్లోకెళ్ళి కొట్టి తెచ్చుకుని తినేవాళ్ళం... లేదంటే బుడ్డాడు ఎవరైనా ఉంటె తెచ్చి పెట్టేవాడు, నేను ఊరోచ్చినప్పతినించి తినాలి తినాలి అనుకుని అందరిని అడిగి అడిగి ఆఖరికి నిన్న యాసిన్ తెచ్చి ఇచ్చాడు.   లావుగా ఉంటె లడ్డం కాయలు అని ఎవరికీ ఎన్ని వచ్చాయి, ఎన్ని లాడ్దాలు ఉన్నాయ్ అని పోటి పది చూసుకోడం ఒక గమ్మత్తైన సరదా.. ఇవి చిన్న పిందెలు లాంటి కాయలు కాని తట్టుకోలేక తిని పారేస.. కొంచెం పసరుగానే ఉన్నాయి.

PS:  They are called Manila Tamarind in English.. thanks anon for the KT (knowledge transfer) :).

Monday, March 14, 2011

Day 74 ~ March 15 - Relaxed Meal

Yesterday's lunch at the new place in Gdw.. a relaxed afternoon with blazing sun outside and conditioned cool air inside... Rejuvenating!!!

ఎండలో తిరిగి తిరిగి వచ్చి చల్లని ఈ bakerylo కూర్చుని పుస్తకం చదువుకుంటూ బ్యాక్ గ్రౌండ్లో పాటలు వింటూ ఉంటె అసలు బయటికి రాబుద్ధి కాలేదు నాకు..  ఎలాంటి అడ్డు లేకుండా, చిచ్కూ నా చుట్టూ తిరగకుండా, ఎక్కి తొక్కకుండా, ఎవరు ఎనకమాల తొందర చెయ్యకుండా  చాల హాయిగా అనిపించిది.. వారానికోసారి కనీసం నెలకోసారి ఐన ఇలాంటి ప్రశాంతం  కావలి అనిపించింది... మూడేళ్ళలో ఇది రెండో సారి మల్లి ఎప్పుడో ఈ యోగం :).

Day 73 ~ March 14 - Naatyam

The guru Vedantam Radhe Shyam garu with his students.

అస్సో ఉస్సో అనుకుంటూ నేను కూచిపూడి ఈ మధ్య కొంచెం ఎక్కువగానే వెళ్తున్నాను.. ఒకటి చిచ్కూకి మంచి గురువు గారి కోసం అన్వేషణ, రెండు నాకు ఎంతగానో నచ్చే కళల నిలయాన్ని చూసి రావడం.. మండే ఎండల్లో నాలుగు బస్సులు మారి ఎల్లి రావడం ఇబ్బందిగానే ఉంది కాని అక్కడికి వెళ్ళాక  అన్ని  మర్చిపోతాను.

వేదాంతం వారు వారి నాట్య కుటుంబాలు, కూచిపూడి  నాట్య సాధన, శిష్యుల శ్రద్ద ఏంటో ముచ్చట గా అనిపిస్తాయి నాకు.. ఈ ఫోటోలోని పెద్ద ఆవిడ ఖమ్మం నించి రోజు పొద్దునే వస్తారు నేర్చుకోవడానికి, ఇద్దరు పిల్లల తల్లి, ఎంతో శ్రద్దగా పొద్దునే లేచి పిల్లలకి అన్ని చేసి పెట్టి వచ్చి నాట్యం నేర్చుకుని మళ్లీ సాయంత్రం వెళ్లి తనే చేసుకుంటారు.. ఆ చిన్న పిల్లలు ఇద్దరు విజయవాడ నించి ప్రతి సెలవు రోజు వచ్చి మరీ నేర్చుకుంటారు.

ఆ భంగిమలు, ఆ ముఖ కవళికలు ఆ లోకమే వేరు.

The kalakshetra with which there is a growing fondness these days... wish it were closer to my place..

తానీష యువ ఉత్సవాలు జరుగుతున్నందువల్ల చాల మంది వచ్చి ప్రాక్టీసు చేసుకుంటూ ఎంతో నిండుగా ఉంది ఆ ప్రాంతం అంతా.

