Wednesday, March 28, 2012

Wk13/Dy5 (89) ~ March 29 - Neeti Viluva

 After several levels of filtering, this is how we get water from the panchayat Tap :(((...

బురద నీళ్ళ లాగ ఉన్న ఈ నీళ్ళు మాకు వాడుక కోసం వచ్చీ పంచాయితీ పంపు నీళ్ళు, చెరువు ఎండిపోవడం వలన అందులో అడుగంటిపోయినాక చెత్తా, చెదారం, పాచి, పురుగులు, ఆకులు, ఇసక, బురద అన్ని కలిపి వస్తే అసలు జీవితం మీద విరక్తి వచ్చేది.. ఒక రోజున అవి కూడా రావడం మానేశాయి అప్పుడు తెలిసొచ్చింది వీటి విలువ..  మంచి నీళ్ళకి నాంది నీళ్ళు కూడా ఈ నీళ్ళని purify  చేసి ఇస్తారు


ఇంట్లో నూతి నీళ్ళు ఉన్నా అందులో సన్నని ఊట ఉండి అంగుళం మందాన తేట కడుతున్నాయి :(, ఎవరితో అయినా తెప్పించుకుని పోయిన్చుకుందాం అన్నా ఊర్లో ఎవరి బావిలోను పెద్దగా నీళ్ళు లేవు, ఒకవేళ ఉన్నా మోసుకొచ్చే దిక్కేది :(.. మర్చి మొదటి వారం నించి మాకు నీటి తిప్పలు ఇన్ని అన్ని కాదు... మినెరల్ వాటర్ పోయించుకుని వాడుకున్దామా అంటే అవి మా ఊరు రావు, పక్క ఊరి నించి తెప్పించుకున్న ఎన్నని తెప్పించుకోవాలి... దాళవా లేకపోతె ఇలా ఊర్లలో నీటి ఎద్దడి ఉంటుంది అంట.

Bleaching powder, Patika, cloth and a chalni....

పచ్చని పాచి పట్టి గంజి లాగ వచ్చేవి నీళ్ళు ఇన్నాళ్ళు.. మెల్లిగా మంచి నీటి చెరువుల కోసం అని కాలువలు వదలడం మూలాన కొంతలో కొంత మెరుగు పడ్డాయి..

నీటి విలువ ఏంటో వినడం వలన తెలిసిన దానికంటే పడుతుంటే తెలుస్తుంది... దయ చేసి మనకి ఉన్నప్పుడు వాటి విలువ గుర్తించకుండా చెయ్యకండి... నీటిని, ప్రక్రుతి వనరులని మన ముందు తరానికి మిగిలించండి :(((..

Wk13/Dy4(88) ~ March 28 - Tiyyani Teepi

Various forms of sugar for our intake... if we take in too much of others, we end up unable to have anything other than the slender yellow boxed pill sweetener.. sigh

అమ్మకి ఈ మధ్య పన్ను పోటుగా ఉంటె చూపించుకుంటే అన్ని టెస్ట్లు చేసి షుగర్ ఉంది అని చెప్పారు అంట.. మా ఇంతా వంటా లేదు షుగర్ అనుకుంటూ ఆహా ఓహో అంటూ కుమ్మడం మా ఇంట్లో అలవాటు.. ఈ రోజుల్లో ఒంటికి శ్రమ లేక, కూర్చుని చేసే ఉద్యోగాలకి చిన్న పెద్ద, బేదం లేకుండా ఒచ్చి చేరు జబ్బు ఐపోయింది :(..


కొంచెం బుద్ధి తెచ్చుకుని కాస్త పని చేసుకుంటున్నాను నేను, exercise కూడా చెయ్యడం మొదలెట్టాను, నోరు కట్టేసుకున్నా ఒంటికి శ్రమ లేకపోతె వచ్చే రోగాలు తప్పవు అని బాగా తెలిసొచ్చింది నాకు.

Wk13/Dy3(87) ~ March 27 - A Summer Shake

 
A glass of banana milk shake made by kid and me :).

