Friday, March 4, 2011

Day 64 ~ Mar 5 - Moggaa Mandaaram..

The yellow hybrid hibiscus flower and the tiny bugs inside..

మందార మొక్కలకి నాకు ఒక లాంటి పోటీ ఉంది.. చిన్నప్పటి నించి నేను పొద్దునే లేగావగానే ఆ మొక్కని చూస్తె మొగ్గలు ఉండేవి మల్లి అటు ఇటు తిరిగొచ్చే లోపు పువ్వులైపోతూ ఉండేవి.. టీవిలో చూపించినట్టు పువ్వు విచ్చికోవడం  చూడాలి అని అబ్బో చిన్నప్పటినించి విశ్వప్రయత్నం, కొన్ని సార్లయితే నిద్ర లేచినప్పటినించి దాని ఎదురుగానే కుర్చీ ఏసుకుని కూర్చోడం ఎలాగైనా చూసి తీరాలి అని.. నాకు విసుగొచ్చి అటు ఇటు తిరిగిన టైములో అది పువ్వు అయిపోవడం.. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే స్టొరీ.. ఈసారి ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చిన్దోచ్చి.. నేను tripod పెట్టి వీడియో షూట్ చేసి నిదానంగా చూసుకుంటా.. ఇన్నాళ్ళు బుర్రకి ఈ ఐడియా రాలేదు.. ఇవ్వాళ్ళే తట్టింది :).అది కూడా ఈ బ్లాగు రాసేటప్పుడే :).


4 comments:

  1. హహ. చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. అంటే గడియారంలో పెద్ద ముల్లు, చిన్న ముల్లు కదులుతుంటే చూడాలనుకోవటం, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కదలటం చూడటం లాంటివి అన్నమాట. కానీ నాకెప్పుడూ ఇలా ఇలా మొగ్గ పువ్వు గా మారటాన్ని, పిందె కాయగా మారటాన్ని చూడాలనుకొనే భయంకరమైన కోరికలు ఎప్పుడు కలగలేదు. :)

    ReplyDelete
  2. avi naa lanti mahaanubhaavulake sontamaina feelings mari :).

    ReplyDelete
  3. Aha chaala andanga undi Sree...

    ReplyDelete
  4. Gorgeous! It has been a while since I we t thru everyone's photo blogs

    ReplyDelete