Day 72 ~ Mar 13 - Goli Soda

The empty soda bottles lined up.. on the counter.

గోలీ సోడా నా చిన్నప్పుడు ఎప్పుడు ఐన తిండి ఎక్కువ తినేసి కడుపుబ్బరంగా ఉన్నా, లేకపోతె అమ్మమ్మో తాతయ్యో తెప్పించుకున్నా వాళ్ళ వెనకాల నుంచుని స్శూయ్య అనే సౌండు వినడం అదొక ఆనందం, అందులోంచి గోలి ఎలా  వస్తుంది అసలు ఎలా వెళ్ళింది అని మళ్లీ డౌట్లు..ఒక తోపుడు బండిలో గడులు గడులు గా సోడాలు సర్దుకుని.. దాని మీద ఒక గోనే సంచి నీళ్ళతో తడుపుతూ ఒక తాత తిర్గుతూ ఉండేవాడు.. ఇప్పుడు అవి అసలు కనిపించట్లేదు... ఈ సోడాలు మటుకు అక్కడక్కడ ఇంకా ఉంటున్ని..


Sweet lime soda in the making... forget the hygiene lecture and it was heavenly freshness down the throat on a hot hot day..

ఎందుకో ఈ సోడా బుడ్లని చూస్తె తాగాలి అనిపించింది.. స్వీట్ limeసోడా అని టింగ్ మని తాగేస్తా :).

Friday, March 11, 2011

Day 71 ~ Mar 12 - Another Serving

My new set arrives :) and I am never full of them, so they keeping coming into my life with time and like I say different phases of my life..

నాకు  chicken soup for the soul అంటే చాల ఇష్టం.. ఎప్పుడు ఎలా చదివాను అని గుర్తులేదు కాని మొదటి సారి చిన్ని చిన్ని కధలు, ఎస్సయ్స్... బెంగుళూరు ఆఫీసు లైబ్రరీ లో ఉన్నవన్నీ చదివేసి, నాకు వీలైనప్పుడు కొనేసి, నేను గిఫ్ట్ గా ఇచ్చి, ఎక్కువగా recommend చేస్తూ మళ్ళీ మళ్ళీ చదివేసే పుస్తకాల్లో ఇవొకటి.. ఎప్పటికైనా ఈ series లో  ఒక article ఐన నేను contribute చెయ్యగలిగితే జన్మ ధన్యం అనేంత ఇష్టం.

Day 70 ~ Mar 11 - Aalochinchu

An excerpt from Aalochinchu - A book by Malathi Chandoor.


మాలతీ చందూర్ గారి పుస్తకాలు నాకు భలే నచ్చుతాయ్, ఆవిడ స్వాతిలో ఇచ్చే write -ups కాని ప్రసన జవాబులు కాని ఎంతో ఆలోచింపచేస్తాయి.. ఒక విజ్ఞాన నిధి అనిపిస్తుంది ఆవిడని చూసినప్పుడు... ఎంతో చెయ్యగల మనిషి సామర్థ్యాన్ని ఎప్పుడు చెప్తూ ఉన్నట్టు అనిపిస్తుంది.

A dialog or a discussion between two characters in the novel.. one of the very interesting conversations on God, his existence and many answers thereof..


Wednesday, March 9, 2011

Day 69 ~ March 10 - Framed

The final outcome.. I simply love the nest, the bird family, the mamma bird feeding the eager babies...


నాకు ఈ స్టిచ్ కిట్స్ అంటే భలే సరదా.. Caps వాళ్ళ మమ్మీ దెగ్గర అలవాటు అయ్యింది అలా సాగిపోతూనే ఉంది.. చిచ్కూ బొజ్జలో ఉన్నప్పుడు కుట్టింది ఈ పిట్టల గూడు... నాకు ఆ బొమ్మని ఎక్కడ చూసిన భలే ముచ్చటగా ఉంటుంది, ఆత్రంగా నోరు తెరుచుకున్న ఆ బుల్లి పిట్టలు, మేతని నమిలి మింగి నోట్లో వేసి తల్లి పిట్ట, గూటికి కాపలా కాసే తండ్రి పిట్ట...  రెక్కలొచ్చి ఆ పిట్టలు వెళ్ళిపోతే ఖాళి ఐపోయే ఈ గూడు సంగతి అటుంచితే.. అవి మళ్ళీ ఇలాగే ఇంకో గూడు చేసుకుంటాయి అని ఆలోచించడం ఇంకా బాగుంది.