చిచ్కూ గాడికి పాలు తాగించడం అంటే నాకు తల ప్రాణం తోకకి రావడం అన్నమాట, బలవంతం చేస్తే తనకి విరక్తి వస్తుంది అని వదిలేస్తే అసలు పాల మొహం చూడదు రోజుల తరబడి, ఎన్ని వేసినా ఎన్ని చేసినా అదే గొడవ.. ఇలాక్కాదు అని చివరాఖరికి తన తోటే అరటి పండు వలిపించి, పాలు తేనే పోయించి, mixielo  వేయించా.. ఇంత చావు చచ్చినా... టీవిలో anchor  లాగ ఒక ఒక గుక్క మింగి, వావ్ అమ్మ సూపర్ అని నా మొహాన పడేసింది... పారేయ్యలేక కాస్త గదిమి తాగించి మిగతాది నేను లాగించా, అదేదో నాకోసోం తనతో చేయిన్చుకున్నట్టయ్యింది నా పని :(

Sunday, March 25, 2012

Wk13/Dy2(86) ~ March 26 - Yellow Fellow

Ask the kid to pick anything.. the obvious choice would be yellow, white and blue and then anything else :)... not that I am complaining ;).. 'cos she takes after me in that regard..

చిచ్కూ గాడికి పసుపు రంగు అంటే పిచ్చి ఇష్టం, ఎన్నని ఉన్నా ఎందులో అయినా సరే పసుపు రంగు ఉంటె అదే ముందు తీసుకుంటుంది... TDP ambassador :)!!

Wk13/Dy1(85) ~ March 25 - Government Uttaram!

Finally we get our much touted Unique ID Adhaar cards.. mine and OA's.. the kid's however still seems to be on the way.

గవర్నమెంట్ వారు ఎలాంటి కార్డ్లు ఇచ్చినా అవి ముందు తెచ్చి పెట్టేసుకుంటే అవసరం పాడినప్పుడు హైరానా అందడు అనుకునే రకం నేను కాబట్టి ముందుగానే ఆధార్ కార్డ్లు ఇస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు ఊర్లో అంటే టింగ్ మని వెళ్లి తీయిన్చుకోచ్చాం... ఒక ఆరు నెలలకి ఇప్పటికి ముక్కుతూ మూలుగుతూ మా ఇద్దరివి వచ్చాయి, చిచ్కూ గాడిది ఇంకా వెయిటింగ్.

Saturday, March 24, 2012

Wk12/Dy7(84) ~ March 24 - Baby and the Beads

kid loves putting these bead chains on, picks one matching for her dress and wears them.. girls.. sigh


చిచ్కూ గాడికి పూసల గొలుసు అంటే చాల ఇష్టం.. అమ్మ ఎల్లో, అమ్మ గ్రీన్ అని ఏది కావాలంటే అది అడిగి పెట్టించుకుంటుంది రోజు... 

Friday, March 23, 2012

Wk12/Day6(83) ~ March 23 - Nanda Nandanaaa...

Ingredients for Ugadi pacchadi along with hot hot poornalu sent by ammamma.. :).

నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు... పొద్దున్నే లేచి పండు గాడు వేప పూత వేరు చేసి పచ్చడి చెయ్యటానికి తయారు గా కూర్చుంది... :).. వండుకుంటే ఒకటి పంచి పెడితే పది లాగ గారెలు, పూర్ణాలు అవీ ఇవీ  అని ఎంచక్కా ఒకొక్కరు ఒకొక్కటి పంపించి పుణ్యం కట్టుకున్నారు ;).

Wednesday, March 21, 2012

Wk12/Dy5(82) ~ March 22 - Gurtukostunnaayi...

A blast from the past.. mom got me my albums that she found somewhere on the attic... !!!

నేను అటు ఇటు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నప్పుడు ఎక్కడో పోయాయి అనుకున్నా ఇవన్నీ కూడా.. ఇంకా బోలెడు ఉండాలి కాని కనీసం ఇవైన దొరికాయి అని భలే సంబరంగా ఉంది... ఎంచక్కా ఇవి దెగ్గర పెట్టుకుని పండుగాడి ఫోటోలు తోటి పోల్చి చూసుకోవచ్చు అని మురిసిపోయా... తెచ్చి చూస్తె ఎక్కడో కొంచెం అది కూడా నేను వాదిస్తున్నాను కనక ఒప్పుకోతమే కాని నాకు తనకి ఒక్క పోలిక కూడా కనిపించట్లేదు :)...

