Ameer, the coconut vendor gets a new rickshaw...happy for you taata!!!
నేను ఈ ఊరు వచ్చేపాటికి చిచ్కూ బొజ్జలో ఉంది, అప్పుడు రోజు కొబ్బరి నీళ్ళు తాగితే మంచిది అని చెప్పారు, ఆ రోజు నించి ఇప్పటి దాక మాంచి వానల్లో తప్ప ప్రతి రోజు వచ్చి, కాయలు కొట్టిచ్చి వెళ్తాడు. ఆ డబ్బు ఇచ్చే కదా కొంటున్నారు అందులో గోప్పెంటి అంటారా, డబ్బులిస్తే రాని ఆప్యాయతలు చిచ్కూ గాడికి అందిస్తాడు. సైకిల్ మీద ఎక్కువ కాయలు పట్టట్లేదు ఎండలకి ఎక్కువ ట్రిప్పులు వెయ్యలేకపోతున్నాడు ఈమధ్య అందుకే ఈ కొత్త రిక్షా బండి కొన్నాడు. పాప మంచి ఆరోగ్యానికి పొట్టలో ఉన్నప్పుడు పడ్డ కొబ్బరి నీళ్ళు అని నాకెందుకో ఒక నమ్మకం. కాకపొతే ఇప్పుడు మటుకు ఒక గుక్కెడు కూడా తాగదు... రోజు రకరకాలుగా కృషి చేస్తున్నా, చేస్తూనే ఉంటా కూడా... కొబ్బ జూసా అంటే చాలు ఆమడ దూరం పరుగో పరుగు :(.
నాకు మాత్రం రెండు పూటలా గుర్తు చేసి మరీ తాగిస్తుంది... బొజ్జలోంచి ఉన్న బంధం కాబట్టి కాబోలు రాగానే రోజు "కొబ్బ తాత ఖాన ఖాయే, పానీ హోనా? అని నోరార పలకరిస్తుంది.
This same guy has been supplying me with tender coconut water for the past 3 yrs, every single day unless it rains really bad.
This same guy has been supplying me with tender coconut water for the past 3 yrs, every single day unless it rains really bad.
రిక్షా కూడా బాగుంది. తోపుడు బండికన్నా చిన్నగా ఉన్నా, దీనిని హ్యాండిల్ చేయడమే వాళ్ళకు ఈజీగా కూడా ఉంటుందేమో. హైదరాబాద్ లో తోపుడుబళ్ళ వాళ్ళు కూడా ఇలాంటివి కొనుక్కుంటే బెటర్.
ReplyDeleteoh my!1 i like his lovely gorgeous.. colour rickshaw.. very pretty!!
ReplyDelete