 Framed and ready to be mounted on the wall...

ఈ మధ్య ఏంటో కాని అదేదో సినిమాలో వేణు చెప్పినట్టు నేను ఏది చేసిన చిరిగ చాట అంతయ్యి, చాప అంత అయిపోతుంది..  డబల్ ఫ్రేం కట్టరా బాబు అంటే బాక్స్ ఫ్రేం కట్టిచ్చాడు, నేను ఎంచుకున్న బీడింగ్ కాకుండా వేరేది పెట్టేసి, అసలు మీరు చెప్పింది ఎమన్నా బాగుందా ఇది చూడండి అదుర్సు, బెదుర్సు అని మళ్ళీ నేను ఏమి అనలేకుండా తనకి తనే ఊదరగోట్టేసుకున్నాడు.

Day 68 ~ March 9 - Daari Tappina Konga Pilla

The baby crane which fell down from its coconut tree top nest and protecting itself from crows and dogs..

ఈ మధ్య కాకులు చేసే అల్లరికి కొంచెం బాధగా ఉంది.. చెట్ల మీద ఉన్న కొంగల గూళ్ళు తోసేసి గుడ్లు పొడుకుని తినేస్తున్నాయి.. పడిపోయిన గూళ్ళు, గుడ్లు, చిన్న కొంగలు, వాటి వెనక పరుగెత్తే అవకాసం కోసం పొంచి ఉన్న  వీధి కుక్కలు, అవి దొరికాక పిచ్చి పిచ్చిగా కొట్టుకు చచ్చే ఆ కుక్కల అరుపులు అన్ని చూస్తుంటే ఎప్పుడు జరిగే సామాన్య విషయమే ఐన బాధగా ఉంటుంది.. మన రాష్ట్ర ప్రస్తుత పరిస్తితి కూడా గుర్తొచ్చి ఇంకొంచెం బాధగా ఉంటుంది.

I get to see this struggle for survival and the survival of the fittest in the nature in a teeny tiny way and relating it to human beings and relations makes me a little heavyhearted.

Day 67 ~ March 8 - Recharged

Reloaded the battery toys and recharged the exhausted ones... green parenting drive??

బొమ్మల్లో బ్యాటరీలు ఇలా నేలకోకసారో లేకపోతె ఐపోయినప్పుడో మార్చి అన్ని ఒక చోట పడేసి మళ్ళీ అన్ని వరస పెట్టి రీచార్జి చెయ్యడం నేను చేసే కొన్ని పనుల్లో ఒకటి... నిన్నచూస్తె మొత్తం మీద మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్ల మీద పక్షపాతం లేకుండా కొని తెచ్చి పెట్టేసాను అని అర్థం అయ్యింది :).  లిథియం బ్యాటరీలు వాడకం తగ్గించాక నేను కూడా ప్రకృతి సంరక్షణలో పాలు పంచుకుంటున్నా అని  ఒక తృప్తి.. అసలు ఏమి వాడకుండా ఉంటె ఇంకా బాగుంటుంది కదా అంటారా ఈ రోజుల్లో, సగం పైగా పని చేసే వస్తువులు, వాచీలు వీటి మీదే కదా మరి.

Sunday, March 6, 2011

Day 66 ~ Mar 7 - Phases and Books

Current reads...

