The whistles, tops and traditional names all made of vegetable dyes and nontoxic... small-scale cottage industry beautifying life and entertaining kids.. just love them.
నాకు ఈ చెక్క బొమ్మలు అంటే చాల ఇష్టం కూడా, అప్పుడు కేవలం అవి చూడటానికి ఆడటానికి నచ్చేవి, పెద్దయ్యే కో, వాటి గురించి తెలుసుకునే కొద్దీ, వాటి తయారీ చూడాలి, వాటిని తయారు చేసే వారి జీవితాలు చూడాలి, అందులో మార్పులు చూడాలి అని ఒక తెలియని కోరిక... ఎలాగైతేనేమి ఆఖరికి పోయిన ఏడాది పని కట్టుకుని ఆ ఊరు ఎల్లి చూసి కొని తెచ్చుకున్నాను తనివి తీరా... అసలు ఎవరికైనా బహుమతులు ఇవ్వటానికి కూడా ఇంతకూ మించి ఉంటాయ అనేంత పిచ్చి ఇవంటే నాకు...
కాకపొతే నేను వెళ్ళినప్పుడు జనాలు కరెంటు లేక చాల పాట్లు పడుతున్నారు, అందుకే బొమ్మలు ఎక్కువగా చెయ్యలేకపోతున్నట్టు చెప్పారు... ఈ మధ్య ఈనాడులో ఆర్టికల్ కూడా వేసారు.. బయట కొట్లలో కొన్నవాటికి వాళ్ళ దెగ్గర తెచ్చుకున్నడానికి ధరలో చాల చాల తేడా ఉంది...
ఆ ఈలలూ బొంగరాలు రైలు బండి, లక్క పిడతలు.. చిన్నతనానికి పరుగులు పెట్టించేస్తుంటాయి నన్ను.
మా చిన్నప్పుడు బంక మట్టితోటి చేసుకునే వాళ్ళం వాటిని, ఇప్పుడూ చెయ్యొచ్చు కాని అవి వాళ్ళు పెట్టేసుకున్తారేమో అని భయం కదా...