Wk12/Dy4(81) ~ March 21 - Glittering Gold ;).

1-g gold jewelry the one that I can afford and most essentially prefer :)....

ఆకాశానికి అంటే పుత్తడి ధర అయినా కొనే జనాలు కోంటానే ఉన్నారు... నేను ఎలాగో కొనే అంత స్తోమత లేకపోవడం వలనా ఒకవేలా ఉన్నా సరే అది పెట్టి ఏ పుస్తకాలో కొనుక్కునే రకం కనక బంగారం, నగలు మనకెంతో దూరం.. :).. ఎవరైనా చూపిస్తే మటుకు చూసి సంబర పడుతున్న ఈ మధ్య కాలంలో.. కళ్ళు చేదిరిపోఎలాగా కొనేస్తున్నారు కొనే వాళ్ళు.. నాకేమో ముక్కు పుడక ముట్టుకుంటే మూడు నాలుగు వేలు అంటుంటే గుండె జారిపోతుంది...


ఏది ఏమైనా.. ఆడపిల్లకి నగలే అందం, చిచ్కూ గాడికి నేను నగలు చేయించను కాక చేయించను, కావాలంటే తనే పెద్దయ్యాక చేయించుకోవాలి అని అనుకుని తనకి నూరిపోస్తూ ఉండడం వలనను పెద్దగా ఏమి లేవు... కాని పట్టు లంగా వేసుకుని చెంగు చెంగున ఇంట్లో తిరుగుతుంటే ఆ అందమే వేరు, అందుకే పుట్టినప్పుడు ఒకటి కనీసం ఇదైన పెట్టు అని మా అమ్మ కొని తెస్తే పెట్టేసా ఇప్పుడు అది చిన్నది ఐపోయింది అని ఇంకోటి తెచ్చి ఇచ్చింది :)...

ఎంచక్కా పోతుంది అని భయం లేదు.. దాన్ని చూసి పిల్లని ఏమైనా చేస్తారు అని అంతకంటే భయం లేదు.. అన్ని తగిలించి ఎక్కడికి వెళ్ళినా ఏమి పర్లేదు అని బిందాస్ గా కూర్చుంటే ప్రాణం కూడా హాయిగా ఉంది.

Wk12/Dy3(80) ~ March 20 - Bill Payment

BSNL bill paid in post office... still using the good old paperwork!!!

క్లిక్   క్లిక్ అని కంప్యూటర్ కీస్ నోక్కేసో, లేదంటే e-సేవ   కి పరుగేట్టేసో బిల్ల్స్ కట్టడం అలవాటు ఐపోయింది ఈ రోజుల్లో అందరికీ.. నేను మామూలుగా lineman కి ఇచ్చేసి కట్టించేస్తా.. అలాంటిది మొదటి సారూ నేను పండు గాడి ఎల్లి ఊరి పోస్ట్ ఆఫీసులో ఫోన్ బిల్లు కట్టి రసీదు తెచ్చుకున్నాం :).

Monday, March 19, 2012

Wk12/Dy2(79) ~ March 19 - Fresh From Farm

The fresh farm produce bought to be stored for the week... wish I can just get them every single day and cook so fresh without having to freeze and consume... sigh!!!

ఎంచక్కా AC లో పెట్టి మిల మిల తళతళ లాడిపోతూ వండితే తినటానికి రుచి పచి లేని కూరలు కొని తిని బలం రాట్లేదు, తింటే ఆయాసం తినకపోతే నీరసం అని అయ్యో కుయ్యో అనటం అనుకోవటం లేకుండా ఎంచక్కా పెరట్లో పండించుకున్నా, పోనీ ఎవరైనా పండించి మనకి అమ్మి పెట్టినా ఎంత హాయిగా ఉంటుందో.

Saturday, March 17, 2012

Wk12/Dy1(78) ~ March 18 - Moolikala Kobbari Noone

Coconut oil poured in a bottle full of herbs...