నిన్న నేను ప్రస్తుతం నా దెగ్గర ఉన్న పుస్తకాలు అన్ని ఒక చోట సర్దుకున్నాను, దుమ్ము దులిపి, ఇంకా పూర్తిగా సర్దకపోయినా, అన్నిటిని ఒక చోట పెట్టేసాను.. లైబ్రరీ లో చదివిన గుట్టలు గుట్టలు పుస్తకాలు కాక నేను కొని చదివిన పుస్తకాలు కూడా చాలానే పోగయ్యాయి.  రెఫెరెన్సు పుస్తకాలు, spiritual , సెల్ఫ్ హెల్ప్.. అవి ఒక చొటన పెడుతుంటే అనిపించింది నేను కొని చదివిన పుస్తకాలు అన్ని కూడా నేను ఆ సమయంలో ఉన్న నా frame of mindని  చాల స్పష్టంగా చెప్తున్నాయ్.. 



అటు ఇటు తిరిగి, ఆ ఊరు ఊరు అంటూ, ఎవరికో ఇచ్చి తిరిగి రాక, మేము లేనప్పుడు మా అమ్మ ఎవరికైనా ఇచ్చేసి, ఇప్పుడు అసలు ఏమైనా మిగిలాయో లేదో కూడా తెలియదు... మూడు చిన్న బీరువాల పుస్తకాలు... ఇప్పుడు ఊర్లో ఉన్న లైబ్రరీ చూస్తె నా దెగ్గరే అంతకంటే మంచి collection ఉండేది అనిపిస్తుంది... ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఇంకా ఎప్పుడైనా జీవితంలో ఈ పుస్తకాలు పెట్టె చోటు లేకపోతె, అవి లైబ్రరీకి ఇచ్చేయ్యడం.. చిచ్కూ కి నేను ఇచ్చే ఆస్తి కూడా ఇవే :).

Day 65 ~ Mar 6 - Memories...

Finally accomplished the task of binding her first year in an album...

బాల్యం, అందులోను మొదటి రెండేళ్ళు జీవితంలో మనకి ఉహ తెలియకుండానే గడిచిపోతుంది... ఎన్నో ముద్దులు ముచ్చట్లు చుట్టూ ఉన్న వాళ్ళు పంచుకునే వయసు... పిడికిట్లో నీటి బొట్ల లాగ అలా జారిపోతుంది.. ఎంతో ముచ్చటపడి చేయించుకున్నాను దీన్ని.. కాకపొతే నేను చెప్పింది ఒకటి స్టూడియో అతనికి అర్థం అయ్యింది ఒకటి, అది ల్యాబ్ వాడికి అర్థమయ్యింది ఇంకేదో విధంగా... ఇంకోటి చేయించుకోవడం కంటే నేనే ఫోటో షాపింగ్ చేసి ప్రింట్స్ తీసుకోడం మెరుగు అని అర్థం అయ్యింది... అది ఇంకా ఇన్నాళ్ళకి కుదురుతుందో.

Friday, March 4, 2011

Day 64 ~ Mar 5 - Moggaa Mandaaram..

The yellow hybrid hibiscus flower and the tiny bugs inside..

మందార మొక్కలకి నాకు ఒక లాంటి పోటీ ఉంది.. చిన్నప్పటి నించి నేను పొద్దునే లేగావగానే ఆ మొక్కని చూస్తె మొగ్గలు ఉండేవి మల్లి అటు ఇటు తిరిగొచ్చే లోపు పువ్వులైపోతూ ఉండేవి.. టీవిలో చూపించినట్టు పువ్వు విచ్చికోవడం  చూడాలి అని అబ్బో చిన్నప్పటినించి విశ్వప్రయత్నం, కొన్ని సార్లయితే నిద్ర లేచినప్పటినించి దాని ఎదురుగానే కుర్చీ ఏసుకుని కూర్చోడం ఎలాగైనా చూసి తీరాలి అని.. నాకు విసుగొచ్చి అటు ఇటు తిరిగిన టైములో అది పువ్వు అయిపోవడం.. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే స్టొరీ.. ఈసారి ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చిన్దోచ్చి.. నేను tripod పెట్టి వీడియో షూట్ చేసి నిదానంగా చూసుకుంటా.. ఇన్నాళ్ళు బుర్రకి ఈ ఐడియా రాలేదు.. ఇవ్వాళ్ళే తట్టింది :).అది కూడా ఈ బ్లాగు రాసేటప్పుడే :).


