Friday, July 22, 2011

Day 197 ~ July 16 - In Shambles

When I look at those walls, I am reminded of a legacy, a life well lived just shattered!! too many lessons, too many memories and too much of grief all at once.

ఊర్లో దివాణం అంటే చాలా గొప్ప దొరలు, వెలమ దొరలు గుర్రాల బాగ్గీలు, ఘోషా, జమీందారీ అదొక లోకం. నా చిన్నప్పుడు ఆ ఇంట్లో లక్ష్మి ఆంటీ ఉండేది, నాయన గారు ఉండేవారు, ఒక్క వెలుగు వెలిగి ఆరిపోయారు, వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంపేవారు కాదు ఆవిడ, పని వాళ్ళు పూర్తిగా నమిలి మింగేశారు వాళ్ళని, ఆఖరికి ఇంట్లో వస్తువులు, బట్టలు కూడా అమ్మేసుకోవాల్సిన పరిస్తితి.. ఎందరికో అన్నం పెట్టిన చెయ్యి ఒకరి ముందు చాచడం చూసిన నాకు చాలా అసహాయంగా అనిపించేది, ఏమి చెయ్యలేని వయసు, ఎంతో చేసెయ్యాలి అనే మనసు.. నాకు ఒక స్తోమత వచ్చేపాటికి వాళ్ళెవరు మిగలలేదు, చెల్లా చెదురు అయిపోయారు ఆ ఇల్లు చూసినప్పుడల్లా, డాబా ఎక్కి మేము ఆడుకున్న ఆటలు, ఆవిడ నవ్వు, ఆ హంగు అన్ని గుర్తొస్తాయ్. నేను ఆఖరి సారి బడి సెలవల్లో ఆవిడని కలిసినప్పుడు తనకి నాకు ఇచ్చి పంపటానికి ఏమి లేక గోడ మీద ఉన్న painting ఇచ్చారు ఎంత వద్దన్నా, ఇంక తరవాత నువ్వు అడిగినా ఏమి లేదు నా దెగ్గర అని ఒక నవ్వు నవ్వి.. అది ఎప్పటికి మర్చిపోలేను.. ఆ చూపు గుర్తొస్తుంది నాకు ఈ మొండి గోడలు చూస్తుంటే

1 comment:

  1. " ఏమి చెయ్యలేని వయసు, ఎంతో చేసెయ్యాలి అనే వయసు ... నాకు ఒక స్తోమత వచ్చేపాటికి వాళ్ళెవరు మిగలలేదు." చాలా సున్నితంగా వ్యక్తపరిచారు !!! చాలా నచ్చిందండి .

    ReplyDelete