Tuesday, September 6, 2011

Day 248 ~ Sep 5 - N for Noise Pollution



Mike facing our home near the local Ganesh Pandal!  Festivals in India bring along a lot of noise along with celebrations... the songs from the mike set all through the day... God!!!

పండగ వస్తే సంతోషం, అది అప్పుడే అయిపోయిందా అని బాధ ఉండడం మామూలే, కాని వినాయక చవితికి దసరాకి ఈ మధ్య నాకు ఎప్పుడు వెల్లిపోతుందా అని బెంగ పట్టేసుకుంటుంది.. మైకు సెట్టు ఒకటి అద్దెకి తెచ్చి, ఊర్లో ఉండే బేవార్సు కుర్రకారు పాటలు మోత మోగించుకుంటూ, చెవులు చిల్లు పడేలాగా చెయ్యటం.. ఇది ఒక ఎత్తైతే సాయంకాలానికి ఆ సందులోని చిన్న పిల్లలందరూ పోగయ్యి పాడే సినిమా బాణీల భక్తీ పాటలు.. చెవుల్లోంచి నెత్తురు కారిపోతుందేమో అనేంత దారుణంగా పిచ్చి కేకల్లాంటి ఆ గానాలాపన విని గుండె నొప్పి వచ్చేస్తుంది నాకైతే.. నాయనో.. విగ్ననాయక వినాయక, గణ నాయక వినాయక అంటూ పండగ కోసం ఎదురు చూసే నేను విసిగించే వినాయక అని వాళ్ళ మైకు సెట్టు పాడైపోవాలని కోరుకున్తున్ననంటే ఏ రేంజ్ లో ఉందొ గోల అర్థం చేసుకోవాలి :(.  భక్తీ మొత్తం పోయి విరక్తి మాత్రం మిగిలింది.

ఊర్లో మొత్తం నాలుగు విగ్రహాలు పెడితే ఒకరు మాత్రం ఐదో రోజు తీసేశారు, నాలుగు వైపుల్లోంచి ఒకటి తగ్గింది అని నేను సంబరం చేసుకున్నాను.

Bye Ganesha, love you loads!

1 comment:

  1. Hehehe...meeku pandagalappude kadaa..maakayithe prathi rojoo gola...intiki 300m radius lo 4 temples vunnayi, ika imagine chesuko :P

    Ee madhya ayithe Baavalu sayya, maradalu sayya ane paata okatundi choodu silk di..aa paata ni parody chesi Ganesh ki paadaaru...naakayithe aa chesinodi peeka meeda kaalesi thokkeyyaalnipinchindi..Grrrr

    ReplyDelete