వట్టి వేళ్ళు, కచ్చూరాలు, గులాబీ రేకులు, మందార పువ్వులు, అవి ఇవి వేసి కొబ్బరి నూనెని మరగ కాసి చల్లబెట్టి ఆ నూనెని తలకి రాసుకుంటే మాడుకి చాలవ అని అంటారు.. అది అంటా చెయ్యటానికి ఓపిక, తీరిక, కోరిక ఆ కాలం వాళ్లకి కాబట్టి ఉండేది... మనది అంతా instant జమానా కదా, ఎంచక్కా సీసాలో మూలికలేసి నూనె పోసి ఒక రెండు రోజులు ఉంచి తీసి దాన్ని వాడుకుంటాం :)...

అయినా ఏదో ఊర్లో ఉన్నాం కాబట్టి కాని గానుగ పట్టించిన మంచి కొబ్బరి నూనె ఎక్కడ దొరుకుతుంది :(.

Wk11/Dy7(77) ~ March 17 - Persistence!!

Watching the master blaster score his 100th 100 in International matches...

నేను ఈ మధ్య క్రికెట్ పెద్దగా చూడట్లేదు కాని OA పట్టు బట్టి చూడాల్సిందే వందో వంద అంటే తప్పదా అన్నట్టు వెళ్లి చూసాను కాని చాల అద్భుతమైన విషయం జరుగుతుండటం చూస్తున్నాను అని అర్థం అయ్యింది.. hats off సచిన్!!
For a change, a milestone not related my daughter :).

Thursday, March 15, 2012

Wk11/Dy6(76) ~ March 16 - Tilakam Acchulu

Finally found these traditional moulds which can used to put design bottus for the kid

ఎప్పుడు చూసానో ఎక్కడ చూసానో తెలియదు కాని నాకు ఈ అచ్చులు కొని చిచ్కూ గాడికి ఎంచక్కా రకరకాల బొట్టు పెట్టి తయారు చెయ్యాలి అని భలే సరదా, పిల్ల పుట్టిన మూడేళ్లకి ఇప్పటికి కుదిరింది.... ఎక్కడ వెతికినా దొరకలేదు... పెద్ద పెద్ద గుళ్ళ దెగ్గర అమ్ముతారు అని చెప్తే పక్కింటి వాళ్ళు తిరుపతి వెళ్తుంటే వాళ్ళని పీడించి.. వాళ్లకి రకరకాలుగా ఇలా ఉంటాయ్ అలా ఉంటాయ్ అని చెప్పి తీసుకురాకపోతే ఇంటికి రాకండి అన్నట్టుగా చెప్పి తెప్పించుకున్నా ;).

Wk11/Dy5(75) ~ March 15 - Stocked Up

Summer special, ice cream tubs stocked up for the kid who just cant get enough from the icecream cycle..

ఎండలు వచ్చాయి అంటే చిచ్కూ గాడికి మధ్యానం వినిపించే icecream బండి వాడి పాట పూనకం తెప్పిస్తుంది.. నాకేమో అందులో వాడేది ఏంటో అర్థం కాక కొనిపెట్టలేను.. ఇంట్లో చెయ్యాలంటే నాకు ఒళ్ళు బద్ధకం.. అందుకే ఎండలు వస్తే ఇలా డబ్బాలు కొనేసి తను అడిగినప్పుడు ఒక్కోటి బౌల్ లో వేసి ఆహ ఓహో అద్భుతం, బండి క్రీం క్యాకి అని నటించేసి, జీవించేసి పెడుతూ ఉంటా.

Wk11/Dy4(74) ~ March 14 - Ganji Battalu

Come summer all the cotton dress come out of the closet, starched and ready to use..

మార్చ్ నెల మధ్యలోకి కూడా సాంతం రాలేదు ఎండలు పెలిపోతున్నాయ్ ఇక్కడ, ఒంటికి బట్టలు రాసుకుంటే మంట పుట్టేస్తుంది అంత చిరాకేస్తుంది.. అందుకే కాటన్ బట్టలు తీసి గంజి పెట్టి గుంజి ఆరేసాను..

Wk11/Dy3(73) ~ March 13 - Tea, coffee, paalu....

the common ingredients are sugar and milk in our individual morning drinks!

పొద్దున్నే గ్లాసుడు పాలు తాగడం చిన్నప్పుడు చేస్తాం, పెద్దయ్యాక టీ అని కాఫీ అని బూస్ట్ అని బోర్న్వీట అని మొదలు పెడతాం... పొద్దున్నే మా ఇంట్లో మా ముగ్గురి పాలల్లోకి మూడు రకాల పొడులు :).