Day 63 ~ Mar 4 - Malle Antlu

Watering the jasmine plant..

ఎండా కాలం వచ్చేస్తే ముందుండేది మల్లె పూలే, కాలం మొదలవగానే ముదురు ఆకులు దూసేసి, కొమ్మలు కొట్టేసి, బోదెలు తీసి పొద్దున్న సాయంత్రం నీరు పోస్తే చక్క మొగ్గలేసి పూత పూస్తుంది.. పనిలో పని వానాకాలంలో పెట్టిన అంట్లు కూడా తీసి కుండీలో పెట్టాము నేను యాసి కలిసి...


Day 62~Mar 3 - Nestham!!

Got this new SIM from BSNL under the nestham scheme.

ఈ సిం కార్డు నాకు చాల స్పెషల్.. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఫోన్ నెంబర్ ఉన్ననెంబర్ వచ్చింది అని పిలిచి మరీ చెప్పాడు సుధీర్, మా TTE .. ఎగిరి గంతేసి తెచ్చేసుకున్నా.. నాకు ఆ నెంబర్ అంటే ఎంతో ఇష్టం, అమ్మ జ్ఞాపకాలని మళ్ళీ ఇలా ఫోన్లో బంధించుకుని దాచుకోవడం ఎంతో బాగుంది. 

Wednesday, March 2, 2011

Day 61~Mar 2 Movie Time

So, there we go to watch a movie in a 30-year-old theater :).. old model non-a/c, non-dts, old world theater reminding me of my childhood.

... and no prizes for guessing who the fountain head is :).

సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్లు పిల్ల జెల్ల అందరితో కలిసి అప్పుడప్పుడు ఒక పెద్ద గుంపు ఇలా ధియేటర్ మీద పడిపోతూ ఉంటాం.. నాకు తోడుగా వాళ్ళు వాళ్లకి పెద్ద దిక్కుగా నేను :).. మాకు బాధ్యతగా చిచ్కూ..

Day 60~Mar 1 - Blast From The Past

I so loved and thrived reading these books... any guesses as to who my favorite is from Archie World ?.. and by the way, I love Betty out of the two leading ladies.

Do I see my future in this cartoon strip.. :)))))..

చిన్నప్పుడు నాకు చాల చాల నచ్చిన పుస్తకాలలో ఇవొకటి.. అన్ని digestలు ఉండేవి ఇంచు మించు నా దెగ్గర.. మొన్న విజయవాడ ఎల్లినప్పుడు సెకండ్-హ్యాండ్ బుక్  షాప్లో ఇది కనిపించగానే ఎగిరి గంతేసి తెచ్చేసుకున్నా.. నాకు బెట్టి అంటే ఇష్టం ఆర్చీ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అని తెగ ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉండేదాన్ని.. ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళ తరవాత మళ్ళీ ఈ పుస్తకం కనిపిస్తే ఆ జ్ఞాపకాలు అన్ని వరద గోదారి టైపులో తన్నుకోచ్చేసాయి :).

February 28 - One after the other..

Yay.. I now have a gas connection on my name.. tiny big pleasures..

ఒక్కోటి అమర్చుకుంటూ మెల్లిగా జీవితంలో స్థిరపడుతుంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ముందుకు సాగటానికి.. ఏదో ఇలా నడిచిపోతే అలా గడిచిపోతుంది అనుకుంటూ ఎవరో ఒకరి స్పేరు సిలిండర్ వాడేసుకుంటూ కాలం గడిపేసిన నాకు ఇది రావడంతో ఒక పెద్ద జంజాటం వదిలినట్లుగా ఉంది.. కొన్ని సార్లు చిన్న చిన్న విషయాల మీద శ్రద్ద ఉండకపోవడం కూడా పెద్ద తల నొప్పి అయిపోతుంది.. నెల నెల బండ ఐపోగానే అటు ఇటు పరుగులు లేవు అంటే ఆహా ఓహో అదుర్స్ బెదుర్స్ కదూ.. ఇది ముందు చెయ్యనందుకు ఒక పెద్ద టెంకి జెల్ల నాకు :).