A green Zen corner....
A closeup shot..
నిన్న ఎగ్జిబిషన్ కి వెళ్లాను అనుకోకుండా ఆఖరి రోజు శనివారం అంట కాని రెండు రోజులు ఊరికే అలా గుడారాలు ఉండిపోయి మిగతా సరుకు కొంత మంది అమ్ముతూనే ఉన్నారు... నిజం ధర ఎంతో తెలియదు కాని విపరీతంగా బేరాలు, చెప్పినదాంట్లో పావు ధరకి కొనుగోలు... నేను మామయ్యా వెళ్లి పెద్ద తెలివి గల వాళ్ళలాగా సగం అడిగి ముప్పావుకి కొనుక్కుని మురిసి ముక్కలు అయిపోయాం.
అక్కడ కొన్నదే ఈ బుద్ధుని టేరాకోట బొమ్మ.. అసలు కేవలం మొహం ఉండే బొమ్మ కొనాలని వెళ్లి చాల పెద్దది గార్డెన్లో పెట్టుకోవచ్చు అని తెచ్చుకున్నా.. తీరా తెచ్చాక మమ్మీ చిచ్కూ ఇద్దరు కూడా ఎండా, వాన దుమ్ము మట్టి అని తినేశారు.. ఆఖరికి చించి చించి ఇలా తయారు చేసి డాబా మెట్ల పక్కన కుదిర్చేసా :).
A closeup shot..
ఆ పెట్టిన స్టాండు ఒక పాత ఉల్లిపాయలు వేసుకునేది విరిగిపోతే ఇంటి ఓనరు పక్కన పారేసినది, దానికి రంగులేసి మెట్ల దెగ్గర స్తంబాలకి గాలికి, చిచ్కూ గాడి లాగుడికి పడిపోకుండా గట్టిగ వైర్లు పెట్టి కట్టేసి బీబత్సంగా బందోబస్తు చేసి చచ్చీ చెడి తయారు చేశా, ఫెంగ్ షుయి కోసం వెదురు మొక్క, నా దెగ్గర ఉన్న తామర పువ్వు ఒకటి, అడపా దడపా చిన్న జాడీల్లో పెట్టిన మొక్కలు వగైరా పెట్టి ఏదో చేసేశా... చిచ్కూ ఏమో వాన పడకుండా తన టోపీ గొడుగు ఇచ్చారు గోతం కి, ఇంతకీ గోతం తన కొత్త ఫెండు అంట.. గౌతం బుద్దా కి వచ్చిన తిప్పలు లెండి... :).. ఇద్దరం కలిపి కష్టపడి చేసుకున్నాం కాబట్టి నాకైతే యమ యమా నచ్చేసింది.
hey super undi..chala cute ga undi
ReplyDeleteSeriously, good creativity. chala chala bagundi sree, loved the arrangement
ReplyDeleteVery nice, chaalaa baagaa arrange chesaaru
ReplyDeleteIlaanti decorative pieces ki maintainance and cleaning kastamanipinchadaa Sushma..naakistame kaanee rojoo thuduchukune opika leka ilaa evari intlo anna vunte choosi aanandisthuntaa...
thank you siri
ReplyDeletethank you Renu :).
ReplyDeleteKeerthi, chaala chaala kashtam dummu padipotundi easygaa that too outdoors kaabatti but this one is relatively easy paininchi kinda daaka water spray cheyyadame... okkosaari konchem visugostundi appudu aa dummu alaage untundi, otherwise it is something to clear my mind.
ReplyDeleteSuper impressive!! :-) Truly is!!
ReplyDeleteChaala chakkaga arrange chesaaru, Sushma. You seem to have flair for creativity. Buddhudini chooste some sense of positivity surrounds you, I have experienced that too. Nenu office ki velle daarilo Budduni mandiram undi. Evening time lo aithe lights to alankaristaaru. The whole place looks so beautiful. As the bus passes through that area, I feel a sense of calm and positivity descending in me.
ReplyDelete