Wk11/Dy2(72) ~ March 12 - Baby Hanumaan

Part of wedding prep and decoration..

పెళ్లి మండపంలో చిచ్కూ గాడికి అన్నిటికంటే ఇది నచ్చింది.

Wk11/Dy1(71) ~ March 11 - Bulli Jaadeelu

A random click of stuff on the dining table..

నాకు ఈ బుల్లి పింగాణీ జాడీలు అంటే చాలా ఇష్టం, నెయ్యి గిన్నె, పచ్చళ్ళు, ఉప్పు... ఇంచు మించు తెలుగు వారి అందరి ఇళ్ళల్లో ఉంటాయేమో :).

Wk10/Dy7(70) ~ March 10 - Pelli Mandapam

I actually liked the ambiance created in the village scene with this wedding in spite of hating the extravagance in such events...

పిలవడం పాపం అన్నట్టు ఎక్కడికి పడితే అక్కడికి డుమ్ములు సౌండ్లు వినడానికి వెళ్ళిపోతాం నేను పండు గాడు... అంతే మరీ అన్ని చోట్లకి కాదు ఏదో తెలిసిన వాళ్ళింటికి అన్నమాట :).. మా తాతయ్య తమ్ముడి మనవరాలి పెళ్లి, పక్క ఊర్లో ఇంక మూడు పూటలా పెళ్ళికెళ్ళి పుష్టిగా కుమ్మేసి వాచ్చాం.  ఆరు బయట అక్కడ కట్టిన మండపం అదీ మొత్తం కళ్యాణ మండపంని మించిపోయింది... ఎన్ని వేల మంది వచ్చినా చిరాకు లేకుండా జరిగిపోయింది.

Friday, March 9, 2012

Wk10/Dy6(69) ~ March 9 - Kaasi daaram

Tirupathi Laddu prasaadam.. nothing can beat its taste!!

నాకు ఎన్ని లడ్డూలు తిన్నా తిరుపతి లడ్డు ముందు బలాదూర్ అనేంత ఇష్టం ఈ లడ్డు అంటే.. ఎవరైనా తిరుపతి ఎల్లినప్పుడు తెచ్చిచ్చే ఈ లడ్డు అన్న ఆ నల్లటి కాసి దారం అన్న కూడా చాల మురిపెం.. చిన్నపుడు ఎప్పుడు మెడకో చేతికో ఈ తాడు తప్పక ఉండేది... కొత్తది ఎవరైనా ఇవ్వగానే పాతది తీసి అది కట్టుకోవడం.. ఇప్పుడు నాజూకు శోకుల్లో ఎక్కడో తప్ప ఇది కట్టుకునేవారు కనపడరు.. ఆఖరికి చిచ్కూ గాడు కూడా వద్దులే అమ్మా దాచెయ్యి ఎవరికైనా ఇచ్చెయ్యి అంటున్నాడు :(.

Thursday, March 8, 2012

Wk10/Dy5(68) ~ March 8 - Rangeli Holi...

The colors masti with the kid...!

చాలా చాలా ఏళ్ళ తరవాత హోలీ ఆడాను పిచ్చి పిచ్చిగా... మీ అందరికి కూడా ఈ హోలీ మీ జీవితంలోకి బోలెడు రంగులని నింపాలి అని కోరుకుంటున్నా.

Wk10/Dy4(67) ~ March 7 - All Set..!

Finally got the cover stitched, a really bright pattern considering it overlooks my mini garden area..

నాకు  పైత్యం పెరిగినప్పుడు కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాను అందులో ఒకటి ఈ కుర్చీకి పైన కిందా ఉన్న cane frame మీద కూడా ఈ ఆకుపచ్చటి వెల్వెట్ material  తోటి అంచు కుట్టడం.. పండుగాడు కిందకి జారేటప్పుడు ఆ cane   ఒరుసుకుని రాసుకోకుండా మెత్తగా ఉంటుంది అని.. ఎలాగు కింద చేశా కదా చూడటానికి బాగుంటుంది అని పైన ;).

Wk10/Dy3(66) ~ March 6 - Minnu This Month

I use my desktop calender to mark up some stuff.. and when I marked up some date on 6th, I thought of posting this pic on that date.

ఈ రోజు ఏదో క్యాలెండరు లో మార్కు పెట్టడానికి వెళ్లి, నెలకో మిన్ను పోస్ట్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను.. తన క్యాలెండరు కొనలేని వాళ్లకి కూడా తన మెసేజ్ ఇవ్వాలి అని.

In this real world, sprouted among the blue thoughts, who knows who the curse is!... for innocent minnu... painting and wordings by Kamal Kamaraju!

Wk10/Dy2(65) ~ March 5 - College Fun

polytechnic final year kids performing Bhangra.. it was indeed a power-packed performance..

చిచ్కూ గాడి పవనన్న కాలేజిలో anniversary ఉంది అంటే సకుటుంబ సపరివార సమేతంగా అక్కడ వాలిపోయి, వాళ్ళ స్పీచ్లు గట్రా ఓపికగా విని డాన్స్లు చూసి వచ్చాం :).

Wk10/Dy1(64) ~ March 4 - Leisure Nail Care

Ready for some nail care!!

వారానికో సారి చిచ్కూ గాడికి గోళ్ళు తీసి.. దానికి బహుమతిగా కాళ్ళకి తను కావాలి అన్న రంగుని వేస్తాను.. అప్పుడప్పుడు మాంచి గుణం కుదిరితే నేను కూడా వేసుకుంటా తను చెప్పిన రంగు... :).

Wk9/Dy7(63) ~ March 3 - Aakulo Aakunai

The first ever time the kid has allowed me to put mehendi on her hands when awake and with full consent...

చిచ్కూ గాడు పెద్దోడు ఐపోతున్నాడు దానితో పాటు ఆడపిల్ల లక్షణాలు కూడా కొన్ని వంట బట్టిన్చుకుంటుంది... ఎంచక్కా గోరింటాకు పెట్టించుకుంటుంది.. cone తోటి వెయ్యడం వరుకు బాగానే ఉంటుంది కాని ఇలా ఆకు నూరి పెట్టించుకోవడం ఇదే మొదటి సారి బుద్ధిగా పెట్టిన్చుకుంది.. పక్కన చుక్కలు అడిగి మరీ... 

Friday, March 2, 2012

Wk9/Dy6(62) ~ March 2 - The books that chose me..

There are some books I plan to buy and some books that kind of come to me a gift or just a random pick from the store..!!!

కొన్ని పుస్తకాలకి మనకి ఏదో అనుబంధం ఉంటుంది అని గట్టిగా నమ్ముతాను నేను... నేను ఎంచుకునేవి కొన్ని ఉంటాయి, నన్ను ఎంచుకునేవి కొన్ని ఉంటాయి... ఆ సమయంలో నాకు కావలిసింది ఏంటో ఎవరో తెలుసుకుని పంపించినట్టు ఉంటుంది అందులోని సారాంశం.. అలాంటివే ఈ రెండూ.

Wk9/Dy5(61) ~ March 1 - Gas Troubles...!!!

I have been kind of glued to the phone to book a cylinder.. that 21-day wait and booking and then the wait continues.. and add to this I just have one cylinder...

అష్ట కష్టాలు పడి ఒక cylinder  కనెక్షన్ సంపాదించుకున్నాను కాని ఇన్నాలైనా రెండో బండ తెచ్చుకోలేకపోతున్నా.. ఇదేమో మా బీబత్స వాడకానికి నేలరోజులకంటే రాట్లేదు, ఇంకోతేమో ఎప్పుడిస్తారో తెలియదు.. ఈ DWAKRA గ్రూప్స్ పుణ్యమా అని, మధ్యానం పధకం వాళ్లకి బండలు అని అది అని ఇది అని నానా చావు చస్తున్నా... !

Wk9/Dy4(60) ~ Feb 29 - Annam Tinaaka..

The kid's measured feed bowl converted.. taddadaan!!

కడుపు నిండా అన్నం కుమ్మేసి అబ్బో ఇంత తినేసా, అంత తినేసా అని ఆయాస పడిపోతూ కూడా మళ్ళీ ఇవి కొన్ని నమలడం మాత్రం మానను.